< యోబు~ గ్రంథము 13 >

1 ఇదిగో వినండి, నా కళ్ళకు ఇదంతా కనబడింది, నా చెవులకు అంతా వినబడింది,
“Mʼani ahu eyinom nyinaa, mʼaso ate, na ate ase.
2 మీకు తెలిసిన విషయాలన్నీ నాక్కూడా తెలుసు. నాకున్న జ్ఞానం కంటే మీకున్న జ్ఞానం ఎక్కువేమీ కాదు.
Nea wunim no, me nso minim; wonyɛ abomfiaa mma me.
3 నేను సర్వశక్తుడైన దేవునితోనే మాట్లాడాలని చూస్తున్నాను. ఆయనతోనే నేను వాదిస్తాను.
Nanso mepɛ sɛ mekasa kyerɛ Otumfo no na mekyerɛkyerɛ mʼasɛm mu kyerɛ Onyankopɔn.
4 మీరంతా అబద్ధాలు కల్పించి చెబుతారు. మీరు ఎందుకూ పనికిరాని వైద్యుల వంటివారు.
Mode atoro mmom na asra me ho; mo nyinaa moyɛ ayaresafo a munsi hwee!
5 మీరేమీ మాట్లాడకుండా ఉంటేనే మంచిది. అదే మీకు ఉత్తమం.
Sɛ mobɛyɛ komm koraa a ɛno na ɛbɛyɛ nyansa ama mo!
6 దయచేసి నేను చెప్పేది వినండి. నా పక్షంగా నేను చేసుకుంటున్న వాదన ఆలకించండి.
Afei muntie mʼano asɛm; muntie mʼanoyi.
7 మీరు దేవుని పక్షంగా నిలబడి అన్యాయంగా వాదించ వచ్చా? ఆయన తరపున వంచన మాటలు పలక వచ్చా?
Mobɛka amumɔyɛsɛm ama Onyankopɔn ana? Mobɛka nnaadaasɛm ama no ana?
8 ఆయన పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శిస్తారా? మీరు దేవుని పక్షాన నిలబడి వాదిస్తారా?
Mobɛkyea mo aso ama no? Mobɛka Onyankopɔn asɛm ama no ana?
9 ఒకవేళ ఆయన మిమ్మల్ని పరిశోధిస్తే అది మీకు క్షేమకరమా? ఒకడు ఇతరులను మోసం చేసినట్టు మీరు ఆయనను మోసం చేస్తారా?
Sɛ ɔhwehwɛ mo mu a, ebesi mo yiye ana? Mubetumi adaadaa no sɛnea modaadaa nnipa no ana?
10 ౧౦ మీరు రహస్యంగా పక్షపాతం చూపిస్తే ఆయన తప్పకుండా మిమ్మల్ని గద్దిస్తాడు.
Sɛ mokyeaa mo aso wɔ kokoa mu a, sɛnea ɛte biara, ɔbɛka mo anim
11 ౧౧ ఆయన ప్రభావం మీకు భయం కలిగించదా? ఆయన భయం మిమ్మల్ని ఆవరించదా?
Nʼanuonyam mmɔ mo hu ana? Ne ho suro ntɔ mo so ana?
12 ౧౨ మీరు చెప్పే గద్దింపు మాటలు బూడిదలాంటి సామెతలు. మీరు చేస్తున్న వాదాలు మట్టిగోడలవంటివి.
Mo kasatɔmmɛ yɛ mmɛbu a ɛte sɛ nsõ; mo anoyi yɛ dɔte twann anoyi.
13 ౧౩ నా జోలికి రాకుండా మౌనంగా ఉండండి. నేను చెప్పేది వినండి. నాకు ఏమి జరగాలని ఉందో అదే జరుగు గాక.
“Monyɛ komm mma menkasa; na nea ɛbɛyɛ me biara mmra me so.
14 ౧౪ నా ప్రాణాన్ని నేనే ఎరగా ఎందుకు చేసుకోవాలి? నా ప్రాణానికి తెగించి మాట్లాడతాను.
Adɛn nti na mede me ho to amane mu na mede me nkwa to me nsam?
15 ౧౫ వినండి, ఆయన నన్ను చంపినా నేను ఆయన కోసం ఆశతో ఎదురుచూస్తున్నాను. ఆయన సమక్షంలో నా న్యాయ ప్రవర్తనను రుజువు పరుచుకుంటాను.
Ɛwɔ mu sɛ okum me de, nanso ne so na mʼani bɛda; ampa ara medi mʼakwan ho adanse wɔ nʼanim.
16 ౧౬ దీని వల్ల నాకు విడుదల చేకూరుతుంది. భక్తిహీనుడు ఆయన సమక్షంలో నిలవడానికి సాహసం చెయ్యడు.
Nokware, eyi na ɛbɛyɛ me nkwagye, efisɛ nea onsuro Onyankopɔn no rentumi nkɔ nʼanim!
17 ౧౭ నా సాక్షం జాగ్రత్తగా వినండి. నేను చేసే ప్రమాణాలు మీ చెవుల్లో మారుమ్రోగనియ్యండి.
Muntie me nsɛm yi yiye; monyɛ aso mma nea meka.
18 ౧౮ ఆలోచించండి, నేను నా వివాదాన్ని చక్కబరచుకున్నాను. నేను నిర్దోషిగా తీర్చబడతానని నాకు తెలుసు.
Afei a masiesie me nkurobɔ yi, minim sɛ medi bem.
19 ౧౯ నాతో వాదం పెట్టుకుని గెలవ గలిగేవాడు ఎవరు? ఎవరైనా ఎదుటికి వస్తే నేను నోరు మూసుకుని ప్రాణం విడిచిపెడతాను.
Obi betumi abɔ me kwaadu ana? Sɛ ɛte saa de a, anka mɛyɛ komm na mawu.
20 ౨౦ దేవా, ఈ రెండు విషయాలు నా పక్షంగా జరిగించు. అప్పుడు నేను దాక్కోకుండా నీ ఎదుట కనపడతాను.
“Onyankopɔn, yɛ saa nneɛma abien yi pɛ ma me, na afei meremfa me ho nhintaw wo:
21 ౨౧ నీ బలమైన చెయ్యి నా మీద నుండి తొలగించు. నీ భయం వల్ల నేను బెదిరిపోయేలా చెయ్యకు.
Yi wo nsa fi me so kɔ akyirikyiri, na gyae wo ho hu a wode hunahuna me no.
22 ౨౨ అప్పుడు నువ్వు పిలిస్తే నేను పలుకుతాను. లేదా నేను పిలుస్తాను, నాకు జవాబు చెప్పు.
Ɛno de, samena me na mɛba, anaa ma menkasa na bua me.
23 ౨౩ నేను చేసిన దోషాలు ఎన్ని? నేను చేసిన పాపాలు ఎన్ని? నా అపరాధాలు, నా పాపాలు నాకు తెలియబరచు.
Mfomso ne bɔne dodow ahe na mayɛ? Kyerɛ me me mfomso ne me bɔne.
24 ౨౪ నీ ముఖాన్ని నాకు చాటు చేసుకుంటున్నావెందుకు? నన్నెందుకు నీ శత్రువుగా భావిస్తున్నావు?
Adɛn nti na wode wʼanim asie me na wudwen sɛ meyɛ wo tamfo?
25 ౨౫ అటూ ఇటూ కొట్టుకుపోయే ఆకులాంటి నన్ను భయపెడతావా? ఎండిపోయిన చెత్త వెంటబడతావా?
Wobɛyɛ ahaban a mframa rebɔ no ayayade ana? Wobɛtaa ntɛtɛ a awo ana?
26 ౨౬ నువ్వు నాకు కఠినమైన శిక్ష విధించావు. నేను చిన్నతనంలో చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవించేలా చేశావు.
Wokyerɛw sobo a ɛyɛ yaw tia me, na woka me mmabunmmere mu bɔne nyinaa gu me so.
27 ౨౭ నా కాళ్ళకు బొండ వేసి బిగించావు. నా నడవడి అంతా నువ్వు కనిపెడుతున్నావు. నా అడుగులకు నువ్వే గిరి గీశావు.
Wode nkyehama gu mʼanan; wohwɛ mʼanammɔnkwan nyinaa so yiye na wode agyiraehyɛde ayeyɛ mʼanammɔn mu.
28 ౨౮ కుళ్ళిపోయిన శవంలాగా ఉన్నవాడి చుట్టూ, చిమ్మటలు తినివేసిన గుడ్డపేలికలాంటివాడి చుట్టూ గిరి గీసి కాపు కాస్తున్నావు.
“Enti onipa nkwa sa te sɛ ade a aporɔw, te sɛ atade a nwewee adi.

< యోబు~ గ్రంథము 13 >