< యోబు~ గ్రంథము 13 >
1 ౧ ఇదిగో వినండి, నా కళ్ళకు ఇదంతా కనబడింది, నా చెవులకు అంతా వినబడింది,
೧ಇಗೋ, ಇವುಗಳನ್ನೆಲ್ಲಾ ನನ್ನ ಕಣ್ಣು ಕಂಡಿದೆ, ಕಿವಿಯು ಕೇಳಿ ಗ್ರಹಿಸಿದೆ.
2 ౨ మీకు తెలిసిన విషయాలన్నీ నాక్కూడా తెలుసు. నాకున్న జ్ఞానం కంటే మీకున్న జ్ఞానం ఎక్కువేమీ కాదు.
೨ನೀವು ತಿಳಿದಿರುವುದನ್ನು ನಾನೂ ತಿಳಿದಿದ್ದೇನೆ. ನಿಮಗಿಂತ ನಾನು ಕಡೆಯಲ್ಲ.
3 ౩ నేను సర్వశక్తుడైన దేవునితోనే మాట్లాడాలని చూస్తున్నాను. ఆయనతోనే నేను వాదిస్తాను.
೩ಆದರೆ ನಾನು ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರ ಸಂಗಡ ಮಾತನಾಡಬೇಕು, ದೇವರೊಂದಿಗೆ ವಾದಿಸಲು ಅಪೇಕ್ಷಿಸುತ್ತೇನೆ.
4 ౪ మీరంతా అబద్ధాలు కల్పించి చెబుతారు. మీరు ఎందుకూ పనికిరాని వైద్యుల వంటివారు.
೪ನೀವಾದರೋ ಸುಳ್ಳನ್ನು ಪ್ರತಿಪಾದಿಸುವವರಾಗಿದ್ದೀರಿ, ನೀವೆಲ್ಲರೂ ವ್ಯರ್ಥ ವೈದ್ಯರೇ.
5 ౫ మీరేమీ మాట్లాడకుండా ఉంటేనే మంచిది. అదే మీకు ఉత్తమం.
೫ನೀವು ಬಾಯಿಮುಚ್ಚಿ ಸುಮ್ಮನಾದರೆ ಎಷ್ಟೋ ಉತ್ತಮ! ಮೌನವೇ ನಿಮಗೆ ಜ್ಞಾನವು.
6 ౬ దయచేసి నేను చెప్పేది వినండి. నా పక్షంగా నేను చేసుకుంటున్న వాదన ఆలకించండి.
೬ದಯಮಾಡಿ ನನ್ನ ಆಕ್ಷೇಪಣೆಯನ್ನು ಕೇಳಿರಿ, ನನ್ನ ತುಟಿಗಳ ವಾದಕ್ಕೆ ಕಿವಿಗೊಡಿರಿ.
7 ౭ మీరు దేవుని పక్షంగా నిలబడి అన్యాయంగా వాదించ వచ్చా? ఆయన తరపున వంచన మాటలు పలక వచ్చా?
೭ದೇವರ ಪಕ್ಷವಾಗಿ ಅನ್ಯಾಯವನ್ನು ನುಡಿಯುವಿರೋ? ಆತನಿಗೋಸ್ಕರ ಮೋಸದ ಮಾತುಗಳನ್ನಾಡುವಿರೋ?
8 ౮ ఆయన పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శిస్తారా? మీరు దేవుని పక్షాన నిలబడి వాదిస్తారా?
೮ಆತನಿಗೆ ಮುಖದಾಕ್ಷಿಣ್ಯವನ್ನು ತೋರಿಸುವಿರಾ? ದೇವರಿಗಾಗಿ ವಾದಿಸುವಿರಾ?
9 ౯ ఒకవేళ ఆయన మిమ్మల్ని పరిశోధిస్తే అది మీకు క్షేమకరమా? ఒకడు ఇతరులను మోసం చేసినట్టు మీరు ఆయనను మోసం చేస్తారా?
೯ಆತನು ನಿಮ್ಮನ್ನು ಶೋಧಿಸಿದರೆ ನಿಮಗೆ ಒಳ್ಳೆಯದಾಗುವುದೋ? ಮನುಷ್ಯನನ್ನು ಮೋಸಗೊಳಿಸುವಂತೆ ಆತನನ್ನೂ ಮೋಸಗೊಳಿಸುವಿರೋ?
10 ౧౦ మీరు రహస్యంగా పక్షపాతం చూపిస్తే ఆయన తప్పకుండా మిమ్మల్ని గద్దిస్తాడు.
೧೦ನೀವು ರಹಸ್ಯವಾಗಿ ಪಕ್ಷಪಾತ ಮಾಡಿದರೆ ಆತನು ನಿಮ್ಮನ್ನು ಖಂಡಿಸೇ ಖಂಡಿಸುವನು.
11 ౧౧ ఆయన ప్రభావం మీకు భయం కలిగించదా? ఆయన భయం మిమ్మల్ని ఆవరించదా?
೧೧ಆತನ ಶ್ರೇಷ್ಠತೆಯು ನಿಮ್ಮನ್ನು ಹೆದರಿಸುವುದಿಲ್ಲವೋ? ಆತನ ಭಯವು ನಿಮ್ಮ ಮೇಲೆ ಬೀಳುವುದಿಲ್ಲವೋ?
12 ౧౨ మీరు చెప్పే గద్దింపు మాటలు బూడిదలాంటి సామెతలు. మీరు చేస్తున్న వాదాలు మట్టిగోడలవంటివి.
೧೨ನಿಮ್ಮ ಸ್ಮೃತಿಗಳು ಬೂದಿಗೆ ಸಮಾನವಾದ ಉದಾಹರಣೆ; ನಿಮ್ಮ ಕೋಟೆಯು ಬರೀ ಮಣ್ಣಿನದೇ.
13 ౧౩ నా జోలికి రాకుండా మౌనంగా ఉండండి. నేను చెప్పేది వినండి. నాకు ఏమి జరగాలని ఉందో అదే జరుగు గాక.
೧೩ಸುಮ್ಮನಿರಿ, ನನ್ನನ್ನು ಬಿಡಿರಿ, ನಾನು ಮಾತನಾಡಬೇಕು, ನನಗೇನಾದರೂ ಆಗಲಿ.
14 ౧౪ నా ప్రాణాన్ని నేనే ఎరగా ఎందుకు చేసుకోవాలి? నా ప్రాణానికి తెగించి మాట్లాడతాను.
೧೪ನನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಬಾಯಿಂದ ಕಚ್ಚಿಕೊಂಡಿರುವೆನು, ನನ್ನ ಜೀವವನ್ನು ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದುಕೊಂಡಿರುವೆನು.
15 ౧౫ వినండి, ఆయన నన్ను చంపినా నేను ఆయన కోసం ఆశతో ఎదురుచూస్తున్నాను. ఆయన సమక్షంలో నా న్యాయ ప్రవర్తనను రుజువు పరుచుకుంటాను.
೧೫ಆಹಾ, ಆತನು ನನ್ನನ್ನು ಕೊಲ್ಲುವನು, ಅದಕ್ಕಾಗಿ ಕಾದಿರುತ್ತೇನೆ, ಆದರೂ ನನ್ನ ನಡತೆಯ ಒಳ್ಳೆಯತನವನ್ನು ಆತನ ಮುಂದೆ ಸ್ಥಾಪಿಸುವೆನು.
16 ౧౬ దీని వల్ల నాకు విడుదల చేకూరుతుంది. భక్తిహీనుడు ఆయన సమక్షంలో నిలవడానికి సాహసం చెయ్యడు.
೧೬ಭ್ರಷ್ಟನು ಆತನ ಮುಂದೆ ಬರುವುದಿಲ್ಲವೆಂಬುದೇ, ನಾನು ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದುವೆನೆಂಬುವುದಕ್ಕೆ ಆಧಾರವಾಗಿದೆ.
17 ౧౭ నా సాక్షం జాగ్రత్తగా వినండి. నేను చేసే ప్రమాణాలు మీ చెవుల్లో మారుమ్రోగనియ్యండి.
೧೭ನನ್ನ ಮಾತುಗಳನ್ನು ಚೆನ್ನಾಗಿ ಕೇಳಿರಿ, ನನ್ನ ಅರಿಕೆಗೆ ಕಿವಿಗೊಡಿರಿ.
18 ౧౮ ఆలోచించండి, నేను నా వివాదాన్ని చక్కబరచుకున్నాను. నేను నిర్దోషిగా తీర్చబడతానని నాకు తెలుసు.
೧೮ಇಗೋ, ನನ್ನ ನ್ಯಾಯವನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಿದ್ದೇನೆ; ನಾನು ನೀತಿವಂತನೆಂಬುದಾಗಿ ನಿರ್ಣಯವಾಗುವುದೆಂದು ನನಗೆ ಗೊತ್ತೇ ಇದೆ.
19 ౧౯ నాతో వాదం పెట్టుకుని గెలవ గలిగేవాడు ఎవరు? ఎవరైనా ఎదుటికి వస్తే నేను నోరు మూసుకుని ప్రాణం విడిచిపెడతాను.
೧೯ನನಗೆ ಪ್ರತಿವಾದಿ ಇದ್ದಾನೋ? ಇದ್ದರೆ, ನಾನು ನನ್ನನ್ನು ನಿನ್ನ ದೃಷ್ಟಿಗೆ ಮರೆಮಾಡಿಕೊಂಡು, ಮೌನನಾಗಿ ಪ್ರಾಣಬಿಡುವೆನು.
20 ౨౦ దేవా, ఈ రెండు విషయాలు నా పక్షంగా జరిగించు. అప్పుడు నేను దాక్కోకుండా నీ ఎదుట కనపడతాను.
೨೦ಈ ನನ್ನೆರಡು ಕೋರಿಕೆಗಳನ್ನು ಈಡೇರಿಸು. ಆಗ ನಿನ್ನ ದೃಷ್ಟಿಗೆ ನಾನು ಮರೆಮಾಡಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ.
21 ౨౧ నీ బలమైన చెయ్యి నా మీద నుండి తొలగించు. నీ భయం వల్ల నేను బెదిరిపోయేలా చెయ్యకు.
೨೧ನನ್ನ ಮೇಲೆತ್ತಿರುವ ನಿನ್ನ ಕೈಯನ್ನು ದೂರಮಾಡು, ನಿನ್ನ ಭಯವು ನನ್ನನ್ನು ಹೆದರಿಸದಿರಲಿ.
22 ౨౨ అప్పుడు నువ్వు పిలిస్తే నేను పలుకుతాను. లేదా నేను పిలుస్తాను, నాకు జవాబు చెప్పు.
೨೨ಆಗ ನೀನು ಕರೆದರೆ ನಾನು ಉತ್ತರಕೊಡುವೆನು, ಇಲ್ಲವೆ ನಾನು ಮಾತನಾಡುವೆ, ನೀನು ಉತ್ತರಕೊಡು.
23 ౨౩ నేను చేసిన దోషాలు ఎన్ని? నేను చేసిన పాపాలు ఎన్ని? నా అపరాధాలు, నా పాపాలు నాకు తెలియబరచు.
೨೩ನನ್ನ ಪಾಪದೋಷಗಳೆಷ್ಟು? ನನ್ನ ಪಾಪವನ್ನೂ, ದ್ರೋಹವನ್ನೂ ನನಗೆ ತಿಳಿಯಪಡಿಸು.
24 ౨౪ నీ ముఖాన్ని నాకు చాటు చేసుకుంటున్నావెందుకు? నన్నెందుకు నీ శత్రువుగా భావిస్తున్నావు?
೨೪ಏಕೆ ನಿನ್ನ ಮುಖವನ್ನು ಮರೆಮಾಡುತ್ತಿ? ನನ್ನನ್ನು ಶತ್ರುವೆಂದೆಣಿಸಿರುವುದೇಕೆ?
25 ౨౫ అటూ ఇటూ కొట్టుకుపోయే ఆకులాంటి నన్ను భయపెడతావా? ఎండిపోయిన చెత్త వెంటబడతావా?
೨೫ಹಾರಿಹೋಗುವ ಎಲೆಯನ್ನು ನಡುಗಿಸುವಿಯಾ? ಒಣಗಿದ ಹೊಟ್ಟನ್ನು ಅಟ್ಟಿಬಿಡುವಿಯಾ?
26 ౨౬ నువ్వు నాకు కఠినమైన శిక్ష విధించావు. నేను చిన్నతనంలో చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవించేలా చేశావు.
೨೬ನನ್ನ ವಿಷಯವಾಗಿ ಕಠಿಣವಾದ ತೀರ್ಪುಗಳನ್ನು ಬರೆದು, ನನ್ನ ಯೌವನದ ಪಾಪಗಳ ಬಾಧ್ಯತೆಯನ್ನು ನನಗೆ ಕೊಟ್ಟಿದ್ದಿ.
27 ౨౭ నా కాళ్ళకు బొండ వేసి బిగించావు. నా నడవడి అంతా నువ్వు కనిపెడుతున్నావు. నా అడుగులకు నువ్వే గిరి గీశావు.
೨೭ನೀನು ನನ್ನ ಕಾಲುಗಳಿಗೆ ಕೋಳವನ್ನು ಹಾಕಿದ್ದಿ; ನನ್ನ ದಾರಿಗಳನ್ನೆಲ್ಲಾ ಮನದಟ್ಟುಮಾಡಿ ನನ್ನ ಹೆಜ್ಜೆಗಳ ಸುತ್ತಲೂ ಗೆರೆಯೆಳೆದಿದ್ದಿ.
28 ౨౮ కుళ్ళిపోయిన శవంలాగా ఉన్నవాడి చుట్టూ, చిమ్మటలు తినివేసిన గుడ్డపేలికలాంటివాడి చుట్టూ గిరి గీసి కాపు కాస్తున్నావు.
೨೮ಕೊಳೆಯುವ ಪದಾರ್ಥದಂತೆಯೂ, ನುಸಿ ಹಿಡಿದ ಬಟ್ಟೆಯ ಹಾಗೂ ಕ್ಷಯಿಸಿಹೋಗುತ್ತಿದ್ದೇನೆ.