< యిర్మీయా 9 >
1 ౧ నా తల జలమయంగా నా కళ్ళు కన్నీటి ఊటగా ఉండు గాక. ఎందుకంటే హతమైన నా ప్రజలను గూర్చి నేను రాత్రింబగళ్ళూ విలపించాలని కోరుతున్నాను.
Yaye, mad wiya bed ka soko mar pi kendo pi wangʼa mol ka aora! Dwaywak odiechiengʼ kod otieno nikech nek mar joga.
2 ౨ నా ప్రజలంతా వ్యభిచారులు, ద్రోహుల గుంపులాగా ఉన్నారు. నేను వారిని విడిచిపెట్టి వెళ్లి ఉండడానికి అరణ్యంలో ఒక బాటసారుల నివాసం నాకు దొరికితే బాగుండును.
Yaye, mad ne abed gi kar nindo michulo ne jowuoth e piny ongoro, mondo omi awe joga kendo adhi mabor kodgi; nimar giduto gin jochode, kanyakla mar joma onge adiera.
3 ౩ విల్లును వంచినట్టుగా వారు తమ నాలుకను అబద్ధమాడడానికి వంచుతారు. ఈ భూమిపై వారు నమ్మదగిన వారు కాదు. వారు ఒకటి తరవాత మరొకటి చెడుకార్యాలు జరిగిస్తున్నారు. “నేను ఎవరో వారు ఎరుగరు” అని యెహోవా చెబుతున్నాడు.
“Giketo lewgi moikore ka atungʼ, mondo gidirgo miriambo; to dhigi maber e piny ok nikech giwacho adiera. Gitimo richo bangʼ moro ka moro; ok gidewa.” Jehova Nyasaye ema owacho.
4 ౪ మీలో ప్రతివాడూ తన పొరుగువాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ సోదరుణ్నీ నమ్మవద్దు. ఎందుకంటే నిజంగా ప్రతి సోదరుడూ మోసం చేసేవాడే. ప్రతి పొరుగువాడూ అపనిందలు వేస్తూ తిరుగుతుంటాడు.
“Beduru motangʼ gosiepeu; kik uket genou kuom oweteu. Nimar oweteu duto jo-miriambo, kendo osiep moro amora jakwoth.
5 ౫ ప్రతివాడూ సత్యం చెప్పకుండా తన పొరుగువాడిని మోసం చేస్తాడు. అక్రమం జరిగించడం వారికి అలవాటై పోయింది. ఎంతసేపూ ఎదుటి వారిలో తప్పులు పట్టాలని చూస్తారు.
Osiep wuondo osiep, kendo onge ngʼama wacho adiera. Gisepuonjo lewgi wacho miriambo; kendo gisedonjo matut e richo ma ok ginyal wuokie.
6 ౬ కపటం మధ్యలో నువ్వు నివసిస్తున్నావు. వారి కపటంలో వారు నన్ను తెలుసుకోలేక పోతున్నారు. ఇదే యెహోవా వాక్కు.
Idak e kind jo-miriambo; e wuondruokgino gisedagi yie kuoma.” Jehova Nyasaye ema owacho.
7 ౭ కాబట్టి సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే, చూడూ, నేను వారిని లోహం లాగా కరిగించి పరీక్షించబోతున్నాను. వారికి ఇంతకంటే మరేమి చెయ్యను?
Emomiyo ma e gima Jehova Nyasaye Maratego wacho: “Ne, abiro pwodhogi kendo temogi, nimar en angʼo machielo manyalo timo, nikech richo mar joga?
8 ౮ వారి నాలుక పదును పెట్టిన బాణం, అది కపటమే పలుకుతుంది. ఒకడు తన పొరుగువారితో పైకి స్నేహపూర్వకంగా మాట్లాడతాడు గాని మనస్సులో మాత్రం మోసపూరితమైన ఆలోచనలు ఉంటాయి.
Lewgi en asere man-gi kwiri; owacho miriambo. Gi dhoge owuoyo mamuol ne jabathe, to e chunye oketone obadho.”
9 ౯ ఈ సంగతులు తెలిసీ నేను వారిని శిక్షించకూడదా? ఈ దేశాన్ని దండించ కూడదా? ఇదే యెహోవా వాక్కు.
Jehova Nyasaye wacho niya, “Donge dakumgi ne ma? Donge dachul kuor ne oganda ma kama?”
10 ౧౦ పర్వతాల గురించి ఏడుస్తాను, విలాప గీతం ఆలపిస్తాను. వాటి మేతస్థలాల గురించి రోదిస్తాను. ఎందుకంటే అవి పాడైపోయాయి. వాటిగుండా ఎవరూ వెళ్ళడం లేదు. వాటిలో పశువుల అరుపులు వినబడడం లేదు. ఆకాశ పక్షులు, జంతువులు అన్నీ పారిపోయాయి.
Abiro ywak kendo dengo ne gode bende anaywag lege motwo, mosedongʼ nono, kendo onge gima wuothoe, bende ywak mar jamni ok winjie. Winy mafuyo e kor polo oseringo, kendo le osedhi.
11 ౧౧ యెరూషలేమును పాడుదిబ్బగా నక్కల నివాసంగా చేస్తాను. యూదా పట్టణాలను ఎవరూ నివసించలేకుండా పాడు చేస్తాను.
“Anami Jerusalem obed gunda, kama ondiegi ema odakie; kendo anaketh mier mag Juda mondo ngʼato kik dag kanyo.”
12 ౧౨ ఈ సంగతిని అర్థం చేసుకోగల జ్ఞానం ఎవరికుంది? దాన్ని వివరించడానికి యెహోవా ఎవరికి తన నోటి మాట ఇచ్చాడు? ఎవరూ ప్రయాణం చేయలేకుండా ఆ దేశం ఎందుకు ఎడారిలా మారిపోయింది?
En ngʼa mariek manyalo winjo tiend ma? En ngʼa mosetiegi gi Jehova Nyasaye kendo nyalo lero tiende? Angʼo momiyo piny osekethi modongʼ nono ka kama otwo maonge ngʼama nyalo luwo?
13 ౧౩ యెహోవా చెప్పేదేమంటే, “దానికి కారణం, వారు నా మాట వినలేదు, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా తోసిపుచ్చారు.
Jehova Nyasaye nowacho niya, “Nikech gisejwangʼo chikna, mane amiyogi; omiyo ok giseluora kata luwo chikna.
14 ౧౪ తమ హృదయంలోని మూర్ఖత్వం ప్రకారం చేశారు. తమ పూర్వికుల దగ్గర నేర్చుకున్నట్టు బయలు దేవుళ్ళను పూజించారు. అందుకే వారి దేశం పాడైపోయింది.”
To giseluwo mana timbegi mag wich teko; bende giseluwo bangʼ Baal, mana kaka wuonegi nopuonjogi.”
15 ౧౫ సైన్యాల ప్రభువు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పేదేమంటే, “నేను ఈ ప్రజలు చేదుకూరలు తినేలా చేస్తాను. విషజలం తాగిస్తాను.
Emomiyo, ma e gima Jehova Nyasaye Maratego ma Nyasach Israel, wacho: “Ne, anami jogi cham chiemo makech kendo modh pi sum.
16 ౧౬ వారు గానీ, వారి పూర్వికులు గానీ ఎరగని జాతి ప్రజల్లోకి వారిని చెదరగొడతాను. వారు పూర్తిగా నాశనం అయ్యేవరకూ వారి పైకి ఖడ్గం పంపుతాను.”
Anakegi e dier ogendini ma gin kata wuonegi ok ongʼeyo, kendo analawgi gi ligangla manyaka atiekgi.”
17 ౧౭ సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “ఆలోచించండి. రోదనం చేసే స్త్రీలను వెతికి వారిని పిలిపించండి. విలాపంలో నైపుణ్యం గల స్త్రీలను వెదికి వారిని పిలవండి.
Ma e gima Jehova Nyasaye Maratego wacho: “Parane! Luonguru mon madengo mondo obi; to moloyo mago man-gi lony mamalo e ywak.
18 ౧౮ మనం కన్నీళ్లు విడిచేలా, మన కనురెప్పల నుండి నీళ్లు కారిపోయేలా వారు త్వరగా వచ్చి రోదన ధ్వని చేయమని చెప్పండి.”
Giret piyo mondo gidengnwa, nyaka wengewa pongʼ gi pi wangʼ ma oo kendo pi wangʼwa mol ma luokwa.
19 ౧౯ “మనం నాశనమయ్యాం, చాలా అవమానానికి గురయ్యాం. వారు మన ఇళ్ళను కూలదోశారు. మనం దేశం విడిచి వెళ్ళాల్సివచ్చింది” అని సీయోనులో రోదన ధ్వని వినబడుతున్నది.
Koko mar dengo iwinjo koa Sayun: ‘Mano kaka otiekowa! Mano kaka wichkuot marwa duongʼ! Nyaka waa e pinywa nikech utewa osemuki.’”
20 ౨౦ స్త్రీలారా, యెహోవా మాట వినండి. ఆయన నోటి నుండి వచ్చే సందేశాలను జాగ్రత్తగా ఆలకించండి. మీ కూతుళ్ళకు విలాప గీతం నేర్పండి. ఒకరికొకరు అంగలార్పు గీతాలు నేర్పండి.
Koro, yaye mon, winjuru wach Jehova Nyasaye; yawuru itu ne weche mawuok e dhoge. Puonjuru nyiu dengo; puonjreuru ywak uwegi.
21 ౨౧ మరణం మన ఇంటి కిటికీల గుండా ఎక్కుతూ ఉంది. మన రాజభవనాల్లో అడుగు పెడుతూ ఉంది. అది వీధుల్లో పసిపిల్లలు, రాజమార్గాల్లో యువకులు లేకుండా వారిని నాశనం చేస్తున్నది.
Tho oseidho gie dirisni magwa kendo osedonjo kuondewa mochiel motegno gohinga; osengʼado nyithindo oko e yore kendo rowere e kuonde budho mag galamoro.
22 ౨౨ యెహోవా చెప్పేదేమంటే “పొలాల్లో పేడ పడేలా, కోతపనివారి వెనక పనలు పడేలా మనుషుల శవాలు కూలుతాయి. వాటిని పోగు చేయడానికి ఎవరూ ఉండరు.”
Wach niya, “Ma e gima Jehova Nyasaye owacho: “‘Ringre joma otho nopie ka owuoyo e pap alanga, kaka cham mokaa gi jakeyo, maonge ngʼama nyalo chokogi.’”
23 ౨౩ యెహోవా చెప్పేదేమంటే “తెలివైనవాడు తన తెలివిని బట్టీ బలవంతుడు తన బలాన్ని బట్టీ గర్వించకూడదు. అలాగే ధనవంతుడు తన ఆస్తిని బట్టి గర్వించకూడదు.
Ma e gima Jehova Nyasaye wacho: “Kik ngʼama riek sungre gi riekone kata ngʼama tek sungre gi tekone, kata ngʼama omewo sungre gi mwandu mage,
24 ౨౪ దేనిలో అతిశయించాలంటే, ఈ భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగిస్తున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడంలోనే అతిశయించాలి. అలాటి వాటిలోనే నేను ఆనందిస్తాను.”
to ngʼat ma sungore mondo osungre kama: ni ongʼeya, kendo owinja, ni An e Jehova Nyasaye, matimo ngʼwono, kendo mangʼado bura mar adier, kendo matimo gik makare e piny, nikech magi ema amorgo,” Jehova Nyasaye ema owacho.
25 ౨౫ యెహోవా చెప్పేదేమంటే “అన్యజాతి ప్రజలు సున్నతి పొందలేదు. ఇశ్రాయేలీయులేమో హృదయ సంబంధమైన సున్నతి పొందలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో సున్నతి పొందని వారినీ, పొందిన వారినీ కలిపి శిక్షిస్తాను.
Jehova Nyasaye wacho niya, “Ndalo biro ma anakumie joma oter nyangu e ringruok kende
26 ౨౬ అంటే ఐగుప్తు వారు, యూదులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఎడారిలో నివసిస్తూ తమ గడ్డాలు చెంపలపై గొరిగించుకునేవారు, వీరందరినీ నేను శిక్షిస్తాను.”
kaka Misri, Juda, Edom, Amon, Moab gi jogo duto modak kuonde motimo ongoro man maboyo. Nimar ogendinigi duto ok oter nyangu adier, kendo kata od Israel duto bende ok oter nyangu e chunygi.”