< యిర్మీయా 8 >
1 ౧ యెహోవా చెప్పేదేమంటే ఆ సమయంలో మీ శత్రువులు యూదా రాజుల, వారి అధిపతుల ఎముకలను, యాజకుల, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను వారి సమాధుల్లో నుండి బయటికి తీస్తారు.
Chúa Hằng Hữu phán: “Trong ngày ấy, kẻ thù sẽ đào hài cốt các vua Giu-đa, các quan tướng, các thầy tế lễ, các tiên tri, và các thường dân Giê-ru-sa-lem.
2 ౨ వాటిని తెచ్చి వారు వేటినైతే ప్రేమిస్తున్నారో, పూజిస్తున్నారో, వేటి ఎదుట విచారణ చేస్తున్నారో, నమస్కరిస్తున్నారో ఆ సూర్య చంద్ర నక్షత్రాల ఎదుట వాటిని పరుస్తారు. వాటిని పోగు చేసి పాతిపెట్టడం జరగదు. భూమి మీద పెంటలాగా అవి పడి ఉంటాయి.
Chúng sẽ lấy xương khô rải ra trên đất dưới ánh mặt trời, mặt trăng, và các vì sao—tức các thần mà dân Ta yêu chuộng, phục vụ, và thờ lạy. Không ai buồn đi lượm các xương khô ấy để cải táng, nhưng cứ để cho mục nát làm phân bón.
3 ౩ ఈ దుర్మార్గ దేశంలో ఇంకా మిగిలి ఉన్నవారు నేను వారిని చెదర గొట్టిన స్థలాల్లో జీవానికి బదులు చావును కోరుకుంటారు. సేనల ప్రభువైన యెహోవా వాక్కు ఇదే.
Số phận của đám dân sống sót còn thê thảm hơn, họ mong được chết đi để khỏi chịu đựng cảnh lưu đày nhục nhã nơi các xứ lạ mà Ta đưa họ đến. Ta, Chúa Hằng Hữu Vạn Quân, đã phán vậy!”
4 ౪ యెహోవా ఇలా చెబుతున్నాడని వారితో చెప్పు. “కిందపడిన మనుషులు లేవకుండా ఉంటారా? దారి తప్పిపోయిన వారు తిరిగి రావడానికి ప్రయత్నించకుండా ఉంటారా?”
“Giê-rê-mi, hãy rao truyền cho dân chúng: ‘Đây là điều Chúa Hằng Hữu phán: Khi người ta vấp ngã, chẳng lẽ họ không đứng dậy sao? Khi biết mình đi sai đường, họ không quay lại sao?
5 ౫ మరి ఈ ప్రజలు, యెరూషలేము ఎందుకు దారి తప్పి శాశ్వతంగా తిరిగి రాకుండా ఉన్నారు? వారు ఎందుకు మోసంలో నిలిచి ఉండి పశ్చాత్తాప పడడానికి ఒప్పుకోవడం లేదు?
Nhưng tại sao dân này cứ tiếp tục đi sâu vào con đường sai lạc? Tại sao người Giê-ru-sa-lem không chịu trở lại?
6 ౬ నేను వారి మాటలు జాగ్రత్తగా ఆలకించాను. కానీ వారు ఒక్కటి కూడా మంచి మాట పలకలేదు. “నేనిలా చేశానేమిటి?” అని తన తన చెడ్డ పని గురించి పశ్చాత్తాపపడే వాడు ఒక్కడూ లేడు. యుద్ధంలోకి చొరబడే గుర్రం లాగా ప్రతివాడూ తనకిష్టమైన మార్గంలో తిరుగుతున్నాడు.
Ta nghe chúng chuyện trò với nhau, nhưng chẳng nghe một lời chân thật. Không một ai hối lỗi vì đã làm điều sai sao? Có ai nói rằng: “Tôi đã làm một việc thật khủng khiếp” không? Không! Tất cả đều vội vàng tiến nhanh trên con đường tội ác như đàn ngựa chạy ra mặt trận!
7 ౭ ఆకాశంలో ఎగిరే సంకుబుడి కొంగకు దాని కాలాలు తెలుసు. తెల్ల గువ్వ, మంగలకత్తి పిట్ట, ఓదెకొరుకులకు అవి తిరిగి రావలసిన సమయాలు తెలుసు. అయితే నా ప్రజలకు యెహోవా న్యాయవిధి తెలియదు.
Ngay cả đàn cò bay trên trời còn biết phân biệt mùa di chuyển, như chim cu, chim nhạn, và chim sếu. Chúng còn biết mùa nào phải trở về. Nhưng dân Ta thì không! Chúng chẳng biết quy luật của Chúa Hằng Hữu.
8 ౮ “మేము జ్ఞానులం, యెహోవా ధర్మశాస్త్రం మాతో ఉంది” అని మీరెందుకు అంటున్నారు? నిజమే గానీ శాస్త్రులు మోసంతో దానికి పెడర్థాలు రాశారు.
Sao các ngươi còn dám tự hào: “Chúng tôi khôn ngoan vì chúng tôi hiểu lời của Chúa Hằng Hữu,” khi các thầy dạy của các ngươi đã xuyên tạc lời Ta và lừa bịp các ngươi?
9 ౯ జ్ఞానులు అవమానం పాలవుతారు. వారు విస్మయంతో చిక్కుల్లో పడ్డారు. వారు యెహోవా వాక్యాన్ని తోసిపుచ్చారు. ఇక వారి జ్ఞానం వలన ఏం ప్రయోజనం?
Những người tự coi mình khôn ngoan sẽ té ngã trong bẫy ngu muội của mình, vì chúng đã khước từ lời Chúa Hằng Hữu. Chúng còn khôn ngoan được sao?
10 ౧౦ కాబట్టి వారి భార్యలను అన్యులకు అప్పగిస్తాను. వారి పొలాలు ఇతరుల స్వాధీనం చేస్తాను. చిన్నలు, పెద్దలు, అందరూ విపరీతమైన దురాశాపరులు. ప్రవక్తలు, యాజకులు, అంతా నయవంచకులు.
Ta sẽ giao vợ của chúng cho người khác và ruộng vườn của chúng cho người lạ. Từ thường dân cho đến người cao trọng, chúng đều trục lợi cách gian lận. Phải, ngay cả tiên tri và thầy tế lễ cũng vậy. Tất cả chúng đều lừa gạt, dối trá.
11 ౧౧ శాంతి లేని సమయంలో వారు “శాంతి సమాధానాలు, శాంతి సమాధానాలు” అని పలుకుతూ నా ప్రజల గాయాలకు పైపై పూత పూస్తారు.
Chúng chữa trị cẩu thả những vết thương trầm trọng của dân Ta. Chúng còn quả quyết bình an khi chẳng có chút bình an nào.
12 ౧౨ వారు చేసే అసహ్యమైన పనులను బట్టి సిగ్గుపడాలి గాని వారేమాత్రం సిగ్గుపడరు. అవమానం అంటే వారికి తెలియదు కాబట్టి పడిపోయే వారితోబాటు వారు కూడా పడిపోతారు. నేను వారికి తీర్పు తీర్చేటప్పుడు వారు కూలిపోతారు అని యెహోవా సెలవిస్తున్నాడు.
Lẽ nào chúng không xấu hổ về những hành động ghê tởm của mình? Không một chút nào—không một chút thẹn thùng đỏ mặt! Vì thế, chúng sẽ ngã chết giữa những người tử trận. Đến ngày Ta thăm phạt, chúng sẽ bị diệt vong, Chúa Hằng Hữu phán vậy.
13 ౧౩ నేను వారిని పూర్తిగా కొట్టివేస్తున్నాను. ఇక ద్రాక్షతీగెకు ద్రాక్షలు, అంజూరు చెట్టుకు అంజూరపండ్లు కాయవు. వాటి ఆకులు వాడిపోతాయి. నేను వారికి ఇచ్చినదంతా నశించిపోతుంది. ఇదే యెహోవా వాక్కు.
Ta sẽ thiêu đốt chúng. Vườn vả, vườn nho của chúng cũng tan hoang. Cây ăn trái của chúng đều khô héo. Tất cả phước lành Ta đã ban cho chúng sẽ không còn nữa. Ta, Chúa Hằng Hữu, đã phán vậy!’
14 ౧౪ “మనం ఎందుకు ఇక్కడ కూర్చున్నాం? మనమంతా కలిసి ప్రాకారాలున్న పట్టణాల్లోకి వెళ్ళి అక్కడే చచ్చిపోదాం రండి. యెహోవాయే మనలను నాశనం చేస్తున్నాడు. మనం ఆయనకు విరోధంగా పాపం చేశాం కాబట్టి మన దేవుడు యెహోవా మనకు విషజలం తాగించాడు.
Lúc ấy, nhiều người sẽ bảo nhau: ‘Lẽ nào chúng ta đành khoanh tay chịu chết? Hãy trốn vào các thành kiên cố rồi chết tại đó. Vì Chúa Hằng Hữu, Đức Chúa Trời chúng ta đã hủy diệt chúng ta và cho chúng ta uống chén thuốc độc vì chúng ta phạm tội chống nghịch Chúa Hằng Hữu.
15 ౧౫ మనం శాంతి సమాధానాల కోసం కనిపెట్టుకుని ఉన్నాం గానీ మనకేమీ మంచి జరగలేదు. క్షేమం కోసం కనిపెడుతున్నాం గానీ భయమే కలుగుతూ ఉంది అని వారు చెబుతారు.
Chúng ta mong bình an, nhưng bình an không đến. Chúng ta trông được chữa lành, mà chỉ gặp toàn cảnh khủng bố kinh hoàng.’
16 ౧౬ దాను ప్రాంతం నుండి వచ్చే వారి గుర్రాల బుసలు వినబడుతున్నాయి. వాటి సకిలింపులకు దేశమంతా అదురుతూ ఉంది. వారు వచ్చి దేశాన్ని, దానిలోని సమస్తాన్ని, పట్టణాన్ని దానిలో నివసించే వారిని నాశనం చేస్తారు.
Tiếng khịt mũi của ngựa chiến cũng có thể nghe được trên mọi nẻo đường từ phía bắc của thành Đan! Cả đất nước rúng động vì quân đội xâm lăng tấn công như vũ bão, chiếm đóng các thành, làng mạc, nuốt chửng các bầy súc vật và mùa màng, cầm tù và tàn sát dân.
17 ౧౭ యెహోవా చెప్పేదేమంటే, ‘నేను పాములనూ, కాలనాగులనూ మీ మధ్యకు పంపిస్తాను. అవి మిమ్మల్ని కాటు వేస్తాయి. వాటికి విరుగుడు మంత్రం ఏమీ లేదు.’”
Ta sẽ sai nhiều đội quân thù đến giữa ngươi như rắn độc, ngươi không tài nào ếm chú được. Chúng sẽ cắn ngươi, và ngươi sẽ chết. Ta, là Chúa, phán vậy!”
18 ౧౮ నా గుండె నా లోపల సొమ్మసిల్లి పోతున్నది. నాకు దుఃఖ నివారణ ఎలా దొరుకుతుంది?
Tôi ước mong được an ủi vì tôi quá đau buồn; lòng dạ tôi tan nát.
19 ౧౯ యెహోవా సీయోనులో లేడా? ఆమె రాజు ఆమెలో లేడా? అని బహు దూరదేశం నుండి నా ప్రజల రోదనలు వినబడుతున్నాయి. వారి విగ్రహాలను ఇతర దేశాల మాయ దేవుళ్ళను పెట్టుకుని నాకు ఎందుకు కోపం తెప్పించారు?
Có tiếng kêu khóc của dân tôi; có thể nghe từ miền đất xa xôi. Dân tôi hỏi: “Có phải Chúa Hằng Hữu đã từ bỏ Giê-ru-sa-lem không? Ngài không còn ngự trị Giê-ru-sa-lem sao?” “Tại sao chúng chọc giận Ta bằng các tượng thần và thờ lạy tà thần nước ngoài?” Chúa Hằng Hữu phán vậy.
20 ౨౦ కోత కాలం గతించిపోయింది. ఎండాకాలం దాటిపోయింది. మనకింకా రక్షణ దొరకలేదు అని చెబుతారు.
Dân chúng kêu khóc: “Mùa gặt đã qua, và mùa hè đã hết, mà chúng ta chưa được cứu!”
21 ౨౧ నా జనుల వేదన చూసి నేనూ వేదన చెందుతున్నాను, వారికి జరిగిన ఘోరమైన సంగతులను బట్టి నేను రోదిస్తున్నాను. విపరీతమైన భయం నన్ను ఆవరించింది.
Tôi đau đớn với nỗi đau của dân tôi. Tôi sầu muộn và kiệt sức lẫn khiếp sợ.
22 ౨౨ గిలాదులో ఔషధం ఏమీ లేదా? అక్కడ వైద్యుడెవరూ లేరా? నా ప్రజలకు ఎందుకు స్వస్థత కలగడం లేదు?
Lẽ nào không có thuốc men trong Ga-la-át? Không có thầy thuốc nào tại đó sao? Vì sao vết thương của dân tôi không được chữa lành?