< యిర్మీయా 6 >
1 ౧ “బెన్యామీను ప్రజలారా, యెరూషలేము నుండి పారిపొండి, తెకోవలో బాకానాదం ఊదండి. బేత్‌హక్కెరెంలో ఒక సూచన నిలబెట్టండి. ఎందుకంటే ఉత్తర దిక్కునుండి గొప్ప ప్రమాదం ముంచుకొస్తున్నది. గొప్ప దండు వస్తున్నది.
Mipitsiha mb’am-pipalirañe mb’eo ry ana’ i Beniamineo, boak’ an-teñateña’ Ierosalaime ao; popòho e Tekoa añe i antsivay, vaho ampitroaro fanairañe e Bete-hak’kereme eñe; fa hirik’ avaratse ty hankàñe, ty fandrotsahañe jabajaba.
2 ౨ సుందరసుకుమారి సీయోను కన్యను పూర్తిగా నాశనం చేస్తాను.
I soa vintañe naho malemey, i anak’ampela’ i Tsioney ro haitoako.
3 ౩ కాపరులు తమ గొర్రెల మందలతో దానిలోకి వస్తారు. దాని చుట్టూ గుడారాలు వేస్తారు. ప్రతివాడూ తన కిష్టమైన చోట మందను మేపుతాడు.
Hivotrak’ ama’e o mpiarakeo rekets’ o lia-rai’eo, hampitroatse fiarikatohañe ami’ty kivoho’ iareo, le songa hiandrazañe an-toe’e.
4 ౪ యెహోవా పేరున ఆమెతో యుద్ధానికి సిద్ధపడండి. లెండి, మధ్యాహ్న సమయంలో దాడి చేద్దాం. అయ్యో, పొద్దుగుంకిపోతున్నది. సాయంకాలపు నీడలు సాగిపోతున్నాయి.
Ihentseño aly; miongaha hanameantika aze an-tsingilingiliñeñe. Feh’ ohatse amantika, fa miroñe i àndroy, mihalava o talinjon-karivao!
5 ౫ కాబట్టి రాత్రిపూట వెళ్ళి ఆమె కోటలు నాశనం చేద్దాం.
Miavota hanamean-tika haleñe, handrotsahantika o anjomba’eo!
6 ౬ సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే ‘చెట్లు నరికి యెరూషలేమును చుట్టూ ముట్టడించండి. ఈ పట్టణం నిండా అన్యాయమే జరుగుతున్నది. కాబట్టి దాన్ని శిక్షించడం న్యాయమే.
Hoe t’Iehovà’ i Màroy: Firao o hatae’eo; atroaro am’Ierosalaime ty fanongàm-panameañe; toe rova tsy mete tsy lilovañe, fa forekeke avao ty ama’e ao.
7 ౭ ఊటలో నీరు ఏవిధంగా పైకి ఉబికి వస్తుందో ఆ విధంగా దాని దుష్టత్వం పైకి ఉబుకుతూ ఉంది. దానిలో బలాత్కారం, అక్రమం జరగడం వినబడుతున్నది, ఎప్పుడూ గాయాలు, దెబ్బలు నాకు కనబడుతున్నాయి.
Manahake ty fitana’ o vovoñeo ty hamamin-drano’e, ty fitana’e ho veloñe o haloloa’eo; janjiñeñe ama’e ao ty tazataza naho ty tsiborohetoke; añatrefako eo nainai’e ty hasiloke naho ty fere.
8 ౮ యెరూషలేమా, నేను నీ దగ్గర నుండి తొలగి పోకుండేలా, నేను నిన్ను నిర్జనమైన ప్రదేశంగా చేయకుండేలా దిద్దుబాటుకు లోబడు.’
Mitaoa ry Ierosalaime, kera ho alik’amako nahareo, ie hampangoakoaheko ho tane tsy amam-pimoneñe.
9 ౯ సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే ‘ద్రాక్ష పండ్లను ఏరే విధంగా ఇశ్రాయేలులో మిగిలిన వారిని ఏరుతారు. ద్రాక్షపండ్లను ఏరేవాడు దాని తీగెల మీద మళ్ళీ చెయ్యి వేసినట్టు నీ చెయ్యి వాళ్ళ మీద వేయి.’”
Hoe t’Iehovà’ i Màroy: Ho vata’e tsindrohe’iareo ty sisa’ Israele hambañe amy t’ie vahe; ozaño am-pita’o indraike i tsampa’ey manahake ty mpanifo valoboke.
10 ౧౦ నేనెవరితో మాట్లాడి హెచ్చరించాలి? వారు వినడానికి సిద్ధంగా లేరు. కాబట్టి వినలేదు. ఇదిగో, యెహోవా వాక్యం వారిని సరిదిద్దడానికి వారి దగ్గరికి వచ్చింది కానీ దాన్ని వారు తృణీకరిస్తారు.
Ia ty ho volañeko naho hatahataeko, hahafijanjiña’ iareo? Hehe, domoke o ravembia’ iareoo, tsy mahatsendreñe; Hete! fañinjeañe am’iereo ty tsara’ Iehovà, tsy mahafale’ iareo.
11 ౧౧ కాబట్టి నేను యెహోవా కోపంతో నిండిపోయాను. దాన్ని నాలోనే అణచుకోలేక నేను విసిగిపోయాను. వీధుల్లో తిరిగే పసిపిల్లలు, యువకులు, ఇలా ప్రతి ఒక్కరి మీదా దాన్ని కుమ్మరించాల్సి వస్తున్నది. భార్యతో బాటు భర్తనూ, వయస్సు మీరిన ప్రతి వాడితో కలిపి వృద్ధులందరినీ పట్టుకుంటారు.
Fe lifo’ ty fiforoforo’ Iehovà iraho; mahamokotse ahy ty mitañ’aze; adoaño amo ajaja an-dalañeo, naho amo ajalahy mifañosoñeo; songa ho rambeseñe ie mirovaly, o zoke’eo rekets’ o androanavio.
12 ౧౨ వారికిక ఏమీ మిగలదు. వారి ఇళ్ళు, వారి పొలాలు, వారి భార్యలు, మొత్తాన్ని ఇతరులు తీసుకు వెళ్లి పోతారు. ఎందుకంటే ఈ దేశ ప్రజల మీద నేను నా చెయ్యి చాపి వారిని ఎదిరిస్తాను. ఇదే యెహోవా వాక్కు
Ho limbeze’ ty ila’e o anjomba’iareoo, o tetekeo miharo amo rakemba’ iareoo; fa hatora-kitsiko amo mpimoneñe amy taneio ty tañako, hoe t’Iehovà.
13 ౧౩ “వారిలో అత్యల్పులు, గొప్పవారు అందరూ మోసం చేసేవారే, దోచుకొనేవారే. ప్రవక్తలు గాని, యాజకులు గాని అందరూ వంచకులే.
Songa mitavañe hitomboa’e ty tsitso’e am’iareo pak’ami’ty loho bey; fonga mpikatramo ty mpitoky sikal’ami’ty mpisoroñe.
14 ౧౪ శాంతి లేని సమయంలో వారు శాంతి, సమాధానం అని ప్రకటిస్తూ నా ప్రజల గాయాలను పైపైన మాత్రమే బాగుచేస్తారు.
Nitaha’ iareo tsidaredare ty fere’ ondatikoo, ami’ty hoe, Fañanintsiñe, Fañanintsiñe, ie tsy eo ty Fanintsiñañe.
15 ౧౫ వారు చేస్తున్న అసహ్యకార్యాలను బట్టి వారు సిగ్గుపడాలి. అయితే వారు ఏమాత్రం సిగ్గుపడరు. తాము అవమానం పాలయ్యామని వారికి తోచడం లేదు. కాబట్టి నేను వారికి తీర్పు తీర్చే కాలంలో పడిపోయే వారితో వారు కూడా పడిపోతారు. వారు కూలిపోతారు” అని యెహోవా సెలవిస్తున్నాడు.
Toko’e ho nahasalatse iereo ty hativàñe nanoe’iereo, f’ie tsy mahay meñatse. Aa le hikorovoke amo mikorovokeo amy androm-pandilovañey iereo, vaho hitsikapy, hoe t’Iehovà.
16 ౧౬ యెహోవా చెప్పేదేమంటే, రహదారుల్లో నిలబడి చూడండి. పురాతన మార్గాలు ఏవో వాకబు చేయండి. “ఏ మార్గంలో వెళ్తే మేలు కలుగుతుంది?” అని అడిగి అందులో నడవండి. అప్పుడు మీ మనస్సుకు నెమ్మది కలుగుతుంది. అయితే వారు “మేము అందులో నడవం” అని చెబుతున్నారు.
Hoe t’Iehovà: Mijohaña an-dala mifanivalañe eo le mahaisaha, mañontanea o oloñoloñe haehaeo, te aia i lalam-bantañey; vaho añavelò, hahatendreha’ areo fitofan’ arofo. Fa hoe iareo: Zahay tsy homb’eo.
17 ౧౭ మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండడానికి నేను కావలి వారిని ఉంచాను. అదిగో, వారు చేసే బూరధ్వని వినండి.
Mbore nampitroarako mpijilo, nanao ty hoe: Haoño ty feo’ i antsivay! Hoe ka iereo: Zahay tsy hañaoñe.
18 ౧౮ అయితే “మేము వినం” అని వారంటున్నారు. కాబట్టి, అన్యజనులారా, వినండి. సాక్షులారా, వారికేం జరగబోతున్నదో చూడండి.
Aa le mijanjiña ry fifeheañeo vaho mahafohina ry valobohòkeo, ty haseseke am’iareo:
19 ౧౯ భూలోకమా, విను. ఈ ప్రజలు నా మాటలు వినడం లేదు. నా ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. కాబట్టి వారి ఆలోచనలకు ఫలితంగా వారి పైకి విపత్తును రప్పిస్తున్నాను.
Tsanoño ry tane; Inao! handesako hankàñe ondaty retoa, ty toli’ o fikinià’ iareoo, amy t’ie tsy nañaoñe o volakoo; mbore nifarie’ iareo i Fanoroakoy.
20 ౨౦ షేబ దేశం నుండి వచ్చే సాంబ్రాణి నాకెందుకు? సుదూర దేశం నుండి తీసుకొచ్చిన మధురమైన సువాసన గల నూనె నాకెందుకు? మీ దహనబలులు నాకిష్టం లేదు. మీ బలులు నాకు సంతోషం కలిగించడం లేదు.
Hanoeko inoñe o rame boake Sebao, naho o fare boake tsietoitaneo? Tsy noko o enga’ oroa’ areoo, tsy mahafale ahy o fisoroña’ areoo.
21 ౨౧ కాబట్టి యెహోవా చెప్పేదేమంటే, చూడండి, ఈ ప్రజలకు వ్యతిరేకంగా ఒక అడ్డుబండను వేయబోతున్నాను. తండ్రులూ కొడుకులూ అందరూ అది తగిలి కూలిపోతారు. అక్కడి నివాసులు, వారి పొరుగువారు కూడా నశిస్తారు.
Aa le hoe t’Iehovà: Hehe te mampipoke vato mahatsikapy aolo’ ondaty retoa iraho, hampitsikapy roae reketse keleiañe; fonga ho mongotse ty mpimoneñe miharo rañetse.
22 ౨౨ యెహోవా చెప్పేదేమంటే, ఉత్తర దిక్కునుండి ఒక జనాంగం వస్తూ ఉంది. ఎక్కడో దూర ప్రాంతం నుండి ఒక మహా గొప్ప రాజ్యం బయలు దేరింది.
Aa le hoe t’Iehovà: Heheke, ondaty mangovovoke mb’etoy boak’an-tane avaratseo, fifeheañe jabajaba ty hahetseketseke boake tsietoimoneñe añe.
23 ౨౩ వారు బాణాలు, ఈటెలు వాడతారు. వారు జాలిలేని క్రూర జనాంగం. వారి స్వరం సముద్ర ఘోషలాగా ఉంటుంది. సీయోను కుమార్తెలారా, వారు గుర్రాలపై స్వారీ చేస్తూ వస్తారు. నీతో యుద్ధం చేయడానికి వారు యోధుల్లాగా బారులు తీరి ఉన్నారు.
Vontitire’ iareo ty fale naho ty lefoñe, masiake iereo, tsy miferenay, manahake ty fitroña’ i riakey ty fikoraha’ iareo; naho miningitse soavala, miriritse hoe lahin-defo miatrek’aly, ama’o ry anak’ ampela’ i Tsione!
24 ౨౪ వారి గురించిన వార్త విని నిస్పృహతో మా చేతులు చచ్చుబడి పోయాయి. ప్రసవించే స్త్రీ నొప్పుల వంటి వేదన పడుతున్నాము.
Ie nitsanoña’ay talily, dredra’e o taña’aio; mamihiñe anay ty lovilovy, ty haorean-drakemba mitsongo.
25 ౨౫ బయట పొలంలోకి వెళ్ళవద్దు. రహదారుల్లో నడవవద్దు. మా చుట్టూ కదులుతున్న శత్రువుల కత్తులు చూసి అంతటా భయం ఆవరించింది.
Ko miakatse mb’an-tetek’ ao, ko mañavelo an-damoke eo; amy te mampiboele harevendreveñañe mb’etia mb’atia ty fibara’ i rafelahiy.
26 ౨౬ నా ప్రజలారా, వినాశనకారి హఠాత్తుగా మా మీదికి వస్తాడు. గోనెపట్ట కట్టుకుని బూడిద చల్లుకోండి. ఒక్కడే కొడుకును గూర్చి ఎలా దుఃఖిస్తారో ఆ విధంగా విలపించండి. బహు ఘోరంగా విలపించండి.
O ry anak’ ampela’ ondatiko, misikìna gony, vaho milalilalia an-davenoke; miroveta hoe t’ie bako tokañe, mandalà añ’aferon’ate, amy te hivovò amantika i mpandrotsakey.
27 ౨౭ యిర్మీయా, నిన్ను నా ప్రజలకు మెరుగు పెట్టేవాడిగా, వారిని నీకు లోహపు ముద్దగా నేను నియమించాను. ఎందుకంటే నువ్వు వారి ప్రవర్తనను పరిశీలించి తెలుసుకోవాలి.
Nanoeko mpañasohaso naho mpitsòke am’ondatikoo irehe, hahafohina’o naho hitsikaraha’o o sata’eo.
28 ౨౮ వారంతా బహు ద్రోహులు, కొండెగాళ్ళు. వారు మట్టి లోహం వంటివారు, వారి అంతరంగం ఇత్తడి, ఇనుములాగా బహు కఠినంగా ఉంటాయి.
Fonga mpiola manjehatse iereo, mb’eo mb’eo mamokafoka avao; torisìke naho viñe, songa tsivokatse.
29 ౨౯ కొలిమి తిత్తులు మంటల్లో కాలిపోతున్నాయి. ఆ జ్వాలల్లో సీసం తగలబడి పోతున్నది. అలా మండిస్తూ ఉండడం నిష్ప్రయోజనం. దుష్టులను వేరు చేయడం వీలు కాదు.
Mitioke mafe o famoforañeo, forototoe’ ty afo i firakey, tsy lefe ty fitoloñam-pitranahañe, amy te tsy mete ho faoheñe ama’e o halò-tserehañeo.
30 ౩౦ వారిని “పారవేయాల్సిన వెండి” అని పిలవాలి. ఎందుకంటే యెహోవా వారిని పూర్తిగా తోసిపుచ్చాడు.
Atao ty hoe taim-bolafoty iereo, amy te naforintse’ Iehovà.