< యిర్మీయా 52 >
1 ౧ తన పరిపాలన ప్రారంభించినప్పుడు సిద్కియా వయస్సు 21 సంవత్సరాలు. అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు. ఆమె లిబ్నా అనే ఊరికి చెందిన యిర్మీయా కూతురు.
Zedekiah a manghai vaengah kum kul kum khat lo ca tih Jerusalem ah kum hlai khat tah manghai van. A manu ming tah Hamutal tih, Hamutal tah Libnah lamkah Jeremiah canu ni.
2 ౨ యెహోయాకీము లాగే సిద్కియా కూడా యెహోవా దృష్టికి దుర్మార్గంగా ప్రవర్తించాడు.
Jehoiakim loh boethae cungkuem a saii bangla Zedekiah loh BOEIPA mikhmuh ah a saii.
3 ౩ యెహోవా తీవ్రమైన కోపంతో వాళ్ళని తన ఎదుట నుండి వెళ్లగొట్టే వరకూ ఈ దుర్మార్గాలు యెరూషలేములోనూ యూదాలోనూ జరిగాయి. తర్వాత సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాడు.
Te dongah a mikhmuh lamloh amih a voeih due Jerusalem neh Judah taengah BOEIPA kah thintoek om coeng. Zedekiah loh Babylon manghai te a tloelh.
4 ౪ అతని పరిపాలనలో తొమ్మిదో సంవత్సరం పదోనెల్లో పదో రోజున బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యాన్నంతా తీసుకుని యెరూషలేముకు వచ్చాడు. వాళ్ళు యెరూషలేముకు ఎదురుగా శిబిరం వేసుకున్నారు.
Te dongah anih a manghai te kum ko hla rha a pha tih hlasae a hnin rha vaengah tah Babylon manghai Nebukhanezar amah neh a caem boeih te Jerusalem la ha pawk. A taengah rhaeh uh tih a kaepvai ah buep a saii uh.
5 ౫ ఈ విధంగా రాజైన సిద్కియా పరిపాలనలో పదకొండో సంవత్సరం వరకూ పట్టణం ముట్టడిలో ఉంది.
Manghai Zedekiah kah a kum hlai khat duela khopuei te vongup khuila pawk.
6 ౬ ఆ సంవత్సరం నాలుగో నెల తొమ్మిదో రోజున పట్టణంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. దేశంలో ప్రజలకు ఆహరం బొత్తిగా లేకుండా పోయింది.
A hla li kah hlasae hnin ko dongah tah khopuei khuiah khokha tlung tih khohmuen kah pilnam ham buh om pawh.
7 ౭ అప్పుడు ప్రాకారాలను పడగొట్టారు. కల్దీయులు పట్టణంలో ప్రవేశించారు. పట్టణంలో సైనికులందరూ రాజు తోట దగ్గరున్న రెండు గోడల మధ్య ద్వారం గుండా పట్టణం విడిచిపెట్టి పారిపోయారు. అరాబా దిశగా తరలి వెళ్ళారు.
Te dongah khopuei te a va uh tih caemtloek hlang rhoek khaw boeih yong uh. Khoyin ah tah khopuei lamloh manghai dum kaep kah vongtung laklo kah vongka longpuei longah coe uh. Tedae khopuei kaep kah Khalden taeng lamloh kolken longpuei la cet uh.
8 ౮ కానీ కల్దీయుల సైన్యం రాజును తరిమింది. యెరికో సమీపంలోని యోర్దాను నదీలోయ మైదాన ప్రాంతంలో వాళ్ళు సిద్కియాను తరిమి పట్టుకున్నారు. అతని సైన్యం అతణ్ణి విడిచి పెట్టి కకావికలై పోయారు.
Te dongah Khalden caem loh manghai hnukah a hloem uh tih Zedekiah te Jerikho kolken ah a kae uh. Te dongah a caem khaw anih taeng lamloh boeih taekyaak uh.
9 ౯ వాళ్ళు రాజును పట్టుకుని హమాతు దేశంలోని రిబ్లా పట్టణంలో ఉన్న బబులోను రాజు దగ్గరికి అతణ్ణి తీసుకు వచ్చారు. అక్కడే అతడు యూదా రాజైన సిద్కియాకు శిక్ష విధించాడు.
Tedae manghai te a tuuk uh tih Khamath khohmuen Riblah kah Babylon manghai taengla a khuen uh tih anih sokah laitloeknah a thui pah.
10 ౧౦ బబులోను రాజు సిద్కియా కొడుకులను అతని కళ్ళ ఎదుటే చంపించాడు. అతడు రిబ్లాలోనే యూదా అధిపతులనందరినీ ఊచకోత కోయించాడు.
Babylon manghai loh Zedekiah ca rhoek te a mikhmuh ah a ngawn pah tih Judah mangpa boeih te khaw Riblah ah a ngawn.
11 ౧౧ సిద్కియా రెండు కళ్ళూ పీకించాడు. అతణ్ణి ఇత్తడి సంకెళ్ళతో బంధించి, బబులోనుకు తీసుకు వచ్చారు. అతడు చనిపోయేంత వరకూ బబులోను రాజు అతణ్ణి చెరసాలలోనే ఉంచాడు.
Te phoeiah Zedekiah mik te a dael sak tih rhohum neh a khih. Anih te Babylon kah Babylon manghai taengla a khuen tih a dueknah khohnin duela a im kah ngoldoelhnah im ah a khueh.
12 ౧౨ అయిదో నెల పదో రోజున, అంటే బబులోను రాజైన నెబుకద్నెజరు పరిపాలన పందొమ్మిదో సంవత్సరంలో బబులోను రాజు అంగరక్షకుల అధిపతీ, రాజు సేవకుడూ అయిన నెబూజరదాను యెరూషలేముకు వచ్చాడు.
Babylon manghai Nebukhanezar manghai kah a kum hlai ko kum, hla nga dongkah hlasae hnin rha dongah tah Babylon manghai mikhmuh ah aka pai imtawt boeiping Nebuzaradan te Jerusalem la ha pawk.
13 ౧౩ అతడు యెహోవా మందిరాన్నీ, రాజు భవనాన్నీ, యెరూషలేములోని ప్రాముఖ్యమైన ఇళ్లనూ తగలబెట్టించాడు.
BOEIPA im te a hoeh tih manghai im neh Jerusalem kah im boeih, im tanglue boeih khaw hmai neh a hoeh pah.
14 ౧౪ రాజు దగ్గర అంగరక్షకుల అధిపతితో పాటు వెళ్ళిన సైన్యం యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలను కూల్చివేశారు.
Jerusalem kaepvai kah vongtung boeih te imtawt boeiping hmuikah Khalden caem pum loh a palet uh.
15 ౧౫ రాజు అంగరక్షకుల అధిపతి నెబూజరదాను ప్రజల్లో కొందరు నిరుపేదలనూ పట్టణంలో మిగిలిపోయిన కొందరినీ, బబులోను రాజు పక్షాన చేరిన వాళ్ళనూ, వృత్తి పనుల వాళ్ళలో కొందరినీ తీసుకు పోయాడు.
Te vaengah pilnam khodaeng neh khopuei ah aka sueng pilnam hlangrhuel khaw, Babylon manghai taengah cungku la aka cungku khaw, bibi thai hlangrhuel khaw imtawt boeiping khaw Nebuzaradan loh a poelyoe.
16 ౧౬ రాజు అంగరక్షకుల అధిపతి నెబూజరదాను ద్రాక్షాతోటల్లో పని చేయడానికి కొందరు నిరుపేదలను ఉండనిచ్చాడు.
Tedae khohmuen kah khodaeng rhoek tah imtawt boeiping Nebuzaradan loh dumpho neh lotawn la a paih.
17 ౧౭ కల్దీయులు యెహోవా మందిరంలో ఉన్న ఇత్తడి స్తంభాలను, పీటలను, ఇత్తడి సరస్సునూ ఊడదీసి వాటిని ముక్కలు చేసి ఆ ఇత్తడినంతా బబులోనుకు పట్టుకుపోయారు.
Khalden loh BOEIPA im kah rhohum tung neh tungkho khaw, BOEIPA im kah rhohum tuitung khaw, amih kah rhohum boeih te aphaek uh tihBabylon la a khuen.
18 ౧౮ అలాగే బిందెలనూ, కుండలనూ గిన్నెలనూ కత్తెరలనూ గరిటెలనూ ఇంకా యాజకులు ఉపయోగించే ఇత్తడి వస్తువులు అన్నిటినీ తీసుకువెళ్ళారు.
Am neh hmaisoh khaw, paitaeh neh baelcak khaw, yakbu neh rhohum hnopai boeih, amih taengkah aka thotat rhoek te khaw a khuen uh.
19 ౧౯ పళ్ళేలనూ, ధూపం వేసే పళ్ళేలనూ పాత్రలనూ కుండలనూ దీప స్తంభాలనూ ఇంకా బంగారు పళ్ళేలనూ వెండి పళ్ళేలనూ రాజు అంగరక్షకుల అధిపతి తీసుకువెళ్ళాడు.
Baeldung neh baelphaih khaw, baelcak neh am khaw, hmaitung khaw, yakbu neh tuisi-am khaw, sui dongkah sui khaw, ngun khuika ngun te khaw imtawt boeiping loh a khuen.
20 ౨౦ రాజైన సొలొమోను యెహోవా మందిరానికి చేయించిన రెండు స్థంభాలూ సరస్సూ పీటల కింద ఉన్న పన్నెండు ఎద్దుల ఇత్తడి ప్రతిమలూ అన్నీ ఇత్తడివి. ఆ ఇత్తడిని తూకం వేయడం సాధ్యం కాదు. వాటన్నిటినీ అతడు బబులోనుకు తీసుకు వెళ్ళాడు.
Tung panit tui-im pakhat hmuikah tungkho, rhohum vaito hlai nit khaw a khuen. Te te manghai Solomon loh BOEIPA im ham a saii tih te rhohum hnopai boeih kah a khiing te sava pawh.
21 ౨౧ వాటిలో ఒక్కో స్తంభం దాదాపు ఇరవై ఆరు అడుగుల ఎత్తు ఉంటుంది. వాటి చుట్టు కొలత పదిహేడున్నర అడుగులు ఉంటుంది. ఇత్తడి రేకు నాలుగు వేళ్ళ మందం ఉంటుంది. అది లోపల బోలుగా ఉంటుంది.
Tung a sang mah tung pakhat dongah a sang dong hlai rhet om coeng tih rhuihet neh dong hlai nit la a som coeng. A thah kutdawn pali thah tih khui.
22 ౨౨ ఒక స్తంభం పైన ఒక ఇత్తడి పీట ఉంది. ఆ పీట ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ పీట చుట్టూ ఇత్తడి దానిమ్మలూ, అల్లిక పనీ ఉన్నాయి. ఇవి కూడా ఇత్తడితో చేసినవే. రెండో స్తంభం పైన కూడా ఇలాగే ఉంది. దానిక్కూడా ఇత్తడి దానిమ్మలు ఉన్నాయి.
A sokah tungthi khaw rhohum tih tungthi pakhat kah a sang te dong nga om. Tungthi sokah sahamlong neh tale khaw a kaepvai khaw rhohum boeih ni. A pabae tung khaw te phek la tale neh om.
23 ౨౩ కాబట్టి పీటల పక్కన మొత్తం తొంభై ఆరు దానిమ్మలూ, అల్లిక పని చుట్టూ వంద దానిమ్మలూ ఉన్నాయి.
Te dongah tale thaih te sawmko phoeiah parhuk om tih a kaepvai kah Sahamlong dongah khaw a pum la tale thaih yakhat om.
24 ౨౪ రాజు అంగరక్షకుల అధిపతి ప్రధానయాజకుడు శెరాయానూ, రెండవ యాజకుడు జెఫన్యానూ, ముగ్గురు కాపలా వాళ్ళనూ పట్టుకున్నాడు.
Imtawt boeiping loh khosoih boeilu Seraiah khaw, a hnukthoi khosoih Zephaniah neh cingkhaa aka tawt pathum te khaw a khuen.
25 ౨౫ అతడు సైనికుల పైన ఉండే ఒక అధికారినీ, రాజు సలహాదారుల్లో ఏడుగురినీ పట్టుకున్నాడు. వీళ్ళు ఇంకా పట్టణంలోనే ఉన్నారు. వీళ్ళతో పాటు పట్టణంలో ప్రముఖులైన అరవై మందినీ పట్టుకున్నాడు.
Caemtloek hlang soah hlangtawt la aka om imkhoem pakhat neh manghai maelhmai aka so hlang parhih a khuen. Te te khopuei khuiah a hmuh uh tih khohmuen pilnam aka hueh caempuei mangpa kah cadaek neh khopuei khui kah a hmuh khohmuen pilnam hlang sawmrhuk te khopuei lamloh a khuen.
26 ౨౬ రాజు అంగరక్షకుల అధిపతి నెబూజరదాను వీళ్ళందరినీ రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తీసుకు వచ్చాడు.
Amih te imtawt boeiping Nebuzaradan loh a khuen tih Riblah kah Babylon manghai taengla a thak.
27 ౨౭ బబులోను రాజు హమాతు దేశంలోని రిబ్లాలో వాళ్ళని కొట్టి చంపించాడు. మిగిలిన యూదా వాళ్ళను బందీలుగా బబులోనుకు తీసుకు వెళ్ళాడు.
Amih te Babylon manghai loh a ngawn tih Khamath khohmuen kah Riblah ah amih te a duek sak. Judah tah amah khohmuen dong lamloh a poelyoe tangloeng.
28 ౨౮ నెబుకద్నెజరు తన పరిపాలన ఏడో సంవత్సరంలో 3,023 మంది యూదులను బందీలుగా తీసుకు వెళ్ళాడు.
A kum rhih dongah tah Nebukhanezar loh pilnam he Judah hlang thawng thum phoeiah pakul pathum a poelyoe coeng.
29 ౨౯ నెబుకద్నెజరు పరిపాలన పద్దెనిమిదో సంవత్సరంలో యెరూషలేము నుండి 832 మందిని బందీలుగా తీసుకు వెళ్ళాడు.
Nebukhanezar kah a kum hlai rhet dongah Jerusalem lamkah hinglu ya rhet sawmthum patnit a khuen.
30 ౩౦ నెబుకద్నెజరు పరిపాలన ఇరవై మూడో సంవత్సరంలో రాజు అంగరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను యూదుల్లో 745 మందిని బందీలుగా తీసుకు వెళ్ళాడు. కాబట్టి మొత్తం యూదా దేశం నుండి బందీలుగా వెళ్ళిన వాళ్ళ సంఖ్య 4, 600.
Nebukhanezar kah kum kul kum thum dongah imtawt boeiping Nebuzaradan loh Judah hinglu ya rhih sawmli panga neh hinglu boeih thawng li ya rhuk te a poelyoe.
31 ౩౧ యూదా రాజైన యెహోయాకీను బందీగా వెళ్ళిన ముప్ఫై ఏడో సంవత్సరం పన్నెండో నెల ఇరవై ఐదో రోజున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన పరిపాలన మొదటి సంవత్సరంలో అతణ్ణి చెరసాల నుండి విడుదల చేశాడు.
Judah manghai Jehoiakhin hlangsol kah kum sawmthum kum rhih hla hlai nit hlasae hnin kul hnin nga lo coeng. Babylon manghai Evilmerodakh kah a ram a pai kum ah tah Judah manghai Jehoiakhin lu te thongim kah im lamloh a hlah.
32 ౩౨ రాజు అతనితో దయగా మాట్లాడాడు. బబులోనులో తనతో ఉన్న మిగిలిన రాజుల కంటే గౌరవనీయమైన స్థానాన్ని అతనికిచ్చాడు.
A taengah a then a thui pah tih manghai rhoek kah ngolkhoel soah khaw, Babylon ah amah taengkah manghai rhoek taengah khaw Jehoiakhin ham ngolkhoel a khueh pah.
33 ౩౩ రాజైన ఎవీల్మెరోదకు అతడు వేసుకున్న చెరసాల బట్టలు తీసి వేయించాడు. ఇక యెహోయాకీను బతికి ఉన్న రోజులన్నీ అతడు రాజైన ఎవీల్మెరోదకుతో కలసి భోజనం చేస్తూ ఉన్నాడు.
Te dongah a thongim himbai te a thovael tih manghai hmai kah buh te a hing tue khuiah phat a caak.
34 ౩౪ అతడు చనిపోయే వరకూ అతని పోషణ కోసం రాజు భత్యం ఇస్తూ వచ్చాడు.
A buhkak tah buhkak mai akhaw anih te rhawp a paek. A hing tue khui neh a dueknah khohnin duela a hnin, hnin ah Babylon manghai taeng lamkah olka te khaw a yaak.