< యిర్మీయా 46 >
1 ౧ ఇతర జాతులనూ దేశాలనూ గూర్చి యిర్మీయా దగ్గరికి వచ్చిన యెహోవా వాక్కు.
১জাতি সমূহৰ বিষয়ে যিৰিমিয়া ভাববাদীৰ ওচৰলৈ অহা যিহোৱাৰ বাক্য।
2 ౨ ఐగుప్తును గూర్చిన మాట. యూఫ్రటీసు నది సమీపాన ఉన్న కర్కెమీషు దగ్గర ఉన్న ఐగుప్తు రాజు ఫరో నెకో సైన్యాలను గూర్చిన సంగతులు. యోషీయా కొడుకూ యూదా రాజు అయిన యెహోయాకీము పరిపాలనలో నాలుగో సంవత్సరంలో బబులోను రాజు నెబుకద్నెజరు ఈ సైన్యాలను ఓడించాడు.
২মিচৰৰ বিষয়। যোচিয়াৰ পুত্ৰ যিহূদাৰ ৰজা যিহোয়াকীমৰ ৰাজত্ব কালৰ চতুৰ্থ বছৰত বাবিলৰ ৰজা নবূখদনেচৰে পৰাজয় কৰা ফৰাৎ নদীৰ পাৰৰ কৰ্কমীচত থকা মিচৰীয়া ৰজা ফৰৌণ নখোৰ সৈন্য-সামন্তৰ বিষয়:
3 ౩ “డాలునూ కవచాన్నీ సిద్ధం చేసుకోండి. యుద్ధానికి ముందుకు కదలండి.
৩তোমালোকে ঢাল আৰু ফৰ যুগুত কৰা আৰু যুদ্ধ কৰিবৰ বাবে ওচৰ চাপা।
4 ౪ గుర్రాలను సిద్ధం చేయండి. రౌతులారా, శిరస్త్రాణం పెట్టుకుని వాటిని అధిరోహించండి. బల్లేలకు పదును పెట్టండి. ఆయుధాలు ధరించండి.
৪হে অশ্বাৰোহীসকল, ঘোঁৰাবোৰ সজোঁৱা, ঘোঁৰাত উঠা আৰু শিৰোৰক্ষক টুপী পিন্ধি, আগলৈ গৈ থিয় হোৱা, বৰচা জকমকোওৱা, কৱচ পিন্ধা।
5 ౫ ఇక్కడ నేనేం చూస్తున్నాను? వాళ్ళు భయకంపితులయ్యారు. పారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ సైన్యాలు ఓడిపోయాయి. వాళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా సురక్షితమైన చోటును వెదుక్కుంటూ వేగంగా పారిపోతున్నారు. అన్నివేపులా భయం ఆవరించింది. యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.
৫মই কিয় এনেকুৱা দেখিছোঁ? তেওঁলোক ব্যাকুল হৈছে, পাছ হুঁহকি গৈছে; তেওঁলোকৰ বীৰসকল বিহ্বল হৈ বেগাই পলাইছে আৰু পাছলৈ নাচায়; যিহোৱাই কৈছে, চাৰিওফালে ত্ৰাস।
6 ౬ వేగం గలవాళ్ళు పారిపోలేక పోతున్నారు. సైనికులు తప్పించుకోలేక పోతున్నారు. ఉత్తర దిక్కులో వాళ్ళు యూఫ్రటీసు నదీ తీరంలో తడబడి పడిపోతున్నారు.
৬বেগী লোক পলাই যাব নোৱাৰে, বীৰ সাৰিব নোৱাৰে; উত্তৰফালে ফৰাৎ নদীৰ পাৰত তেওঁলোকে উজুটি খাই পৰিছে।
7 ౭ నైలునదీ ప్రవాహంలా ఉప్పొంగుతూ వస్తున్న ఈ వ్యక్తి ఎవరు? ఇతని నీళ్ళు నదుల్లా ఎగసి పడుతున్నాయి.
৭যাৰ জল সমূহে নৈবোৰৰ দৰে আস্ফালন কৰিছে, নীল নদীৰ দৰে বাঢ়ি অহা সৌ জন কোন?
8 ౮ ఐగుప్తు నైలు నదిలా పైకి లేస్తుంది. దాని నీళ్ళు నదుల్లా పైకీ కిందికీ విసిరినట్టుగా ప్రవహిస్తుంది. అది ‘నేను పైకి లేస్తాను. భూమిని కప్పి వేస్తాను. నేను పట్టణాలనూ, వాటిలో ప్రజలనూ నాశనం చేస్తాను’ అంటుంది.
৮মিচৰৰ নীল নদীৰ দৰে বাঢ়ি আহিছে, আৰু তাৰ জল সমূহে নদীবোৰৰ দৰে আস্ফালন কৰিছে। আৰু সি কৈছে, ‘মই বাঢ়ি পৃথিৱী তল নিয়াম, নগৰ আৰু তাৰ নিবাসীসকলক নষ্ট কৰিম।’
9 ౯ గుర్రాలూ, పైకి లేవండి. రథాలూ రోషం తెచ్చుకోండి. సైనికుల్లారా బయలుదేరండి. డాలు వాడటంలో నిపుణులైన కూషు వాళ్ళూ, పూతు వాళ్ళూ, విల్లు వంచి బాణాలు సంధించడంలో నిపుణులైన లూదీ వాళ్ళూ బయలుదేరాలి.
৯হে ঘোঁৰাবিলাক, উঠি যোৱা, হে ৰথবিলাক, বাতুলৰ নিচিনাকৈ লৰি যোৱা: বীৰসকল ঢালধাৰী কুচ আৰু পূট আৰু ধনুৰ্দ্ধৰ ও ধনুত জোঁৰ দিয়া লুদীয়া লোকসকল বাহিৰ ওলাওঁক।
10 ౧౦ ఇది సేనల ప్రభువైన యెహోవా ప్రతీకారం తీర్చుకునే రోజు. ఆయన తన శత్రువులపై పగ తీర్చుకుంటాడు. కత్తి శత్రువులని చీల్చివేస్తుంది. తృప్తి చెందుతుంది. వాళ్ళ రక్తాన్ని పానం చేస్తుంది. యూఫ్రటీసు నది దగ్గర ఉత్తర దేశంలో సేనల ప్రభువైన యెహోవాకు బలి అర్పణ జరగబోతూ ఉంది.
১০কিয়নো এই দিন বাহিনীসকলৰ প্ৰভু যিহোৱাৰ দিন, তেওঁৰ শত্ৰুবোৰক প্ৰতিফল দিবলৈ শত্ৰুৰ প্ৰতিকাৰ সধা দিন; তৰোৱালে গ্ৰাস কৰি হেপাহ পলোৱাৰ আৰু তেওঁলোকৰ তেজ পান কৰি পৰিতৃপ্ত হ’ব; কিয়নো উত্তৰ দেশত ফৰাৎ নদীৰ পাৰত বাহিনীসকলৰ প্ৰভু যিহোৱাৰ এক যজ্ঞ হৈছে।
11 ౧౧ కన్య అయిన ఐగుప్తు కుమారీ, గిలాదుకి వెళ్లి ఔషధం తెచ్చుకో. నీ పైన ఎక్కువ ఔషధాలు ఉపయోగించడం వ్యర్ధం. నీకు స్వస్థత కలుగదు.
১১হে কুমাৰী মিচৰ জীয়াৰী, তুমি গিলিয়দলৈ উঠি গৈ সুস্থজনক গছৰ ৰস লোৱা। তুমি বৃথা অনেক ঔষধ ব্যৱহাৰ কৰিছা, তোমাৰ কোনো সুস্থতা নাই।
12 ౧౨ నీకు కలిగిన అవమానం గూర్చి జాతులన్నీ తెలుసుకున్నాయి. నువ్వు చేసే రోదన ధ్వని భూమి అంతటా వినిపిస్తుంది. ఒక సైనికుడు తడబడి మరో సైనికుడి పైన పడతాడు. ఇద్దరూ కలసి కూలి పోతారు.”
১২জাতিবোৰে তোমাৰ অপমানৰ কথা শুনিছে, আৰু তোমাৰ চিঞৰৰ শব্দেৰে পৃথিৱী পৰিপূৰ্ণ হৈছে, কিয়নো বীৰে বীৰত খুন্দা খাই দুয়ো একেলগে পতিত হ’ল।
13 ౧౩ బబులోను రాజైన నెబుకద్నెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తుపై దాడి చేసినప్పుడు ప్రవక్త అయిన యిర్మీయాకు యెహోవా చెప్పిన మాట ఇది.
১৩বাবিলৰ ৰজা নবূখদনেচৰে আহি মিচৰ দেশ পৰাজয় কৰিবৰ বিষয়ে যিৰিমিয়া ভাববাদীক কোৱা যিহোৱাৰ বাক্য:
14 ౧౪ ఐగుప్తులో తెలియజేయండి. అది మిగ్దోలులోనూ మెంఫిస్ లోనూ వినిపించాలి. తహపనేసులో వాళ్ళు ఇలా ప్రకటించారు. నీ చుట్టూ కత్తి స్వైర విహారం చేస్తూ అంతటినీ మింగివేస్తుంది. కాబట్టి మీరు లేచి ధైర్యంగా నిలిచి ఉండండి.
১৪“তোমালোকে মিচৰত প্ৰচাৰ কৰা, মিগদোলত ঘোষণা কৰা, নোফ আৰু তহ্পন্হেচত ঘোষণা কৰা। তোমালোকে কোৱা, “তুমি আগলৈ গৈ থিয় হোৱা, নিজকে যুগুত কৰা; কিয়নো তৰোৱালে তোমাৰ চাৰিওফালে গ্ৰাস কৰিছে।”
15 ౧౫ ఏపిస్ అనే నీ దేవుడు ఎందుకు పారిపోయాడు? నీ ఎద్దు దేవుడు ఎందుకు నిలబడలేదు? ఎందుకంటే యెహోవా అతణ్ణి కిందకు పడవేశాడు.
১৫তোমাৰ বলৱান জনক কেলেই পেলোৱা হ’ল? তেওঁ থিয় হৈ নাথাকিল; কিয়নো যিহোৱাই তেওঁক পেলালে।
16 ౧౬ తడబడే వాళ్ళ సంఖ్యను ఆయన అధికం చేస్తున్నాడు. ఒక్కో సైనికుడు మరొకడి మీద పడిపోతున్నాడు. వాళ్ళు “లేవండి, ఇంటికి వెళ్దాం. మన స్వంత ప్రజల దగ్గరకూ, మన స్వదేశానికీ వెళ్దాం. మనలను బాధిస్తున్న ఈ కత్తిని వదిలించుకుందాం.” అని చెప్పుకుంటున్నారు.
১৬তেওঁ অনেকক উজুটি খুৱালে, এনেকি তেওঁলোকে পৰস্পৰে পৰা-পৰি হ’ল; আৰু তেওঁলোকে ক’লে, “উঠা আমি এই সংহাৰক তৰোৱালৰ মুখৰ পৰা নিজ জাতিৰ ওচৰলৈ আৰু আমাৰ জন্মৰ দেশলৈ উলটি যাওঁহঁক।”
17 ౧౭ వాళ్ళు అక్కడ “ఐగుప్తు రాజైన ఫరో కేవలం ఒక ధ్వని మాత్రమే. అతడు అవకాశాలను చేజార్చుకునే వాడు” అని ప్రకటించారు.
১৭তেওঁলোকে তাত চিঞৰি ক’লে, “মিচৰৰ ৰজা ফৰৌণৰ সৰ্ব্বনাশ হ’ল; তেওঁ উপযুক্ত সময় বৃথা নষ্ট কৰিলে।”
18 ౧౮ సేనల ప్రభువూ, రాజూ అయిన యెహోవా ఇలా ప్రకటన చేస్తున్నాడు. “నా తోడు, ఒక మనిషి రాబోతూ ఉన్నాడు. అతడు తాబోరు పర్వతం లాంటి వాడు. సముద్రం పక్కనే ఉన్న కర్మెలు లాంటి వాడు.
১৮বাহিনীসকলৰ যিহোৱা নামেৰে প্ৰখ্যাত ৰজাই কৈছে, “মোৰ জীৱনৰ শপত,” “পৰ্ব্বতবোৰৰ মাজত পর্ব্বত তাবোৰ যেনে, আৰু সমূদ্ৰ পাৰত থকা কৰ্মিল যেনে, নিশ্চয়ে তেওঁ তেনে হৈ আহিব।”
19 ౧౯ ఐగుప్తు ఆడపడుచులారా, మీరు చెరలోకి వెళ్ళడానికి సిద్ధపడండి. ఎందుకంటే నోపు భయం కలిగించేలా శిథిలమై పోతుంది. అక్కడ ఎవరూ నివసించలేరు.
১৯হে মিচৰ নিবাসিনী জীয়াৰী, বন্দী অৱস্থালৈ যাবৰ বাবে নিজৰ প্ৰয়োজনীয় বস্তু লোৱা; কিয়নো নোফ উচ্ছন্ন ঠাই হ’ব, দগ্ধ আৰু নিবাসীশূণ্য হ’ব।
20 ౨౦ ఐగుప్తు ఒక అందమైన లేగదూడ వంటిది. కానీ ఉత్తరం వైపు నుండి కుట్టే కందిరీగ ఒకటి వస్తుంది. అది సమీపిస్తూ ఉంది.
২০মিচৰ অতি সুন্দৰী চেঁউৰী গৰু; কিন্তু উত্তৰ দিশৰ পৰা এটা ডাঁহ আহিল, পালেহি।
21 ౨౧ వాళ్ళ మధ్యలో అద్దెకు తెచ్చుకున్న సైనికులు కొవ్వు పట్టిన ఎద్దుల్లా ఉన్నారు. అయితే వాళ్ళు కూడా వెనక్కి తిరిగి పారిపోతారు. వాళ్ళు కలసి ఉండరు. వాళ్ళు నాశనమయే రోజు వాళ్లకు వ్యతిరేకంగా వస్తూ ఉంది. అది వాళ్ళని శిక్షించే రోజు.
২১তাইৰ মাজত থকা তাইৰ বেচ খোৱাবোৰ হৃষ্টপুষ্ট দামুৰিৰ সদৃশ; কিয়নো তেওঁলোকো বিমুখ হৈ গৈছে। একেবাৰে পলাইছে, থিয়কেই নিদিলে; কাৰণ তেওঁলোকৰ আপদৰ দিন, তেওঁলোকৰ দণ্ডৰ সময় তেওঁলোকৰ ওচৰত উপস্থিত।
22 ౨౨ ఐగుప్తు పైకి శత్రువులు దండెత్తి వస్తున్నారు. అది పాములా బుసలు కొడుతూ పాక్కుంటూ అవతలికి వెళ్ళిపోతుంది. చెట్ల కొమ్మలు నరికే వాళ్ళు గొడ్డళ్ళు పట్టుకుని వచ్చినట్టుగా వాళ్ళు ఆమె దగ్గరికి వస్తున్నారు.”
২২পলাই যাওঁতে, তাই যোৱা শব্দ সাপ যোৱা শব্দৰ দৰে হ’ব; কিয়নো শত্ৰুৱে সসৈন্যে যাত্ৰা কৰি, কাঠকটীয়াৰ দৰে কুঠাৰেৰে তাইক আক্ৰমণ কৰিব।
23 ౨౩ ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “అవి ఎంత దట్టమైన అడవులైనా వాళ్ళు దాన్ని నరికి వేస్తారు. ఎందుకంటే వాళ్ళ సంఖ్య మిడతల దండు కంటే ఎక్కువగా ఉంటుంది. వాళ్ళను లెక్క పెట్టడం సాధ్యం కాదు.
২৩যিহোৱাই কৈছে, যদিও তাইৰ কাঠনি অগম্য, তথাপি তেওঁলোকে তাক কাটি পেলাব; কিয়নো তেওঁলোক অর্থাৎ শত্রুসকল ফৰিঙৰ জাকতকৈয়ো অধিক আৰু অসংখ্য।
24 ౨౪ ఐగుప్తు కుమారిని అవమానపరుస్తారు. ఉత్తరం వైపున దేశాల వారికి ఆమెను అప్పగిస్తారు.”
২৪মিচৰ জীয়াৰী লজ্জিত হ’ব; তাইক উত্তৰ-দেশীয়সকলৰ হাতত সমৰ্পণ কৰা হ’ব।”
25 ౨౫ సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి, నో పట్టణంలో ఉన్న ఆమోను దేవుణ్ణి, ఫరోనూ, ఐగుప్తునూ, దాని దేవుళ్ళనూ, రాజులనూ, ఫరో రాజులనూ, ఇంకా వాళ్ళలో నమ్మకముంచే వాళ్ళనీ నేను శిక్షించ బోతున్నాను.
২৫ইস্ৰায়েলৰ ঈশ্বৰ বাহিনীসকলৰ যিহোৱাই কৈছে, “চোৱা, মই নোত থকা আমোনক, ফৰৌণক, মিচৰক আৰু তাৰ দেৱতাবোৰক আৰু তাৰ ৰজাসকলক, এনে কি ফৰৌণ আৰু তেওঁক ভাৰসা কৰা সকলোকে দণ্ড দিম।
26 ౨౬ వాళ్ళ ప్రాణాలు తీయాలని చూసే వాళ్ళ చేతుల్లోకి వాళ్ళను అప్పగిస్తున్నాను. బబులోను రాజు నెబుకద్నెజరుకూ, అతని సేవకులకూ వాళ్ళని అప్పగిస్తున్నాను. ఆ తర్వాత ఐగుప్తు మళ్ళీ ఇంతకు ముందు లాగానే ప్రజలకు నివాస యోగ్యం అవుతుంది.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
২৬আৰু তেওঁলোকৰ প্ৰাণ বিচাৰি ফুৰাসকলৰ হাতত, বাবিলৰ ৰজা নবূখদনেচৰৰ আৰু তেওঁৰ প্ৰধান মন্ত্ৰীসকলৰ হাতত মই তেওঁলোকক সমপৰ্ণ কৰিম; তথাপি যিহোৱাই কৈছে, পাছত সেই দেশ আগৰ কালৰ দৰে বসতিস্থান হ’ব।
27 ౨౭ “కానీ నా సేవకుడవైన యాకోబూ, నువ్వు భయపడకు. ఇశ్రాయేలూ, వ్యాకుల పడకు. ఎందుకంటే చూడు, నిన్ను దూర ప్రాంతాల్లోనుండి వెనక్కి తీసుకు వస్తాను. బందీలుగా ఉన్న నీ సంతానాన్ని చెరలో ఉన్న దేశం నుండి తీసుకు వస్తాను. యాకోబు తిరిగి వస్తాడు. అతనికి శాంతి లభిస్తుంది. క్షేమంగా ఉంటాడు. అతణ్ణి భయపెట్టే వాళ్ళు ఎవరూ ఉండరు.
২৭“কিন্তু হে মোৰ দাস যাকোব, ভয় নকৰিবা, হে ইস্ৰায়েল ব্যাকুল নহ’বা; কিয়নো চোৱা, মই দূৰৰ পৰা তোমাক, আৰু বন্দী অৱস্থাত থকা দেশৰ পৰা তোমাৰ বংশক নিস্তাৰ কৰিম; তাতে যাকোব ঘূৰি আহি নিৰ্ভয় আৰু নিশ্চিত হৈ থাকিব, কোনেও তেওঁক ভয় নেদেখুৱাব।
28 ౨౮ నా సేవకుడైన యాకోబూ, నువ్వు భయపడకు.” ఇదే యెహోవా చేస్తున్న ప్రకటన. “ఎందుకంటే నేను నీతో ఉన్నాను. నేను మిమ్మల్ని ఏ ఏ దేశాల్లోకి చెదరగొట్టానో ఆ దేశాలను సమూలంగా నాశనం చేస్తాను. కానీ నిన్ను పూర్తిగా నాశనం చేయను. అయితే నా సేవకుడవైన యాకోబూ, నేను నీకు తోడుగా ఉన్నాను. భయపడకు. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టానో ఆ దేశప్రజలందరినీ సమూల నాశనం చేస్తాను. అయితే నిన్ను సమూలంగా నాశనం చేయను. న్యాయమైన విధంగా నిన్ను శిక్షిస్తాను. శిక్షించకుండా నిన్ను వదిలిపెట్టను.”
২৮যিহোৱাই কৈছে, হে মোৰ দাস যাকোব, ভয় নকৰিবা; কিয়নো মই তোমাৰ লগত আছোঁ; কাৰণ, মই যি জাতিৰ মাজলৈ তোমাক খেদিলোঁ, সেই সকলো জাতিক মই নিঃশেষে সংহাৰ কৰিলেও, তোমাক নিঃশেষে সংহাৰ নকৰিম; কিন্তু তোমাক সুবিচাৰেৰে শাস্তি দিম, তোমাক কোনোমতেই দণ্ড নিদিয়াকৈ নেৰোঁ”’।”