< యిర్మీయా 44 >

1 ఐగుప్తు లోని మిగ్దోలు, తహపనేసు, నొపు, పత్రోసు నగరాల్లో నివాసమున్న యూదా ప్రజలందరిని గూర్చి యిర్మీయా వద్దకు వచ్చిన దేవుని వాక్యం ఇది.
Ilizwi leli lafika kuJeremiya limayelana lamaJuda ayehlala eGibhithe, eMigidoli, leThahiphanesi leMemfisi, lasePhathrosi lisithi,
2 “సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. నేను యెరూషలేము పైకీ మిగిలిన యూదా దేశపు పట్టణాల పైకీ పంపిన విపత్తులన్నిటినీ మీరు చూశారు. చూడండి, అవి శిథిలాలై పడి ఉన్నాయి. అక్కడ ఎవరూ నివసించడం లేదు.
“UThixo uSomandla, uNkulunkulu ka-Israyeli uthi: Liwubonile umonakalo omkhulu engawehlisela phezu kweJerusalema laphezu kwamadolobho wonke akoJuda. Lamhlanje kawahlali muntu njalo angamanxiwa
3 మీకుగానీ మీ పితరులకిగానీ తెలియని దేవుళ్ళకి సాంబ్రాణి వేసి పూజించి నాకు కోపం పుట్టించారు కాబట్టి అలా జరిగింది.
ngenxa yobubi ababenzayo. Bangithukuthelisa ngokukhonza langokutshisela impepha abanye onkulunkulu abangabaziyo bona, lani kanye labokhokho benu.
4 అందుకని నేను నా సేవకులైన ప్రవక్తలందర్నీ పదే పదే పంపిస్తూ వచ్చాను. నేను అసహ్యించుకునే ఈ నీచమైన పనులు చేయవద్దు అని చెప్పేందుకు వాళ్ళని పంపాను.
Ngathuma izinceku zami, abaphrofethi, njalonjalo ezathi, ‘Lingayenzi into le enengisayo engiyizondayo!’
5 కానీ వాళ్ళు వినలేదు. ఇతర దేవుళ్ళకి ధూపం వేయడం గానీ, దుర్మార్గపు పనులను చేయడం గానీ మానుకోలేదు. నా మాటపై శ్రద్ధ పెట్టలేదు.
Kodwa kabalalelanga njalo kabanakanga; kabaphendukanga ebubini babo kumbe bayekele ukutshisela abanye onkulunkulu impepha.
6 కాబట్టి నా దగ్గర నుండి తీవ్రమైన కోపం, ఉగ్రత ప్రవహించింది. అది అగ్నిలా యూదా పట్టణాలనూ, యెరూషలేము రహదారులనూ తగులబెట్టింది. కాబట్టి అవి ఇప్పుడు చూస్తున్నట్టుగా నాశనమై శిథిలాలుగా పడి ఉన్నాయి.”
Ngakho ulaka lwami olwesabekayo lwaphuphuma; lwavutha emadolobheni akoJuda lasemigwaqweni yaseJerusalema, lwakwenza kwaba ngamanxiwa achithekileyo ayikho lamhlanje.
7 కాబట్టి ఇప్పుడు సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “మీకు విరోధంగా మీరే ఎందుకిలా దుర్మార్గం చేస్తూ ఉన్నారు? స్త్రీలూ, పురుషులూ, పిల్లలూ, పసికందులూ ఇలా ఎవరూ యూదా దేశంలో ఉండకుండా నిర్మూలం అయ్యేలా, మీలో ఎవరూ మిగలకుండా మీరే ఎందుకు చేసుకుంటున్నారు?
Khathesi uThixo uNkulunkulu uSomandla, uNkulunkulu ka-Israyeli, uthi: Kungani lizilethela umonakalo omkhulu kangaka ngokususa koJuda amadoda labafazi, abantwana lensane, ngalokho lingazitshiyeli lensalela na?
8 మీ దుర్మార్గత చేత మీరు మీ చేతులతో చేసే పనులతో నాకు అభ్యంతరకరంగా నేరం చేస్తున్నారు. మీరు నివాసం ఉండబోతున్న ఐగుప్తు దేశపు దేవుళ్ళకి ధూపం వేస్తూ నన్ను ఉల్లంఘిస్తున్నారు. మీరు నాశనం కావడానికీ భూమి పైన ఉన్న అన్ని దేశాల్లో మీరు నవ్వుల పాలు కావడానికీ, ఒక శాప వచనంగా ఉండటానికీ మీరు అక్కడికి వెళ్తున్నారు.
Kungani lingithukuthelisa ngokwenziwa yizandla zenu, litshisela abanye onkulunkulu impepha eGibhithe, lapho eselayahlala khona? Lizazibhubhisa lina ngokwenu lizenze into yokuthukwa lokuhlekwa phakathi kwezizwe zonke emhlabeni.
9 మీ పితరులు చేసిన దుర్మార్గాన్నీ, మీ యూదా రాజులూ, వాళ్ళ భార్యలూ చేసిన దుర్మార్గాన్నీ మరచిపోయారా? యూదా దేశంలోనూ, యెరూషలేము వీధుల్లోనూ మీరూ, మీ భార్యలూ చేసిన దుర్మార్గాన్ని మరచిపోయారా?
Selibukhohliwe yini ububi obenziwa ngokhokho benu lobubi obenziwa ngamakhosi lamakhosikazi akoJuda, lobubi obenziwa yini labomkenu elizweni lakoJuda, lasemigwaqweni yaseJerusalema?
10 ౧౦ ఈ రోజు వరకూ వాళ్ళు అణకువతో ఉండలేదు. వాళ్ళ ముందూ వాళ్ళ పితరుల ముందూ నేను ఉంచిన ధర్మశాస్త్రాన్నిగానీ ఆజ్ఞలనుగానీ వాళ్ళు గౌరవించలేదు. వాటి ప్రకారం జీవించలేదు.”
Kuze kube lamhla kabazithobanga kumbe batshengise ukuhlonipha, kumbe balandele imithetho yami lezimiso engalibekela zona lina labokhokho benu.
11 ౧౧ కాబట్టి సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి, మీ పైకి అపాయాన్ని తీసుకురావడానికీ, యూదా దేశాన్నంతా నాశనం చేయడానికీ నేను నా ముఖాన్ని మీకు వ్యతిరేకంగా తిప్పుకుంటున్నాను.
Ngakho uThixo uSomandla, uNkulunkulu ka-Israyeli uthi: Ngizimisele ukulehlisela umonakalo ngibhubhise loJuda wonke.
12 ౧౨ యూదా ప్రజలలో మిగిలిన వాళ్ళలో ఐగుప్తు దేశానికి వెళ్ళాలని నిర్ణయించుకున్న వాళ్ళని నేనే తీసుకు వెళ్తాను. వాళ్ళంతా ఐగుప్తులో నాశనం కావడానికే ఇలా చేస్తాను. వాళ్ళు అక్కడ కత్తి మూలంగానూ, కరువు మూలంగానూ కూలిపోతారు. వాళ్ళు చనిపోయి శాపానికీ, దూషణకూ, అవమానానికీ, భయానికీ సామెతగా ఉంటారు.
Ngizathatha abaseleyo koJuda ababezimisele ukuya eGibhithe; ukuba bahlale khona. Bonke bazabhubha eGibhithe; bazabulawa ngenkemba loba babulawe yindlala. Bazabulawa yinkemba loba indlala kusukela komncinyane kusiya komkhulu. Bazakuba yinto yokuqalekiswa lokwesaba, eyokulahlwa lokuthukwa.
13 ౧౩ యెరూషలేములో నివసించే వాళ్ళని కత్తితో, కరువుతో, వ్యాధులతో నేను ఎలా శిక్షించానో అలాగే ఐగుప్తులో నివసించే వాళ్ళను కూడా శిక్షిస్తాను.
Abahlala eGibhithe ngizabajezisa ngenkemba, ngendlala langesifo, njengokujezisa engakwenza iJerusalema.
14 ౧౪ ఐగుప్తులో నివాసముండటానికి వెళ్ళిన మిగిలిన యూదా ప్రజల్లో ఎవరూ కాందిశీకుల్లా తిరిగి యూదా దేశానికి రావాలని ఎంత కోరుకున్నా రాలేరు. అక్కడ నుండి తప్పించుకుని పారిపోయిన ఏ కొద్దిమందో తప్ప ఎవరూ తిరిగి రారు.”
Kakho owensalela yakoJuda owayahlala eGibhithe ozaphunyuka kumbe aphephe ukuba abuyele elizweni lakoJuda asebefisa ukubuyela bayehlala kulo, kakho ozabuyela ngaphandle kweziphepheli ezilutshwane.”
15 ౧౫ అప్పుడు తమ భార్యలు ఇతర దేవుళ్ళకు సాంబ్రాణి ధూపం వేస్తారని తెలిసిన పురుషులందరూ, అక్కడ సమూహంలో ఉన్న ఆడవాళ్ళందరూ, ఐగుప్తు దేశంలో పత్రోసులో నివాసముండే ప్రజలందరూ యిర్మీయాకు జవాబిచ్చారు.
Lapho-ke wonke amadoda ayekwazi ukuthi omkawo babetshisela abanye onkulunkulu impepha, kanye labesifazane bonke ababekhona, ixuku elikhulu, labantu bonke ababehlala ePhathrosi elizweni laseGibhithe, bathi kuJeremiya:
16 ౧౬ వాళ్ళిలా అన్నారు. “యెహోవా పేరు మీద నువ్వు చెప్పిన మాట మేం వినం.
“Thina kasiyikulilalela ilizwi olikhulume kithi ngebizo likaThixo!
17 ౧౭ మేం చేస్తామని చెప్పిన పనులను మేం తప్పకుండా చేస్తాం. యూదా దేశంలోనూ, యెరూషలేము వీధులలోనూ మేమూ, మా రాజులూ, మా పితరులూ, మా నాయకులూ చేసినట్టే ఆకాశ రాణికి ధూపం వేస్తాం, ఆమెకు పానీయ నైవేద్యాలు సమర్పిస్తాం. అప్పుడే ఎలాంటి ఆపదా కలగకుండా మాకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. మేం అభివృద్ధి చెందుతాం.
Impela sizakwenza konke esathi sizakwenza: Impepha sizayitshisela iNdlovukazi yaseZulwini siyithululele leminikelo yokunathwayo njengalokhu esakwenzayo thina labobaba, amakhosi ethu kanye lezikhulu zakithi emadolobheni akoJuda lasemigwaqweni yaseJerusalema. Ngalesosikhathi sasilokudla okunengi, sinothile kungekho okubi.
18 ౧౮ మేం ఆకాశరాణికి ధూపం వేయకుండా, ఆమెకు పానీయ నైవేద్యాలు అర్పించకుండా ఉన్నప్పుడు పేదరికంతో బాధ పడ్డాం. కత్తి మూలంగానూ, కరువు మూలంగానూ నశించిపోతున్నాం.”
Kodwa selokhu sayekela ukutshisela iNdlovukazi yaseZulwini impepha lokuyithululela iminikelo yokunathwayo, kasisabanga lalutho njalo sesilokhu sisifa ngenkemba langendlala.”
19 ౧౯ అక్కడి స్త్రీలు “మేం మా భర్తలకు తెలియకుండానే ఆకాశ రాణికి ధూపం వేస్తూ, ఆమెకు పానీయ నైవేద్యాలు అర్పిస్తూ ఉన్నామా ఏమిటి?” అన్నారు.
Abesifazane bengeza bathi, “Ngesikhathi sitshisela iNdlovukazi yaseZulwini impepha, siyithululela leminikelo yokunathwa, omkethu babengakwazi na ukuthi sasisenza amakhekhe anjengesithombe sayo, siyithululela leminikelo yokunathwayo?”
20 ౨౦ అప్పుడు యిర్మీయా ఆ ప్రజలందరితో, ఆ స్త్రీ పురుషులందరితో, తనకు జవాబు చెప్పిన వాళ్ళందరితో ఇలా అన్నాడు. వాళ్ళకి ఇలా ప్రకటన చేశాడు.
UJeremiya wasesithi ebantwini bonke, abesilisa labesifazane, ababemphendula,
21 ౨౧ “మీరూ, మీ పితరులూ, మీ రాజులూ, మీ నాయకులూ, మీ ప్రజలందరూ యూదా పట్టణాల్లోనూ, యెరూషలేము వీధులలోనూ మీరు వేసిన ధూపం యెహోవా మర్చిపోయాడు అనుకుంటున్నారా? ఆయన దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఆలోచనల్లో ఇది మెదులుతూనే ఉంది.
“UThixo kakhumbulanga wanakana ngempepha elayitshisela emadolobheni akoJuda lasemigwaqweni yaseJerusalema lina laboyihlo, lamakhosi enu, lezikhulu zakini kanye labantu belizweni na?
22 ౨౨ ఆయన మీ దుర్మార్గపు పనులనూ, మీరు జరిగించిన అసహ్య కార్యాలనూ చూసి సహించలేక పోయాడు. అందుకే మీ భూమి ఎడారి అయింది. భీకరమైన ప్రాంతంగా, ఒక శాపంగా అయింది. అందుకే ఈ రోజు వరకూ అక్కడ ఎవరూ నివాసమేర్పరచుకోలేదు.
Kwathi uThixo engaselakho ukubekezelela izenzo zenu ezimbi lezinto ezinengisayo elazenzayo, ilizwe lenu laba yinto yokuqalekiswa logwadule oluphundlekileyo olungahlali muntu njengoba kunjalo lanamhla.
23 ౨౩ మీరు ధూపం వేసి యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు. ఆయన మాట వినకుండా ఆయన ధర్మశాస్త్రాన్నీ, ఆయన ఆజ్ఞలనూ, ఆయన నిబంధన నియమాలనూ పాటించలేదు. అందుకే ఈ రోజు మీకీ దురవస్థ కలిగింది.”
Umonakalo lo wehlele kini njengoba liwubona khathesi ngoba litshise impepha lenza okubi kuThixo njalo kalaze lamlalela loba lilandele umthetho wakhe kumbe imithetho yakhe loba izimiso zakhe.”
24 ౨౪ తర్వాత యిర్మీయా అక్కడి ప్రజలనందరికీ, స్త్రీలందరికీ ఇలా చెప్పాడు. “ఐగుప్తులో ఉన్న యూదా ప్రజలారా, యెహోవా మాట వినండి.
UJeremiya wasesithi ebantwini bonke, kubalwa labesifazane, “Zwanini ilizwi likaThixo lonke lina bantu bakoJuda abaseGibhithe.
25 ౨౫ సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. ‘మీరూ, మీ భార్యలూ, ఇద్దరూ కలసి మీ నోటితో చెప్పారు.’ అలా చెప్పిన దాన్ని చేతులతో చేసి చూపించారు. ఆకాశ రాణికి ధూపం వేస్తామనీ, ఆమెకు పూజ చేస్తామనీ మీరు ఒట్టు పెట్టుకున్నారు. ఇప్పుడు మీ ఒట్టును నెరవేర్చండి. దానిని జరిగించండి.
UThixo uSomandla, uNkulunkulu ka-Israyeli uthi: Lina labomkenu selitshengisile ngezenzo zenu elathembisa ukukwenza lapho lathi, ‘Impela sizagcwalisa izifungo zethu esazenzayo zokutshisela iNdlovukazi yaseZulwini impepha kanye lokuyithululela iminikelo yokunathwayo.’ Ngakho qhubekani, yenzani elakuthembisayo. Gcwalisani izifungo zenu.
26 ౨౬ అయితే ఐగుప్తులో నివసించే యూదా ప్రజలందరూ యెహోవా మాట వినండి. ఆయన ఇలా అంటున్నాడు. చూడండి. నేను నా ఘన నామంపై ప్రమాణం చేసి చెప్తున్నాను. ఐగుప్తులో ఉన్న యూదులంతా ఇప్పుడు ‘యెహోవా జీవం తోడు’ అంటూ ఉంటారు. అయితే ఐగుప్తులో ఉన్న యూదుల్లో ఎవ్వరూ ఇక మీదట నా పేరును తమ నోటితో పలకరు.
Kodwa zwanini ilizwi likaThixo lonke lina baJuda abahlala eGibhithe elithi: ‘Ngifunga ngebizo lami elidumileyo,’ kutsho uThixo, ‘ukuthi kakho ovela koJuda ohlala loba kungaphi eGibhithe ozabiza ibizo lami kumbe afunge esithi, “Ngeqiniso elinjengoba uThixo Wobukhosi ekhona.”
27 ౨౭ నేను వాళ్ళ క్షేమం కోసం కాకుండా వాళ్ళ వినాశనం కోసమే వాళ్ళని కనిపెట్టుకుని ఉన్నాను. ఐగుప్తులోని యూదులంతా కత్తి మూలంగానో కరువు మూలంగానో చనిపోతారు. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలడు. వారు ఖడ్గం వల్ల గానీ కరువు వల్ల గానీ క్షీణించిపోతారు. ఐగుప్తు దేశంలో ఉన్న యూదా వారంతా ఎవరూ మిగలకుండా అంతమై పోతారు.
Ngoba ngilindele ukubenza okubi, hatshi okuhle. AmaJuda aseGibhithe azabhujiswa yinkemba lendlala aze aphele wonke.
28 ౨౮ కత్తిని తప్పించుకున్న కొద్దిమంది ఐగుప్తు నుండి యూదా దేశానికి తిరిగి వస్తారు. కాబట్టి యూదాలో మిగిలిన వాళ్లకు ఎవరి మాట నిజమైనదో, నాదో, వారిదో అప్పడు తెలుసుకుంటారు.
Labo abazaphepha enkembeni babuyele elizweni lakoJuda bevela eGibhithe bazakuba balutshwana. Lapho-ke bonke abayinsalela yakoJuda abayahlala eGibhithe bazakwazi ukuthi ilizwi elizakuma ngelikabani, elami kumbe elabo.
29 ౨౯ ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. ‘నా మాట మీకు విరోధంగా మీ పైకి ఘోర విపత్తును తీసుకు వస్తుంది. దానికి ఇది మీకు ఒక సూచనగా ఉంటుంది.’
Lokhu kuzakuba yisibonakaliso kini sokuthi ngizalijezisa kuyonale indawo,’ kutsho uThixo, ‘ukuze lazi ukuthi okubi engalisongela ngakho kuzakwenzakala.’
30 ౩౦ యెహోవా ఇలా చెప్తున్నాడు. ‘సిద్కియా ప్రాణాన్ని తీయాలని వెదికిన అతని శత్రువు నెబుకద్నెజరు చేతికి సిద్కియాను అప్పగించినట్టే ఐగుప్తు రాజైన ఫరో హోఫ్రాను అతని శత్రువులకీ, అతని ప్రాణం తీయాలని చూసేవాళ్లకీ అప్పగించబోతున్నాను.’”
UThixo uthi: ‘Ngizanikela uFaro Hofira inkosi yaseGibhithe ezitheni zakhe ezifuna ukumbulala, njengalokhu nganikela uZedekhiya inkosi yakoJuda kuNebhukhadineza inkosi yaseBhabhiloni, isitha sakhe esasifuna ukumbulala.’”

< యిర్మీయా 44 >