< యిర్మీయా 43 >
1 ౧ వాళ్ళ దేవుడైన యెహోవా వాళ్ళతో చెప్పమని తనకి ఆదేశించిన మాటలన్నిటినీ యిర్మీయా వాళ్లకు చెప్పి ముగించాడు.
Men da Jeremias var til ende med at forkynde alle de Ord, med hvilke HERREN deres Gud havde sendt ham til dem, alle de nævnte Ord,
2 ౨ అప్పుడు హోషేయా కొడుకు అజర్యా, కారేహ కొడుకు యోహానానూ ఇంకా అక్కడ ఆహంకారులందరూ యిర్మీయాతో “నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ‘మీరు నివసించడానికి ఐగుప్తుకు వెళ్ళవద్దు’ అని మా దేవుడు యెహోవా నీతో చెప్పి పంపలేదు.
sagde Azarja, Ma'asejas Søn, og Johanan, Kareas Søn, og alle de andre overmodige Mænd til Jeremias: »Du lyver! HERREN vor Gud har ikke sendt dig for at sige, at vi ikke skal drage til Ægypten for at bo der som fremmede;
3 ౩ మేం చావడానికీ, బబులోనుకు బందీలుగా పోవడానికీ కల్దీయుల చేతిలో చిక్కాలని నేరీయా కొడుకు బారూకు మాకు వ్యతిరేకంగా నిన్ను రెచ్చగొడుతున్నాడు” అన్నారు.
nej, Baruk, Nerijas Søn, har ophidset dig imod os, for at vi skal gives i Kaldæernes Haand, saa de dræber os eller fører os bort til Babel.«
4 ౪ ఈ విధంగా కారేహ కొడుకు యోహానానూ, సైన్యాధిపతులందరూ, ఇంకా ప్రజలందరూ యూదా దేశంలో నివసించమన్న దేవుని మాట వినలేదు.
Og Johanan, Kareas Søn, alle Hærførerne og alt Folket adlød ikke HERRENS Røst om at blive i Judas Land;
5 ౫ కారేహ కొడుకు యోహానానూ, సైన్యాధిపతులందరూ చెరలో నుండి యూదా దేశంలో నివసించడానికి అనేక ప్రాంతాల నుండి తిరిగి వచ్చిన వాళ్ళనందరినీ తీసుకు వెళ్ళారు.
men Johanan, Kareas Søn, og alle Hærførerne tog hele Judas Rest, som var vendt tilbage for at bo i Judas Land,
6 ౬ స్త్రీ పురుషులనందరినీ, పిల్లలనూ, రాజ కుమార్తెలనూ, రాజు అంగరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను షాఫాను కొడుకైన అహీకాము కొడుకు గెదల్యా ఆధీనంలో ఉంచిన వాళ్ళనందరినీ తీసుకుని వెళ్ళారు. వాళ్ళు ప్రవక్త అయిన యిర్మీయానూ, నేరీయా కొడుకు బారూకును కూడా తీసుకు వెళ్ళారు.
Mænd, Kvinder og Børn, Kongedøtrene og enhver, som Livvagtsøversten Nebuzar'adan havde ladet blive hos Gedalja, Sjafans Søn Ahikams Søn, ogsaa Profeten Jeremias og Baruk, Nerijas Søn,
7 ౭ వాళ్ళు దేవుని మాట వినకుండా ఐగుప్తుదేశంలో ఉన్న తహపనేసుకు వచ్చారు.
og drog til Ægypten; thi de adlød ikke HERRENS Røst. Og de kom til Takpankes.
8 ౮ కాబట్టి యెహోవా వాక్కు తహపనేసులో ఉన్న యిర్మీయా వద్దకు వచ్చి ఇలా చెప్పాడు.
Men HERRENS Ord kom til Jeremias i Takpankes saaledes:
9 ౯ యూదులు చూస్తూ ఉండగా నువ్వు కొన్ని పెద్ద రాళ్ళను చేతిలో పట్టుకుని తహపనేసులో ఉన్న ఫరో భవన ద్వారం దగ్గరికి వెళ్ళు. అక్కడ ఇటుకలు పేర్చిన దారిలో సున్నం కింద వాటిని దాచి పెట్టు.
Tag dig nogle store Sten og grav dem ned i Teglstensgulvets Underlag ved Indgangen til Faraos Hus i Takpankes i de judæiske Mænds Paasyn
10 ౧౦ తర్వాత వాళ్లకిలా ప్రకటించు. “సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ‘చూడండి, నేను నా సేవకుడూ, బబులోను రాజూ అయిన నెబుకద్నెజరును పిలవడానికి వార్తాహరులను పంపిస్తున్నాను. యిర్మీయా పాతిన ఈ రాళ్ళ పైన అతని సింహాసనాన్ని నిలబెడతాను. వాటిపైనే అతడు తన కంబళి పరుస్తాడు.
og sig til dem: Saa siger Hærskarers HERRE, Israels Gud: Jeg lader min Tjener Kong Nebukadrezar af Babel hente, og han skal rejse sin Trone oven over de Sten, du gravede ned, og brede sit Trontæppe derover.
11 ౧౧ అతడు వచ్చి ఐగుప్తు పై దాడి చేస్తాడు. చావుకు నిర్ణయమైన వాళ్ళు చనిపోతారు. బందీలుగా వెళ్ళడానికి నిర్ణయమైన వాళ్ళు బందీలుగా వెళ్తారు. కత్తి మూలంగా చావడానికి నిర్ణయమైన వాళ్ళు కత్తి మూలంగానే చనిపోతారు.
Han skal komme og slaa Ægypten; dem, der hører Døden til, skal han overgive til Død, dem, der hører Fangenskabet til, til Fangenskab og dem, der hører Sværdet til, til Sværd.
12 ౧౨ అప్పుడు నేను ఐగుప్తు దేవుళ్ళ గుళ్లలో అగ్ని రాజేస్తాను. నెబుకద్నెజరు వాటిని కాల్చి వేస్తాడు. లేదా ఆ దేవుళ్ళను పట్టుకుపోతాడు. గొర్రెల కాపరి తన బట్టలపై ఉన్న పురుగులను తుడిచి పెట్టినట్టుగా అతడు ఐగుప్తు దేశాన్ని తుడిచి పెట్టేస్తాడు. విజయం సాధించి అక్కడ నుండి వెళ్తాడు.
Han skal sætte Ild paa Ægyptens Gudehuse og afbrænde dem og bortføre Guderne som Fanger, og han skal svøbe Ægypten om sig som en Hyrde sin Kappe; derpaa skal han drage bort derfra i Fred.
13 ౧౩ అతడు ఐగుప్తులో సూర్య మందిరాలలో ఉన్న రాతి స్తంభాలను కూల్చి వేస్తాడు. ఐగుప్తు దేవుళ్ళ ఆలయాలను కాల్చివేస్తాడు.’”
Han skal nedbryde Stenstøtterne i Bet-Sjemesj og afbrænde Ægyptens Gudehuse.