< యిర్మీయా 42 >
1 ౧ అప్పుడు కారేహ కుమారుడు యోహానానూ, హోషేయా కుమారుడు యెజన్యా, సైన్యాధిపతులందరూ ఇంకా గొప్పవారూ, సామాన్యులూ ప్రజలందరూ కలసి ప్రవక్త అయిన యిర్మీయా దగ్గరికి వచ్చారు.
Potom doðoše sve vojvode i Joanan sin Karijin i Jezanija sin Osajin, i sav narod, malo i veliko,
2 ౨ వాళ్ళు అతనితో ఇలా అన్నారు. “నువ్వు చూస్తున్నట్టు మేం చాలా తక్కువ మందిమి. మా మనవిని చెవినబెట్టి మిగిలిన ఈ ప్రజల కోసం నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు.
I rekoše Jeremiji proroku: pusti preda se našu molbu, i pomoli se za nas Gospodu Bogu svojemu, za sav ovaj ostatak, jer nas je ostalo malo od mnogih, kao što nas oèi tvoje vide,
3 ౩ మేం ఏ మార్గాన వెళ్ళాలో, ఏం చేయాలో నీ దేవుడైన యెహోవాను అడిగి మాకు తెలియజేయి.”
Da bi nam pokazao Gospod Bog tvoj put kojim æemo iæi i šta æemo raditi.
4 ౪ కాబట్టి ప్రవక్త అయిన యిర్మీయా వాళ్లకిలా చెప్పాడు. “మీరు చెప్పింది విన్నాను. చూడండి, మీరు అభ్యర్ధించినట్టే నేను మీ దేవుడైన యెహోవాను ప్రార్ధిస్తాను. యెహోవా ఏం జవాబిచ్చాడో అది ఏదీ దాచకుండా మీకు చెప్తాను.”
A Jeremija prorok reèe im: poslušaæu; evo, pomoliæu se Gospodu Bogu vašemu po vašim rijeèima, i što vam odgovori Gospod kazaæu vam, neæu vam zatajiti ni rijeèi.
5 ౫ వాళ్ళు యిర్మీయాతో ఇలా అన్నారు. “నీ దేవుడైన యెహోవా మాకు చెప్పినదంతా మేం చేయకపోతే అప్పుడు యెహోవా మాకు వ్యతిరేకంగా నమ్మకమైన సత్యసాక్షిగా ఉంటాడు గాక.
A oni rekoše Jeremiji: Gospod neka nam je svjedok istinit i vjeran da æemo èiniti sve što ti Gospod Bog tvoj zapovjedi za nas.
6 ౬ అది మాకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మేము మాత్రం నిన్ను పంపుతున్న మన దేవుడైన యెహోవా స్వరానికి లోబడతాం. మన దేవుడైన యెహోవా చెప్పిన మాటకు లోబడటం మాకు మేలు చేస్తుంది.”
Bilo dobro ili zlo, poslušaæemo rijeè Gospoda Boga svojega ka kojemu te šaljemo, da bi nam dobro bilo kad poslušamo glas Gospoda Boga svojega.
7 ౭ పది రోజుల తర్వాత యెహోవా వాక్కు యిర్మీయా దగ్గరికి వచ్చింది.
A poslije deset dana doðe rijeè Gospodnja Jeremiji;
8 ౮ కాబట్టి అతడు కారేహ కొడుకు యోహానానునూ, అతనితో ఉన్న సైన్యాధిపతులందర్నీ, ఇంకా గొప్పవారూ, సామాన్యులూ అయిన ప్రజలందర్నీ తన దగ్గరికి పిలిచాడు.
Te sazva Joanana sina Karijina i sve vojvode što bijahu s njim, i sav narod, malo i veliko,
9 ౯ వారికిలా చెప్పాడు. “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దగ్గర మీ కోసం ప్రార్ధించడానికి మీరు నన్ను పంపారు. ఆయన ఇలా చెప్పాడు.
I reèe im: ovako veli Gospod Bog Izrailjev, ka kojemu me poslaste da iznesem preda nj molbu vašu:
10 ౧౦ ‘మీరు వెనక్కి వెళ్లి ఈ దేశంలోనే నివసించినట్లయితే నేను మిమ్మల్ని నిర్మిస్తాను. మిమ్మల్ని చీల్చివేయను. మిమ్మల్ని నాటుతాను గానీ పెకలించి వేయను. మీ పైకి నేను తెచ్చిన విపత్తును తప్పిస్తాను.
Ako ostanete u ovoj zemlji, sazidaæu vas, i neæu vas razoriti, i nasadiæu vas i neæu vas istrijebiti; jer mi je žao sa zla koje sam vam uèinio.
11 ౧౧ మీరు బబులోను రాజుకు భయపడుతూ ఉన్నారు. అతనికి భయపడకండి.’ ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. ‘మిమ్మల్ని రక్షించడానికీ, అతని చేతిలో నుండి తప్పించడానికీ నేను మీతో ఉన్నాను కాబట్టి అతనికి భయపడకండి.
Ne bojte se cara Vavilonskoga, kojega se bojite; ne bojte ga se, govori Gospod, jer sam ja s vama da vas saèuvam i da vas izbavim iz njegove ruke.
12 ౧౨ నేను మిమ్మల్ని కరుణిస్తాను. మీ పైన కనికరపడతాను. మీ దేశానికి తిరిగి మిమ్మల్ని తీసుకువస్తాను.’
I uèiniæu vam milost da se smiluje na vas, i vrati vas u zemlju vašu.
13 ౧౩ అయితే ఒకవేళ మీరు కత్తి మూలంగానో, కరువు మూలంగానో, వ్యాధి మూలంగానో మీ దేవుడైన యెహోవానైన నా మాట వినకుండా ‘మేం ఈ దేశంలో నివసించం,’ అన్నారనుకోండి,
Ako li reèete: neæemo da ostanemo u toj zemlji, ne slušajuæi glasa Gospoda Boga svojega
14 ౧౪ లేదా మీరు ‘ఇక్కడ కాదు. మనం ఐగుప్తు దేశానికి వెళ్దాం. అక్కడ ఎలాంటి యుద్ధమూ చూడం, అక్కడ యుద్ధ భేరీనాదం వినం, ఆహారం కోసం ఆకలితో ఉండం. మనం అక్కడే నివసిద్దాం’ అనుకోవచ్చు కూడా.
Govoreæi: ne, nego idemo u zemlju Misirsku, da ne vidimo rata i glasa trubnoga ne èujemo i ne budemo gladni hljeba, i ondje æemo se naseliti,
15 ౧౫ యూదా ప్రజల్లో మిగిలి ఉన్న వారు యెహోవా చెప్పే ఈ మాట వినండి. సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. మీరు ఒకవేళ ఐగుప్తులో నివసించడానికి వెళ్లాలని నిర్ణయం చేసుకుంటే,
Onda èujte rijeè Gospodnju, koji ste ostali od Jude; ovako veli Gospod nad vojskama Bog Izrailjev: ako vi okrenete lice svoje da idete u Misir i otidete da se naselite ondje,
16 ౧౬ మీరు భయపడుతున్న కత్తి ఐగుప్తులో మిమ్మల్ని కలుసుకుంటుంది. మీరు చింతించే కరువు మీ వెనుకే ఐగుప్తు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటుంది. మీరు అక్కడే చనిపోతారు.
Ondje æe vas u zemlji Misirskoj stignuti maè kojega se bojite, i glad, radi koje se brinete, goniæe vas ondje u Misiru i ondje æete pomrijeti.
17 ౧౭ కాబట్టి ఐగుప్తులో నివసించాలని నిర్ణయం తీసుకుని అక్కడకు వెళ్ళే వాళ్ళు కత్తి మూలంగానో, కరువు మూలంగానో, వ్యాధి మూలంగానో చనిపోతారు. నేను వాళ్ళ పైకి పంపించే ఆపద నుండి ఎవరూ తప్పించుకోరు. ఎవరూ మిగిలి ఉండరు.”
I svi ljudi koji su okrenuli lice svoje da idu u Misir da se ondje nasele, izginuæe od maèa i od gladi i od pomora, i nijedan ih neæe ostati niti æe koji uteæi od zla koje æu pustiti na njih.
18 ౧౮ ఎందుకంటే సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “యెరూషలేము నివాసుల పైకి నా తీవ్ర కోపమూ, నా ఉగ్రతా వచ్చినట్టే, మీరు ఐగుప్తుకు వెళ్ళినట్టయితే మీ మీద కూడా నా క్రోధాన్ని కుమ్మరిస్తాను. మీరు శాపానికి గురౌతారు. మీరు భయాన్ని పుట్టించే వాళ్ళుగా ఉంటారు. దూషణ పాలవుతారు. ఈ స్థలాన్ని మీరు ఇక మీదట చూడరు.
Jer ovako veli Gospod nad vojskama Bog Izrailjev: kao što se gnjev moj i jarost moja izli na stanovnike Jerusalimske, tako æe se izliti gnjev moj na vas, ako otidete u Misir, i biæete uklin i èudo i kletva i rug, i neæete više vidjeti ovoga mjesta.
19 ౧౯ యూదా ప్రజల్లో మిగిలి ఉన్న మీ కోసం యెహోవా చెప్తున్నాడు. ఐగుప్తుకు వెళ్ళకండి! ఈ రోజు మీకు వ్యతిరేకంగా సాక్ష్యం నేనే అని మీకు తెలుసు.
Gospod vam govori, ostanci Judini! ne idite u Misir. Znajte da vam ja svjedoèim danas.
20 ౨౦ ‘మా కోసం మన దేవుడైన యెహోవాకు ప్రార్థించు. మన దేవుడైన యెహోవా చెప్పినదంతా మాకు తెలియజెయ్యి. మేం దాన్ని జరిగిస్తాం’ అంటూ మీరే యిర్మీయా అనే నన్ను మీ దేవుడైన యెహోవా దగ్గరికి పంపించారు. కాబట్టి మీరు మీ ప్రాణాలనే చెల్లించాల్సి ఉంటుంది.
Jer varaste duše svoje kad me poslaste ka Gospodu Bogu svojemu rekavši: pomoli se za nas Gospodu Bogu našemu, i kako reèe Gospod Bog naš, javi nam i uèiniæemo.
21 ౨౧ ఈ రోజు నేను మీకు తెలియజేశాను. కానీ మీరు మీ దేవుడైన యెహోవా మాట వినలేదు. ఆయన నా ద్వారా మీకు తెలియజేసిన వాటిలో దేనినీ వినలేదు.
A kad vam javih danas, neæete da poslušate glasa Gospoda Boga svojega niti išta što mi zapovjedi za vas.
22 ౨౨ కాబట్టి ఎక్కడ నివాసముండాలని మీరు కోరుకుంటున్నారో అక్కడే మీరు కత్తి మూలంగానో, కరువు మూలంగానో, వ్యాధి మూలంగానో చనిపోతారు. అది మీకు తప్పకుండా తెలుసుకోవాలి.”
Znajte dakle da æete izginuti od maèa i od gladi i od pomora na mjestu kuda ste radi otiæi da se stanite.