< యిర్మీయా 4 >

1 యెహోవా చెప్పేదేమంటే, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు తిరిగి రాదలిస్తే నా దగ్గరకే రావాలి. మీరు మీ హేయమైన విగ్రహాలను తీసివేసి నా సన్నిధి నుండి ఇటూ అటూ తప్పిపోకుండా ఉంటే,
“Sɛ wo, Israel, wobɛsan wʼakyi a, san bra me nkyɛn,” sɛɛ na Awurade se. “Sɛ wuyi wʼahoni a ɛyɛ akyiwade fi mʼani so na sɛ woamman bio,
2 యథార్థంగా, నీతి నిజాయితీతో “యెహోవా జీవం తోడు” అని ప్రమాణం చేస్తే, జాతులకు ఆయనలో ఆశీర్వాదం దొరుకుతుంది. వారు ఆయనలోనే అతిశయిస్తారు.
na sɛ wufi nokware, pɛpɛyɛ ne trenee mu ka ntam se, ‘Sɛ Awurade te ase yi,’ a afei wobehyira aman no na ne mu na wobenya anuonyam.”
3 యూదా వారికీ యెరూషలేము నివాసులకూ యెహోవా చెప్పేదేమంటే, ముళ్ల పొదల్లో విత్తనాలు చల్లవద్దు. మీ బీడు భూమిని దున్నండి.
Eyi ne asɛm a, Awurade ka kyerɛ Yuda mmarima ne Yerusalem: “Munsiesie mo asase a womfuntum da, na munnnua wɔ nsɔe mu.
4 యూదా, యెరూషలేము ప్రజలారా, మీ హృదయాలకు సున్నతి చేసుకోండి. మీ దుష్టక్రియలను బట్టి నా కోపం అగ్నిలాగా మండుతున్నది. దాన్ని ఎవరూ ఆర్పివేయలేరు. కాబట్టి యెహోవాకు లోబడి ఉండండి.
Muntwitwa mo ho twetia mma Awurade muntwitwa mo koma twetia, mo Yuda mmarima ne Yerusalemfo, anyɛ saa a mʼabufuwhyew bɛsɔre na adɛw sɛ ogya mo bɔne a moayɛ nti, ɛbɛhyew a obiara rennum.”
5 యెరూషలేములో వినబడేలా యూదాలో ఇలా ప్రకటించండి. “దేశంలో బూర ఊదండి.” గట్టిగా ఇలా హెచ్చరిక చేయండి. “ప్రాకారాలతో ఉన్న పట్టణాల్లోకి వెళ్దాం రండి.”
“Bɔ nkae wɔ Yuda na pae mu ka wɔ Yerusalem se ‘Hyɛn torobɛnto no wɔ asase no nyinaa so!’ Teɛ mu dennen se: ‘Mommoaboa mo ho ano! Momma yenguan nkɔ nkuropɔn a wɔabɔ ho ban no mu!’
6 సీయోనుకు కనబడేలా జెండా ఎత్తండి. తప్పించుకోడానికి పారిపోండి. ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే యెహోవా అనే నేను ఉత్తరదిక్కు నుండి కీడును రప్పిస్తున్నాను. గొప్ప వినాశనాన్ని రప్పిస్తున్నాను.
Momma frankaa so na monkɔ Sion munguan nkɔbɔ mo ho aguaa! Efisɛ mede amanehunu fi atifi fam reba, ɔsɛe a ɛyɛ hu.”
7 పొదల్లో నుండి సింహం బయలుదేరింది. జాతుల వినాశకుడు బయలు దేరాడు. నీ దేశాన్ని నాశనం చేయడానికి, నీ పట్టణాలను శిథిలాలుగా మార్చి ఎవరూ నివసించకుండా చేయడానికి అతడు తన చోటు నుండి బయలు దేరాడు.
Gyata bi afi ne tu mu; ɔbɔɔaman bi asi mu. Wafi ne tenabea sɛ ɔrebɛsɛe wʼasase. Wo nkurow bebubu na ada mpan.
8 యెహోవా కోపాగ్ని మన మీద నుండి తొలగిపోలేదు. కాబట్టి గోనె పట్ట కట్టుకోండి. రోదనతో విలపించండి.
Enti fura atweaatam, di awerɛhow na twa adwo, efisɛ Awurade abufuwhyew no nnan mfii yɛn so.
9 యెహోవా చెప్పేదేమంటే “ఆ రోజు రాజూ అతని అధికారులూ ధైర్యం కోల్పోతారు. యాజకులు నిర్ఘాంతపోతారు. ప్రవక్తలు విస్మయానికి గురౌతారు.”
“Saa da no,” Awurade na ose, “ɔhene no ne adwumayɛfo no bɛbɔ hu, asɔfo no bo betu, na adiyifo no ho bedwiriw wɔn.”
10 ౧౦ అప్పుడు నేనిలా అన్నాను “అయ్యో, ప్రభూ యెహోవా! ‘మీకు క్షేమంగా ఉంటుంది’ అని చెప్పి యెరూషలేము ప్రజలను మోసం చేశావు. ఇప్పుడేమో ఖడ్గం వారి ప్రాణాల మీద పడి హతం చేస్తూ ఉంది.”
Afei, mekae se, “Aa, Otumfo Awurade, woadaadaa nnipa yi ne Yerusalem, wokae se, ‘Mubenya asomdwoe,’ wɔ bere a afoa da yɛn mene mu.”
11 ౧౧ ఆ రోజుల్లో ఆ ప్రజలకు యెరూషలేము నివాసుల గూర్చి ఇలా చెబుతారు. “ఎడారిలో చెట్లులేని మెరకల నుండి నా ప్రజల పైకి వడగాలి వీస్తున్నది. అది తూర్పార పట్టడానికో, శుద్ధి చేయడానికో కాదు.
Saa bere no wɔbɛka akyerɛ nnipa yi ne Yerusalem se, “Mframa a emu yɛ hyew bɛbɔ afi nkoko wosee a ɛwɔ nweatam so aba me nkurɔfo so, ɛnyɛ nea ɛpo ho anaa ehuhuw so;
12 ౧౨ నా మాట చొప్పున అంతకంటే మరింత బలమైన గాలి వీస్తుంది. ఇప్పుడు వారి మీదికి రాబోయే తీర్పులు ప్రకటిస్తాను.”
mframa a ano yɛ den boro saa no fi me nkyɛn. Afei mepae mu ka mʼatemmu a etia wɔn.”
13 ౧౩ ఆయన రాక మేఘాలు కమ్ముతున్నట్టుగా ఉంది. ఆయన రథాలు సుడిగాలిలాగా, ఆయన గుర్రాలు గరుడ పక్షుల కంటే వేగంగా పరుగెత్తుతున్నాయి. అయ్యో, మనం నాశనమై పోయాం.
Hwɛ! ɔreba sɛ omununkum, ne nteaseɛnam reba sɛ mfɛtɛ, nʼapɔnkɔ ho yɛ hare sen akɔre. Yennue! Yɛawu!
14 ౧౪ యెరూషలేమా, నీకు విమోచన కావాలంటే నీ హృదయంలోని చెడుగును కడుక్కో. ఎంతకాలం పాపం చేయాలని కోరుకుంటావు?
Yerusalem, yi bɔne fi wo koma mu na woanya nkwa. Wode adwemmɔne bɛhyɛ wo mu akosi da bɛn?
15 ౧౫ దాను పట్టణం నుండి ఒకడు ప్రకటన చేస్తున్నాడు, కీడు రాబోతున్నదని ఎఫ్రాయిము కొండల్లో ఒకడు చాటిస్తున్నాడు,
Nne bi rebɔ amanneɛ fi Dan, ɛrebɔ amanehunu ho dawuru fi Efraim nkoko so.
16 ౧౬ దూరదేశం నుండి ముట్టడి వేసేవారు వచ్చి “యూదా పట్టణాలను పట్టుకోబోతున్నాం” అని పెద్దపెద్ద కేకలు వేస్తున్నారని యెరూషలేముకు, ఇతర రాజ్యాలకు ప్రకటించండి.
“Monka eyi nkyerɛ aman no, mommɔ no dawuru nkyerɛ Yerusalem se, ‘Atuafo dɔm fi akyirikyiri asase bi so reba, wɔma ɔko nteɛmu so de tia Yuda nkuropɔn.
17 ౧౭ యూదా నా మీద తిరుగుబాటు చేసింది కాబట్టి వారు పొలాన్ని కావలి కాసేవారిలాగా యూదాను కూడా ముట్టడిస్తారు. ఇదే యెహోవా వాక్కు.
Wotwa ne ho hyia sɛ mmarima a wɔrewɛn afuw, efisɛ watew me so atua,’” sɛɛ na Awurade se.
18 ౧౮ నీ ప్రవర్తన, నీ క్రియలే ఈ ఆపదను నీ మీదికి రప్పించాయి. నీ చెడుతనమే దీనికి కారణం. ఇది చేదుగా ఉండి నీ హృదయాన్ని గట్టిగా తాకుతున్నది కదా?
“Wo ankasa abrabɔ ne nneyɛe, na ɛde eyi aba wo so. Eyi yɛ wʼasotwe. Ɛyɛ nwen! Ɛwowɔ koma!”
19 ౧౯ నా హృదయం! నా హృదయం! వేదనతో నా అంతరంగం అల్లాడుతూ ఉంది. నా గుండె బాధగా కొట్టుకుంటూ ఉంది. తాళలేకపోతున్నాను. బాకానాదం వినబడుతున్నది, యుద్ధ ఘోష విని నేను తట్టుకోలేను.
Ao, mʼahoyeraw, mʼahoyeraw! midi me mu yaw. Me koma mu yawdi! Me koma bɔ kitirikitiri wɔ me mu, mintumi nyɛ komm. Efisɛ, mate torobɛnto no nnyigye; mate ɔko frɛ no.
20 ౨౦ కీడు తరవాత కీడు వస్తూ ఉంది. దేశమంతా నాశనమైంది. హటాత్తుగా నా గుడారాలు, క్షణాల్లో వాటి తెరలు పాడైపోయాయి.
Amanehunu di amanehunu akyi; asase no nyinaa asɛe. Wɔasɛe me ntamadan prɛko pɛ, ne me hintabea mpofirim.
21 ౨౧ ఇంకెన్నాళ్లు నేను ధ్వజాన్ని చూస్తూ, బాకానాదం వింటూ ఉండాలి?
Ɛsɛ sɛ mehwɛ ɔko frankaa no na mitie torobɛnto no nnyigye kosi da bɛn?
22 ౨౨ నా ప్రజలు మూర్ఖులు. వారికి నేను తెలియదు. వారు తెలివితక్కువ పిల్లలు, వారికి గ్రహింపు లేదు. చెడు జరిగించడంలో వారికి నైపుణ్యం ఉంది గానీ మంచి చేయడం వారికి అసలు తెలియదు.
“Me nkurɔfo yɛ nkwaseafo; wonnim me. Wɔyɛ mma a wonni adwene; wɔnte hwee ase. Wɔwɔ bɔneyɛ ho nyansa; na wonnim sɛnea wɔyɛ papa.”
23 ౨౩ నేను భూమిని చూశాను. అది ఆకారం కోల్పోయి శూన్యంగా ఉంది. ఆకాశాన్ని చూశాను, అక్కడ వెలుగు లేదు.
Mehwɛɛ asase no, na enni bɔbea, na ɛda mpan; mehwɛɛ ɔsorosoro, na wɔn hann no nni hɔ.
24 ౨౪ పర్వతాలను చూస్తే అవి కంపిస్తూ ఉన్నాయి, కొండలన్నీ కదిలిపోతున్నాయి.
Mehwɛɛ mmepɔw no, na wɔrewosowosow, na nkoko no nyinaa rehinhim.
25 ౨౫ నేను చూసినప్పుడు మనిషి ఒక్కడు కూడా లేడు. ఆకాశపక్షులన్నీ ఎగిరిపోయాయి.
Mehwɛe, na nnipa nni hɔ; wim anomaa biara atu kɔ.
26 ౨౬ నేను చూస్తూ ఉండగా యెహోవా కోపాగ్నికి ఫలవంతమైన భూమి ఎడారిలా మారింది. అందులోని పట్టణాలన్నీ పూర్తిగా కూలిపోయాయి.
Mehwɛe, na nsasebere no adan nweatam na ne nkurow nyinaa asɛe wɔ Awurade anim, wɔ nʼabufuwhyew ano.
27 ౨౭ యెహోవా చెప్పేదేమంటే, ఈ దేశమంతా పాడైపోతుంది. అయితే దాన్ని పూర్తిగా నాశనం చేయను.
Sɛnea Awurade se: “Wɔbɛsɛe asase no nyinaa; mmom, merensɛe no korakora.
28 ౨౮ దాని విషయం భూమి దుఃఖిస్తుంది. ఆకాశం చీకటి కమ్ముతుంది. నేను నిర్ణయించాను, వెనక్కి తగ్గను. పశ్చాత్తాప పడను, దాన్ని రద్దు చేయను.
Enti asase bedi awerɛhow na ɔsorosoro beduru sum, efisɛ makasa na merentwe nsan; masi gyinae na merennan no.”
29 ౨౯ రౌతులూ విలుకాళ్ళూ చేసే శబ్దం విని పట్టణ ప్రజలంతా పారిపోయి అడవుల్లో దూరుతున్నారు, ఉన్నత ప్రాంతాల్లో రాళ్ళ మధ్యకు ఎక్కుతున్నారు. ప్రతి పట్టణం నిర్మానుష్యంగా మారింది. వాటిలో ఎవరూ నివసించడం లేదు.
Apɔnkɔsotefo ne agyantowfo nnyigyei ma kurow biara sofo guan. Ebinom kɔhyɛ nkyɛkyerɛ mu, ebinom foro kɔ abotan mu. Nkurow no nyinaa so adeda mpan; na obiara nte so.
30 ౩౦ నీవు ధ్వంసం అయ్యావు. ఏమి చేయగలవు? ఎరుపు రంగు బట్టలు కట్టుకుని, బంగారు నగలు ధరించి, కాటుకతో నీ కళ్ళు పెద్దగా కనబడేలా చేసుకున్నావు, నీ అలంకరణ అంతా వ్యర్ధం. ఇంతకు ముందు నిన్ను ప్రేమించిన వారు నిన్ను తృణీకరిస్తారు. పైగా వారే నిన్ను చంపడానికి చూస్తారు.
Dɛn na woreyɛ, wo a wɔasɛe wo? Adɛn na wufura ɔkɔben de sikakɔkɔɔ agude asiesie wo ho? Adɛn na wode nnuru keka wʼani? Wohyehyɛ wo ho kwa. Wʼadɔfo bu wo animtiaa; wɔrehwehwɛ wo akum wo.
31 ౩౧ స్త్రీ పురిటినొప్పులతో కేకలు వేస్తున్నట్టు, తొలి కాన్పులో స్త్రీ కేకలు వేస్తున్నట్టు సీయోను కన్య “అయ్యో, నాకు బాధ! నా హంతకుల చేతిలో చిక్కి నేను మూర్చబోతున్నాను” అని ఎగశ్వాసతో చేతులు చాస్తూ వేస్తున్న కేకలు నాకు వినబడుతున్నాయి.
Mete osu bi te sɛ ɔbea a ɔwɔ awoko mu, apinisi te sɛ ɔbea a ɔrewo nʼabakan, Ɔbabea Sion resu te sɛ nea osi apini, ɔtrɛw ne nsa mu na ɔreka se, “Afei de meretɔ piti; wɔde me nkwa ama awudifo.”

< యిర్మీయా 4 >