< యిర్మీయా 33 >
1 ౧ యిర్మీయా ఇంకా చెరసాలలో ఉన్నప్పుడు యెహోవా వాక్కు రెండోసారి అతనికి ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
І було Єремії Господнє слово вдру́ге, коли він ще за́мкнений був на подвір'ї в'язни́ці, говорячи:
2 ౨ “సృష్టికర్త అయిన యెహోవా, రూపించిన దాన్ని స్థిరపరిచే యెహోవా, యెహోవా అనే పేరు గలవాడు ఇలా అంటున్నాడు,
„Так говорить Господь, що чинить оце, Господь, що вформо́вує це, щоб поставити міцно оце, — Господь Його Йме́ння:
3 ౩ నాకు మొర పెట్టు, అప్పుడు నేను నీకు జవాబిస్తాను. నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులు, నీకు అర్థం కాని మర్మాలు నీకు వివరిస్తాను.
Покли́куй до Мене — і тобі відпові́м, і тобі розповім про велике та незрозуміле, чого ти не знаєш!
4 ౪ ముట్టడి దిబ్బల వలనా, ఖడ్గం వలనా నాశనమైన పట్టణంలోని యూదా రాజుల గృహాల విషయంలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు.
Бо так промовляє Господь, Бог Ізраїлів, про доми́ цього міста й про доми́ царів Юди, що їх поруйновано на оборо́нні вали́, —
5 ౫ ‘యుద్ధం చెయ్యడానికి కల్దీయులు వస్తున్నారు. నా ఉగ్రతను బట్టి, నా ఆగ్రహాన్ని బట్టి, తమ దుష్టత్వం కారణంగా నేను ఈ పట్టణం నుండి ముఖం తిప్పేసుకున్నందు వల్ల హతమయ్యే ప్రజల శవాలతో ఆ ఇళ్ళను నింపడానికి వారు వస్తున్నారు.
приходять вони воювати з халдеями, щоб доми́ понапо́внювати лю́дськими тру́пами, що вра́зив Я гнівом Своїм та люттю Своєю, і сховав Я від міста оцього обличчя Своє за все їхнє зло:
6 ౬ కాని, చూడు, నేను ఆరోగ్యం, స్వస్థత తీసుకొస్తాను. నేను వాళ్ళను స్వస్థపరిచి వాళ్ళను సమృద్ధిలోకి, శాంతిలోకి, నమ్మకత్వంలోకి తీసుకొస్తాను.
Ось Я йому ви́рощу шкурку на рані, й дам ліки, та їх уздоро́влю, і відкрию багатство споко́ю та правди для них!
7 ౭ యూదా, ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళ భాగ్యం మళ్ళీ తీసుకొస్తాను. ఆరంభంలో ఉన్నట్టు వాళ్ళను నిర్మాణం చేస్తాను.
І Я поверну́ долю Юди, і долю Ізраїля, і їх розбудую, немов напоча́тку.
8 ౮ అప్పుడు వాళ్ళు నాకు విరోధంగా చేసిన దోషాల నుంచి వాళ్ళను పవిత్రం చేస్తాను. నాకు విరోధంగా చేసిన వాళ్ళ దోషాలనూ తిరుగుబాటునూ క్షమిస్తాను.
І очищу Я їх з їхньої провини всілякої, що нагріши́ли Мені, і проба́чу всі їхні провини, яки́ми нагрішили Мені, та відпа́ли від Мене.
9 ౯ నేను వాళ్ళ కోసం చెయ్యబోతున్న మంచి సంగతులు విన్న భూజనులందరి ఎదుట, వాళ్ళు నా ఆనందానికి, స్తోత్ర గీతానికి, ఘనతకు కారణంగా ఉంటారు. నేను వారికి ఇచ్చే మంచి విషయాలు, శాంతి కారణంగా వాళ్ళు భయపడతారు.’”
І Єрусалим Мені стане за радісне йме́ння, за хвалу́ та пишно́ту всім лю́дям землі, що почують про все те добро́, що зробив Я для них! І вони полякаються та затремтя́ть через все те добро та ввесь спо́кій, який Я для нього вчинив!
10 ౧౦ యెహోవా ఇలా అంటున్నాడు. “‘ఇది నివాసయోగ్యం కాదు, యూదా పట్టణాల్లో మనుషులు లేరు, జంతువులు లేవు, యెరూషలేము వీధుల్లో జనంగానీ, జంతువులుగానీ లేవు’ అని మీరు చెప్పే ఈ స్థలాల్లోనే,
Так говорить Господь: Ще буде почутий на місці оцьо́му, — про яке ви говорите: „Воно поруйноване, так що немає люди́ни й немає скотини“, — у містах Юди й на вулицях Єрусалиму, спусто́шених так, що немає люди́ни, й немає мешка́нця, й немає скотини, —
11 ౧౧ సంతోష స్వరం, ఆనంద శబ్దం, పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు స్వరాలు ఇలా అంటాయి, ‘సైన్యాలకు అధిపతి అయిన యెహోవాకు స్తుతి చెల్లించండి, యెహోవా మంచివాడు, ఆయన నిబంధనా నమ్మకత్వం నిరంతరం ఉంటుంది.’ స్తుతి అర్పణ నా మందిరంలోకి తీసుకు రండి, ఎందుకంటే ముందు ఉన్నట్టుగానే ఈ దేశపు భాగ్యం మళ్ళీ దానికి కలుగజేస్తాను,” అని యెహోవా అంటున్నాడు.
радісний голос та голос веселий, голос молодого та голос молодої, голос тих, що говорять: „Хваліть Господа Саваота, бо добрий Господь, бо навіки Його́ милосердя!“що жертву хвали́ до Господнього дому приносять, бо Я поверну́ долю Кра́ю цього, як було напоча́тку, говорить Господь!
12 ౧౨ సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు “మనుషులు, జంతువులు లేక పాడైపోయిన ఈ పట్టణాలు, కాపరులు తమ గొర్రెలను మేపే ప్రాంతాలుగా, వాటిని విశ్రమింపజేసే ప్రదేశాలుగా ఉంటాయి.
Так говорить Господь Саваот: Ще буде на місці оцьо́му спусто́шеному, що немає нічого воно від люди́ни та аж до скотини, та по містах його всіх — ще буде пасо́висько для пастухів, куди приведу́ть вони че́реду на відпочи́нок!
13 ౧౩ మన్య పట్టణాల్లో, మైదానపు పట్టణాల్లో, దక్షిణ దేశపు పట్టణాల్లో, బెన్యామీను దేశంలో, యెరూషలేము ప్రాంతంలో, యూదా పట్టణాల్లో మందలు లెక్కించుకుంటూ తిరుగుతారు.”
У містах у горі́шніх, у містах до́лішніх, і в півде́нних містах, і в Веніяминовому кра́ї, і в околицях Єрусалиму, і в містах Юдиних ще прохо́дитиме череда через руки рахуючого, говорить Господь!
14 ౧౪ యెహోవా వాక్కు ఇదే. “చూడు! ఇశ్రాయేలు, యూదా ప్రజలకు నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చే రోజులు వస్తున్నాయి.
Ось дні настаю́ть, — говорить Господь, — і Я ви́повню добре те слово, що Я провіща́в про Ізраїлів дім і про дім Юдин:
15 ౧౫ ఆ రోజుల్లో, ఆ సమయంలో నేను దావీదు కోసం నీతి చిగురు మొలిపిస్తాను. అతడు దేశంలో నీతి న్యాయాలను జరిగిస్తాడు.
тими дня́ми та ча́су того́ Я Давидові зрощу́ Пагінця́ справедливости, — Він буде чини́ти на землі правосуддя та правду!
16 ౧౬ ఆ రోజుల్లో యూదా వాళ్ళు రక్షణ పొందుతారు. యెరూషలేము నివాసులు సురక్షితంగా ఉంటారు. ‘యెహోవాయే మనకు నీతి’ అని యెరూషలేముకు పేరు ఉంటుంది.”
Юда буде спасе́ний в тих днях, а Єрусалим буде жити безпечно, і його будуть кликати так: „Господь — наша правда!“
17 ౧౭ ఎందుకంటే, యెహోవా ఇలా అంటున్నాడు “ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోడానికి దావీదు సంతతివాడు ఒకడు లేకుండా పోడు,
Бо так промовляє Господь: Нема перево́ду Давидовим му́жам, що мають сидіти на троні дому Ізраїлевого,
18 ౧౮ నా సన్నిధిలో నిత్యం దహన బలులు అర్పించడానికీ, నైవేద్యాలు అర్పించడానికీ, ధాన్య అర్పణలు అర్పించడానికీ యాజకులైన లేవీయుల్లో ఒకడు ఎప్పుడూ లేకుండా ఉండడు.”
і нема перево́ду в Левитів — священиків перед обличчям Моїм тому му́жеві, що буде прино́сити цілопа́лення, і спалювати хлібну жертву, і прино́сити жертву всі дні!“
19 ౧౯ యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,
І було слово Господа до Єремії таке:
20 ౨౦ యెహోవా ఇలా అంటున్నాడు. “దివారాత్రులు, వాటి సమయాల్లో అవి ఉండకుండా నేను పగటికి చేసిన నిబంధన, రాత్రికి చేసిన నిబంధన మీరు వ్యర్ధం చెయ్యగలిగితే,
„Так говорить Господь: Якщо знищите ви заповіта Мого щодо дня та Мого заповіта щодо ночі, щоб не було́ дня та ночі в їхньому ча́сі,
21 ౨౧ అప్పుడు, నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుని పాలించే వారసుడు అతనికి ఉండకుండా మానడని అతనితో, నా సేవకులైన లేవీయులతో, యాజకులతో నేను చేసిన నా నిబంధన వ్యర్ధం అవుతుంది.
то знищений буде також заповіт Мій з Давидом, рабом Моїм, щоб він сина не мав, який не царював би на троні його, і з Левитами-священиками, слугами Моїми!
22 ౨౨ ఆకాశ నక్షత్రాలు, సముద్రపు ఇసుక రేణువులు లెక్కపెట్టడం సాధ్యం కానట్టే, నా సేవకుడైన దావీదు సంతానాన్ని, నాకు సేవ చేసే లేవీయులను లెక్క పెట్టలేనంతగా నేను అధికం చేస్తాను.”
І як незчисле́нні ті зо́рі небесні, а мо́рський пісок незміре́нний, так помно́жу насіння Давида, Мого раба, та Левитів, що служать Мені!“
23 ౨౩ యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,
І було слово Господа до Єремії таке:
24 ౨౪ తాను ఏర్పరచుకున్న రెండు వంశాలను యెహోవా తిరస్కరించాడు, నా ప్రజలు ఇకమీదట తమ దృష్టిలో ఒక జనాంగంగా ఉండరు, అని, ఈ రకంగా నా ప్రజలను తృణీకరిస్తూ ఈ ప్రజలు చెప్పుకునే మాట గురించి నువ్వు ఆలోచించలేదా?
„Хіба ж ти не завва́жив, як наро́д цей казав був, говорячи: „Оби́два ті ро́ди, яких Господь вибрав, відкинув Він їх?“І наро́дом Моїм вони не́хтують, наче б не був він уже перед ними наро́дом.
25 ౨౫ యెహోవానైన నేను ఇలా అంటున్నాను, “పగలు గురించి, రాత్రి గురించి, నేను చేసిన నిబంధన నిలకడగా ఉండకపోతే,
Так говорить Господь: Якщо заповіта Мого щодо дня та щодо ночі нема, якщо Я уставів для неба й землі не поклав,
26 ౨౬ భూమ్యాకాశాలను గురించిన నిబంధన నిలిచి ఉండకపోతే, అప్పుడు మాత్రమే అబ్రాహాము ఇస్సాకు, యాకోబుల సంతానాన్ని పరిపాలించడానికి అతని సంతాన సంబంధి అయిన వ్యక్తిని ఏర్పరచుకోకుండా, నేను యాకోబు సంతానంలోని నా సేవకుడైన దావీదు సంతానాన్ని తృణీకరిస్తాను. కచ్చితంగా నేను వాళ్ళ పట్ల కనికరం చూపించి వాళ్ళ భాగ్యం వాళ్లకు మళ్ళీ తీసుకొస్తాను.”
то відки́ну й насіння Якова та раба Мого Давида, щоб не брати володарі́в із насіння його для насіння Авраама, Ісака та Якова. Та не буде того, — бо верну́ їхню долю, й помилую їх!“