< యిర్మీయా 32 >

1 యూదా రాజైన సిద్కియా పాలన పదో సంవత్సరంలో, అంటే, నెబుకద్నెజరు ఏలుబడి 18 వ సంవత్సరంలో యెహోవా దగ్గర నుంచి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.
The word that came to Jeremiah from the Lord in the tenth year of Zedekiah the king of Judah, which is the eighteenth year of Nebuchadrezzar.
2 ఆ కాలంలో బబులోను రాజు సైన్యం యెరూషలేముకు ముట్టడి వేస్తూ ఉన్నప్పుడు ప్రవక్త అయిన యిర్మీయా యూదా రాజు గృహ ప్రాంగణంలో ఖైదీగా ఉన్నాడు.
And at that time the king of Babylon's army was besieging Jerusalem; and Jeremiah the prophet was shut up in the court of the prison, which was in the house of the king of Judah;
3 యూదా రాజైన సిద్కియా అతణ్ణి బంధించి, అతనితో మాట్లాడుతూ “నువ్వు ఇలా ఎందుకు ప్రవచిస్తున్నావు?” అని అడిగాడు. అందుకు అతడు “యెహోవా ఇలా అంటున్నాడు, ‘చూడు, ఈ పట్టణాన్ని బబులోను రాజు చేతికి అప్పగిస్తాను, అతడు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు,
Because Zedekiah the king of Judah had shut him up, saying, Wherefore art thou prophesying, saying, Thus hath said the Lord, Behold, I will give up this city into the hand of the king of Babylon, and he shall capture it.
4 యూదా రాజైన సిద్కియా కల్దీయుల చేతిలోనుంచి తప్పించుకోలేడు. ఎందుకంటే ఇప్పటికే అతణ్ణి బబులోను రాజు చేతికి అప్పగించడం జరిగింది. అతని నోరు రాజు నోటితో మాట్లాడుతుంది. అతని కళ్ళు రాజు కళ్ళను చూస్తాయి.
And Zedekiah the king of Judah shall not escape out of the hand of the Chaldeans, because he shall surely be given up into the hand of the king of Babylon, and his mouth shall speak to his mouth, and his eyes shall behold his eyes;
5 సిద్కియా బబులోను వెళ్లి నేను అతని పట్ల ఏదో ఒకటి జరిగించే వరకు అక్కడే ఉంటాడు. మీరు కల్దీయులతో యుద్ధం చేశారు కాబట్టి మీరు జయం పొందరు.’” ఇది యెహోవా వాక్కు.
And to Babylon shall he lead Zedekiah, and there shall he remain until I think of him, saith the Lord: though ye fight with the Chaldeans, ye shall not prosper.
6 యిర్మీయా ఇలా అన్నాడు. “యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,
And Jeremiah said, The word of the Lord came unto me, saying,
7 చూడు, మీ బాబాయి షల్లూము కొడుకు హనమేలు నీ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, ‘అనాతోతులో ఉన్న నా భూమిని కొనుక్కో. ఎందుకంటే దాన్ని కొనుక్కునే హక్కు నీకే ఉంటుంది.’”
Behold, Chanamel the son of Shallum thy uncle is coming unto thee, saying, Buy for thyself my field that is in 'Anathoth; for unto thee belongeth the right of redemption to buy it.
8 అప్పుడు, యెహోవా ప్రకటించినట్టే, మా బాబాయి కొడుకు హనమేలు చెరసాల ప్రాంగణంలో ఉన్న నా దగ్గరికి వచ్చి, నాతో ఇలా అన్నాడు. “బెన్యామీను దేశంలో అనాతోతులో ఉన్న నా భూమిని నీ కోసం కొనుక్కో. ఎందుకంటే దాని మీద వారసత్వపు హక్కు నీదే.” అప్పుడు ఇది యెహోవా వాక్కు అని నాకు తెలిసింది.
And there came to me Chanamel my uncle's son according to the word of the Lord into the court of the prison, and he said unto me, Buy, I pray thee, my field, that is in 'Anathoth, which is in the land of Benjamin; for to thee belongeth the right of inheritance, and to thee belongeth the redemption, buy it for thyself: then did I know that it was the word of the Lord.
9 కాబట్టి, మా బాబాయి కొడుకు హనమేలు పొలం కొని, 17 తులాల వెండి తూచి అతనికిచ్చాను.
And I bought the field from Chanamel my uncle's son, that is in 'Anathoth; and I weighed out unto him the money, seven shekels, and ten pieces of silver.
10 ౧౦ అప్పుడు నేను దాన్ని తోలు చుట్ట మీద రాసి ముద్ర వేసి సాక్షుల సంతకాలు పెట్టించుకున్నాను. ఆ తరువాత వెండిని తూచి ఇచ్చాను.
And I wrote it in a deed, and sealed it, and had it certified by witnesses, and weighed the money in balances.
11 ౧౧ ఆ తరువాత ఆజ్ఞల, చట్టాల ప్రకారం ముద్ర ఉన్న, ముద్ర లేని దస్తావేజులను తీసుకున్నాను.
And I took the deed of the purchase, both that which was sealed, according to the law and custom, and that which was open;
12 ౧౨ అప్పుడు మా బాబాయి కొడుకు హనమేలు ఎదుట, ఆ రాత పత్రంలో రాసిన సాక్షుల ఎదుట, చెరసాల ప్రాంగణంలో కూర్చున్న యూదులందరి ఎదుట, నేను మహసేయా కొడుకైన నేరీయా కొడుకు బారూకుకు ఆ దస్తావేజులు అప్పగించి,
And I gave the deed of the purchase unto Baruch the son of Neriyah, the son of Machseyah, before the eyes of Chanamel my kinsman, and before the eyes of the witnesses that had signed the deed of the purchase, before the eyes of all the Jews that were sitting in the court of the prison.
13 ౧౩ వాళ్ళ కళ్ళ ఎదుట బారూకుకు ఇలా ఆజ్ఞాపించాను,
And I charged Baruch before their eyes, saying,
14 ౧౪ “ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, ‘కొనుగోలు రసీదుతో పాటు ఈ రాత ప్రతులు, అంటే, ముద్ర వేసిన రాత పత్రం, ముద్ర లేని రాత పత్రం తీసుకుని, అవి చాలా కాలం ఉండేలా వాటిని కొత్త కుండలో ఉంచు.’
Thus hath said the Lord of hosts, the God of Israel, Take these deeds, this deed of the purchase, both the sealed, and this open deed, and place them in an earthen vessel, in order that they may last many days.
15 ౧౫ ఇశ్రాయేలు దేవుడూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా అంటున్నాడు, ‘ఇల్లు, పొలాలు, ద్రాక్షతోటలు మళ్ళీ ఈ దేశంలో కొనడం జరుగుతుంది.’”
For thus hath said the Lord of hosts, the God of Israel, Yet again shall there be bought houses and fields and vineyards in this land.
16 ౧౬ నేరీయా కొడుకు బారూకు చేతికి ఆ రసీదును నేను అప్పగించిన తరువాత, నేను యెహోవాకు ప్రార్థన చేసి ఇలా అన్నాను,
And I prayed to the Lord after I had delivered the deed of the purchase unto Baruch the son of Neriyah, saying,
17 ౧౭ “అయ్యో! ప్రభువైన యెహోవా! చూడు! కేవలం నువ్వే నీ గొప్ప బలంతోను, ఎత్తిన నీ చేతితోనూ భూమ్యాకాశాలను సృష్టించావు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు.
Ah Lord Eternal! behold, it is thou that hast made the heavens and the earth by thy great power and by thy outstretched arm; nothing is too wonderful for thee;
18 ౧౮ నువ్వు వేవేల మందికి నీ నిబంధనా నమ్మకత్వం కనపరుస్తావు. తండ్రుల దోషం వాళ్ళ తరువాత వాళ్ళ పిల్లల ఒడిలో వేస్తావు. నువ్వు గొప్ప శక్తిగల దేవుడవు. సేనల ప్రభువైన యెహోవా అని నీకు పేరు.
Thou exercisest kindness unto the thousandth [generation], and recompensest the iniquity of the fathers unto the bosom of their children after them; [thou art] the Great, the Mighty God, the Lord of hosts is his name;
19 ౧౯ జ్ఞానంలో, శక్తిగల కార్యాలు చెయ్యడంలో నువ్వు గొప్పవాడివి. ప్రతివాడి పనులను బట్టి, ప్రవర్తనను బట్టి వాళ్లకు తగినది ఇవ్వడానికి, తెరిచిన నీ కళ్ళు ప్రజలందరి మార్గాలు చూస్తున్నాయి.
Great in counsel, and mighty in execution: [thou] whose eyes are open over all the ways of the sons of man, to give unto every one according to his ways, and according to the fruit of his doings;
20 ౨౦ నువ్వు ఐగుప్తు దేశంలో చేసినట్టు ఈరోజు వరకూ ఇశ్రాయేలు వాళ్ళ మధ్య, ఇతర మనుషుల మధ్య సూచక క్రియలు, గొప్ప కార్యాలు చేస్తూ నీ పేరు ప్రసిద్ధి చేసుకున్నావు.
Who hast displayed signs and wonders in the land of Egypt, up to this day, and in Israel, and among other men; and thou hast made thyself a name, as it is at this day;
21 ౨౧ సూచక క్రియలు, గొప్ప కార్యాలు జరిగిస్తూ మహా బలం కలిగి, చాపిన చేతులతో మహాభయం పుట్టించి, ఐగుప్తు దేశంలోనుంచి నీ ప్రజలను బయటకు తీసుకొచ్చావు.
And thou didst bring forth thy people Israel out of the land of Egypt with signs, and with wonders, and with a strong hand, and with an outstretched arm, and with great terror;
22 ౨౨ ‘మీకు ఇస్తాను’ అని వాళ్ళ పితరులకు ప్రమాణం చేసి, పాలు తేనెలు ప్రవహించే ఈ దేశాన్ని వాళ్లకు ఇచ్చావు.
And thou gavest them this land, which thou hadst sworn to their fathers to give unto them, a land flowing with milk and honey;
23 ౨౩ కాబట్టి, వాళ్ళు ప్రవేశించి, దాన్ని సొంతం చేసుకున్నారు. కాని, నీ మాట వినలేదు. నీ ధర్మశాస్త్రం అనుసరించలేదు. చెయ్యాలని వాళ్లకు నువ్వు ఆజ్ఞాపించిన వాటిలో దేన్నీ చెయ్య లేదు. గనుక, నువ్వు ఈ విపత్తు వాళ్ళ మీదకి రప్పించావు.
And they came in, and took possession of it; but they hearkened not to thy voice, and in thy law they did not walk; all that thou hadst commanded them to do they did not do: and thou hast therefore caused all this evil to befall them.
24 ౨౪ చూడు! పట్టణాన్ని స్వాధీనం చేసుకోడానికి ముట్టడి దిబ్బలు పైపైకి లేస్తున్నాయి. ఖడ్గం, కరువు, తెగులు రావడం వల్ల దాని మీద యుద్ధం చేసే కల్దీయుల చేతికి ఈ పట్టణం అప్పగించడం జరిగింది. నువ్వు ఏం చెప్పావో అది జరుగుతూ ఉంది. జరుగుతున్నది నువ్వు చూస్తున్నావు.
Behold the mounds reach unto the city to capture it; and the city is given up into the hand of the Chaldeans, who fight against it, because of the sword, and of the famine, and of the pestilence: and what thou hast spoken is come to pass; and, behold, thou seest it.
25 ౨౫ అప్పుడు స్వయంగా నువ్వే నాతో ఇలా అన్నావు, కల్దీయుల చేతికి ఈ పట్టణం అప్పగించడం జరిగినా, ‘ఒక పొలం కొనుక్కుని, దానికి సాక్షంగా సాక్షులను పెట్టుకో.’”
And yet thou hast said unto me, O Lord Eternal, Buy for thyself the field for money, and have it certified by witnesses: while the city is given up into the hand of the Chaldeans.
26 ౨౬ యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
Then came the word of the Lord unto Jeremiah, saying,
27 ౨౭ “చూడు! నేను యెహోవాను. సమస్త మానవాళికి దేవుణ్ణి. చెయ్యడానికి అసాధ్యమైనది ఏదైనా నాకు ఉందా?”
Behold, I am the Lord, the God of all flesh: shall any thing be too wonderful for me?
28 ౨౮ కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు. “చూడు, నేను ఈ పట్టణాన్ని కల్దీయుల చేతికి, బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగించబోతున్నాను. అతడు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు.
Therefore thus hath said the Lord, Behold, I will give up this city into the hand of the Chaldeans, and into the hand of Nebuchadrezzar the king of Babylon, and he shall capture it:
29 ౨౯ ఈ పట్టణం మీద యుద్ధం చేసే కల్దీయులు వచ్చి, ఈ పట్టణానికి నిప్పంటించి, ఏ మిద్దెల మీదైతే ప్రజలు బయలుకు ధూపార్పణ చేసి అన్యదేవుళ్ళకు పానార్పణలు అర్పించి నన్ను రెచ్చగొట్టారో ఆ మిద్దెలన్నిటినీ కాల్చేస్తారు.
And the Chaldeans, that fight against this city, shall come and set this city on fire, and burn it, with the houses upon the roofs of which they have offered incense unto Ba'al, and have poured out drink-offerings unto other gods, in order to provoke me to anger;
30 ౩౦ ఎందుకంటే ఇశ్రాయేలు వాళ్ళు, యూదా వాళ్ళు అయిన ఈ ప్రజలు, కచ్చితంగా తమ చిన్నతనం నుంచి నా ఎదుట చెడుతనమే చేస్తూ వచ్చారు. తమ చేతులతో వాళ్ళు చేసిన పనుల వల్ల వాళ్ళు కచ్చితంగా నాకు కోపమే పుట్టించారు.” ఇది యెహోవా వాక్కు.
For the children of Israel and the children of Judah have been doing only what is evil in my eyes from their youth; for the children of Israel have been only provoking me to anger with the work of their hands, saith the Lord.
31 ౩౧ “ఎందుకంటే, ఇశ్రాయేలు వాళ్ళు, యూదా వాళ్ళు. వాళ్ళ రాజులు, వాళ్ళ ప్రధానులు, వాళ్ళ యాజకులు, వాళ్ళ ప్రవక్తలు, యూదాలోనూ, యెరూషలేములోనూ ఉన్న ప్రజలందరూ నన్ను రెచ్చగొట్టే చెడు ప్రవర్తన అంతటిని బట్టి,
For to excite my anger and my fury hath been unto me this city from the day that they built it, even until this day; so that I will remove it from before my presence:
32 ౩౨ ఈ పట్టణాన్ని కట్టిన రోజు నుంచి, ఇది నా ఉగ్రతను, నా కోపాన్ని రేకెత్తిస్తూనే ఉంది. ఈ రోజు వరకూ అది జరుగుతూనే ఉంది. కాబట్టి నేను నా ఎదుట నుంచి దాన్ని తొలగిస్తాను.
Because of all the wickedness of the children of Israel and of the children of Judah, which they have done to provoke me to anger, they, their kings, their princes, their priests, and their prophets, and the men of Judah, and the inhabitants of Jerusalem;
33 ౩౩ నేను ఉదయాన్నే లేచి వాళ్లకు బోధించినా వాళ్ళు నా ఉపదేశం అంగీకరించ లేదు. వాళ్ళు నా వైపు తమ ముఖం తిప్పడానికి బదులుగా తమ వీపును తిప్పారు.
And they turned unto me the back, and not the face: though [my prophets] taught them, rising up early and teaching; yet they hearkened not to receive instruction.
34 ౩౪ తరువాత వాళ్ళు నా పేరు పెట్టిన మందిరాన్ని అపవిత్రం చెయ్యడానికి దానిలో హేయమైన వాటిని పెట్టారు.
But they placed their abominations in the house, which is called by my name, to defile it.
35 ౩౫ వాళ్ళు తమ కొడుకులను, కూతుళ్ళను మొలెకుకు బలి ఇవ్వడానికి బెన్‌ హిన్నోము లోయలో ఉన్న బయలు దేవుడికి గుళ్ళు కట్టారు. ఇలా చెయ్యడానికి నేను వాళ్లకు ఆజ్ఞ ఇవ్వలేదు. యూదా వాళ్ళు పాపంలో పడి, ఇంత అసహ్యమైన పనులు చేస్తారని నా హృదయంలో ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు.
And they built the high-places of Ba'al, which are in the valley of the son of Hinnom, to cause their sons and their daughters to pass through [the fire] unto Molech; which I had not commanded them, and which had not come into my mind, to practise this abomination, in order to mislead Judah to sin.
36 ౩౬ కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు దేవుణ్ణి, యెహోవాను అయిన నేను, ఈ పట్టణం గురించి ఈ మాట చెబుతున్నాను. అది ఖడ్గంతో, కరువుతో, తెగులుతో బాధ పొందింది. దాన్ని బబులోను రాజు చేతికి అప్పగించడం జరిగింది. మీరు ఈ పట్టణం గురించి ఇలా అంటున్నారు,
But now, therefore, thus hath said the Lord, the God of Israel, concerning this city, whereof ye say, it is given up into the hand of the king of Babylon through the sword, and through the famine, and through the pestilence:
37 ౩౭ చూడు, నాకు కలిగిన కోపోద్రేకాలతో, మహా ఉగ్రతతో నేను వాళ్ళను వెళ్లగొట్టిన దేశాలన్నిటిలో నుంచి వాళ్ళను సమకూర్చి ఈ స్థలానికి మళ్ళీ తీసుకు రాబోతున్నాను. వాళ్ళు ఇక్కడ క్షేమంతో నివాసం ఉండేలా చేస్తాను.
Behold, I will gather them out of all the countries, whither I have driven them in my anger, and in my fury, and in great wrath; and I will bring them back again unto this place, and I will cause them to dwell in safety;
38 ౩౮ వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను.
And they shall be unto me for a people, and I will be unto them for a God:
39 ౩౯ వాళ్ళకూ, వాళ్ళ కొడుకులకూ మేలు కలగడానికి, వాళ్ళు నిత్యం నాకు భయపడేలా నేను వాళ్లకు ఒకే హృదయం, ఒకే మార్గం ఇస్తాను
And I will give them one heart, and one manner, to fear me at all times, that it may be well with them, and with their children after them;
40 ౪౦ నేను వాళ్ళ నుంచి తిరిగిపోకుండా ఉండేలా వాళ్లతో ఒక నిత్యమైన నిబంధన స్థిరం చేస్తాను. వాళ్లకు మేలు చేసేందుకు, వాళ్ళు నన్ను వెంబడించడం విడిచిపెట్టకుండా ఉండేలా వాళ్ళ హృదయాల్లో నా పట్ల గౌరవం కలిగిస్తాను.
And I will make with them an everlasting covenant, that I will not turn away from them, to do them good on my part; and my fear will I place in their heart, so that they may not depart from me.
41 ౪౧ వాళ్లకు మంచి చెయ్యడంలో ఆనందిస్తాను. నా నిండు హృదయంతో, నా ఉనికి అంతటితో కచ్చితంగా ఈ దేశంలో వాళ్ళను నాటుతాను.”
And I will be glad over them to do them good; and I will plant them in this land in truth, with all my heart and with all my soul.
42 ౪౨ యెహోవా ఇలా అంటున్నాడు. “నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప విపత్తు రప్పించిన విధంగానే నేను వాళ్ళ గురించి చెప్పిన మంచి అంతా వాళ్ళకు ప్రసాదిస్తాను.
For thus hath said the Lord, Just as I have brought upon this people all this great evil, so will I bring upon them all the good that I speak concerning them.
43 ౪౩ ‘ఇది పాడైపోయింది. దానిలో మనుషులు లేరు. పశువులు లేవు. ఇది కల్దీయుల వశమైపోయింది’ అని మీరు చెబుతున్న ఈ దేశంలో, అప్పుడు పొలాల విక్రయం జరుగుతుంది.
And the field shall yet be bought in this land, whereof ye say, It is desolate without man or beast, it is given up into the hand of the Chaldeans.
44 ౪౪ వాళ్ళు వెండితో పొలాలు కొని ముద్రించిన రాత పత్రాల్లో రాస్తారు. వాళ్ళు బెన్యామీను దేశంలో, యెరూషలేము ప్రాంతాల్లో, యూదా పట్టణాల్లో, మన్యంలోని పట్టణాల్లో, దక్షిణదేశపు పట్టణాల్లో సాక్షులను సమావేశపరుస్తారు. ఎందుకంటే నేను వాళ్ళ భాగ్యం వాళ్లకు మళ్ళీ తీసుకొస్తాను.” ఇది యెహోవా వాక్కు.
Men shall buy fields for money, and write it in deeds, and seal it, and certify it by witnesses, in the land of Benjamin, and in the environs of Jerusalem, and in the cities of Judah, and in the cities of the mountain, and in the cities of the lowlands, and in the cities of the south; for I will cause their captivity to return, saith the Lord.

< యిర్మీయా 32 >