< యిర్మీయా 30 >
1 ౧ ఇది యెహోవా నుంచి యిర్మీయాకు వచ్చిన వాక్కు,
Det ord, som kom til Jeramias fra Herren.
2 ౨ “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు,
Skriv alle de Ord, jeg har talet til dig, op i en Bog.
3 ౩ ‘రాబోయే రోజుల్లో నేను ఇశ్రాయేలు వాళ్ళూ, యూదా వాళ్ళైన నా ప్రజలను చెరనుంచి విడిపించి, వాళ్ళ పితరులకు నేనిచ్చిన దేశాన్ని వారు స్వాధీనం చేసుకునేలా వాళ్ళను తిరిగి రప్పిస్తాను,’ అని యెహోవానైన నేను చెప్పాను. కాబట్టి, నేను నీతో చెప్పిన మాటలన్నీ ఒక రాతచుట్టలో రాయి.”
Thi se Dage skal komme, lyder det fra HERREN, da jeg vender mit Folk Israels og Judas Skæbne, siger HERREN, og fører dem hjem til det Land, jeg gav deres Fædre, og de skal tage det i Eje.
4 ౪ యెహోవా ఇశ్రాయేలు వాళ్ళ గురించి, యూదా వాళ్ళ గురించి చెప్పిన మాటలివి.
Dette er de Ord, HERREN talede til Israel og Juda.
5 ౫ “యెహోవా ఇలా అంటున్నాడు, ‘భయంతో వణుకుతున్న స్వరం మేం విన్నాం. ఆ స్వరంలో శాంతి లేదు.
Så siger HERREN: Vi hørte et Udbrud af Skræk, af Rædsel og Ufred;
6 ౬ ప్రసూతి వేదనతో ఒక పురుషుడు బిడ్డను కనగలడా? మీరు అడిగి తెలుసుకోండి. ప్రతి యువకుడు తన నడుము మీద చేతులెందుకు పెట్టుకుంటున్నాడు? ప్రసవ వేదన పడే స్త్రీలా వాళ్ళ ముఖాలు ఎందుకు పాలిపోయాయి?
spørg og se dog til, om en Mand kan føde! Hvi ser jeg da alle Mænd med Hånd på Hofte som Kvinde i Barnsnød og alle Åsyn blegne?
7 ౭ అయ్యో, ఎంత భయంకరమైన రోజు! అలాంటి రోజు ఇంకొకటి రాదు. అది యాకోబు సంతతి వాళ్లకు ఆందోళన కలిగించే సమయం. అయినా దానిలోనుంచి అతనికి రక్షణ దొరుకుతుంది.’”
Thi stor er denne Dag, den er uden Lige, en Trængselstid for Jakob, men fra den skal han frelses.
8 ౮ సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు “ఆ రోజు, నీ మెడ మీద ఉన్న నీ కాడి విరిచి, నేను నీ బంధకాలు తెంపుతాను. ఇంక విదేశీయులు నీ చేత దాస్యం చేయించుకోరు.
På hin Dag, lyder det fra Hærskarers HERRE, vil jeg sønderbryde deres Åg og tage det af deres Hals og sprænge deres Bånd, og de skal ikke mere trælle for fremmede.
9 ౯ కాని, వాళ్ళు తమ దేవుడైన యెహోవాను ఆరాధించి, నేను వాళ్ళ మీద రాజుగా చేసే తమ రాజైన దావీదును సేవిస్తారు.
De skal tjene HERREN deres Gud og David, deres Konge, som jeg vil oprejse dem.
10 ౧౦ కాబట్టి, నా సేవకుడవైన యాకోబూ, భయపడకు, యెహోవా చేప్పేదేమంటే, ‘ఇశ్రాయేలూ, దిగులు పడకు. దూరంగా ఉన్న నిన్ను, బందీలుగా ఆ దేశంలో ఉన్న నీ సంతతి వాళ్ళను, నేను రక్షించబోతున్నాను. యాకోబు సంతతి తిరిగి వచ్చి, శాంతి కలిగి ఉంటుంది. అతడు సురక్షితంగా ఉంటాడు, భయభీతులు ఇంక ఉండవు.
Frygt derfor ikke, min Tjener Jakob, lyder det fra HERREN, og vær ikke bange, Israel; thi se, jeg frelser dig fra det fjerne og dit Afkom fra deres Fangenskabs Land; og Jakob skal vende hjem og bo roligt og trygt, og ingen skal forfærde ham.
11 ౧౧ ఎందుకంటే, నేను నీతో ఉన్నాను,’ యెహోవా వాక్కు ఇదే, ‘నిన్ను రక్షించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను ఏ దేశాల్లోకైతే చెదరగొట్టానో, ఆ దేశాలన్నిటినీ నేను సమూల నాశనం చేస్తాను. కాని, నిన్ను మాత్రం పూర్తిగా నాశనం చెయ్యను. అయితే నిన్ను తగిన క్రమశిక్షణలో పెడతాను. శిక్ష లేకుండా మాత్రం నిన్ను విడిచిపెట్టను.’
Thi jeg er med dig, lyder det fra HERREN, for at frelse dig; thi jeg vil tilintetgøre alle de Folk, blandt hvilke jeg har spredt dig, men dig vil jeg ikke tilintetgøre; jeg vil tugte dig med Måde, ikke lade dig helt ustraffet.
12 ౧౨ యెహోవా ఇలా అంటున్నాడు, ‘నీ దెబ్బ నయం కాదు. నీ గాయం మానని పుండుగా అయ్యింది.
Thi så siger HERREN: Ulægeligt er dit Brud, dit Sår er svart.
13 ౧౩ నీ పక్షంగా వాదించేవాళ్ళు ఎవరూ లేరు. నీ పుండు నయం చేసే మందు లేదు.
Ingen fører din Sag. For din Byld er ingen Lægedom, for dig ingen Helse.
14 ౧౪ నీ ప్రేమికులంతా నిన్ను మరిచిపోయారు. వాళ్ళు నీ కోసం చూడరు. ఎందుకంటే, అధికమైన నీ పాపాలనుబట్టి, నీ గొప్ప దోషాన్నిబట్టి, ఒక కఠినమైన యజమాని పెట్టే క్రమశిక్షణ కింద నిన్ను ఉంచి, ఒక శత్రువు గాయపరిచినట్టు నేను నిన్ను గాయపరిచాను.
Alle dine Venner har glemt dig, søger dig ikke, thi med Fjendeslag slog jeg dig, med skånselløs Straf, fordi din Brøde var stor, dine Synder mange.
15 ౧౫ నీ గాయాన్నిబట్టి నువ్వు సాయం కోసం అడుగుతున్నావా? నీ బాధ తీరనిది. విస్తారమైన నీ పాపాలనుబట్టి, అనేకమైన నీ దోషాలను బట్టి నేను నీకు ఇలా చేశాను.
Hvi skriger du over dit Brud, er dit Sår ulægeligt? Fordi din Brøde var stor, dine Synder mange, gjorde jeg dette imod dig.
16 ౧౬ కాబట్టి, నిన్ను దిగమింగే వాళ్ళెవరో, వాళ్ళనే దిగమింగడం జరుగుతుంది. నీ ప్రత్యర్దులందరూ బందీలుగా చెరలోకి వెళ్తారు. నిన్ను దోచుకున్నవాళ్ళు దోపుడు సొమ్ము అవుతారు. నిన్ను కొల్లగొట్టిన వాళ్ళను కొల్లసొమ్ముగా చేస్తాను.
Derfor skal alle, som fortærer dig, fortæres, alle dine Fjender, alle skal de vandre i Fangenskab; de, der plyndrer dig, skal plyndres, til Ran gør jeg alle dine Ransmænd.
17 ౧౭ నీకు స్వస్థత తీసుకొస్తాను. నీ గాయాలను స్వస్థపరుస్తాను.’” ఇదే యెహోవా వాక్కు. “ఎందుకంటే వాళ్ళు ‘సీయోను వెలి వేయబడింది. దాన్ని పట్టించుకునే వాడు లేడు’ అని నీ గురించి అన్నారు గనుక, నేను ఈ విధంగా చేస్తాను.”
Thi jeg heler dig, læger dine Sår, så lyder det fra HERREN; du kaldtes jo, Zion, "den bortstødte, som ingen søger."
18 ౧౮ యెహోవా ఇలా అంటున్నాడు “చూడు, యాకోబు నివాసస్థలాలను కరుణించి అతని గుడారాల మీద నేను కనికరం చూపిస్తాను. అప్పుడు శిథిలాల గుట్ట మీద ఒక పట్టణం నిర్మాణం అవుతుంది. ఇదివరకు ఉన్నట్టే ఒక స్థిరమైన నివాసం ఏర్పాటవుతుంది.
Så siger HERREN: Se, jeg vender Jakobs Skæbne, forbarmer mig over hans Boliger, Byen skal bygges på sin Høj, Paladset stå, bvor det stod.
19 ౧౯ అప్పుడు వాటిలోనుంచి ఒక స్తుతి కీర్తన, ఒక వేడుక శబ్దం బయటకు వస్తుంది. ప్రజలు తక్కువ సంఖ్యలో లేకుండా నేను వాళ్ళను విస్తరింపజేస్తాను. అల్పులు కాకుండా నేను వాళ్ళకు ఘనత కలుగజేస్తాను.
Fra dem skal Lovsang lyde og legendes Råb; de bliver ej færre, jeg gør dem mange; de bliver ej ringe, jeg giver dem Hæder.
20 ౨౦ వాళ్ళ ప్రజలు మునుపటిలా ఉంటారు. వాళ్ళను హింసించే వాళ్ళందరినీ నేను శిక్షించినప్పుడు, వాళ్ళ సమాజం నా ఎదుట స్థిరం అవుతుంది.
Hans Sønner skal blive som fordum, hans Menighed stå fast for mit Åsyn. Jeg hjemsøger alle, som trykker ham.
21 ౨౧ వాళ్ళ నాయకుడు వాళ్ళల్లోనుంచే వస్తాడు. నేను వాళ్ళను ఆకర్షించినప్పుడు, వాళ్ళు నన్ను సమీపించినప్పుడు, వాళ్ళ మధ్య నుంచి అతడు బయలుదేరుతాడు. నేను ఇది చెయ్యకపోతే, నన్ను సమీపించే సాహసం ఎవడు చెయ్యగలడు?” ఇది యెహోవా వాక్కు.
Hans Fyrste stammer fra ham selv, hans Hersker går frem af hans Midte. Jeg lader ham komme mig nær, han skal nærme sig mig; thi hvem ellers sætter Livet i Vov ved at nærme sig mig? lyder det fra HERREN.
22 ౨౨ “అప్పుడు మీరు నా ప్రజలుగా ఉంటారు. నేను మీ దేవుడుగా ఉంటాను.
I skal være mit Folk, og jeg vil være eders Gud.
23 ౨౩ చూడు, యెహోవా ఉగ్రత పెనుగాలిలా బయలుదేరింది. అది ఎల్లప్పుడూ వీచే పెనుగాలి. అది సుడిగాలిలా దుష్టుల తలల మీద గిరగిరా తిరుగుతుంది.
Se, HERRENs Stormvejr, Vreden er brudt løs, et hvirvlende Stormvejr; det hvirvler hen over de gudløses Hoved.
24 ౨౪ తన కార్యం జరిగించే వరకూ, తన హృదయాలోచనలు నెరవేర్చే వరకూ యెహోవా కోపాగ్ని చల్లారదు. చివరి రోజుల్లో మీరు దీన్ని అర్థం చేసుకుంటారు.”
HERRENs glødende Vrede lægger sig ikke, før han har udført og fuldbyrdet sit Hjertes Tanker; i de sidste dage skal I forstå det.