< యిర్మీయా 3 >
1 ౧ ఒక మనిషి తన భార్యను విడిచిపెట్టి ఆమెను పంపి వేస్తే ఆమె అతని దగ్గర నుండి వెళ్ళి ఇంకొకడికి భార్య అయ్యింది. అప్పుడు అతడు ఆమెను తిరిగి చేర్చుకుంటాడా? అదే జరిగితే ఆ దేశం ఎంతో అపవిత్రమవుతుంది కదా. నువ్వు అనేకమంది విటులతో వ్యభిచారం చేశావు. అయినా నా దగ్గరికి తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు.
Når en Mand frastøder sin hustru, og hun går fra ham og ægter en anden, kan hun så gå tilbage til ham? Er slig en Kvinde ej sunket til Bunds i Vanære? Og du, som boled med mange Elskere, vil tilbage til mig! så lyder det fra HERREN.
2 ౨ నీ తలెత్తి చెట్లు లేని కొండప్రదేశాలను చూడు. మనుషులు నీతో వ్యభిచారం చేయని స్థలం ఏదైనా ఉందా? ఎడారి దారిలో సంచార జాతి వాడు కాచుకుని ఉన్నట్టు నువ్వు వారి కోసం దారి పక్కన కూర్చుని ఎదురు చూశావు. నీ వ్యభిచారంతో, నీ దుష్ట ప్రవర్తనతో నువ్వు దేశాన్ని అపవిత్రం చేశావు.
Se til de nøgne Høje: Hvor mon du ej lod dig skænde? Ved Vejene vogted du på dem som Araber i Ørk. Du vanæred Landet både ved din Utugt og Ondskab,
3 ౩ కాబట్టి వానలు కురవడం లేదు. కడవరి వర్షం ఆగిపోయింది. అయినా నువ్వు కులట మొహం వేసుకుని సిగ్గు పడడం లేదు.
en Snare blev dine mange Elskere for dig. En Horkvindes Pande har du, trodser al Skam.
4 ౪ అయినా ఇప్పుడు నువ్వు “నా తండ్రీ, చిన్నప్పటి నుండి నాకు దగ్గర స్నేహితుడివి” అని నాకు మొర పెడుతున్నావు.
Råbte du ikke nylig til mig: "Min Fader! Du er min Ungdoms Ven.
5 ౫ “నువ్వు ఎల్లప్పుడూ కోపిస్తావా? ఇక నీ ఆగ్రహం మానవా?” అని అంటూనే నువ్వు చేయాలనుకున్న దుష్కార్యాలు చేస్తూనే ఉన్నావు.
Vil han evigt gemme på Vrede, bære Nag for stedse?" Se, således taler du, men øver det onde til Gavns.
6 ౬ యోషీయా రాజు పాలన సమయంలో యెహోవా నాకిలా చెప్పాడు. “ఇశ్రాయేలు ఎంత అపనమ్మకం చూపిందో చూశావా? ఆమె ఎత్తయిన ప్రతి కొండమీదికీ పచ్చని ప్రతి చెట్టు కిందికీ వెళ్ళి అక్కడ వ్యభిచారం చేస్తున్నది.
HERREN sagde til mig i Kong Josias's Dage: Så du, hvad den troløse Kvinde Israel gjorde? Hun gik op på ethvert højt Bjerg og hen under ethvert grønt Træ og bolede.
7 ౭ ఆమె వాటన్నిటినీ చేసినా ఆమెను నా దగ్గరికి తిరిగి రమ్మన్నాను కానీ ఆమె రాలేదు. ద్రోహి అయిన ఆమె సోదరి అయిన యూదా దాన్ని చూసింది.
Jeg tænkte, at hun efter at have gjort alt det vilde vende om til mig; men hun vendte ikke om. Det så hendes svigefulde Søster Juda;
8 ౮ ఇశ్రాయేలు వ్యభిచారం చేసినందుకే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు విడాకులిచ్చి పంపేశాను. విశ్వాసఘాతకురాలైన ఆమె సోదరి యూదా దాన్ని చూసి ఆమె కూడా భయం లేకుండా వ్యభిచారం చేస్తూ ఉంది.
hun så, at jeg forstødte den troløse Kvinde Israel for al hendes Hors Skyld, og at jeg gav hende Skilsmissebrev; den svigefulde Søster Juda frygtede dog ikke, men gik også hen og bolede.
9 ౯ రాళ్ళతో, మొద్దులతో విగ్రహాలను చేసుకుని, ఆమె నిర్భయంగా వ్యభిచారం చేసి దేశాన్ని అపవిత్రపరచింది.
Ved sin letsindige Bolen vanærede hun Landet og horede med Sten og Træ.
10 ౧౦ ఇంత జరిగినా విశ్వాసఘాతకురాలైన ఆమె సోదరి యూదా పైపైనే గాని తన పూర్ణహృదయంతో నా దగ్గరికి రావడం లేదు.
Og alligevel vendte den svigefulde Søster Juda ikke om til mig af hele sit Hjerte, men kun på Skrømt, lyder det fra HERREN.
11 ౧౧ కాబట్టి యూదా చేసిన ద్రోహం చూస్తే దానికంటే ఇశ్రాయేలే కొంచెం మంచిది అనిపిస్తున్నది.
Og HERREN sagde til mig: Det troløse Israels Sag står bedre end det svigefulde Judas.
12 ౧౨ నువ్వు వెళ్లి ఉత్తరం వైపుకు ఇలా ప్రకటించు, విశ్వాసం లేని ఇశ్రాయేలూ, తిరిగి రా. మీ మీద నేను కోపపడను. నేను దయగలవాణ్ణి కాబట్టి శాశ్వతంగా కోపించేవాణ్ణి కాను.” ఇదే యెహోవా వాక్కు.
Gå hen og udråb disse Ord mod Nord: Omvend dig, troløse Israel, lyder det fra HERREN; jeg vil ikke vredes på eder, thi nådig er jeg, lyder det fra HERREN; jeg gemmer ej evigt på Vrede;
13 ౧౩ నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేస్తూ, నా మాట తోసిపుచ్చి ప్రతి పచ్చని చెట్టు కిందా అన్యులతో వ్యభిచరించావు. నువ్వు నీ దోషాన్ని ఒప్పుకోవాలి. ఇదే యెహోవా వాక్కు.
men vedgå din Uret, at du forbrød dig mod HERREN din Gud; for de fremmedes Skyld løb du hid og did under hvert grønt Træ og hørte ikke min Røst, så lyder det fra HERREN.
14 ౧౪ చెడిపోయిన పిల్లలారా, తిరిగి రండి, నేను మీ యజమానిని. ఇదే యెహోవా వాక్కు ఒక్కొక్క ఊరిలోనుండి ఒకణ్ణి, ఒక్కొక్క వంశం లోనుండి ఇద్దరినీ, సీయోనుకు తీసుకొస్తాను.
Vend om, I frafaldne Søoner, lyder det fra HERREN; thi jeg er eders Herre; jeg tager eder, een fra en By og en fra en Slægt og bringer eder til Zion,
15 ౧౫ నాకిష్టమైన కాపరులను మీపైన నియమిస్తాను, వారు జ్ఞానంతో, వివేకంతో మిమ్మల్ని పాలిస్తారు.
og jeg giver eder Hyrder efter mit Sind, og de skal vogte eder med Indsigt og Kløgt.
16 ౧౬ ఆ రోజుల్లో మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరిస్తూ ఉన్నప్పుడు ప్రజలు యెహోవా నిబంధన మందసం గురించి మాట్లాడరు. అది వారి మనస్సుకు తట్టదు. దాన్ని జ్ఞాపకం చేసుకోరు. అది లేనందుకు బాధపడరు, ఇక ముందు దాన్ని తయారు చేయరు. ఇదే యెహోవా వాక్కు.
Og når I bliver mangfoldige og frugtbare i Landet i hine Dage, lyder det fra HERREN, skal de ikke mere tale om HERRENs Pagts Ark, og Tanken om den skal ikke mere opkomme i noget Hjerte; de skal ikke mere komme den i Hu eller savne den, og en ny skal ikke laves.
17 ౧౭ ఆ కాలంలో యెరూషలేమును యెహోవా సింహాసనం అంటారు. అన్యజాతులు వారి చెడ్డ హృదయాలను అనుసరించి మూర్ఖులుగా నడుచుకోక ఘనమైన యెహోవా పేరు విని యెరూషలేముకు గుంపులుగా వస్తారు.
På hin Tid skal man kalde Jerusalem HERRENs Trone, og der, til HERRENs Navn i Jerusalem, skal alle Folk strømme sammen, og de skal ikke mere følge deres onde Hjertes Stivsind.
18 ౧౮ ఆ రోజుల్లో యూదా వారూ ఇశ్రాయేలు వారూ కలిసి ఉత్తరదేశం నుండి నేను మీ పూర్వీకులకు వారసత్వంగా ఇచ్చిన దేశానికి తిరిగి వస్తారు.
I hine Dage skal Judas Hus vandre til Israels Hus, og samlet skal de drage fra Nordens Land til det Land, jeg gav deres Fædre i Eje.
19 ౧౯ నిన్ను నా కొడుకుగా చేసుకుని, ఏ జనానికీ లేనంత సుందరమైన దేశాన్ని నీకు వారసత్వంగా ఇవ్వాలని కోరుకున్నాను. నువ్వు నా తండ్రీ అని పిలుస్తూ నా వెంట రావాలని కోరుకున్నాను.
Og jeg, jeg sagde til dig: "Blandt Sønnerne sætter jeg dig, jeg giver dig et yndigt Land, Folkenes herligste Arvelod." Jeg sagde: "Kald mig din Fader, vend dig ej fra mig!"
20 ౨౦ అయినా స్త్రీ తన భర్త పట్ల అపనమ్మకం చూపినట్టు ఇశ్రాయేలు ప్రజలారా, నిజంగా మీరు నాపట్ల అపనమ్మకస్తులయ్యారు. ఇదే యెహోవా వాక్కు.
Men som en Kvinde sviger sin Ven, så sveg du mig, Israels Hus, så lyder det fra HERREN.
21 ౨౧ వినండి, చెట్లు లేని ఉన్నత స్థలాల్లో ఒక స్వరం వినబడుతున్నది. వినండి, దుర్మార్గులైన ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవాను మరచిపోయినందుకు రోదనలు, విజ్ఞాపనలు చేస్తున్నారు.
Hør, der lyder Gråd på de nøgne Høje, Tryglen af Israels Børn, fordi de vandrede Krogveje, glemte HERREN deres Gud.
22 ౨౨ ద్రోహులైన ప్రజలారా, తిరిగి రండి. మీ అవిశ్వాసాన్ని నేను బాగుచేస్తాను. “మా దేవుడు యెహోవా నీవే, నీ దగ్గరకే మేం వస్తున్నాం” అనే ఈ మాటలన్నీ అబద్ధాలు.
Vend om, I frafaldne Sønner, jeg læger eders Frafald. Se, vi kommer til dig, thi du er HERREN vor Gud.
23 ౨౩ నిజంగా కొండల మీద జరిగేదంతా మోసం. పర్వతాల మీద చేసిన తంతులన్నీ నిష్‌ప్రయోజనం. నిజంగా మా దేవుడైన యెహోవా వలన మాత్రమే ఇశ్రాయేలుకు రక్షణ కలుగుతుంది.
Visselig, Blændværk var Højene, Bjergenes Larm; visselig, hos HERREN vor Gud er Israels Frelse.
24 ౨౪ మా బాల్యంనుండి మా పూర్వీకుల కష్టార్జితాన్నంతా అసహ్యమైన విగ్రహాలు మింగివేశాయి. వారి గొర్రెల్నీ పశువులను, కొడుకులను, కూతుళ్ళను మింగేస్తూ ఉన్నాయి.
Skændselen åd fra vor Ungdom vore Fædres Gods, deres Småkvæg og Hornkvæg, Sønner og Døtre.
25 ౨౫ మన దేవుడైన యెహోవా మాట వినకుండా మనమూ మన పూర్వికులూ బాల్యం నుండి ఈ రోజు వరకూ ఆయనకు విరోధంగా పాపం చేశాం. కాబట్టి రండి, సిగ్గుతో సాష్టాంగపడదాం. మనం కనబడకుండా మన అవమానం మనలను కప్పివేస్తుంది గాక.
Vi lægger os ned i vor Skændsel, vor Skam er vort Tæppe, thi mod HERREN vor Gud har vi syndet, vi og vore Fædre fra Ungdommen af til i Dag; vi høre ikke på Herren vor Guds røst.