< యిర్మీయా 29 >

1 యెరూషలేము నుంచి నెబుకద్నెజరు బబులోనుకు చెరపట్టి తీసుకెళ్ళిన వాళ్ళలో ఉన్న యాజకులకూ, ప్రవక్తలకూ, ప్రజలందరికీ ప్రవక్త అయిన యిర్మీయా యెరూషలేము నుంచి పంపించిన వ్రాత చుట్ట లోని మాటలు ఇవి.
Yei ne krataa mu nsɛm a odiyifoɔ Yeremia twerɛ firii Yerusalem kɔmaa nnommumfoɔ no mu mpanimfoɔ nkaeɛ, asɔfoɔ, adiyifoɔ ne nnipa a wɔaka nyinaa a Nebukadnessar afa wɔn nnommum afiri Yerusalem akɔ Babilonia.
2 రాజైన యెకొన్యా, రాజమాత, ఇంకా యూదాలో, యెరూషలేములో ఉన్న ఉన్నతాధికారులూ, శిల్పకారులూ, కంసాలులూ, యెరూషలేము నుంచి వెళ్ళిపోయిన తరువాత ఇది జరిగింది.
(Yei yɛ ɛberɛ a ɔhene Yehoiakin ne ɔhemmaa no, asɛnniiɛ adwumayɛfoɔ, Yuda ne Yerusalem ntuanofoɔ, adwumfoɔ ahodoɔ nyinaa afiri Yerusalem akɔ nnommumfa mu no akyi.)
3 అతడు ఈ పత్రాన్ని యూదా రాజైన సిద్కియా పంపిన షాఫాను కొడుకు ఎల్యాశా, హిల్కీయా కొడుకు గెమర్యాల చేత బబులోను రాజైన నెబుకద్నెజరుకు పంపాడు.
Ɔde krataa no hyɛɛ Safan babarima Elasa ne Hilkia babarima Gemaria nsa, wɔn na Yudahene Sedekia somaa wɔn kɔɔ Ɔhene Nebukadnessar nkyɛn wɔ Babilonia. Krataa no mu nsɛm nie:
4 అందులో ఇలా ఉంది “ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా తన ఉద్దేశం చొప్పున బబులోనుకు బందీలుగా వెళ్ళిన వాళ్ళందరికీ ఇలా చెబుతున్నాడు,
Yei ne deɛ Asafo Awurade, Israel Onyankopɔn, ka kyerɛ wɔn a mema wɔfaa wɔn nnommum firi Yerusalem kɔɔ Babilonia no nyinaa:
5 ‘ఇళ్ళు కట్టుకుని వాటిలో నివాసం ఉండండి. తోటలు నాటి వాటి ఫలాలు అనుభవించండి.
“Monsisi afie, na momfa mmɔ atenaseɛ; monyɛ nturo na monni mu aba.
6 పెళ్ళిళ్ళు చేసుకుని కొడుకులనూ కూతుళ్ళనూ కనండి. అక్కడ మీరు తక్కువ సంఖ్యలో ఉండకుండా అభివృద్ధి పొందడానికి మీ కొడుకులకూ, కూతుళ్ళకూ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళను కొడుకులూ కూతుళ్ళూ కననివ్వండి.
Monwareware, na monwowo mmammarima ne mmammaa. Monhwehwɛ yerenom mma mo mmammarima na momfa mo mmammaa nso mma awadeɛ, na wɔn nso nwowo mmammarima ne mmammaa. Monnɔre wɔ hɔ na mo so ante.
7 నేను మిమ్మల్ని బందీలుగా తీసుకెళ్ళిన పట్టణం క్షేమం కోరి దాని కోసం యెహోవాకు ప్రార్థన చేయండి. ఎందుకంటే, దానికి క్షేమం కలిగితే మీకు క్షేమం కలుగుతుంది.’
Afei, monhwehwɛ kuropɔn a mema wɔtuu mo kɔtenaa so no asomdwoeɛ ne yiedie. Mommɔ Awurade mpaeɛ mma no, ɛfiri sɛ ne yiedie mu na mo nso mobɛdi yie.”
8 ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు, ‘మీ మధ్య ఉన్న ప్రవక్తలు, మంత్రగాళ్ళు మిమ్మల్ని మోసం చెయ్యనివ్వకుండా చూసుకోండి. మీలో కలలు కనే వాళ్ళు చెప్పే మాటలు వినకండి.
Aane, yei ne deɛ Asafo Awurade, Israel Onyankopɔn seɛ: “Mommma adiyifoɔ ne nkɔmhyɛfoɔ a wɔwɔ mo mu no nnaadaa mo. Monntie wɔn adaeɛ a mohyɛ wɔn nkuran ma wɔsoso no.
9 వాళ్ళు నా పేరట అబద్ధ ప్రవచనాలు మీతో చెప్తారు. నేను వాళ్ళను పంపలేదు.’ ఇదే యెహోవా వాక్కు.
Wɔhyɛ nkɔntorɔ wɔ me din mu. Mensomaa wɔn,” Awurade na ɔseɛ.
10 ౧౦ ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు, ‘బబులోను మిమ్మల్ని డెబ్భై సంవత్సరాలు పాలించిన తరువాత, నేను మీకు సాయం చేసి, నేను మీకోసం పలికిన శుభ వచనం నెరవేర్చి, ఈ స్థలానికి మిమ్మల్ని తిరిగి తీసుకొస్తాను.
Deɛ Awurade seɛ nie: “Sɛ mosom Babilonia mfeɛ aduɔson a, mɛba abɛhwɛ mo na mɛma mʼadom mu bɔhyɛ sɛ mede mo bɛba ha bio no aba mu.
11 ౧౧ ఎందుకంటే, మీ కోసం నేను ఉద్దేశించిన ప్రణాళికలు నాకే తెలుసు,’ ఇది యెహోవా వాక్కు. ‘అవి మీకు ఒక భవిష్యత్తునూ, నిరీక్షణనూ కలిగించే సమాధానకరమైన ప్రణాళికలే. అవి హానికరమైనవి కావు.
Menim nhyehyɛeɛ a mewɔ ma mo,” Awurade na ɔseɛ, “Nhyehyɛeɛ a ɛde mo bɛsi yie na ɛrenha mo, nhyehyɛeɛ a ɛbɛma mo anidasoɔ ne awieeɛ pa.
12 ౧౨ అప్పుడు మీరు నన్ను వెతికి, నాకు ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను మీ మాట ఆలకిస్తాను.
Afei mobɛfrɛ me na moaba abɛbɔ me mpaeɛ, na mɛtie mo.
13 ౧౩ మీరు పూర్ణమనస్సుతో నన్ను అన్వేషిస్తారు కాబట్టి, నన్ను కనుగొంటారు.
Mobɛhwehwɛ me na mobɛhunu me, sɛ mode mo akoma nyinaa hwehwɛ me dea.
14 ౧౪ అప్పుడు నేను మీకు దొరుకుతాను,’ ఇది యెహోవా వాక్కు. ‘తరువాత, నేను మిమ్మల్ని నిర్బంధంలో నుంచి రప్పించి, మిమ్మల్ని చెదరగొట్టిన దేశాల్లోనుంచి, స్థలాల్లోనుంచి మిమ్మల్ని పోగు చేస్తాను.’ ఇది యెహోవా వాక్కు. ‘ఎక్కడినుంచి మిమ్మల్ని బందీలుగా పంపానో, అక్కడికే మిమ్మల్ని మళ్ళీ తీసుకొస్తాను,’
Mobɛhunu me,” Awurade na ɔseɛ, “na mɛyi mo afiri nkoasom mu de mo asane aba. Mɛboaboa mo ano afiri amanaman ne beaeɛ a mepamoo mo kɔɔ so no nyinaa,” Awurade na ɔseɛ, “na mede mo bɛsane aba baabi a metuu mo firi kɔɔ nnommum mu no bio.”
15 ౧౫ బబులోనులో యెహోవా మాకు ప్రవక్తలను నియమించాడని మీరు అన్నారు గనుక,
Mobɛka sɛ, “Awurade ama yɛn adiyifoɔ wɔ Babilonia,”
16 ౧౬ దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజుతో, మీతోబాటు బందీలుగా వెళ్ళకుండా ఈ పట్టణంలో నివాసం ఉన్న మీ సహోదరులతో, ప్రజలందరితో యెహోవా ఈ మాట అంటున్నాడు,
nanso, sei na Awurade ka fa ɔhene a ɔte Dawid ahennwa so ne nnipa a wɔaka wɔ kuropɔn no mu nyinaa, mo manfoɔ a wɔne mo ankɔ nnommumfa mu no,
17 ౧౭ సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, ‘నేను వాళ్ళ మీదికి ఖడ్గం, కరువు, తెగులు పంపబోతున్నాను. తినడానికి వీలు లేని కుళ్ళిపోయిన అంజూరు పళ్ళలా వాళ్ళను చేస్తాను.
aane, yei ne deɛ Asafo Awurade seɛ: “Mɛma akofena, ɛkɔm ne yaredɔm aba wɔn so, na wɔayɛ sɛ borɔdɔma a asɛeɛ enti wɔntumi nni.
18 ౧౮ తరువాత ఖడ్గంతో, కరువుతో, తెగులుతో నేను వాళ్ళను తరుముతాను. భూమి మీద ఉన్న రాజ్యాలన్నిటి దృష్టిలో వాళ్లను ఒక అసహ్యంగా చేస్తాను. నేను వాళ్ళను చెదరగొట్టిన దేశాల్లో వాళ్ళను శాపానికీ, తృణీకారానికీ, ఎగతాళికీ ప్రతీకగా చేస్తాను.
Mede akofena, ɛkɔm ne yaredɔm bɛti wɔn, na mɛyɛ wɔn atantanneɛ ama ahennie a ɛwɔ asase no so nyinaa, ne nnome ne ahodwiredeɛ, fɛdideɛ ne animtiabudeɛ wɔ amanaman a mepamoo wɔn kɔɔ so no mu.
19 ౧౯ ఎందుకంటే వాళ్ళు నా మాట వినలేదు,’ ఇది యెహోవా వాక్కు. ‘నా సేవకులైన ప్రవక్తల ద్వారా నా వాక్కు పదేపదే పంపాను. కాని, మీరు వినలేదు’ ఇది యెహోవా వాక్కు.”
Ɛfiri sɛ, wɔantie me nsɛm,” sei na Awurade seɛ, “nsɛm a mede somaa mʼasomfoɔ adiyifoɔ mpɛn bebree baa mo nkyɛn. Na mo nnommumfoɔ nso antie,” Awurade na ɔseɛ.
20 ౨౦ “నేను యెరూషలేము నుంచి బబులోనుకు బందీలుగా పంపిన ప్రజలారా, మీరందరూ యెహోవా మాట వినండి.
Afei montie Awurade asɛm, mo nnommumfoɔ a mama mo afiri Yerusalem akɔ Babilonia no nyinaa.
21 ౨౧ నా పేరును బట్టి మీకు అబద్ధ ప్రవచనాలు ప్రకటించే కోలాయా కొడుకు అహాబు గురించి, మయశేయా కొడుకు సిద్కియా గురించి, ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, చూడండి, బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వాళ్ళను అప్పగించబోతున్నాను. మీ కళ్ళ ఎదుట అతడు వాళ్ళను చంపుతాడు.
Yei ne deɛ Asafo Awurade, Israel Onyankopɔn ka fa Kolaia babarima Ahab ne Maaseia babarima Sedekia a wɔde me din rehyɛ mo nkɔmtorɔ no ho nie: “Mede wɔn bɛhyɛ Babiloniahene Nebukadnessar nsa, na wakum wɔn wɔ mo anim.
22 ౨౨ అప్పుడు వీళ్ళ గురించి బబులోనులో ఉన్న వాళ్ళందరూ శాపవచనాలు పలుకుతారు. ‘బబులోను రాజు అగ్నిలో కాల్పించిన సిద్కియాలాగా, అహాబులాగా యెహోవా నిన్ను చేస్తాడు గాక,’ అని శాపం పెడతారు.
Esiane wɔn enti, Yuda nnommumfoɔ a wɔwɔ Babilonia nyinaa de saa nnome yi bɛdome sɛ: ‘Awurade nyɛ wo sɛ, Sedekia ne Ahab a Babiloniahene hyee wɔn wɔ ogya mu no.’
23 ౨౩ ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, వాళ్ళు ఇశ్రాయేలీయుల్లో దుర్మార్గం జరిగిస్తూ, తమ పొరుగువాళ్ళ భార్యలతో వ్యభిచారం చేస్తూ, నేను వాళ్లకు ప్రకటించని అబద్ధపు మాటలు నా పేరట ప్రకటించారు. నేనే ఈ సంగతి తెలుసుకున్నాను, నేనే దానికి సాక్షం,” ఇదే యెహోవా వాక్కు.
Na wɔayɛ akyiwadeɛ a ɛboro so wɔ Israel: wɔne wɔn yɔnkonom yerenom adeda de asɛe awadeɛ, na wɔde me din adi atorɔ a mennka nkyerɛɛ wɔn sɛ wɔnyɛ. Menim na medi ho adanseɛ,” Awurade na ɔseɛ.
24 ౨౪ “నెహెలామీయుడైన షెమయా గురించి ఇలా చెప్పు.
Ka kyerɛ Nehelamni Semaia sɛ,
25 ౨౫ ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ, యాజకుడైన మయశేయా కొడుకు జెఫన్యాకూ, యాజకులకందరికీ, నీ సొంత పేరుతో ఉత్తరాలు పంపి,
“Yei ne deɛ Asafo Awurade, Israel Onyankopɔn seɛ: Watwerɛ krataa wɔ wo din mu akɔma nnipa a wɔwɔ Yerusalem nyinaa, ɔsɔfoɔ Maaseia babarima Sefania, ne asɔfoɔ a aka no nyinaa. Woka kyerɛɛ Sefania sɛ,
26 ౨౬ ‘యాజకుడైన యెహోయాదాకు బదులుగా యెహోవా మందిర విషయాల్లో విచారణకర్త అయిన యాజకునిగా యెహోవా నిన్ను నియమించాడు. వెర్రివాళ్లై తమను తాము ప్రవక్తలుగా ఏర్పరచుకున్న వాళ్ళను నువ్వు సంకెళ్లతో బంధించి బొండలో బిగించాలి’ అన్నావు.
‘Awurade ahyɛ wo ɔsɔfoɔ asi Yehoiada anan mu sɛ hwɛ Awurade efie no so; Ɛsɛ sɛ wode nkɔnsɔnkɔnsɔn ne dadeɛ kɔnnua gu obiara a wabɔ dam na ɔyɛ ne ho sɛ odiyifoɔ.
27 ౨౭ ‘కాబట్టి ఇప్పుడు, నీకు ప్రత్యర్ధిగా, తనను తాను ప్రవక్తగా చేసుకున్న అనాతోతీయుడైన యిర్మీయాను నువ్వెందుకు చీవాట్లు పెట్టలేదు?
Afei adɛn enti na wontwi Yeremia a ɔfiri Anatot a ɔyɛ ne ho sɛ odiyifoɔ wɔ mo mu no anim?
28 ౨౮ మీరు ఇక్కడ చాలాకాలం ఉంటారు. ఇళ్ళు కట్టుకుని వాటిలో నివాసం ఉండండి, తోటలు నాటి వాటి ఫలాలు తినండి,’ అని బబులోనులో ఉన్న మాకు అతడు వర్తమానం పంపాడు,”
Ɔde saa nkra yi abrɛ yɛn wɔ Babilonia: Ɛbɛkyɛ. Ɛno enti monsisi afie mfa mmɔ atenaseɛ; monyɛ nturo na monni emu aba.’”
29 ౨౯ అప్పుడు యాజకుడైన జెఫన్యా, ప్రవక్త అయిన యిర్మీయా వింటూ ఉండగా ఆ పత్రికను చదివి వినిపించాడు.
Ɔsɔfoɔ Sefania kenkanee krataa no kyerɛɛ odiyifoɔ Yeremia.
30 ౩౦ అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,
Na Awurade asɛm baa Yeremia nkyɛn sɛ,
31 ౩౧ “బందీలుగా ఉన్న వాళ్ళందరికీ నువ్వు కబురంపి ఇలా చెప్పు, ‘యెహోవా నెహెలామీయుడైన షెమయా గురించి ఇలా అంటున్నాడు, నేను అతణ్ణి పంపకపోయినా, షెమయా మీకు ప్రవచించి మీరు అబద్ధపు మాటలు నమ్మేలా చేశాడు కాబట్టి,
“Fa saa nkra yi kɔma nnommumfoɔ no nyinaa sɛ, ‘Yei ne deɛ Awurade ka fa Nehelamni Semaia ho: Esiane sɛ wahyɛ mo nkɔm a mpo mansoma no, na wama moagye atorɔ adi enti,
32 ౩౨ నెహెలామీయుడైన షెమయా యెహోవాకు వ్యతిరేకంగా అబద్ధం ప్రకటించాడు కాబట్టి అతన్నీ, అతని సంతానాన్నీ నేను శిక్షించబోతున్నాను. ఈ ప్రజల్లో కాపురం ఉండేవాడు ఒక్కడూ అతనికి మిగిలి ఉండడు. నా ప్రజలకు నేను చేసే మేలు అతడు చూడడు.’ ఇది యెహోవా వాక్కు.”
deɛ Awurade seɛ nie: Nokorɛm, mɛtwe Nehelamni Semaia ne nʼasefoɔ aso. Ɔrennya obiara a ɔbɛka wɔ saa nkurɔfoɔ yi mu, na ɔrenhunu nneɛma pa a mɛyɛ ama me nkurɔfoɔ, ɛfiri sɛ waka atuateɛ nsɛm atia me,’” Awurade na ɔseɛ.

< యిర్మీయా 29 >