< యిర్మీయా 29 >
1 ౧ యెరూషలేము నుంచి నెబుకద్నెజరు బబులోనుకు చెరపట్టి తీసుకెళ్ళిన వాళ్ళలో ఉన్న యాజకులకూ, ప్రవక్తలకూ, ప్రజలందరికీ ప్రవక్త అయిన యిర్మీయా యెరూషలేము నుంచి పంపించిన వ్రాత చుట్ట లోని మాటలు ఇవి.
Now these are the wordes of the booke that Ieremiah the Prophet sent from Ierusalem vnto the residue of the Elders which were caryed away captiues, and to the Priestes, and to the Prophets, and to all the people whome Nebuchad-nezzar had caried away captiue from Ierusalem to Babel:
2 ౨ రాజైన యెకొన్యా, రాజమాత, ఇంకా యూదాలో, యెరూషలేములో ఉన్న ఉన్నతాధికారులూ, శిల్పకారులూ, కంసాలులూ, యెరూషలేము నుంచి వెళ్ళిపోయిన తరువాత ఇది జరిగింది.
(After that Ieconiah the King, and the Queene, and the eunuches, the princes of Iudah, and of Ierusalem, and the workemen, and cunning men were departed from Ierusalem)
3 ౩ అతడు ఈ పత్రాన్ని యూదా రాజైన సిద్కియా పంపిన షాఫాను కొడుకు ఎల్యాశా, హిల్కీయా కొడుకు గెమర్యాల చేత బబులోను రాజైన నెబుకద్నెజరుకు పంపాడు.
By the hand of Elasah the sonne of Shaphan and Gemariah the sonne of Hilkiah, (whom Zedekiah King of Iudah sent vnto Babel to Nebuchad-nezzar King of Babel) saying,
4 ౪ అందులో ఇలా ఉంది “ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా తన ఉద్దేశం చొప్పున బబులోనుకు బందీలుగా వెళ్ళిన వాళ్ళందరికీ ఇలా చెబుతున్నాడు,
Thus hath the Lord of hostes the God of Israel spoken vnto all that are caryed away captiues, whome I haue caused to be caryed away captiues from Ierusalem vnto Babel:
5 ౫ ‘ఇళ్ళు కట్టుకుని వాటిలో నివాసం ఉండండి. తోటలు నాటి వాటి ఫలాలు అనుభవించండి.
Buylde you houses to dwell in, and plant you gardens, and eate the fruites of them.
6 ౬ పెళ్ళిళ్ళు చేసుకుని కొడుకులనూ కూతుళ్ళనూ కనండి. అక్కడ మీరు తక్కువ సంఖ్యలో ఉండకుండా అభివృద్ధి పొందడానికి మీ కొడుకులకూ, కూతుళ్ళకూ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళను కొడుకులూ కూతుళ్ళూ కననివ్వండి.
Take you wiues, and beget sonnes and daughters, and take wiues for your sonnes, and giue your daughters to husbands, that they may beare sonnes and daughters, that ye may bee increased there, and not diminished.
7 ౭ నేను మిమ్మల్ని బందీలుగా తీసుకెళ్ళిన పట్టణం క్షేమం కోరి దాని కోసం యెహోవాకు ప్రార్థన చేయండి. ఎందుకంటే, దానికి క్షేమం కలిగితే మీకు క్షేమం కలుగుతుంది.’
And seeke the prosperitie of the citie, whither I haue caused you to be caried away captiues, and pray vnto the Lord for it: for in the peace thereof shall you haue peace.
8 ౮ ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు, ‘మీ మధ్య ఉన్న ప్రవక్తలు, మంత్రగాళ్ళు మిమ్మల్ని మోసం చెయ్యనివ్వకుండా చూసుకోండి. మీలో కలలు కనే వాళ్ళు చెప్పే మాటలు వినకండి.
For thus saith the Lord of hostes the God of Israel, Let not your prophets, and your southsayers that bee among you, deceiue you, neither giue eare to your dreames, which you dreame.
9 ౯ వాళ్ళు నా పేరట అబద్ధ ప్రవచనాలు మీతో చెప్తారు. నేను వాళ్ళను పంపలేదు.’ ఇదే యెహోవా వాక్కు.
For they prophecie you a lie in my Name: I haue not sent them, saith the Lord.
10 ౧౦ ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు, ‘బబులోను మిమ్మల్ని డెబ్భై సంవత్సరాలు పాలించిన తరువాత, నేను మీకు సాయం చేసి, నేను మీకోసం పలికిన శుభ వచనం నెరవేర్చి, ఈ స్థలానికి మిమ్మల్ని తిరిగి తీసుకొస్తాను.
But thus saith the Lord, That after seuentie yeeres be accomplished at Babel, I will visite you, and performe my good promise toward you, and cause you to returne to this place.
11 ౧౧ ఎందుకంటే, మీ కోసం నేను ఉద్దేశించిన ప్రణాళికలు నాకే తెలుసు,’ ఇది యెహోవా వాక్కు. ‘అవి మీకు ఒక భవిష్యత్తునూ, నిరీక్షణనూ కలిగించే సమాధానకరమైన ప్రణాళికలే. అవి హానికరమైనవి కావు.
For I knowe the thoughtes, that I haue thought towards you, saith the Lord, euen the thoughtes of peace, and not of trouble, to giue you an ende, and your hope.
12 ౧౨ అప్పుడు మీరు నన్ను వెతికి, నాకు ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను మీ మాట ఆలకిస్తాను.
Then shall you crie vnto mee, and ye shall go and pray vnto me, and I will heare you,
13 ౧౩ మీరు పూర్ణమనస్సుతో నన్ను అన్వేషిస్తారు కాబట్టి, నన్ను కనుగొంటారు.
And ye shall seeke mee and finde mee, because ye shall seeke mee with all your heart.
14 ౧౪ అప్పుడు నేను మీకు దొరుకుతాను,’ ఇది యెహోవా వాక్కు. ‘తరువాత, నేను మిమ్మల్ని నిర్బంధంలో నుంచి రప్పించి, మిమ్మల్ని చెదరగొట్టిన దేశాల్లోనుంచి, స్థలాల్లోనుంచి మిమ్మల్ని పోగు చేస్తాను.’ ఇది యెహోవా వాక్కు. ‘ఎక్కడినుంచి మిమ్మల్ని బందీలుగా పంపానో, అక్కడికే మిమ్మల్ని మళ్ళీ తీసుకొస్తాను,’
And I wil be found of you, saith the Lord, and I will turne away your captiuitie, and I will gather you from all the nations, and from all the places, whither I haue cast you, saith the Lord, and will bring you againe vnto the place, whence I caused you to be caryed away captiue.
15 ౧౫ బబులోనులో యెహోవా మాకు ప్రవక్తలను నియమించాడని మీరు అన్నారు గనుక,
Because ye haue sayd, The Lord hath raised vs vp Prophets in Babel,
16 ౧౬ దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజుతో, మీతోబాటు బందీలుగా వెళ్ళకుండా ఈ పట్టణంలో నివాసం ఉన్న మీ సహోదరులతో, ప్రజలందరితో యెహోవా ఈ మాట అంటున్నాడు,
Therefore thus saith the Lord of the King, that sitteth vpon the throne of Dauid, and of all the people, that dwell in this citie, your brethren that are not gone forth with you into captiuitie:
17 ౧౭ సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, ‘నేను వాళ్ళ మీదికి ఖడ్గం, కరువు, తెగులు పంపబోతున్నాను. తినడానికి వీలు లేని కుళ్ళిపోయిన అంజూరు పళ్ళలా వాళ్ళను చేస్తాను.
Euen thus sayth the Lord of hostes, Beholde, I will sende vpon them the sworde, the famine, and the pestilence, and will make them like vile figges, that cannot bee eaten, they are so naughtie.
18 ౧౮ తరువాత ఖడ్గంతో, కరువుతో, తెగులుతో నేను వాళ్ళను తరుముతాను. భూమి మీద ఉన్న రాజ్యాలన్నిటి దృష్టిలో వాళ్లను ఒక అసహ్యంగా చేస్తాను. నేను వాళ్ళను చెదరగొట్టిన దేశాల్లో వాళ్ళను శాపానికీ, తృణీకారానికీ, ఎగతాళికీ ప్రతీకగా చేస్తాను.
And I will persecute them with the sword, with the famine, and with the pestilence: and I will make them a terror to all kingdomes of the earth, and a curse, and astonishment and an hissing, and a reproche among all the nations whither I haue cast them,
19 ౧౯ ఎందుకంటే వాళ్ళు నా మాట వినలేదు,’ ఇది యెహోవా వాక్కు. ‘నా సేవకులైన ప్రవక్తల ద్వారా నా వాక్కు పదేపదే పంపాను. కాని, మీరు వినలేదు’ ఇది యెహోవా వాక్కు.”
Because they haue not hearde my words, saith the Lord, which I sent vnto them by my seruantes the Prophetes, rising vp earely, and sending them, but yee woulde not heare, saith the Lord.
20 ౨౦ “నేను యెరూషలేము నుంచి బబులోనుకు బందీలుగా పంపిన ప్రజలారా, మీరందరూ యెహోవా మాట వినండి.
Heare ye therefore the word of the Lord all ye of the captiuitie, whome I haue sent from Ierusalem to Babel.
21 ౨౧ నా పేరును బట్టి మీకు అబద్ధ ప్రవచనాలు ప్రకటించే కోలాయా కొడుకు అహాబు గురించి, మయశేయా కొడుకు సిద్కియా గురించి, ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, చూడండి, బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వాళ్ళను అప్పగించబోతున్నాను. మీ కళ్ళ ఎదుట అతడు వాళ్ళను చంపుతాడు.
Thus saith the Lord of hostes, the God of Israel, of Ahab the sonne of Kolaiah, and of Zedekiah the sonne of Maaseiah, which prophecie lyes vnto you in my Name, Beholde, I will deliuer them into the hande of Nebuchad-nezzar King of Babel, and he shall slay them before your eyes.
22 ౨౨ అప్పుడు వీళ్ళ గురించి బబులోనులో ఉన్న వాళ్ళందరూ శాపవచనాలు పలుకుతారు. ‘బబులోను రాజు అగ్నిలో కాల్పించిన సిద్కియాలాగా, అహాబులాగా యెహోవా నిన్ను చేస్తాడు గాక,’ అని శాపం పెడతారు.
And al they of the captiuitie of Iudah, that are in Babel, shall take vp this curse against them, and say, The Lord make thee like Zedekiah and like Ahab, whome the King of Babel burnt in the fire,
23 ౨౩ ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, వాళ్ళు ఇశ్రాయేలీయుల్లో దుర్మార్గం జరిగిస్తూ, తమ పొరుగువాళ్ళ భార్యలతో వ్యభిచారం చేస్తూ, నేను వాళ్లకు ప్రకటించని అబద్ధపు మాటలు నా పేరట ప్రకటించారు. నేనే ఈ సంగతి తెలుసుకున్నాను, నేనే దానికి సాక్షం,” ఇదే యెహోవా వాక్కు.
Because they haue committed vilenie in Israel, and haue committed adulterie with their neighbours wiues, and haue spoken lying words in my Name, which I haue not commanded them, euen I knowe it, and testifie it, saith the Lord.
24 ౨౪ “నెహెలామీయుడైన షెమయా గురించి ఇలా చెప్పు.
Thou shalt also speake to Shemaiah the Nehelamite, saying,
25 ౨౫ ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ, యాజకుడైన మయశేయా కొడుకు జెఫన్యాకూ, యాజకులకందరికీ, నీ సొంత పేరుతో ఉత్తరాలు పంపి,
Thus speaketh the Lord of hostes, the God of Israel, saying, Because thou hast sent letters in thy Name vnto all the people, that are at Ierusalem, and to Zephaniah the sonne of Maaseiah the Priest, and to all the Priests, saying,
26 ౨౬ ‘యాజకుడైన యెహోయాదాకు బదులుగా యెహోవా మందిర విషయాల్లో విచారణకర్త అయిన యాజకునిగా యెహోవా నిన్ను నియమించాడు. వెర్రివాళ్లై తమను తాము ప్రవక్తలుగా ఏర్పరచుకున్న వాళ్ళను నువ్వు సంకెళ్లతో బంధించి బొండలో బిగించాలి’ అన్నావు.
The Lord hath made thee Priest for Iehoiada the Priest, that yee should bee officers in the House of the Lord, for euery man that raueth and maketh himselfe a Prophet, to put him in prison and in the stockes.
27 ౨౭ ‘కాబట్టి ఇప్పుడు, నీకు ప్రత్యర్ధిగా, తనను తాను ప్రవక్తగా చేసుకున్న అనాతోతీయుడైన యిర్మీయాను నువ్వెందుకు చీవాట్లు పెట్టలేదు?
Nowe therefore why hast not thou reproued Ieremiah of Anathoth, which prophecieth vnto you?
28 ౨౮ మీరు ఇక్కడ చాలాకాలం ఉంటారు. ఇళ్ళు కట్టుకుని వాటిలో నివాసం ఉండండి, తోటలు నాటి వాటి ఫలాలు తినండి,’ అని బబులోనులో ఉన్న మాకు అతడు వర్తమానం పంపాడు,”
For, for this cause hee sent vnto vs in Babel, saying, This captiuitie is long: buyld houses to dwell in, and plant gardens, and eate the fruites of them.
29 ౨౯ అప్పుడు యాజకుడైన జెఫన్యా, ప్రవక్త అయిన యిర్మీయా వింటూ ఉండగా ఆ పత్రికను చదివి వినిపించాడు.
And Zephaniah the Priest red this letter in the eares of Ieremiah the Prophet.
30 ౩౦ అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,
Then came the worde of the Lord vnto Ieremiah, saying,
31 ౩౧ “బందీలుగా ఉన్న వాళ్ళందరికీ నువ్వు కబురంపి ఇలా చెప్పు, ‘యెహోవా నెహెలామీయుడైన షెమయా గురించి ఇలా అంటున్నాడు, నేను అతణ్ణి పంపకపోయినా, షెమయా మీకు ప్రవచించి మీరు అబద్ధపు మాటలు నమ్మేలా చేశాడు కాబట్టి,
Send to all them of the captiuitie, saying, Thus saith the Lord of Shemaiah the Nehelamite, Because that Shemaiah hath prophecied vnto you, and I sent him not, and hee caused you to trust in a lye,
32 ౩౨ నెహెలామీయుడైన షెమయా యెహోవాకు వ్యతిరేకంగా అబద్ధం ప్రకటించాడు కాబట్టి అతన్నీ, అతని సంతానాన్నీ నేను శిక్షించబోతున్నాను. ఈ ప్రజల్లో కాపురం ఉండేవాడు ఒక్కడూ అతనికి మిగిలి ఉండడు. నా ప్రజలకు నేను చేసే మేలు అతడు చూడడు.’ ఇది యెహోవా వాక్కు.”
Therefore thus saieth the Lord, Behold, I wil visite Shemaiah the Nehelamite, and his seede: hee shall not haue a man to dwell among this people, neither shall he beholde the good, that I will doe for my people, sayth the Lord, because he hath spoken rebelliously against the Lord.