< యిర్మీయా 28 >
1 ౧ యూదా రాజు సిద్కియా పరిపాలన మొదట్లో నాలుగో సంవత్సరం అయిదో నెలలో గిబియోనువాడు, అజ్జూరు ప్రవక్త కొడుకు హనన్యా యాజకుల ఎదుట, ప్రజలందరి ఎదుట యెహోవా మందిరంలో నాతో ఇలా అన్నాడు,
Ɔsram a ɛto so anum wɔ afe koro a ɛyɛ Yudahene Sedekia adedi mfiase, afe a ɛto so anan no mu, odiyifo Hanania a ɔyɛ Asur a ofi Gibeon babarima no ka kyerɛɛ me wɔ Awurade fi bere a na asɔfo ne nnipa no nyinaa ahyia no se,
2 ౨ “ఇశ్రాయేలు దేవుడు, సేనల అధిపతి యెహోవా ఇలా చెబుతున్నాడు, ‘నేను బబులోను రాజు కాడిని విరిచేశాను.
“Sɛɛ na Asafo Awurade, Israel Nyankopɔn se: ‘Mebubu Babiloniahene konnua no.
3 ౩ రెండేళ్లలో బబులోను రాజు నెబుకద్నెజరు ఈ స్థలంలో నుంచి బబులోనుకు తీసుకుపోయిన యెహోవా మందిరంలోని పాత్రలన్నీ ఇక్కడికి మళ్ళీ తెప్పిస్తాను.
Mfe abien mu no, mede Awurade fi mu nneɛma a Babiloniahene Nebukadnessar bɛfa fii ha kɔɔ Babilonia no nyinaa bɛsan aba.
4 ౪ బబులోను రాజు కాడిని విరగగొట్టి యెహోయాకీము కొడుకు యూదా రాజు యెకొన్యాను, బబులోనుకు బందీలుగా తీసుకుపోయిన యూదులందరినీ ఈ స్థలానికి తిరిగి రప్పిస్తాను.’ ఇదే యెహోవా వాక్కు.”
Na mɛsan de Yehoiakyin a ɔyɛ Yudahene Yehoiakim babarima ne Yuda nnommum a wɔkɔɔ Babilonia no nyinaa aba’ sɛɛ na Awurade se, ‘na mebubu Babiloniahene konnua no.’”
5 ౫ అప్పుడు ప్రవక్త అయిన యిర్మీయా యాజకుల ఎదుట, యెహోవా మందిరంలో నిలబడి ఉన్న ప్రజలందరి ఎదుట హనన్యా ప్రవక్తతో ఇలా అన్నాడు,
Na odiyifo Yeremia buaa odiyifo Hanania wɔ asɔfo ne nnipa a na wogyinagyina Awurade fi no nyinaa anim.
6 ౬ “యెహోవా దీనిని చేస్తాడు గాక! యెహోవా మందిరపు పాత్రలన్నీ బందీలుగా తీసుకుపోయిన వారందరినీ యెహోవా బబులోనులో నుంచి ఈ స్థలానికి తెప్పించి నువ్వు ప్రకటించిన మాటలను నెరవేరుస్తాడు గాక!
Ɔkae se, “Amen! Ma Awurade nyɛ no saa! Ma Awurade mma wo nkɔm a woahyɛ sɛ wɔde Awurade fi nneɛma no nyinaa ne nnommum no befi Babilonia asan aba ha yi no mmra mu.
7 ౭ అయినా నువ్వు వింటుండగా ఈ ప్రజలందరూ వింటుండగా నేను చెబుతున్న మాట విను.
Nanso tie asɛm a ɛsɛ sɛ meka ma wote na nnipa no nyinaa nso te:
8 ౮ నాకూ నీకూ ముందున్న ప్రవక్తలు, అనేక దేశాలకూ గొప్ప రాజ్యాలకూ వ్యతిరేకంగా యుద్ధాలు జరుగుతాయనీ కీడు సంభవిస్తుందనీ అంటురోగాలు వస్తాయనీ ఎప్పటినుంచో ప్రవచిస్తూ ఉన్నారు.
Efi tete no, adiyifo a wodii mʼanim ne wʼanim no hyehyɛɛ ɔko, amanehunu ne ɔyaredɔm ho nkɔm tiaa aman bebree ne ahenni akɛse.
9 ౯ అయితే క్షేమం కలుగుతుందని ప్రకటించే ప్రవక్త మాట నెరవేరితే అతన్ని నిజంగా యెహోవాయే పంపాడని తెలుసుకోవచ్చు,” అని యిర్మీయా ప్రవక్త చెప్పాడు.
Nanso odiyifo a ɔhyɛ asomdwoe ho nkɔm no, sɛ ne nkɔmhyɛ no ba mu a wobegye no ato mu sɛ obi a ampa ara Awurade asoma no.”
10 ౧౦ అయితే హనన్యా ప్రవక్త, యిర్మీయా ప్రవక్త మెడ మీదనుంచి ఆ కాడిని తీసి దాన్ని విరిచేశాడు.
Na odiyifo Hanania yii konnua no fii odiyifo Yeremia kɔn mu, bubuu mu,
11 ౧౧ ప్రజలందరి ఎదుట హనన్యా ఇలా అన్నాడు. “యెహోవా ఇలా చెబుతున్నాడు, ‘రెండేళ్ళలో నేను బబులోను రాజు నెబుకద్నెజరు కాడిని రాజ్యాలన్నిటి మెడమీద నుంచి తొలగించి దానిని విరిచివేస్తాను.’” అప్పుడు యిర్మీయా ప్రవక్త తన దారిన వెళ్లిపోయాడు.
na ɔkaa wɔ nnipa no nyinaa anim se, “Sɛɛ na Awurade se: ‘Saa ara na mebubu Babiloniahene Nebukadnessar konnua no afi amanaman nyinaa kɔn mu wɔ mfe abien mu.’” Odiyifo Yeremia tee eyi no ofii hɔ kɔe.
12 ౧౨ హనన్యా, యిర్మీయా మెడ మీద ఉన్న కాడిని విరిచిన తరువాత యెహోవా దగ్గర నుంచి ఈ సందేశం యిర్మీయాకు వచ్చింది.
Odiyifo Hanania bubuu konnua no fii odiyifo Yeremia kɔn mu akyi no, Awurade asɛm baa Yeremia nkyɛn se:
13 ౧౩ “నువ్వు పోయి హనన్యాతో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెబుతున్నాడు, నువ్వు కొయ్య కాడిని విరిచావు గదా! దానికి బదులు ఇనుప కాడిని నేను చేయిస్తాను.’
“Kɔ na kɔka kyerɛ Hanania se, ‘Sɛɛ na Awurade se: Woabubu dua konnua mu, nanso mede dade konnua besi anan mu.
14 ౧౪ ఇశ్రాయేలు దేవుడు సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. ‘ఈ ప్రజలంతా బబులోను రాజు నెబుకద్నెజరుకు సేవ చేయాలని వారి మెడ మీద ఇనుప కాడి ఉంచాను. కాబట్టి వాళ్ళు అతనికి సేవ చేస్తారు. భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించాను.’”
Na sɛnea Asafo Awurade, Israel Nyankopɔn no se ni: Mede dade konnua bɛto amanaman nyinaa kɔn mu, ama wɔn asom Babiloniahene Nebukadnessar, na wɔbɛsom no. Na mpo mɛma no adi wuram mmoa so.’”
15 ౧౫ అప్పుడు యిర్మీయా ప్రవక్త, హనన్యాతో ఇలా అన్నాడు. “హనన్యా, విను. యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజల చేత అబద్ధాలను నమ్మించావు.
Na odiyifo Yeremia ka kyerɛɛ odiyifo Hanania se, “Tie, Hanania! Awurade nsomaa wo, nanso, woama ɔman yi agye atoro ato mu.
16 ౧౬ కాబట్టి యెహోవా ఈ మాట చెబుతున్నాడు, ‘నేను నిన్ను భూమి మీద లేకుండా చేయబోతున్నాను. యెహోవా మీద నమ్మకం ఉంచకుండా చేయడానికి నువ్వు ప్రజలను ప్రేరేపించావు. కాబట్టి ఈ సంవత్సరమే నువ్వు చనిపోతావు’” అని చెప్పాడు.
Ɛno nti, sɛ Awurade se ni: ‘Merebeyi wo afi asase so. Afe yi mu ara wubewu, efisɛ woaka atuatew nsɛm atia Awurade.’”
17 ౧౭ ఆ సంవత్సరం ఏడో నెలలో హనన్యా ప్రవక్త చనిపోయాడు.
Ɔsram a ɛto so ason wɔ afe no ara mu no, odiyifo Hanania wui.