< యిర్మీయా 26 >
1 ౧ యోషీయా కొడుకు యూదా రాజు యెహోయాకీము పరిపాలన మొదట్లో యెహోవా దగ్గర నుంచి సందేశం ఇలా వచ్చింది,
I Josias's Søns, Kong Jojakim af Judas, første Regeringstid kom dette Ord fra HERREN:
2 ౨ “యెహోవా చెప్పేదేమిటంటే, నువ్వు యెహోవా మందిర ఆవరణంలో నిలబడి, నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటిని యెహోవా మందిరంలో ఆరాధించడానికి వచ్చే యూదా పౌరులందరికీ ప్రకటించు. వాటిలో ఒక మాట కూడా విడిచిపెట్టవద్దు.
Saa siger HERREN: Staa frem i Forgaarden til HERRENS Hus og tal til hele Juda, som kommer for at tilbede i HERRENS Hus, alle de Ord, jeg har paalagt dig at tale til dem; udelad ikke et Ord!
3 ౩ ఒకవేళ వాళ్ళు విని తమ దుర్మార్గాన్ని విడిచిపెడితే వాళ్ల మీదికి రప్పిస్తానని చెప్పిన విపత్తును తప్పిస్తాను.”
Maaske hører de og omvender sig, hver fra sin onde Vej, saa jeg kan angre det onde, jeg har i Sinde at gøre dem for deres onde Gerningers Skyld.
4 ౪ నువ్వు వారితో ఈ మాట చెప్పాలి. “యెహోవా చెప్పేదేమిటంటే,
Sig til dem: Saa siger HERREN: Hvis I ikke hører mig og følger den Lov, jeg har forelagt eder,
5 ౫ మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే, నేను ప్రతిసారీ పంపిస్తున్న నా సేవకులైన ప్రవక్తల మాటలు మీరు వినకపోతే
saa I hører mine Tjenere Profeternes Ord, som jeg aarle og silde sendte eder, skønt I ikke vilde høre,
6 ౬ నేను షిలోహుకు చేసినట్టు ఈ మందిరానికి కూడా చేస్తాను. ఈ పట్టణాన్ని భూమిపై ఉన్న రాజ్యాలన్నిటికీ శాపంగా చేస్తాను.”
saa gør jeg med dette Hus som med Silo og giver alle Jordens Folk denne By at forbande ved.
7 ౭ యిర్మీయా యీ మాటలను యెహోవా మందిరంలో పలుకుతూ ఉంటే యాజకులూ ప్రవక్తలూ ప్రజలంతా విన్నారు.
Præsterne, Profeterne og alt Folket hørte nu Jeremias tale disse Ord i HERRENS Hus;
8 ౮ అయితే యిర్మీయా యెహోవా చెప్పమని తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ ప్రజలందరికీ చెప్పడం ముగించిన తరువాత యాజకులూ ప్రవక్తలూ ప్రజలంతా అతణ్ణి పట్టుకుని “నువ్వు తప్పకుండా చావాలి.
og da Jeremias havde sagt alt, hvad HERREN havde paalagt ham at sige til alt Folket, greb Præsterne og Profeterne og alt Folket ham og sagde: »Du skal dø!
9 ౯ ఈ మందిరం షిలోహులాగా అవుతుందనీ ఈ పట్టణంలో ఎవరూ నివసించరనీ, పట్టణం పాడైపోతుందనీ యెహోవా పేరున నువ్వు ఎందుకు ప్రకటిస్తున్నావు?” అన్నారు. ప్రజలంతా యెహోవా మందిరంలో యిర్మీయా చుట్టూ గుమికూడారు.
Hvor tør du profetere i HERRENS Navn og sige: Det skal gaa dette Hus som Silo, og denne By skal ødelægges, saa ingen bor der!« Og alt Folket stimlede sammen om Jeremias i HERRENS Hus.
10 ౧౦ యూదా అధికారులు ఈ మాటలు విని రాజ భవనంలో నుంచి యెహోవా మందిరానికి వచ్చి, యెహోవా మందిరపు కొత్త ద్వారం ప్రవేశంలో కూర్చున్నారు.
Da Judas Fyrster hørte det, gik de fra Kongens Palads op til HERRENS Hus og tog Sæde ved Indgangen til HERRENS nye Port.
11 ౧౧ యాజకులతో, ప్రవక్తలతో, అధిపతులతో, ప్రజలందరితో వాళ్ళు ఇలా అన్నారు. “మీరు చెవులారా విన్నట్టుగా ఈ వ్యక్తి ఈ పట్టణానికి వ్యతిరేకంగా ప్రకటిస్తున్నాడు, కాబట్టి ఇతడు చావడం సమంజసమే.”
Saa sagde Præsterne og Profeterne til Fyrsterne og alt Folket: »Denne Mand har gjort halsløs Gerning, thi han har profeteret mod denne By, som I selv hørte.«
12 ౧౨ అప్పుడు యిర్మీయా అధికారులందరితో ప్రజలందరితో ఇలా చెప్పాడు “‘ఈ మందిరానికీ ఈ పట్టణానికీ వ్యతిరేకంగా మీరు విన్న మాటలన్నీ ప్రకటించు’ అని యెహోవా నన్ను పంపాడు.
Men Jeremias sagde til Fyrsterne og alt Folket: »HERREN sendte mig for at profetere mod dette Hus og denne By alle de Ord, I hørte.
13 ౧౩ కాబట్టి మీరు ఇప్పుడైనా మీ మార్గాలనూ మీ ప్రవర్తననూ చక్కపరచుకుని మీ యెహోవా దేవుని మాట వినండి. యెహోవా మీమీదికి తేవాలనుకున్న ఆపద రాకుండా చేస్తాడు.
Bedrer dog eders Veje og eders Gerninger og hør paa HERREN eders Guds Røst, at HERREN maa angre det onde, han har talet imod eder.
14 ౧౪ ఇదిగో నేను మీ చేతుల్లో ఉన్నాను. మీ దృష్టికేది మంచిదో ఏది సరైనదో అదే నాకు చేయండి.
Men se, jeg er i eders Haand; gør med mig, hvad der er godt og billigt i eders Øjne!
15 ౧౫ అయితే ఈ మాటలన్నీ చెప్పడానికి నిజంగా యెహోవా మీ దగ్గరికి నన్ను పంపాడు. కాబట్టి, మీరు నన్ను చంపితే నిర్దోషి రక్తాపరాధం మీ మీదికీ ఈ పట్టణం మీదికీ దాని నివాసుల మీదికీ తెచ్చుకున్న వాళ్ళవుతారు. దీనిని మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.”
Dog skal I vide, at hvis I dræber mig, saa bringer I uskyldigt Blod over eder og denne By og dens Indbyggere; thi sandelig sendte HERREN mig for at tale alle disse Ord til eder.«
16 ౧౬ అప్పుడు అధిపతులు, ప్రజలంతా యాజకులతో ప్రవక్తలతో ఇలా అన్నారు. “ఈ వ్యక్తి మన యెహోవా దేవుని పేరున మనతో మాట్లాడాడు కాబట్టి ఇతడు చావడం సరి కాదు.”
Da sagde Fyrsterne og alt Folket til Præsterne og Profeterne: »Denne Mand har ikke gjort halsløs Gerning, men talt til os i HERREN vor Guds Navn.«
17 ౧౭ దేశంలోని పెద్దల్లో కొంతమంది లేచి అక్కడ చేరిన ప్రజలతో,
Og nogle af Landets Ældste traadte frem og sagde til hele Folkets Forsamling:
18 ౧౮ “యూదా రాజు హిజ్కియా రోజుల్లో మోరషు ఊరివాడు మీకా ప్రవచిస్తూ ఉండేవాడు. అతడు యూదా ప్రజలందరితో ఇలా చెప్పాడు. సేనల అధిపతి యెహోవా చెప్పేదేమిటంటే, సీయోనును పొలంలాగా దున్నడం జరుగుతుంది. యెరూషలేము రాళ్ల కుప్ప అవుతుంది. మందిరమున్న పర్వతం అరణ్యంలోని కొండలాగా అవుతుంది.
»Mika fra Moresjet profeterede paa Kong Ezekias af Judas Tid og sagde til alt Judas Folk: Saa siger Hærskarers HERRE: Zion skal pløjes som en Mark, Jerusalem blive til Grushobe, Tempelbjerget til Krathøj.
19 ౧౯ యూదా రాజు హిజ్కియా గానీ యూదా ప్రజలు గానీ అతణ్ణి చంపారా? రాజు యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయనను వేడుకుంటే వాళ్లకు చేస్తానన్న విపత్తు చేయలేదు కదా! అయితే మన మీదికి మనమే గొప్ప కీడు తెచ్చుకుంటున్నాము” అని చెప్పారు.
Mon Kong Ezekias af Juda og hele Juda dræbte ham? Frygtede de ikke HERREN og bad ham om Naade, saa HERREN angrede det onde, han havde truet dem med? Vi er ved at bringe stor Ulykke over vore Sjæle.«
20 ౨౦ కిర్యత్యారీము వాసి షెమయా కొడుకు ఊరియా అనే ఒకడు యెహోవా పేరున ప్రవచిస్తూ ఉండేవాడు. అతడు యిర్మీయా చెప్పిన మాటల్లాగే ఈ పట్టణానికీ ఈ దేశానికీ వ్యతిరేకంగా ప్రవచించాడు.
Der var ogsaa en anden Mand, som profeterede i HERRENS Navn, Urija, Sjemajas Søn, fra Kirjat-Jearim; og han profeterede mod denne By og dette Land med de samme Ord som Jeremias.
21 ౨౧ యెహోయాకీం రాజు, అతని శూరులంతా అధికారులంతా అతని మాటలు విన్నప్పుడు, రాజు అతణ్ణి చంపాలని చూశాడు. ఊరియా అది తెలుసుకుని భయపడి ఐగుప్తుకు పారిపోయాడు.
Da Kong Jojakim og alle hans Krigsfolk og alle Fyrsterne hørte hans Ord, stod han ham efter Livet; og da Urija hørte det, blev han bange og flygtede og kom til Ægypten.
22 ౨౨ అయినప్పటికీ యెహోయాకీం రాజు, అక్బోరు కొడుకు ఎల్నాతానునూ అతనితో కూడా కొంతమందిని ఐగుప్తుకు పంపాడు.
Men Kong Jojakim sendte Folk til Ægypten; han sendte Elnatan, Akbors Søn, og nogle andre til Ægypten,
23 ౨౩ వాళ్ళు ఐగుప్తు నుంచి ఊరియాను యెహోయాకీం రాజు దగ్గరికి తెచ్చారు. రాజు కత్తితో అతణ్ణి చంపి సాధారణ ప్రజల సమాధుల్లో అతని శవాన్ని పాతిపెట్టాడు.
og de bragte Urija hjem fra Ægypten og førte ham til Kong Jojakim, som lod ham hugge ned med Sværdet og hans Lig kaste hen, hvor Smaafolk havde deres Grave.
24 ౨౪ అయితే షాఫాను కొడుకు అహీకాము యిర్మీయాకు సాయపడ్డాడు. అతణ్ణి చంపడానికి ప్రజలకు అప్పగించలేదు.
Men Ahikam, Sjafans Søn, holdt Haanden over Jeremias, saa han ikke blev overgivet i Folkets Haand og dræbt.