< యిర్మీయా 24 >

1 బబులోను రాజు నెబుకద్నెజరు యూదా రాజు యెహోయాకీము కొడుకు యెకోన్యాను, యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను, యెరూషలేము నుంచి బందీలుగా బబులోనుకు తీసుకుపోయిన తరువాత యెహోవా మందిరం ముందున్న రెండు గంపల అంజూరు పళ్ళు యెహోవా నాకు చూపించాడు.
巴比倫王拿步高從耶路撒冷將猶大王約雅金的兒子耶苛尼雅和猶大的眾王侯,技工和鐵匠,擄到巴比倫去以後,上主使我見到一個神視:看,有兩筐無花果放在上主的殿前:
2 ఒక గంపలో మగ్గిన అంజూరు పళ్ళు ఉన్నాయి. రెండవ గంపలో తినడానికి వీలు లేకుండా బాగా కుళ్ళిపోయిన అంజూరు పళ్ళు ఉన్నాయి.
一筐內裝的是很好的無花果,好像是初熟的無花果;另一筐內裝的卻是很壞的無花果,壞得幾乎不能吃。
3 “యిర్మీయా! నువ్వేమి చూస్తున్నావు?” అని యెహోవా నన్ను ఆడిగాడు. అందుకు నేను “అంజూరు పళ్ళు. మంచివి చాలా బాగున్నాన్నాయి. చెడ్డవి బాగా కుళ్ళిపోయాయి. తినడానికి పనికి రావు.” అన్నాను.
於是上主問我說:「耶肋米亞,你看見什麼﹖」我答說:「無花果:好的無花果實在好,壞的也實在壞,壞得至於不能吃。」
4 అప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
那時,有上主的話傳給我說:「
5 “ఇశ్రాయేలు దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, వారికి మేలు కలగాలని యూదావారిలో కొంతమందిని బందీలుగా ఈ స్థలం నుంచి నేను కల్దీయుల దేశానికి పంపించాను. వాళ్ళను ఈ మంచి అంజూరు పళ్ళలాగా ఎంచుతాను.
上主,以色列的天主這樣說:我要惠然眷顧,我從這裏遣往加色丁地去的猶大俘虜,像這些好無花果一樣;
6 వాళ్లకు మేలు కలగడానికి నేను వాళ్ళ మీద దృష్టి పెడతాను. ఈ దేశానికి వాళ్ళను మళ్ళీ తీసుకువస్తాను. నేను వాళ్ళను పడగొట్టకుండా కడతాను. పెళ్లగించకుండా నాటుతాను.
好好照顧他們,領他們回到這地方來;從新建樹他們,不再拆毀;從新栽培他們,不再拔除;
7 నేను వాళ్లకు నన్ను తెలుసుకునే మనసు ఇస్తాను. నేను యెహోవాను. వాళ్ళు సంపూర్ణ హృదయంతో నా వైపు తిరిగేలా నేను వాళ్ళ దేవుడుగా వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు.”
賦給他們一顆認識我的心,知道只有我是上主;他們要作我的人民,我要作他們的天主;因為他們要全心回頭歸向我。
8 “యూదా రాజు సిద్కియానూ అతని అధికారులనూ దేశంలో మిగిలిన వాళ్ళనూ ఐగుప్తు దేశంలో నివసించే వాళ్ళనూ బాగా చెడిపోయి తినడానికి పనికిరాని ఆ కుళ్ళిపోయిన అంజూరు పళ్ళలాగా ఉంచుతానని యెహోవా చెబుతున్నాడు.
至於人怎樣對待那些壞的,壞得不可吃的無花果──上主這樣說──我也要怎樣對待猶大王漆德克雅和他的王侯,以及留在此地並住在埃及地的耶路撒冷遺民,
9 వాళ్ళను చెదరగొట్టిన ప్రపంచ రాజ్యాలన్నిటిలో నేను వాళ్ళను తోలివేసే స్థలాలన్నిటిలో వాళ్ళను భయకారణంగా విపత్తుగా నిందాస్పదంగా సామెతగా అపహాస్యంగా శాపంగా ఉంచుతాను.
使他們成為地上各或恐怖的對象;在我驅逐他們所到的地方,成為人侮辱、譏笑、嘲弄和詛咒的對象;
10 ౧౦ నేను వారికీ వాళ్ళ పూర్వీకులకూ ఇచ్చిన దేశంలో ఉండకుండా వాళ్ళు నాశనమయ్యే వరకూ నేను కత్తినీ కరువునూ అంటు వ్యాధుల్నీ వాళ్లలోకి పంపుతాను.”
給他們招來戰爭、饑荒和瘟疫,直到他們由我賜給他們和他們祖先的地上完全消滅。

< యిర్మీయా 24 >