< యిర్మీయా 23 >
1 ౧ “నా మందలో చేరిన గొర్రెలను నాశనం చేస్తూ చెదరగొట్టే కాపరులకు బాధ.” ఇది యెహోవా వాక్కు.
“Jao pastirima koji upropašćuju i raspršuju ovce paše moje” - riječ je Jahvina.
2 ౨ ఇశ్రాయేలు దేవుడు యెహోవా తన ప్రజలను మేపే కాపరులను గురించి ఇలా చెబుతున్నాడు. “మీరు నా గొర్రెలను చెదరగొట్టి వెళ్ళగొట్టారు. మీరు వాటిని అసలేమీ పట్టించుకోలేదు. మీరు చేసిన చెడ్డ పనులను బట్టి మిమ్మల్ని శిక్షిస్తాను. ఇది యెహోవా వాక్కు.
Stoga ovako govori Jahve, Bog Izraelov, protiv pastira koji pasu narod moj: “Vi ste raspršili ovce moje, rastjerali ih, niste se brinuli za njih. Zato ću se ja sada pobrinuti za vas zbog zlodjela vaših - riječ je Jahvina.
3 ౩ నేను వాటిని తోలి వేసిన దేశాలన్నిటిలో నుంచి మిగిలిన నా గొర్రెలను దగ్గరికి చేరుస్తాను. వాటి మేత భూములకు వాటిని రప్పిస్తాను. అవి వృద్ధి చెంది విస్తరిస్తాయి.
I sam ću skupiti ostatak svojih ovaca iz svih zemalja kamo sam ih raspršio i vratiti ih na ispaše njihove: bit će plodne i množit će se.
4 ౪ నేను వాటి మీద కాపరులను నియమిస్తాను. ఇకనుంచి అవి భయపడకుండా, బెదరి పోకుండా, వాటిలో ఒకటైనా తప్పిపోకుండా వారు నా గొర్రెలను మేపుతారు. ఇది యెహోవా వాక్కు.”
I podići ću im pastire da ih pasu te se ničega više neće bojati ni plašiti, niti će se gubiti” - riječ je Jahvina.
5 ౫ యెహోవా ఇలా చెబుతున్నాడు “రాబోయే రోజుల్లో నేను దావీదుకు నీతి అనే చిగురు పుట్టిస్తాను. ఆయన రాజుగా పాలిస్తాడు. ఆయన సౌభాగ్యం తెస్తాడు. భూమి మీద నీతి న్యాయాలను జరిగిస్తాడు.
“Evo dolaze dani - riječ je Jahvina - podići ću Davidu izdanak pravedni. On će vladati kao kralj i biti mudar i činit će pravo i pravicu u zemlji.
6 ౬ ఆయన రోజుల్లో యూదాకు విడుదల వస్తుంది. ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తుంది. ‘యెహోవా మనకు నీతి’ అని అతనికి పేరు పెడతారు.”
U njegove će dane Judeja biti spašena i Izrael će živjeti spokojno. I evo imena kojim će ga nazivati: 'Jahve, Pravda naša.'
7 ౭ కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు “ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి రప్పించిన యెహోవా జీవం తోడు” అని ఇకపై ప్రమాణం చెయ్యరు.
Zato, evo, dolaze dani - riječ je Jahvina - kad se više neće govoriti: 'Živoga mi Jahve koji sinove Izraelove izvede iz zemlje egipatske',
8 ౮ “ఉత్తర దేశంలో నుంచి, నేను వారిని చెదరగొట్టిన దేశాలన్నిటిలో నుంచి వారిని రప్పించిన యెహోవానైన నా తోడు” అని ప్రమాణం చేస్తారు. వాళ్ళు తమ దేశంలో నివసిస్తారు అని యెహోవా చెబుతున్నాడు.
nego: 'Živoga mi Jahve koji potomstvo doma Izraelova izvede i dovede iz zemlje sjeverne i iz svih zemalja kamo ih bijaše prognao, tako da obitavaju u zemlji svojoj.'”
9 ౯ ప్రవక్తల గూర్చిన సమాచారం. యెహోవా గురించి, ఆయన పరిశుద్ధమైన మాటలను గురించి నా గుండె నాలో పగిలిపోయింది. నా ఎముకలన్నీ వణికి పోతున్నాయి. నేను మత్తు మందు సేవించినవాడిలా అయ్యాను. ద్రాక్షమద్యం వశమైన వాడిలా అయ్యాను.
Prorocima. Srce je u meni skrhano, dršću mi kosti, sličan sam pijancu, čovjeku kojim vino ovlada, pred licem Jahvinim i njegovim svetim riječima:
10 ౧౦ దేశం వ్యభిచారులతో నిండిపోయింది. వారిని బట్టే దేశం దుఃఖిస్తూ ఉంది. ఎడారిలో పచ్చిక మైదానాలు ఎండిపోయాయి. ప్రవక్తలు చెడ్డగా ప్రవర్తిస్తున్నారు. తమ బలాన్ని సరిగా వాడడం లేదు.
“Jer zemlja je puna preljubnika; zbog tih se ljudi zemlja u crno zavila, a ispaše u pustinji sagorješe. Njihova je trka zloba, a moć im je nepravda.
11 ౧౧ ప్రవక్తలూ యాజకులూ పాడైపోయారు. నా ఆలయంలో కూడా వాళ్ళ దుర్మార్గం నేను చూశాను. ఇది యెహోవా వాక్కు.
Da, i prorok i svećenik zlikovci su, čak i u Domu svome nađoh im pakost” - riječ je Jahvina.
12 ౧౨ కాబట్టి చీకట్లో వాళ్ళ దారి జారిపోయే నేలలాగా ఉంటుంది. వాళ్ళను గెంటేస్తారు. వాళ్ళు దానిలో పడిపోతారు. వాళ్ళను శిక్షించే సంవత్సరంలో వాళ్ళ మీదికి విపత్తు రప్పిస్తాను. ఇది యెహోవా వాక్కు.
Stog' će im se puti prometnuti u tlo klizavo: u mraku će posrtati i padati. Jer ja ću na njih svaliti nesreću u godine kazne njihove” - riječ je Jahvina.
13 ౧౩ సమరయ ప్రవక్తల మధ్య నేరం చూశాను. వాళ్ళు బయలు దేవుడి పేర ప్రవచనం చెప్పి నా ఇశ్రాయేలు ప్రజలను దారి తప్పించారు.
“I u proroka Samarije vidjeh mnoge ludosti: prorokuju u Baalovo ime i zavode narod moj izraelski.
14 ౧౪ యెరూషలేము ప్రవక్తల మధ్య ఘోరమైన పనులు నేను చూశాను. వాళ్ళు వ్యభిచారులు. మోసంలో నడుస్తున్నారు. వాళ్ళు దుర్మార్గుల చేతులను బలపరుస్తున్నారు! ఎవడూ తన దుర్మార్గం విడిచిపెట్టడం లేదు. వాళ్ళంతా నా దృష్టికి సొదొమ ప్రజల్లాగా మారారు. యెరూషలేము నివాసులు గొమొర్రా ప్రజల్లాగా మారారు.
Ali u proroka jeruzalemskih vidjeh strahote: preljub, prijevarne putove, jačaju ruke zločincima, te se nitko od zločina svojih ne obraća. Svi su mi oni kao Sodoma, a žitelji kao Gomora!”
15 ౧౫ కాబట్టి సేనల ప్రభువు యెహోవా ఈ ప్రవక్తలను గురించి చెప్పేదేమిటంటే, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతా వ్యాపించింది. కాబట్టి వాళ్లకు తినడానికి చేదుకూరలూ తాగడానికి విషజలం నేను వారికిస్తాను.
I zato Jahve nad Vojskama ovako govori o prorocima: “Evo, nahranit ću ih pelinom i napojiti vodom zatrovanom, jer od proroka jeruzalemskih potječe pokvara u svoj zemlji.”
16 ౧౬ సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. “మీకు ప్రవచనాలు ప్రకటించే ప్రవక్తల మాటలు వినవద్దు. వాళ్ళు మిమ్మల్ని భ్రమపెట్టారు! వాళ్ళు యెహోవా నోటి నుంచి వచ్చినవి కాక తమ సొంత మనస్సులోని దర్శనాలను ప్రకటిస్తున్నారు.”
Ovako govori Jahve nad Vojskama: “Ne slušajte riječi proroka: oni vas obmanjuju, objavljuju viđenja srca svoga, a ne što dolazi iz usta Jahvinih;
17 ౧౭ “మీకు శాంతిక్షేమాలు కలుగుతాయని యెహోవా చెబుతున్నాడు” అని నన్ను తృణీకరించే వాళ్ళతో అదే పనిగా చెబుతున్నారు. “మీ మీదికి ఏ కీడూ రాదు” అని తన హృదయ మూర్ఖత ప్రకారం నడుచుకునే ప్రతివారూ చెబుతున్నారు.
govore onima što preziru riječ Jahvinu: 'Bit će s vama mir!' a onima što slijede glas svog srca okorjelog: 'Nikakvo vas zlo neće snaći!'”
18 ౧౮ అయితే యెహోవా మాట విని గ్రహించడానికి వాళ్ళలో ఆయన సభలో ఎవరు నిలబడ్డారు? ఆయన మాట ఎవరు విని పట్టించుకున్నారు?
TÓa tko bijaše na vijećanju Jahvinu, tko je vidio, tko slušao riječ njegovu? Tko ju je shvatio te je može objaviti?
19 ౧౯ ఇదిగో యెహోవా ఆగ్రహం తుఫానులాగా బయలుదేరింది. అది తీవ్రమైన సుడిగాలిలాగా దుర్మార్గుల తల మీదికి విరుచుకుపడుతుంది.
Gle, nevrijeme Jahvino: jarost provaljuje, razmahuje se vihor silan i svaljuje na glave bezbožničke.
20 ౨౦ తన మనస్సులోని ఆలోచనలను నెరవేర్చి సాధించే వరకూ యెహోవా కోపం చల్లారదు. చివరి రోజుల్లో ఈ విషయం మీరు బాగా తెలుసుకుంటారు.
Jahvin se gnjev neće stišati, dok on ne izvrši i ne ispuni naume srca svojega. U dane posljednje jasno ćete to razumjeti.
21 ౨౧ “నేను ఈ ప్రవక్తలను పంపలేదు. అయినా వాళ్ళు వచ్చారు. నేను వాళ్ళతో మాట్లాడలేదు. అయినా వాళ్ళు ప్రవచించారు.
“Ne poslah ti proroka, a ipak trče! Ne govorih im, a ipak prorokuju!
22 ౨౨ ఒకవేళ వాళ్ళు నా సలహా మండలిలో నిలబడి ఉంటే, వాళ్ళు నా మాటలు నా ప్రజలకు తెలియజేసే వాళ్ళే. వాళ్ళ చెడ్డ మాటల నుంచి, వాళ్ళ దుర్మార్గపు అలవాట్ల నుంచి వాళ్ళను తప్పించి ఉండే వాళ్ళే.”
Jest, da bijahu na mom vijećanju, moje bi riječi narodu mom obznanili, i kušali ih svrnuti sa zla puta njihova i od zlodjela njihovih!
23 ౨౩ యెహోవా చెప్పేదేమిటంటే “నేను దగ్గరలో మాత్రమే ఉన్న దేవుడినా? దూరంగా ఉన్న దేవుణ్ణి కానా?
TÓa, zar sam ja Bog samo iz blizine - riječ je Jahvina - zar iz daljine nisam više Bog?
24 ౨౪ నాకు కనబడకుండా రహస్య స్థలాల్లో ఎవరైనా దాక్కోగలరా? అని యెహోవా అడుగుతున్నాడు. నేను భూమ్యాకాశాల్లో ఉన్నాను కదా? ఇది యెహోవా వాక్కు.”
Može li se tko skriti u skrovištima da ga ja ne vidim? - riječ je Jahvina. Ne ispunjam li ja nebo i zemlju? - riječ je Jahvina.
25 ౨౫ “నా పేర మోసపు మాటలు ప్రవచించే ప్రవక్తల మాటలు నేను విన్నాను. ‘నాకు కల వచ్చింది! నాకు కల వచ్చింది’ అని వాళ్ళు చెబుతున్నారు.”
Čuo sam što govore proroci koji prorokuju laži u ime moje i tvrde: 'Usnio sam! Usnio sam!'
26 ౨౬ ఎంతకాలం ఇలా జరగాలి? ప్రవక్తలు తమ మనస్సులో నుంచి అబద్ధాలు ప్రవచిస్తున్నారు. తమ హృదయాల్లోని మోసంతో ప్రవచిస్తున్నారు.
Dokle će među prorocima biti onih koji prorokuju laž i objavljuju prijevaru srca svojega?
27 ౨౭ బయలు దేవతను పూజిస్తూ తమ పూర్వీకులు నా పేరును మరచిపోయినట్టు ప్రతివాడూ తమ పొరుగు వారితో చెప్పే కలలతో నా ప్రజలు నా పేరును మరచిపోవాలని ఆలోచిస్తున్నారు.
Misle da će svojim snima što ih jedan drugom pripovijedaju postići da narod moj zaboravi ime moje, kao što već oci njihovi zaboraviše ime moje uz Baala!
28 ౨౮ కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవచ్చు. అయితే ఎవడికి నేను నా వాక్కు వెల్లడించానో అతడు దాన్ని నమ్మకంగా చెప్పవచ్చు. ధాన్యంతో పొట్టుకు ఏం సంబంధం? ఇదే యెహోవా వాక్కు.
Prorok koji je usnio san neka samo pripovijeda svoj san, a u koga je riječ moja, neka po istini objavljuje riječ moju!” “Što je zajedničko slami i žitu? - riječ je Jahvina.
29 ౨౯ “నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేసే సుత్తి లాంటిది కాదా?
Nije li riječ moja poput vatre - riječ je Jahvina - i nije li slična malju što razbija pećinu?
30 ౩౦ కాబట్టి ఒకడి దగ్గర నుంచి మరొకడు నా మాటలను దొంగిలించే ప్రవక్తలకు నేను విరోధిని.” ఇది యెహోవా వాక్కు.
Evo me stoga protiv proroka - riječ je Jahvina - koji jedan drugome kradu moje riječi.
31 ౩౧ “సొంత మాటలు పలుకుతూ వాటినే దేవోక్తులుగా ప్రకటించే ప్రవక్తలకు నేను విరోధిని.” ఇది యెహోవా వాక్కు.
Evo me protiv proroka - riječ je Jahvina - koji mlate jezikom i proroštva kuju.
32 ౩౨ “మోసపు కలలను పలికే వాళ్లకు నేను విరోధిని. వాళ్ళు అబద్ధాలు చెబుతూ మోసంతో గొప్పలు చెప్పుకుంటూ నా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.” ఇది యెహోవా వాక్కు. “నేను వాళ్ళను పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వాళ్ళ వలన ఈ ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదు.” ఇదే యెహోవా వాక్కు.
Evo me protiv proroka - riječ je Jahvina - koji prorokuju izmišljene snove i pripovijedajući ih zavode narod moj izmišljotinama svojim i lažima. A ja ih nisam poslao, niti sam im što zapovjedio, niti su narodu ovome od kakve koristi - riječ je Jahvina.
33 ౩౩ ఈ ప్రజలు గానీ ప్రవక్త గానీ యాజకుడు గానీ నిన్ను “యెహోవా సందేశం ఏమిటి?” అని అడిగితే నువ్వు వారితో ఇలా చెప్పు. “ఏ సందేశం? నేను మిమ్మల్ని వదిలేశాను.” ఇది యెహోవా సందేశం.
A ako te ovaj narod, ili prorok, ili svećenik, zapita: 'Što je breme Jahvino?' odgovori im: 'Vi ste breme Jahvino i ja vas odbacujem' - riječ je Jahvina.
34 ౩౪ “ఇదే యెహోవా సందేశం” అని ప్రవక్త గానీ యాజకుడు గానీ ప్రజలు గానీ అంటే, అతన్నీ అతని కుటుంబాన్నీ శిక్షిస్తాను.
A reče li koji prorok ili svećenik, ili tko iz naroda: 'Breme Jahvino', kaznit ću toga čovjeka i dom njegov.
35 ౩౫ అయితే “యెహోవా జవాబేమిటి? యెహోవా ఏం చెప్పాడు?” అని మీరు మీ పొరుగువారితో మీ సోదరులతో చెప్పాలి.
Ovako morate govoriti svaki svome bližnjemu i svaki svome bratu: 'Što je Jahve odgovorio?' ili 'Što je Jahve rekao?'
36 ౩౬ “యెహోవా సందేశం” అనే మాట మీరికమీదట పలకవద్దు. ఎందుకంటే ఎవడి మాట వాడికి సందేశం అవుతుంది. జీవంగల మన దేవుని మాటలను, సేనల అధిపతి అయిన యెహోవా దేవుని మాటలను, మీరు తారుమారు చేశారు.
Ali 'Breme Jahvino' da više niste spomenuli, jer je breme svakome riječ njegova.” Jer vi iskrivljujete riječi Boga živoga, Jahve nad Vojskama, našega Boga!
37 ౩౭ మీరు మీ ప్రవక్తతో ఇలా చెప్పాలి. “యెహోవా నీకేం జవాబు చెప్పాడు? యెహోవా ఏం చెప్పాడు?”
Ovako reci proroku: “Što ti je Jahve odgovorio?” ili “Što je Jahve rekao?”
38 ౩౮ అయితే మీరు “ఇది యెహోవా సందేశం” అని చెబితే యెహోవా ఇలా చెబుతున్నాడు. “ఇది యెహోవా సందేశం” అని మీరు చెప్పకూడదని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినా మీరు యెహోవా సందేశం అంటున్నారు.
Ali ako kažete “Breme Jahvino”, ovako govori Jahve: “Zato što se služite riječju 'Breme Jahvino', premda sam vam poručio da je ne izgovarate,
39 ౩౯ కాబట్టి నేను మిమ్మల్ని ఏరి నా దగ్గర నుంచి పారవేస్తాను. మీకూ మీ పూర్వీకులకూ నేనిచ్చిన పట్టణాన్నీ పారవేస్తాను.
ja ću visoko podići i odbaciti od lica svojega vas i vaš grad što ga dadoh vama i ocima vašim!
40 ౪౦ ఎప్పటికీ నిలిచి ఉండే నిందనూ అవమానాన్నీ మీ మీదికి రప్పిస్తాను.
I svalit ću na vas vječnu sramotu i vječnu porugu koja se neće zaboraviti.”