< యిర్మీయా 20 >

1 ఇమ్మేరు కొడుకు పషూరు యాజకుడు. యెహోవా మందిరంలో పెద్ద నాయకుడు. యిర్మీయా ఆ ప్రవచనాలను పలుకుతుంటే విన్నాడు.
וַיִּשְׁמַ֤ע פַּשְׁחוּר֙ בֶּן־אִמֵּ֣ר הַכֹּהֵ֔ן וְהֽוּא־פָקִ֥יד נָגִ֖יד בְּבֵ֣ית יְהוָ֑ה אֶֽת־יִרְמְיָ֔הוּ נִבָּ֖א אֶת־הַדְּבָרִ֥ים הָאֵֽלֶּה׃
2 కాబట్టి పషూరు యిర్మీయా ప్రవక్తను కొట్టి, యెహోవా మందిరంలో బెన్యామీను పైగుమ్మం దగ్గర ఉండే బొండలో అతణ్ణి వేయించాడు.
וַיַּכֶּ֣ה פַשְׁח֔וּר אֵ֖ת יִרְמְיָ֣הוּ הַנָּבִ֑יא וַיִּתֵּ֨ן אֹתֹ֜ו עַל־הַמַּהְפֶּ֗כֶת אֲשֶׁ֨ר בְּשַׁ֤עַר בִּנְיָמִן֙ הָֽעֶלְיֹ֔ון אֲשֶׁ֖ר בְּבֵ֥ית יְהוָֽה׃
3 మరుసటి రోజు పషూరు యిర్మీయాను బొండ నుంచి బయటకు రప్పించాడు. అప్పుడు యిర్మీయా అతనితో ఇలా అన్నాడు. “యెహోవా నీకు పషూరు అని పేరు పెట్టడు. ‘మాగోర్ మిస్సాబీబ్‌’ అని పెడతాడు.”
וַֽיְהִי֙ מִֽמָּחֳרָ֔ת וַיֹּצֵ֥א פַשְׁח֛וּר אֶֽת־יִרְמְיָ֖הוּ מִן־הַמַּהְפָּ֑כֶת וַיֹּ֨אמֶר אֵלָ֜יו יִרְמְיָ֗הוּ לֹ֤א פַשְׁחוּר֙ קָרָ֤א יְהוָה֙ שְׁמֶ֔ךָ כִּ֖י אִם־מָגֹ֥ור מִסָּבִֽיב׃ פ
4 యెహోవా ఈ మాట చెబుతున్నాడు. “నీకూ నీ స్నేహితులందరికీ నిన్ను భయకారణంగా చేస్తాను. నీ కళ్ళముందే వాళ్ళు తమ శత్రువుల కత్తికి గురై కూలుతారు. యూదా వాళ్ళందరినీ బబులోను రాజు చేతికి అప్పగిస్తాను. అతడు వాళ్ళను బందీలుగా బబులోను తీసుకుపోతాడు. కత్తితో వాళ్ళను చంపేస్తాడు.
כִּ֣י כֹ֣ה אָמַ֣ר יְהוָ֡ה הִנְנִי֩ נֹתֶנְךָ֙ לְמָגֹ֜ור לְךָ֣ וּלְכָל־אֹהֲבֶ֗יךָ וְנָֽפְל֛וּ בְּחֶ֥רֶב אֹיְבֵיהֶ֖ם וְעֵינֶ֣יךָ רֹאֹ֑ות וְאֶת־כָּל־יְהוּדָ֗ה אֶתֵּן֙ בְּיַ֣ד מֶֽלֶךְ־בָּבֶ֔ל וְהִגְלָ֥ם בָּבֶ֖לָה וְהִכָּ֥ם בֶּחָֽרֶב׃
5 ఈ పట్టణంలోని సంపద అంతా, దాని ఆస్తి, విలువైన వస్తువులన్నీ యూదా రాజుల ఖజానా అంతా నేనప్పగిస్తాను. మీ శత్రువుల చేతికి వాటిని అప్పగిస్తాను. శత్రువులు వాటిని దోచుకుని బబులోను తీసుకుపోతారు.
וְנָתַתִּ֗י אֶת־כָּל־חֹ֙סֶן֙ הָעִ֣יר הַזֹּ֔את וְאֶת־כָּל־יְגִיעָ֖הּ וְאֶת־כָּל־יְקָרָ֑הּ וְאֵ֨ת כָּל־אֹוצְרֹ֜ות מַלְכֵ֣י יְהוּדָ֗ה אֶתֵּן֙ בְּיַ֣ד אֹֽיְבֵיהֶ֔ם וּבְזָזוּם֙ וּלְקָח֔וּם וֶהֱבִיא֖וּם בָּבֶֽלָה׃
6 పషూరు! నువ్వూ నీ ఇంట్లో నివాసముంటున్న వాళ్ళంతా బందీలుగా పోతారు. నువ్వు బబులోను వెళ్లి అక్కడే చస్తావు. నీ ప్రవచనాలతో నువ్వు మోసపుచ్చిన నీ స్నేహితులందరినీ బబులోనులో పాతిపెడతారు.
וְאַתָּ֣ה פַשְׁח֗וּר וְכֹל֙ יֹשְׁבֵ֣י בֵיתֶ֔ךָ תֵּלְכ֖וּ בַּשֶּׁ֑בִי וּבָבֶ֣ל תָּבֹ֗וא וְשָׁ֤ם תָּמוּת֙ וְשָׁ֣ם תִּקָּבֵ֔ר אַתָּה֙ וְכָל־אֹ֣הֲבֶ֔יךָ אֲשֶׁר־נִבֵּ֥אתָ לָהֶ֖ם בַּשָּֽׁקֶר׃ ס
7 యెహోవా, నువ్వు నన్ను ప్రేరేపించావు. నీ ప్రేరేపణకు నేను లొంగిపోయాను. నువ్వు నన్ను గట్టిగా పట్టుకుని గెలిచావు. నేను నవ్వుల పాలయ్యాను. రోజంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు.
פִּתִּיתַ֤נִי יְהוָה֙ וֽ͏ָאֶפָּ֔ת חֲזַקְתַּ֖נִי וַתּוּכָ֑ל הָיִ֤יתִי לִשְׂחֹוק֙ כָּל־הַיֹּ֔ום כֻּלֹּ֖ה לֹעֵ֥ג לִֽי׃
8 ఎందుకంటే నేను మాట్లాడే ప్రతిసారీ కేకలేస్తూ ‘దుర్మార్గం, నాశనం’ అని చాటించాను. రోజంతా యెహోవా మాట నాకు అవమానం, ఎగతాళి అయింది.
כִּֽי־מִדֵּ֤י אֲדַבֵּר֙ אֶזְעָ֔ק חָמָ֥ס וָשֹׁ֖ד אֶקְרָ֑א כִּֽי־הָיָ֨ה דְבַר־יְהוָ֥ה לִ֛י לְחֶרְפָּ֥ה וּלְקֶ֖לֶס כָּל־הַיֹּֽום׃
9 ‘ఇక నుంచి నేను యెహోవా గురించి ఆలోచించను, ఆయన పేరు ఎత్తను’ అనుకుంటే అది నా గుండెలో మండినట్టుంది. నా ఎముకల్లో మంట పెట్టినట్టుంది. నేను ఓర్చుకుందాం అనుకుంటున్నాను గానీ నావల్ల కావడం లేదు.
וְאָמַרְתִּ֣י לֹֽא־אֶזְכְּרֶ֗נּוּ וְלֹֽא־אֲדַבֵּ֥ר עֹוד֙ בִּשְׁמֹ֔ו וְהָיָ֤ה בְלִבִּי֙ כְּאֵ֣שׁ בֹּעֶ֔רֶת עָצֻ֖ר בְּעַצְמֹתָ֑י וְנִלְאֵ֥יתִי כַּֽלְכֵ֖ל וְלֹ֥א אוּכָֽל׃
10 ౧౦ చుట్టుపక్కలా చాలామంది ఎంతో భయంతో ఇలా గుసగుసలాడడం విన్నాను. నిందించండి. తప్పకుండా నిందించాలి. నాకు సన్నిహితంగా ఉండేవాళ్ళంతా నేను పడిపోవాలని కనిపెడుతున్నారు. ‘ఒకవేళ అతడు చిక్కుపడతాడు. అప్పుడు మనం ఓడించి పగ తీర్చుకుందాం’ అంటున్నారు.
כִּ֣י שָׁמַ֜עְתִּי דִּבַּ֣ת רַבִּים֮ מָגֹ֣ור מִסָּבִיב֒ הַגִּ֙ידוּ֙ וְנַגִּידֶ֔נּוּ כֹּ֚ל אֱנֹ֣ושׁ שְׁלֹומִ֔י שֹׁמְרֵ֖י צַלְעִ֑י אוּלַ֤י יְפֻתֶּה֙ וְנ֣וּכְלָה לֹ֔ו וְנִקְחָ֥ה נִקְמָתֵ֖נוּ מִמֶּֽנּוּ׃
11 ౧౧ అయితే బలం గల యుద్ధవీరుడులాగా యెహోవా నాతో ఉన్నాడు. కాబట్టి నన్ను హింసించేవాళ్ళు నన్ను గెలవలేక తొట్రుపడిపోతారు. వాళ్ళు అనుకున్నది సాధించలేక సిగ్గుపాలవుతారు. వాళ్ళ అవమానం ఎప్పటికీ ఉంటుంది.
וַֽיהוָ֤ה אֹותִי֙ כְּגִבֹּ֣ור עָרִ֔יץ עַל־כֵּ֛ן רֹדְפַ֥י יִכָּשְׁל֖וּ וְלֹ֣א יֻכָ֑לוּ בֹּ֤שׁוּ מְאֹד֙ כִּֽי־לֹ֣א הִשְׂכִּ֔ילוּ כְּלִמַּ֥ת עֹולָ֖ם לֹ֥א תִשָּׁכֵֽחַ׃
12 ౧౨ సేనల ప్రభువు యెహోవా, నువ్వు నీతిమంతులను పరీక్షించే వాడివి. హృదయాన్నీ మనసునూ చూసే వాడివి. నా ఫిర్యాదు నీకే అప్పచెప్పాను కాబట్టి నువ్వు వారికి చేసే ప్రతీకారం నన్ను చూడనివ్వు.
וַיהוָ֤ה צְבָאֹות֙ בֹּחֵ֣ן צַדִּ֔יק רֹאֶ֥ה כְלָיֹ֖ות וָלֵ֑ב אֶרְאֶ֤ה נִקְמָֽתְךָ֙ מֵהֶ֔ם כִּ֥י אֵלֶ֖יךָ גִּלִּ֥יתִי אֶת־רִיבִֽי׃ ס
13 ౧౩ యెహోవాకు పాట పాడండి! యెహోవాను స్తుతించండి! దుర్మార్గుల చేతిలోనుంచి అణగారిన వారి ప్రాణాన్ని ఆయన తప్పించాడు.
שִׁ֚ירוּ לַֽיהוָ֔ה הַֽלְל֖וּ אֶת־יְהוָ֑ה כִּ֥י הִצִּ֛יל אֶת־נֶ֥פֶשׁ אֶבְיֹ֖ון מִיַּ֥ד מְרֵעִֽים׃ ס
14 ౧౪ నేను పుట్టిన రోజు శపితమౌతుంది గాక. నా తల్లి నన్ను కనిన రోజు శుభదినం అని ఎవరూ అనరుగాక.
אָר֣וּר הַיֹּ֔ום אֲשֶׁ֥ר יֻלַּ֖דְתִּי בֹּ֑ו יֹ֛ום אֲשֶׁר־יְלָדַ֥תְנִי אִמִּ֖י אַל־יְהִ֥י בָרֽוּךְ׃
15 ౧౫ ‘నీకు బాబు పుట్టాడు’ అని నా తండ్రికి కబురు తెచ్చి అతనికి ఆనందం తెచ్చినవాడు శాపానికి గురి అవుతాడు గాక.
אָר֣וּר הָאִ֗ישׁ אֲשֶׁ֨ר בִּשַּׂ֤ר אֶת־אָבִי֙ לֵאמֹ֔ר יֻֽלַּד־לְךָ֖ בֵּ֣ן זָכָ֑ר שַׂמֵּ֖חַ שִׂמֳּחָֽהוּ׃
16 ౧౬ ఏమీ జాలి లేక యెహోవా నాశనం చేసిన పట్టణంగా వాడు ఉంటాడు గాక! ఉదయాన ఆర్త ధ్వనినీ మధ్యాహ్నం యుద్ధ ధ్వనినీ అతడు వినుగాక!
וְהָיָה֙ הָאִ֣ישׁ הַה֔וּא כֶּֽעָרִ֛ים אֲשֶׁר־הָפַ֥ךְ יְהוָ֖ה וְלֹ֣א נִחָ֑ם וְשָׁמַ֤ע זְעָקָה֙ בַּבֹּ֔קֶר וּתְרוּעָ֖ה בְּעֵ֥ת צָהֳרָֽיִם׃
17 ౧౭ యెహోవా నన్ను గర్భంలోనే చంపలేదు. నా తల్లి నాకు సమాధిలాంటిదై ఎప్పటికీ నన్ను గర్భాన మోసేలా చేయలేదు.
אֲשֶׁ֥ר לֹא־מֹותְתַ֖נִי מֵרָ֑חֶם וַתְּהִי־לִ֤י אִמִּי֙ קִבְרִ֔י וְרַחְמָ֖הֿ הֲרַ֥ת עֹולָֽם׃
18 ౧౮ కష్టం, దుఖం, అనుభవిస్తూ నేను అవమానంతో నా రోజులు గడుపుతూ ఉన్నాను. ఇందుకేనా నేను గర్భంలోనుంచి బయటికి వచ్చింది?”
לָ֤מָּה זֶּה֙ מֵרֶ֣חֶם יָצָ֔אתִי לִרְאֹ֥ות עָמָ֖ל וְיָגֹ֑ון וַיִּכְל֥וּ בְּבֹ֖שֶׁת יָמָֽי׃ פ

< యిర్మీయా 20 >