< యిర్మీయా 20 >
1 ౧ ఇమ్మేరు కొడుకు పషూరు యాజకుడు. యెహోవా మందిరంలో పెద్ద నాయకుడు. యిర్మీయా ఆ ప్రవచనాలను పలుకుతుంటే విన్నాడు.
Immer chapa Pashur, Pakai houin vaipo thempupa chun, Jeremiah gaothusei chu ajatai.
2 ౨ కాబట్టి పషూరు యిర్మీయా ప్రవక్తను కొట్టి, యెహోవా మందిరంలో బెన్యామీను పైగుమ్మం దగ్గర ఉండే బొండలో అతణ్ణి వేయించాడు.
Hichun aman Jeremiah chu amanin, adingin chule Pakai houin a Benjamin kelkot mun’a, mi henna insunga chun ahentai.
3 ౩ మరుసటి రోజు పషూరు యిర్మీయాను బొండ నుంచి బయటకు రప్పించాడు. అప్పుడు యిర్మీయా అతనితో ఇలా అన్నాడు. “యెహోవా నీకు పషూరు అని పేరు పెట్టడు. ‘మాగోర్ మిస్సాబీబ్’ అని పెడతాడు.”
Ajing nikhon, Pashur in Jeremiah chu ahinlhadoh tai. Hichun Jeremiah in Pashur jah’a, Pakaiyin namin akheltai, tuapat nangmin hi, munjousea tijat in aumkimvel mipa, nakiti ding ahitai.
4 ౪ యెహోవా ఈ మాట చెబుతున్నాడు. “నీకూ నీ స్నేహితులందరికీ నిన్ను భయకారణంగా చేస్తాను. నీ కళ్ళముందే వాళ్ళు తమ శత్రువుల కత్తికి గురై కూలుతారు. యూదా వాళ్ళందరినీ బబులోను రాజు చేతికి అప్పగిస్తాను. అతడు వాళ్ళను బందీలుగా బబులోను తీసుకుపోతాడు. కత్తితో వాళ్ళను చంపేస్తాడు.
Ijeh inem itile, Pakaiyin hitin aseiye, Nangle naloi nagolho chunga hamsetna kalhunsah ding, nangma mitmu chang tah’a, naloi nagol ho chu melmate chemjam’a lousoh keidiu ahi. Juda mite jong Babylon lengpa khut a kapeh doh ding, aman abang sohchanga akaiding chule abang athading ahi.
5 ౫ ఈ పట్టణంలోని సంపద అంతా, దాని ఆస్తి, విలువైన వస్తువులన్నీ యూదా రాజుల ఖజానా అంతా నేనప్పగిస్తాను. మీ శత్రువుల చేతికి వాటిని అప్పగిస్తాను. శత్రువులు వాటిని దోచుకుని బబులోను తీసుకుపోతారు.
Chule keiman namelmate khut a Jerusalem kapeh doh ding, khopi sunga neilegou umjouse-sana, dangka, songmantam chule Judah lengthen akholdoh ouseu aboncha-a achom gamdiu, Babylon gamsung alhutdiu ahi.
6 ౬ పషూరు! నువ్వూ నీ ఇంట్లో నివాసముంటున్న వాళ్ళంతా బందీలుగా పోతారు. నువ్వు బబులోను వెళ్లి అక్కడే చస్తావు. నీ ప్రవచనాలతో నువ్వు మోసపుచ్చిన నీ స్నేహితులందరినీ బబులోనులో పాతిపెడతారు.
Chutengle Pashur, nangle na-insung mite nabonchauva sohchanga Babylon gam najot cheh diu, chukom’a chu nathi dending chule joule nal a gaothu naseikhompi naloi nagol jouse toh nakivuithadiu ahi, ati.
7 ౭ యెహోవా, నువ్వు నన్ను ప్రేరేపించావు. నీ ప్రేరేపణకు నేను లొంగిపోయాను. నువ్వు నన్ను గట్టిగా పట్టుకుని గెలిచావు. నేను నవ్వుల పాలయ్యాను. రోజంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు.
Vo Pakai, nangin neilhemlha tai. Keijong nang lheplhah’a kaum hi pha kasai. Kei sangin nang nahatjon, nang dingin kei imakham kahipoi. Hijongle, mihon nilhum lhum in einuisat un chule totnopnan eineitauve.
8 ౮ ఎందుకంటే నేను మాట్లాడే ప్రతిసారీ కేకలేస్తూ ‘దుర్మార్గం, నాశనం’ అని చాటించాను. రోజంతా యెహోవా మాట నాకు అవమానం, ఎగతాళి అయింది.
Keiman thu kaseichan in, “Pumhat jeng leh manthahna jeng ahi’’ tin ka-eodoh jengjin, kasaptho jin ahi. Hitia Pakaiya kon thuho kaphondoh teng, miho nuijat nopna bep in kapangji e.
9 ౯ ‘ఇక నుంచి నేను యెహోవా గురించి ఆలోచించను, ఆయన పేరు ఎత్తను’ అనుకుంటే అది నా గుండెలో మండినట్టుంది. నా ఎముకల్లో మంట పెట్టినట్టుంది. నేను ఓర్చుకుందాం అనుకుంటున్నాను గానీ నావల్ల కావడం లేదు.
Hijeh chun, keiman Pakai min phahtah louding, chule ama min’a thu seitah louding, kati jongle, kalungsung meiya kihal bangin asajin ahi. Hichu keiman immang kagotji vang'in kaimjou jipoi.
10 ౧౦ చుట్టుపక్కలా చాలామంది ఎంతో భయంతో ఇలా గుసగుసలాడడం విన్నాను. నిందించండి. తప్పకుండా నిందించాలి. నాకు సన్నిహితంగా ఉండేవాళ్ళంతా నేను పడిపోవాలని కనిపెడుతున్నారు. ‘ఒకవేళ అతడు చిక్కుపడతాడు. అప్పుడు మనం ఓడించి పగ తీర్చుకుందాం’ అంటున్నారు.
Keima eiseisetnau, miho kihoulhihna thu lamleng tampi kajan, keidin kajet kavei tijatna jeng ahi. Hehset a bolgimdin eikigih in, ima seitheilouvin eilhauve. Kaloi kagol ho jeng injong, kalhuhkal ngahlel in eigalvet uve. Ama ahung kisuhmo tengle, eiho achunga phu ikilah joudiu ahi, atiuve.
11 ౧౧ అయితే బలం గల యుద్ధవీరుడులాగా యెహోవా నాతో ఉన్నాడు. కాబట్టి నన్ను హింసించేవాళ్ళు నన్ను గెలవలేక తొట్రుపడిపోతారు. వాళ్ళు అనుకున్నది సాధించలేక సిగ్గుపాలవుతారు. వాళ్ళ అవమానం ఎప్పటికీ ఉంటుంది.
Ahinlah, Pakaiyin thaneitah in keima eiumpi jingnai. Ama angsung a koiman eijou ponte, kachunga thilse gong ho abon'uva lhugamdiu ahi. Amaho kijumso diu, chule ajahchatnau chu mangmo’a umding ahi.
12 ౧౨ సేనల ప్రభువు యెహోవా, నువ్వు నీతిమంతులను పరీక్షించే వాడివి. హృదయాన్నీ మనసునూ చూసే వాడివి. నా ఫిర్యాదు నీకే అప్పచెప్పాను కాబట్టి నువ్వు వారికి చేసే ప్రతీకారం నన్ను చూడనివ్వు.
O thaneipen Pakai, nangman adih a thilbol ho napatep in, miho lungthim gilpen leh thuguh ho naholdoh soh keiye. Keiman kachungthu nakom’a kalhuttai. Hijeh chun, kamelmate chunga naphulahna neimusah in, kati ahi.
13 ౧౩ యెహోవాకు పాట పాడండి! యెహోవాను స్తుతించండి! దుర్మార్గుల చేతిలోనుంచి అణగారిన వారి ప్రాణాన్ని ఆయన తప్పించాడు.
Pakai vahchoila sauvin, vahchoiyun Pakai! Migiloute bolsetna-a konin, vaicha gentheite eihuhdoh tauve.
14 ౧౪ నేను పుట్టిన రోజు శపితమౌతుంది గాక. నా తల్లి నన్ను కనిన రోజు శుభదినం అని ఎవరూ అనరుగాక.
Kapen nikho gaosap chang hen, kanun eihindoh nikho chu koima geldoh in umdahen.
15 ౧౫ ‘నీకు బాబు పుట్టాడు’ అని నా తండ్రికి కబురు తెచ్చి అతనికి ఆనందం తెచ్చినవాడు శాపానికి గురి అవుతాడు గాక.
Kahungpen nikho’a, kapa jah’a, ‘chapa khat naneiye’ tia thu galhutpa chu gaosap changhen!
16 ౧౬ ఏమీ జాలి లేక యెహోవా నాశనం చేసిన పట్టణంగా వాడు ఉంటాడు గాక! ఉదయాన ఆర్త ధ్వనినీ మధ్యాహ్నం యుద్ధ ధ్వనినీ అతడు వినుగాక!
Hiche mipa chu, Pakaiyin hepina beihel’a khopi ho asuhmang bang in sumang jeng hen. Jingkah teng nat thohgimna o jahen, sunteng gal kisap o gin jahen!
17 ౧౭ యెహోవా నన్ను గర్భంలోనే చంపలేదు. నా తల్లి నాకు సమాధిలాంటిదై ఎప్పటికీ నన్ను గర్భాన మోసేలా చేయలేదు.
Ajeh chu, aman kapenlhah chun einathatpon, Ohe, kanu naobu sunga anathidan hitaleng, keima hi. Kanu oisunga kivuiden tadinga.
18 ౧౮ కష్టం, దుఖం, అనుభవిస్తూ నేను అవమానంతో నా రోజులు గడుపుతూ ఉన్నాను. ఇందుకేనా నేను గర్భంలోనుంచి బయటికి వచ్చింది?”
Ipi dinga keima hi hungpeng kahim? Kahinkhoa hesoh genthei thohdingle miho vetda chanding bep’a?