< యిర్మీయా 13 >
1 ౧ యెహోవా నాతో ఇలా చెప్పాడు. “నువ్వు వెళ్లి అవిసెనార నడికట్టు కొనుక్కుని నీటితో తడపకుండానే నీ నడుముకు కట్టుకో.”
Saaledes sagde HERREN til mig: »Gaa hen og køb dig et linned Bælte og bind det om din Lænd, lad det ikke komme i Vand!«
2 ౨ కాబట్టి యెహోవా మాట ప్రకారం నేను నడికట్టు ఒకటి కొనుక్కుని నడుముకు కట్టుకున్నాను.
Og jeg købte Bæltet efter HERRENS Ord og bandt det om min Lænd.
3 ౩ యెహోవా వాక్కు నాకు రెండోసారి ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
Saa kom HERRENS Ord atter til mig saaledes:
4 ౪ “నువ్వు కొని నడుముకు కట్టుకున్న నడికట్టును తీసి, యూఫ్రటీసు నది దగ్గరికి పోయి అక్కడ ఉన్న బండ సందులో దాన్ని దాచిపెట్టు.”
»Tag Bæltet, du købte og har om Lænden, og gaa til Frat og gem det der i en Klipperevne!«
5 ౫ యెహోవా ఆజ్ఞాపించినట్టే నేను వెళ్ళి యూఫ్రటీసు దగ్గర దాన్ని దాచిపెట్టాను.
Og jeg gik hen og gemte det ved Frat, som HERREN bød.
6 ౬ చాలా రోజుల తరవాత యెహోవా “నువ్వు యూఫ్రటీసు దగ్గరికి వెళ్ళి, అక్కడ దాచిపెట్టిన నడికట్టు తీసుకో” అని నాతో చెప్పాడు.
Men lang Tid efter sagde HERREN til mig: »Gaa til Frat og hent Bæltet, jeg bød dig gemme der!«
7 ౭ నేను యూఫ్రటీసు దగ్గరికి పోయి తవ్వి దాచిపెట్టిన నడికట్టును తీసుకున్నాను. అయితే ఆ నడికట్టు చెడిపోయి ఉంది. అది దేనికీ పనికిరాకుండా ఉంది.
Og jeg gik til Frat og gravede Bæltet op, hvor jeg havde gemt det: og se, Bæltet var ødelagt og duede ikke til noget.
8 ౮ అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
Og HERRENS Ord kom til mig saaledes:
9 ౯ “యెహోవా చెప్పేదేమంటే, ఇదే విధంగా యూదా ప్రజల గర్వాన్ని, యెరూషలేము ప్రజల మహా గర్వాన్ని నేను అణచివేస్తాను.
Saa siger HERREN: Saaledes vil jeg ødelægge Judas og Jerusalems store Herlighed.
10 ౧౦ ఈ ప్రజలు అన్య దేవుళ్ళను పూజిస్తూ, వాటికే నమస్కారం చేస్తున్నారు. వాటినే అనుసరిస్తూ, నా మాటలు వినకుండా తమ హృదయ కాఠిన్యం చొప్పున నడుస్తున్నారు. వారు ఎందుకూ పనికిరాని ఈ నడికట్టులాగా అవుతారు.
Dette onde Folk, som vægrer sig ved at høre mine Ord og vandrer i deres Hjertes Stivsind og holder sig til andre Guder og dyrker og tilbeder dem, skal blive som dette Bælte, der ikke duer til noget.
11 ౧౧ వారిని నా ప్రజలుగా చేసుకుని వారి ద్వారా నాకు కీర్తి ప్రతిష్టలు, మహిమ కలగాలని నేను ఆశించాను. ఒకడు నడికట్టు కట్టుకున్నట్టుగా నేను ఇశ్రాయేలు, యూదా ప్రజలందరినీ నా నడుము చుట్టూ కట్టుకున్నాను గానీ, వారు నా మాటలు వినలేదు.”
Thi som Bæltet slutter sig tæt til en Mands Lænd, saaledes har jeg sluttet hele Israels Hus og hele Judas Hus tæt til mig, lyder det fra HERREN, for at de skulde være mit Folk og blive mig til Navnkundighed, Pris og Ære; men de hørte ikke.
12 ౧౨ కాబట్టి నువ్వు వారితో ఇలా చెప్పు. “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, ప్రతి ద్రాక్ష తిత్తీ రసంతో నిండి ఉండాలి.” “ద్రాక్ష తిత్తులు రసంతో నిండి ఉండాలి అని మాకు తెలియదా” అని వారు నీతో అంటే, వారితో ఈ మాటలు చెప్పు.
Og du skal sige til dette Folk: Saa siger HERREN, Israels Gud: Enhver Vindunk fyldes med Vin! Og siger de til dig: »Skulde vi ikke vide, at enhver Vindunk fyldes med Vin?«
13 ౧౩ “యెహోవా చెప్పేదేమంటే, ఈ దేశ ప్రజలందరినీ, అంటే, దావీదు సింహాసనం మీద కూర్చునే రాజులను, యాజకులను, ప్రవక్తలను, యెరూషలేము ప్రజలను, అందరినీ నేను మత్తులో మునిగేలా చేయబోతున్నాను.
saa svar dem: Saa siger HERREN: Se, jeg vil fylde alle dette Lands Indbyggere, Kongerne, der sidder paa Davids Trone, Præsterne, Profeterne og alle Jerusalems Borgere, saa de bliver drukne;
14 ౧౪ అప్పుడు నేను తండ్రులూ కొడుకులూ అందరూ కూలిపోయి ఒకడి మీద ఒకడు పడేలా చేస్తాను. వారి మీద జాలీ, కనికరమూ చూపకుండా వారిని నాశనం చేస్తాను.”
og jeg knuser dem mod hinanden, baade Fædre og Sønner, lyder det fra HERREN; uden Skaansel, Medynk og Barmhjertighed ødelægger jeg dem.
15 ౧౫ జాగ్రత్తగా వినండి. యెహోవా మాట్లాడుతున్నాడు, అహంకారం వద్దు.
Hør og lyt uden Hovmod, thi HERREN taler.
16 ౧౬ మీ దేవుడైన యెహోవా చీకటి కమ్మజేయక ముందే, చీకటిలో మీ కాళ్లు కొండలపై తొట్రుపడక ముందే, ఆయనను ఘనపరచి కొనియాడండి. ఎందుకంటే మీరు వెలుగు కోసం చూస్తుండగా ఆయన దాన్ని గాఢాంధకారంగా మారుస్తాడు.
Lad HERREN eders Gud faa Ære, før det mørkner, før I støder eders Fødder paa Skumringsbjerge, saa I maa bie paa Lys, men han gør det til Mulm, han gør det til Mørke.
17 ౧౭ ఇప్పుడు మీరు ఆ మాట వినకపోతే మీ గర్వం విషయంలో నేను రహస్యంగా విలపిస్తాను. యెహోవా మందను చెరగా పట్టుకున్నందుకు నేను కన్నీరు మున్నీరుగా విలపిస్తాను.
Men dersom I ikke hører, da græder min Sjæl i Løn for Hovmodets Skyld, den fælder saa bitre Taarer; mit Øje rinder med Graad, thi HERRENS Hjord føres bort.
18 ౧౮ రాజుతో, రాజమాతతో ఇలా చెప్పు. “మిమ్మల్ని మీరు తగ్గించుకుని, నేల మీద కూర్చోండి. మీ తలపై కిరీటాలు, మీ అహంకారం, మీ మహిమ అన్నీ పడిపోయాయి.”
Sig til Kongen og til Herskerinden: »Tag lavere Sæde, thi af eders Hoved faldt den dejlige Krone.«
19 ౧౯ దక్షిణదేశ పట్టణాలు మూతబడి ఉన్నాయి. వాటిని తెరిచేవాడు ఉండడు. యూదా ప్రజలంతా చెరలోకి వెళ్ళిపోయారు.
Sydlandets Byer er lukkede, ingen lukker op, hele Juda er bortført til sidste Mand.
20 ౨౦ మీ కళ్ళెత్తి ఉత్తరం నుండి వస్తున్న వారిని చూడండి. నీకిచ్చిన సుందరమైన మంద ఎక్కడ ఉంది?
Løft dine Øjne og se dem komme fra Nord! Hvor er den Hjord, du fik, dine dejlige Faar?
21 ౨౧ వారిని నీకై నువ్వు స్నేహితులుగా చేసికొన్నావు. ఇప్పుడు వారినే ఆయన నీ మీద అధిపతులుగా నియమిస్తే నీవేం చేస్తావు? ప్రసవించే స్త్రీ పడే వేదన నీకు కలుగుతుంది కదా?
Hvad vil du sige, naar du faar dem til Herrer, hvem du lærte at komme til dig som Venner? Vil ikke Veer da gribe dig som Kvinde i Barnsnød?
22 ౨౨ “ఇవన్నీ నాకెందుకు జరుగుతున్నాయి?” అని నీ మనస్సులో అనుకోవచ్చు. నువ్వు చేసిన విస్తారమైన దోషాలే దానికి కారణం. అందుకే నీ వస్త్రాలు తీసివేయడం, నీపై అత్యాచారం చేయడం జరుగుతుంది.
Og siger du i dit Hjerte: »Hvi hændtes mig dette?« For din svare Skyld blev dit Slæb løftet op, dine Hæle skændet.
23 ౨౩ కూషు దేశ ప్రజలు తమ చర్మపు రంగు మాపుకోగలరా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? అదే గనుక సాధ్యమైతే చెడు చేయడానికి అలవాటు పడిన మీకు మంచి చేయడం సాధ్యమౌతుంది.
Hvis en Neger kunde skifte sin Hud, en Panter sine Striber, saa kunde og I gøre godt, I Mestre i ondt!
24 ౨౪ కాబట్టి అడవిగాలికి పొట్టు ఎగిరిపోయినట్టు నేను వారిని చెదరగొడతాను.
Jeg spreder dem som Straa, der flyver for Ørkenens Vind;
25 ౨౫ మీరు నన్ను మరచిపోయి మోసాన్ని నమ్ముకున్నారు కాబట్టి అదే మీ వంతుగా నేను కొలిచి ఇచ్చాను, అని యెహోవా చెబుతున్నాడు.
det er din Lod, din tilmaalte Del fra mig, saa lyder det fra HERREN, fordi du lod mig gaa ad Glemme og stoled paa Løgn.
26 ౨౬ కాబట్టి మీకు సిగ్గు కలిగేలా నేను మీ బట్టల అంచులను లేపి మీ ముఖం మీద పడేలా చేస్తాను.
Ja, dit Slæb slaar jeg over dit Ansigt, din Skam skal ses,
27 ౨౭ నీ వ్యభిచారం, కామంతో కూడిన నీ సకిలింపులు నీ జార కార్యాలు నాకు తెలుసు. పొలాల్లోని ఉన్నత స్థలాల్లో నీవు చేసిన అసహ్యమైన కార్యాలు నాకు కనబడుతున్నాయి. యెరూషలేమా, నీకు శ్రమ. నిన్ను నువ్వు పవిత్ర పరచుకోవడం లేదు. ఇలా ఎంత కాలం కొనసాగుతుంది?
dit Ægteskabsbrud og din Vrinsken, din skamløse Utugt; paa Højene og ude paa Marken saa jeg dine væmmelige Guder. Ve dig, Jerusalem, du bliver ej ren — hvor længe endnu?