< యిర్మీయా 11 >

1 యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
上主有話傳給依撒意亞說:
2 “మీరు ఈ నిబంధన మాటలు వినండి. యూదా ప్రజలతో, యెరూషలేము నివాసులతో ఇలా చెప్పు.
「你們應聽這盟約上的話,將這些話宣讀給猶大人和耶路撒冷的居民聽。
3 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, ఈ నిబంధన మాటలు వినని వాడు శాపానికి గురౌతాడు.
你應對他們說:「上主,以色列的天主這樣說:凡不聽從這盟約上的話的人,是可咒罵的!
4 ఐగుప్తుదేశం అనే ఆ ఇనప కొలిమిలో నుండి నేను మీ పూర్వికులను రప్పించిన రోజున నేను ఈ ఆజ్ఞ ఇచ్చాను, ‘నేను మీ పూర్వికులకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని వారికి చేసిన ప్రమాణాన్ని నెరవేర్చేలా, మీరు నా వాక్యం విని నేను మీకిచ్చే ఆజ్ఞలను బట్టి ఈ నిబంధన వాక్యాలను అనుసరిస్తే మీరు నా ప్రజలుగా, నేను మీ దేవుడుగా ఉంటాను.’”
這些話是我在領你們的祖先由鐵爐,即由埃及地出來的那天,對他們吩咐的。我對他們說:你們應聽從我的聲音,應依照我命令你們的一切去做,你們就必做我的人民,我也必做你們的天主,
5 అందుకు నేను “యెహోవా, అలాగే జరుగు గాక” అన్నాను.
好我能實踐對你們祖先所起的誓,賜給他們流奶流蜜的土地,有如今日。我即答說:「是,上主! 」
6 యెహోవా నాతో ఇలా చెప్పాడు. “నువ్వు యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో ఈ మాటలు ప్రకటించు. ‘మీరు ఈ నిబంధన మాటలు విని వాటిని పాటించండి.’
上主對我說:「你應在猶大城邑和耶路撒冷的街上宣佈這些話說:你們應聽從這盟約上的話,依照遵行,
7 ఐగుప్తులో నుండి మీ పూర్వికులను రప్పించిన రోజు మొదలుకుని నేటివరకూ వారితో ‘నా మాట వినండి’ అని నేను గట్టిగా, ఖండితంగా చెబుతూ వచ్చాను.
因為在我領你們的祖先由埃及上來的那一天,我就鄭重警告過他們,直到今日仍不斷勸告他們說:你們應我的聲音!
8 అయినా వారు తమ దుష్టహృదయంతో, మూర్ఖులై నడుచుకుంటూ నామాట వినలేదు. ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవమని చెప్పినా వారు వినలేదు కాబట్టి నేను ఆ నిబంధనలోని శాపాలన్నిటినీ వారి మీదికి రప్పిస్తాను.”
他們不但不聽從,氶而各隨自己頑固的惡心生活,為此,我對他們執行了我命他們遵行,而他們沒有遵行的這盟約上的一切話。」
9 యెహోవా నాతో ఇలా చెప్పాడు. “యూదా ప్రజల్లో, యెరూషలేము నివాసుల్లో ఒక కుట్ర జరుగుతున్నట్టు కనిపిస్తున్నది.
上主又對我說:「猶大和耶路撒冷間存有叛逆的陰謀,
10 ౧౦ అదేమంటే, ఇశ్రాయేలు, యూదా వంశస్థులు నా మాటలు వినని తమ పూర్వీకుల దోషాలను కొనసాగించడానికి నిర్ణయించుకున్నారు. వారు అన్య దేవుళ్ళను పూజిస్తూ, వాటిని అనుసరిస్తూ వారి పూర్వికులతో నేను చేసిన నిబంధనను భంగం చేశారు.”
他們再陷於他們那不願聽從我話的祖先的罪惡中,追隨事奉其他的神祗;以色列家和猶大家都違反了我與他們祖先締結的盟約。
11 ౧౧ కాబట్టి యెహోవా చెప్పేదేమంటే “వారు తప్పించుకోలేని విపత్తును వారి మీదికి రప్పిస్తాను, వారు నన్ను ఎంత వేడుకున్నా నేను వినను.
為此,上主這樣說:看,我必給他們召來不可逃避的災禍;既使他們向我呼號,我也不俯聽。
12 ౧౨ యూదా పట్టణాలు, యెరూషలేము ప్రజలు తాము ఎవరికైతే ధూపం వేస్తూ పూజిస్తున్నారో ఆ దేవుళ్ళకు విన్నవించుకుంటారుగానీ వారి ఆపదలో అవి వారిని ఏమాత్రం కాపాడలేవు.
猶大城邑和耶路撒冷的居民,必去呼號他們獻香敬拜的神祗,佰這些神祗在他們遭難時,決不能拯救他們。
13 ౧౩ యూదా, నీ పట్టణాలు ఎన్ని ఉన్నాయో అన్ని దేవుళ్ళు నీకు ఉన్నారు కదా? యెరూషలేము ప్రజలారా, బయలు దేవతకు ధూపం వేయడానికి మీరు వీధి వీధినా అసహ్యమైన బలిపీఠాలు దానికి నిర్మించారు.
的確,猶大! 你神祗的號竟等於你城邑的數目;耶路撒冷有多少街道,你們也給可恥之物設立了多少祭壇,向巴爾獻香的祭壇。
14 ౧౪ కాబట్టి యిర్మీయా, నువ్వు ఈ ప్రజల కోసం ప్రార్థన చేయవద్దు. వారి పక్షంగా అంగలార్చవద్దు, వేడుకోవద్దు. వారు తమ విపత్తులో నాకు మొర పెట్టినపుడు నేను వినను.
至於你,你不必為這人民祈禱,不必為他們呼號祈求,因為他們在遭難時,才向我呼求,我必不俯聽。
15 ౧౫ దుష్ట తలంపులు కలిగిన నా ప్రియమైన ప్రజలకు నా మందిరంతో పనేంటి? బలుల కోసం నువ్వు మొక్కుకుని తెచ్చిన ప్రతిష్ఠితమైన మాంసం భుజించడం వలన నీకు ప్రయోజనం లేదు. ఎందుకంటే నువ్వు చెడు జరిగించి సంతోషించావు.
我心愛的人! 你既為作歹,還在我家做什麼﹖難道許願和祝聖的肉能使你免禍,叫你作惡而能倖免﹖
16 ౧౬ గతంలో యెహోవా నిన్ను, ‘ఫలభరితమైన పచ్చని ఒలీవ చెట్టు’ అని పిలిచాడు. అయితే ఆయన గొప్ప తుఫాను శబ్దంలా వినిపించే మంట రగిలించాడు. దాని కొమ్మలు విరిగిపోతాయి.
上主曾給你起外叫:「青綠茂盛而滿結佳果的橄欖樹」;但現在衪在雷電霹靂聲音中,給綠葉燃起了火,燒毀了枝條。
17 ౧౭ ఇశ్రాయేలు, యూదా ప్రజలు బయలు దేవతకు ధూపం వేసి నాకు కోపం పుట్టించారు. కాబట్టి మీకై మీరు చేసిన చెడు క్రియలను బట్టి మిమ్మల్ని నాటిన సేనల ప్రభువైన యెహోవా మీపైకి మహా విపత్తును పంపిస్తాడు.”
那位培埴你的萬軍的上主,命災禍來懲罰你,全是為了以色列家和猶大家自作自受的罪惡,因為他們向巴爾獻香,獨犯了我。
18 ౧౮ దీనంతటినీ యెహోవా నాకు వెల్లడి చేసినప్పుడు నేను గ్రహించాను. ఆయన వారి పనులను నాకు కనపరిచాడు.
上主叫我知道, 才知道;那時我看透了他們的作為:
19 ౧౯ అయితే నేను వధకు తీసుకుపోయే గొర్రెపిల్లలాగా ఉన్నాను. వారు నాకు వ్యతిరేకంగా చేసిన ఆలోచనలు నేను గ్రహించలేదు. “మనం చెట్టును దాని ఫలంతో సహా కొట్టివేద్దాం రండి, అతని పేరు ఇకపై ఎవరూ జ్ఞాపకం చేసుకోకుండా అతనిని సజీవుల్లో నుండి నిర్మూలం చేద్దాం రండి” అని వారు చెప్పుకున్నారు.
我好像一隻馴服被牽去宰殺的羔羊,竟不知他們對我畜意謀害:「讓我毀壞這株生氣蓬勃的樹,將他由活人的地上拔除,使他的名字不再受人記念。」
20 ౨౦ సేనల ప్రభువైన యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తూ, హృదయాన్నీ, మనస్సునూ పరిశోధిస్తాడు. యెహోవా, నా వ్యాజ్యాన్ని నీ ఎదుట పెట్టాను. వారి మీద నువ్వు చేసే ప్రతీకారం నేను చూస్తాను.
公平審判和洞察肺腑的上主! 願我見到你對他們的報復,因為我已向他們提出我的控訴。
21 ౨౧ “నువ్వు యెహోవా పేరున ప్రవచిస్తే, మా చేతిలో చనిపోతావు” అని చెప్పే అనాతోతు ప్రజల గురించి సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే,
為此,關於那些謀害我的性命,對我說:「你不要事奉上主的名講預言,免得你死在我們手裏」的阿納托特人,上主這樣說,
22 ౨౨ “నేను వారిని శిక్షించబోతున్నాను, వారి యువకులు ఖడ్గం చేత చనిపోతారు. వారి కొడుకులు, కూతుర్లు కరువు చేత చనిపోతారు.
萬軍的上主這樣說:「看,我必懲罰他們:青年必死在刀下,子女必死於饑荒,
23 ౨౩ వారిలో ఎవరూ మిగలరు. ఎందుకంటే నేను వారికి తీర్పు తీర్చిన సంవత్సరం వారి పైకి మహా విపత్తును పంపిస్తాను.”
使他們沒有子嗣,因為在懲罰他們的那年,我必給阿納托人招來災禍。」

< యిర్మీయా 11 >