< యిర్మీయా 10 >
1 ౧ ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా మీ గురించి చెప్పే మాటలు వినండి.
以色列家啊,要听耶和华对你们所说的话。
2 ౨ యెహోవా చెప్పేదేమంటే, అన్యజాతుల ప్రజల ఆచారాలు పాటించకండి. వారు ఆకాశంలో కనబడే సూచనలకు భయపడతారు. కానీ మీరు మాత్రం భయపడవద్దు.
耶和华如此说: 你们不要效法列国的行为, 也不要为天象惊惶, 因列国为此事惊惶。
3 ౩ ఆ ప్రజల ఆచారాలు నిష్ప్రయోజనం. ఒకడు అడవిలో చెట్టు నరకుతాడు, పనివాడు దాన్ని గొడ్డలితో చెక్కుతాడు.
众民的风俗是虚空的; 他们在树林中用斧子砍伐一棵树, 匠人用手工造成偶像。
4 ౪ అప్పుడు వారు దానికి వెండి బంగారు వస్తువులు అలంకరిస్తారు. అది కదలకుండా ఉండేలా దానికి సుత్తితో మేకులు కొట్టి బిగిస్తారు.
他们用金银妆饰它, 用钉子和锤子钉稳, 使它不动摇。
5 ౫ అవి దోస తోటల్లో దిష్టి బొమ్మల్లాగా నిలబడి ఉంటాయి. పలకవు, నడవలేవు కాబట్టి వాటిని ఎవరైనా మోయాలి. అవి మీకు హాని చేయలేవు. కాబట్టి వాటికి భయపడకండి. వాటి వలన మంచి ఏమీ జరగదు.
它好像棕树,是旋成的, 不能说话,不能行走, 必须有人抬着。 你们不要怕它; 它不能降祸, 也无力降福。
6 ౬ యెహోవా, నీలాంటివాడు ఎవరూ లేరు. నువ్వు గొప్పవాడివి. నీ బల ప్రభావాలను బట్టి నీ పేరు ఎంతో ఘనతకెక్కింది.
耶和华啊,没有能比你的! 你本为大,有大能大力的名。
7 ౭ లోక జాతులకు రాజువైన నీకు భయపడని వాడెవడు? ఆయా రాజ్యాల ప్రజల్లోని జ్ఞానులందరిలో నీవంటి వాడెవడూ లేడు. కాబట్టి మనుషులు నీలో భయభక్తులు నిలపాలి.
万国的王啊,谁不敬畏你? 敬畏你本是合宜的; 因为在列国的智慧人中, 虽有政权的尊荣, 也不能比你。
8 ౮ వారంతా బుద్ధి హీనులు, అవివేకులు. చెక్కిన బొమ్మలను పూజించడం వలన వారికి కలిగే జ్ఞానం సున్నా.
他们尽都是畜类,是愚昧的。 偶像的训诲算什么呢? 偶像不过是木头。
9 ౯ తర్షీషు నుండి రేకులుగా సాగగొట్టిన వెండినీ ఉఫాజ్ నుండి బంగారాన్నీ తెస్తారు. అది కూలీల చేతి పని. ఆ విగ్రహాలకు నీలి, ఊదా రంగు వస్త్రాలు తొడిగారు. అవన్నీ వైపుణ్యం గల పనివారు చేసినవే.
有银子打成片,是从他施带来的, 并有从乌法来的金子, 都是匠人和银匠的手工, 又有蓝色紫色料的衣服, 都是巧匠的工作。
10 ౧౦ అయితే యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే సజీవుడైన దేవుడు, శాశ్వతమైన రాజు. ఆయన కోపాన్ని చూస్తే భూమి కంపిస్తుంది. ఆయన కోపాన్ని రాజ్యాలు తట్టుకోలేవు.
惟耶和华是真 神, 是活 神,是永远的王。 他一发怒,大地震动; 他一恼恨,列国都担当不起。 (
11 ౧౧ మీరు వారితో ఇలా చెప్పాలి. “భూమ్యాకాశాలను సృష్టించని ఈ దేవుళ్ళు భూమి మీదా, ఆకాశం కిందా ఉండకుండా నశించిపోతారు.
你们要对他们如此说:不是那创造天地的神,必从地上从天下被除灭!)
12 ౧౨ ఆయన తన బలంతో భూమిని సృష్టించాడు. తన జ్ఞానంతో ప్రపంచాన్ని స్థాపించాడు, తన తెలివితో ఆకాశాన్ని చక్కగా పరిచాడు.
耶和华用能力创造大地, 用智慧建立世界, 用聪明铺张穹苍。
13 ౧౩ ఆయన స్వరం ఆకాశమండలంలో నీటి గర్జనలాగా వినిపిస్తుంది. భూదిగంతాల్లో నుండి ఆయన ఆవిరి మేఘాలు వచ్చేలా చేస్తాడు. వర్షంతో బాటు ఆయన మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగుల నుండి గాలిని పంపిస్తాడు.
他一发声,空中便有多水激动; 他使云雾从地极上腾; 他造电随雨而闪, 从他府库中带出风来。
14 ౧౪ ప్రతి మనిషీ తెలివిలేని మూర్ఖుడు. విగ్రహాలు పోతపోసే ప్రతివాడూ తాను చేసిన విగ్రహాన్నిబట్టి అవమానం పొందుతాడు. అతడు పోత పోసిన విగ్రహాలు నకిలీవి. వాటికి ప్రాణం లేదు.
各人都成了畜类,毫无知识; 各银匠都因他雕刻的偶像羞愧。 他所铸的偶像本是虚假的, 其中并无气息,
15 ౧౫ అవి ఉపయోగం లేనివి. అవన్నీ ఎగతాళి పనులు. వాటి మీద తీర్పు జరిగినప్పుడు అవి నశించి పోతాయి.
都是虚无的, 是迷惑人的工作; 到追讨的时候必被除灭。
16 ౧౬ యాకోబు వంశానికి వారసత్వంగా ఉన్నవాడు అలాంటి వాడు కాడు. ఆయన సమస్తాన్నీ నిర్మించేవాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన వారసత్వం. సేనల ప్రభువు అని ఆయనకు పేరు.
雅各的分不像这些, 因他是造作万有的主。 以色列也是他产业的支派, 万军之耶和华是他的名。
17 ౧౭ ముట్టడిలో ఉన్న ప్రజలారా, దేశం విడిచి వెళ్ళడానికి నీ సామాను సర్దుకోండి.”
受围困的人哪,当收拾你的财物, 从国中带出去。
18 ౧౮ యెహోవా చేప్పేదేమంటే “నేను ఈసారి ఈ దేశ నివాసులను బయటికి విసిరివేస్తాను. వారు పట్టబడేలా చేసి నిస్పృహకు గురి చేస్తాను.”
因为耶和华如此说: 这时候,我必将此地的居民, 好像用机弦甩出去, 又必加害在他们身上, 使他们觉悟。
19 ౧౯ అయ్యో, నా ఎముకలకు దెబ్బ తగిలి ఆ గాయం పుండుగా మారింది. అయితే “ఇది నాకు కలిగిన బాధ. నేను దీనిని సహించాల్సిందే” అనుకుంటాను.
民说:祸哉!我受损伤; 我的伤痕极其重大。 我却说:这真是我的痛苦, 必须忍受。
20 ౨౦ నా గుడారం చిందర వందర అయ్యింది. నా డేరా తాళ్ళు అన్నీ తెగిపోయాయి. వారు నా పిల్లలను తీసుకెళ్ళిపోయారు. అందుకే వారు లేరు. నా డేరా నిలబెట్టడానికి, వాటి తెరలు వేయడానికి నా దగ్గర ఎవరూ లేరు.
我的帐棚毁坏; 我的绳索折断。 我的儿女离我出去,没有了。 无人再支搭我的帐棚,挂起我的幔子。
21 ౨౧ కాపరులు మూర్ఖులై యెహోవాను అడగరు. కాబట్టి వారికి విజయం లేదు. వారి మందలన్నీ చెదరిపోతున్నాయి.
因为牧人都成为畜类, 没有求问耶和华, 所以不得顺利; 他们的羊群也都分散。
22 ౨౨ అదిగో వినండి, వార్త రానే వచ్చింది, వారి రాక ధ్వని వినబడుతూ ఉంది. యూదా పట్టణాలను పాడు చేసి, వాటిని నక్కల నివాసంగా చేయడానికి ఉత్తరదేశం నుండి వస్తున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుతూ ఉంది.
有风声!看哪,敌人来了! 有大扰乱从北方出来, 要使犹大城邑变为荒凉, 成为野狗的住处。
23 ౨౩ యెహోవా, మనుషులు తమ మార్గాలను నిర్ణయించుకోవడం వారికి చేతకాదనీ, మంచిగా ప్రవర్తించడం వారి వశంలో లేదనీ నాకు తెలుసు.
耶和华啊,我晓得人的道路不由自己, 行路的人也不能定自己的脚步。
24 ౨౪ యెహోవా, నన్ను నీ న్యాయవిధిని బట్టి క్రమశిక్షణలో పెట్టు. అలా కాక నీ కోపాన్ని బట్టి శిక్షించావంటే నేను నాశనమైపోతాను.
耶和华啊,求你从宽惩治我, 不要在你的怒中惩治我, 恐怕使我归于无有。
25 ౨౫ నిన్నెరగని అన్యజనాల మీదా నీ పేరున ప్రార్థించని వంశాల మీదా నీ కోపాన్ని కుమ్మరించు. ఎందుకంటే వారు యాకోబు వంశాన్ని పూర్తిగా నిర్మూలం చేయడానికి మింగివేశారు. దాని నివాస స్థలాలను పాడు చేశారు.
愿你将忿怒倾在不认识你的列国中, 和不求告你名的各族上; 因为他们吞了雅各,不但吞了,而且灭绝, 把他的住处变为荒场。