< యాకోబు 5 >
1 ౧ ధనవంతులారా, మీ మీదికి వచ్చే దుర్దశను తలచుకుని శోకించండి.
Og nu, I rike: Gråt og jamre over eders ulykker, som kommer over eder!
2 ౨ మీ సిరిసంపదలు శిథిలమైపోయాయి. మీ బట్టలు చిమ్మెటలు కొట్టేస్తున్నాయి.
Eders rikdom er råtnet, og eders klær er blitt møllett;
3 ౩ మీ వెండి బంగారాలు తుప్పుపట్టాయి. ఆ తుప్పే మీమీద సాక్ష్యం పలుకుతూ అగ్నిలాగా మీ దేహాలను దహిస్తుంది. మీరు చివరిదినాల్లో ధనం పోగు చేసుకున్నారు.
eders gull og sølv er rustet bort, og rusten på det skal være til vidnesbyrd mot eder og ete eders kjød som en ild; I har samlet skatter i de siste dager!
4 ౪ చూడండి, మీ చేను కోసిన పనివారి కూలీ ఇవ్వకుండా, మీరు మోసంగా బిగపట్టిన కూలీ కేకలు వేస్తున్నది. మీ కోతపని వారి ఆక్రందనలు సేనల ప్రభువు చెవిని బడుతున్నాయి.
Se, den lønn I har forholdt arbeiderne som har skåret eders akrer, den skriker, og høstfolkenes rop er kommet inn for den Herre Sebaots ører.
5 ౫ మీరు భూమి మీద సుఖంగా బతుకుతూ భోగలాలసులై వధ దినం కోసం మీ హృదయాలను కొవ్వబెట్టుకున్నారు.
I har levd i vellevnet på jorden og efter eders lyster; I har gjødd eders hjerter på slaktedagen!
6 ౬ మిమ్మల్ని ఎదిరించలేని నీతిపరులకు మీరు శిక్ష విధించి చంపారు.
I har domfelt og drept den rettferdige; ingen gjør motstand mot eder.
7 ౭ కాబట్టి సోదరులారా, ప్రభువు రాక వరకూ సహనంతో ఉండండి. రైతు తొలకరి వాన, కడవరి వాన కురిసే దాకా విలువైన పంట కోసం ఓపికతో ఎదురు చూస్తూ వేచి ఉంటాడు కదా.
Vær da tålmodige, brødre, til Herren kommer! Se, bonden venter på jordens kostelige grøde og bier tålmodig på den, til den får høstregn og vårregn;
8 ౮ ప్రభువు రాక దగ్గర పడింది. మీరు కూడా ఓపికగా ఉండండి. మీ హృదయాలను దిటవు చేసుకోండి.
vær og I tålmodige, styrk eders hjerter! for Herrens komme er nær.
9 ౯ సోదరులారా, ఒకడి మీద ఒకడు సణుక్కోకండి, అప్పుడు మీ మీదికి తీర్పు రాదు. ఇదుగో న్యాయాధిపతి వాకిట్లోకి వచ్చేశాడు.
Sukk ikke mot hverandre, brødre, forat I ikke skal dømmes! Se, dommeren står for døren.
10 ౧౦ నా సోదరులారా, ప్రభువు నామంలో బోధించిన ప్రవక్తలు ఎదుర్కొన్న హింసలను, ఓపికను ఆదర్శంగా తీసుకోండి.
Mine brødre! ta profetene, som talte i Herrens navn, til eders forbillede i å lide ondt og være tålmodig!
11 ౧౧ చూడండి, సహించి నిలబడిన వారిని ధన్యులని భావిస్తాము గదా? మీరు యోబు సహనాన్ని గూర్చి విన్నారు. యోబు విషయంలో దేవుని ఉద్దేశాలను తెలిసిన మీరు ఆయన ఎంతో జాలి, కరుణ ఉన్నవాడని గ్రహించారు.
Se, vi priser dem salige som lider tålmodig. I har hørt om Jobs tålmod og sett den utgang som Herren gjorde; for Herren er overmåte miskunnelig og barmhjertig.
12 ౧౨ నా సోదరులారా, ఒక ముఖ్యమైన సంగతి. ఆకాశం తోడనీ భూమి తోడనీ మరి దేని తోడనీ ఒట్టు పెట్టుకోవద్దు. మీరు “అవునంటే అవును, కాదంటే కాదు” అన్నట్టుగా ఉంటే మీరు తీర్పు పాలు కారు.
Men fremfor alt, mine brødre, sverg ikke, hverken ved himmelen eller ved jorden eller nogen annen ed! men eders ja være ja, og eders nei være nei, forat I ikke skal falle under dommen!
13 ౧౩ మీలో ఎవరికైనా కష్టం వస్తే అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగితే అతడు కీర్తనలు పాడాలి.
Lider nogen iblandt eder ondt, han bede; er nogen vel til mote, han synge lovsanger.
14 ౧౪ మీలో ఎవరైనా జబ్బు పడ్డాడా? అతడు సంఘ పెద్దలను పిలిపించుకోవాలి, వారు ప్రభువు నామంలో అతనికి నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయాలి.
Er nogen iblandt eder syk, han kalle til sig menighetens eldste, og de skal bede over ham og salve ham med olje i Herrens navn,
15 ౧౫ విశ్వాసంతో కూడిన ప్రార్థన ఆ రోగిని బాగు చేస్తుంది. ప్రభువు అతణ్ణి లేపుతాడు, అతడు పాపం చేసి ఉంటే అతనికి పాపక్షమాపణ దొరుకుతుంది.
og troens bønn skal hjelpe den syke, og Herren skal reise ham op, og har han gjort synder, skal de bli ham forlatt.
16 ౧౬ కాబట్టి మీ పాపాలను ఒకరితో ఒకడు ఒప్పుకోండి. మీకు స్వస్థత కలిగేలా ఒకడి కోసం ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన ఫలభరితమైనది. అది ఎంతో బలవత్తరమైనది.
Bekjenn derfor eders synder for hverandre og bed for hverandre, forat I kan bli lægt! En rettferdig manns bønn har stor kraft i sin virkning.
17 ౧౭ ఏలీయా మనలాటి స్వభావం ఉన్న మనిషే. వానలు కురవకుండా అతడు తీవ్రంగా ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు భూమి మీద వాన కురవలేదు.
Elias var et menneske under samme vilkår som vi, og han bad at det ikke skulde regne, og det regnet ikke på jorden i tre år og seks måneder;
18 ౧౮ అతడు తిరిగి ప్రార్థన చేస్తే ఆకాశం వాన కురిపించింది, భూమి ఫలసాయం ఇచ్చింది.
og han bad atter, og himmelen gav regn, og jorden bar sin grøde.
19 ౧౯ నా సోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుంచి తొలగిపోతే మరొకడు అతన్ని తిరిగి సత్యానికి మళ్ళించినట్టయితే
Mine brødre! dersom nogen iblandt eder har faret vill fra sannheten, og en omvender ham,
20 ౨౦ అలాటి పాపిని తన తప్పుమార్గం నుంచి మళ్ళించే వాడు మరణం నుంచి ఒక ఆత్మను రక్షించి అనేక పాపాలను కప్పివేస్తాడని అతడు తెలుసుకోవాలి.
han skal vite at den som omvender en synder fra hans villfarende vei, han frelser en sjel fra døden og skjuler en mangfoldighet av synder.