< యాకోబు 4 >

1 మీలో తగాదాలూ, అభిప్రాయభేదాలూ ఎక్కడ నుండి వస్తున్నాయి? మీ సాటి విశ్వాసుల్లో వివాదాలకు కారణమైన మీ శరీర సంబంధమైన కోరికల నుంచే కదా?
Звідкіля войни та свари в вас? Чи не звідсіля: з розкошів ваших, що воюють у членах ваших?
2 మీకు లేని వాటిని కోరుకుంటారు. మీరు పొందలేని దాని వెనకాల పరుగులు పెడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. పోరాటం చేస్తున్నారు, తగాదాలాడుతున్నారు కానీ దేవుణ్ణి అడగరు కాబట్టి మీరేదీ పొందరు.
Бажаєте, та й не маєте; убиваєте і завидуєте, та й не можете осягти; сваритесь і воюєте, та й не маєте, тим що не просите.
3 మీరడిగినా మీకేమీ దొరకదు. ఎందుకంటే మీ సుఖభోగాల కోసం ఖర్చు చేసేందుకు చెడ్డ వాటిని అడుగుతారు.
Просите, та й не приймаєте, тому що погано просите, щоб обернути на розкоші ваші.
4 కులటలారా, లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వమని మీకు తెలియదా? దాన్ని బట్టి ఈ లోకంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతాడు.
Перелюбники і перелюбниці! хиба не знаєте, що любов сьвіта сього - вражда проти Бога? Оце ж, хто хоче бути приятелем сьвіту, той стаєть ся ворогом Бога.
5 ఆయన మనలో ఉంచిన ఆత్మ మనలను తీవ్రమైన ఆసక్తితో కోరుకుంటాడు అని లేఖనం చెబుతున్నది. ఆ లేఖనం వ్యర్థం అనుకుంటున్నారా?
Або думаєте, що марно писаннє глаголе: "до зависти пре Дух, що вселив ся в нас?"
6 కాదు, ఆయన అధికంగా కృప దయ చేస్తాడు. అందుకనే “దేవుడు గర్విష్టులను అడ్డుకుంటాడు. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు” అని లేఖనం చెబుతున్నది.
Більшу ж дає благодать; тим же і глаголе: "Господь гордим противить ся, смиренним же дає благодать."
7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు.
Коріте ся ж оце Богу, противтеся ж дияволові, то й утїче од вас.
8 దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి.
Приближуйтесьдо Бога, то й приближить ся до вас; очистіть руки грішники, і направте серця (ваші) двоєдушники.
9 చపలచిత్తులారా విలపించండి. మీ నవ్వును విచారానికీ, మీ ఆనందాన్ని చింతకూ మార్చుకోండి.
Страдайте, сумуйте та плачте сьміх ваш у плач нехай обернеть ся і радість у горе.
10 ౧౦ ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు.
Смирітесь перед Господом, то в підійме вас.
11 ౧౧ సోదరులారా, మీలో ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడకండి. తన సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు లేక తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నాడు. ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నావంటే ధర్మశాస్త్రానికి నువ్వు లోబడడం లేదని అర్థం. ధర్మశాస్త్రానికే న్యాయాధిపతిగా వ్యవహరిస్తున్నావని అర్థం.
Не осуджуйте один одного, браттє; хто бо осуджує брата та судить брата свого, осуджує закон і судить закон; коли ж закон судиш, то ти не чинитель закону, а суддя.
12 ౧౨ ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందీ తీర్పు తీర్చేదీ ఒక్కరే. దేవుడే! ఆయనే రక్షించడానికీ నాశనం చేయడానికీ సమర్ధుడు. ఇతరులకి తీర్పు తీర్చడానికి నువ్వెవరు?
Один єсть Законодавець, що може спасти і погубити; ти ж хто вси, що судиш другого?
13 ౧౩ “నేడో రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అనుకునే వారికి ఒక మాట.
А нуте ж ви, що говорите: Сьогодні або завтра пійдемо в той і той город, і пробудемо там рік, та торгувати мем та дбати мем,
14 ౧౪ రేపేం జరుగుతుందో ఎవరికీ తెలుసు? అసలు నీ జీవితం ఏపాటిది? కాసేపు కనిపించి మాయమై పోయే ఆవిరిలాంటిది.
(ви, що не знаєте, що буде завтрішнього. Яке бо життє ваше? та же ж воно пара, що на малий час явить ся, а потім счезає.)
15 ౧౫ కాబట్టి మీరు, “ప్రభువుకు ఇష్టమైతే ఈ రోజు మనం జీవించి ఇది చేద్దాం, అది చేద్దాం” అనుకోవాలి.
Замість щоб говорити вам: Коли Господь зводить та живі будемо. то зробимо се або те.
16 ౧౬ ఇప్పుడైతే మీరు దురహంకారంగా ఉన్నారు. ఈ గర్వం చెడ్డది.
Нинї ж хвалитесь у гордощах ваших. Усяка така хвала лиха.
17 ౧౭ మంచి విషయాలు చేయాలని తెలిసీ చేయని వాడికి అది పాపంగా పరిణమిస్తుంది.
Оце ж хто знав, як чинити добро, та й не чинить, тому гріх.

< యాకోబు 4 >