< యాకోబు 4 >
1 ౧ మీలో తగాదాలూ, అభిప్రాయభేదాలూ ఎక్కడ నుండి వస్తున్నాయి? మీ సాటి విశ్వాసుల్లో వివాదాలకు కారణమైన మీ శరీర సంబంధమైన కోరికల నుంచే కదా?
De unde vin războaiele și luptele dintre voi? Nu vin ele din plăcerile voastre care se războiesc în mădularele voastre?
2 ౨ మీకు లేని వాటిని కోరుకుంటారు. మీరు పొందలేని దాని వెనకాల పరుగులు పెడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. పోరాటం చేస్తున్నారు, తగాదాలాడుతున్నారు కానీ దేవుణ్ణి అడగరు కాబట్టి మీరేదీ పొందరు.
Voi poftiți, și nu aveți. Ucideți și poftiți, și nu puteți obține. Vă luptați și faceți război. Nu aveți, pentru că nu cereți.
3 ౩ మీరడిగినా మీకేమీ దొరకదు. ఎందుకంటే మీ సుఖభోగాల కోసం ఖర్చు చేసేందుకు చెడ్డ వాటిని అడుగుతారు.
Cereți, și nu primiți, pentru că cereți cu motive greșite, ca să cheltuiți pe plăcerile voastre.
4 ౪ కులటలారా, లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వమని మీకు తెలియదా? దాన్ని బట్టి ఈ లోకంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతాడు.
Voi, adulterinilor și adulterinelor, nu știți că prietenia cu lumea este ostilitate față de Dumnezeu? De aceea, oricine vrea să fie prieten cu lumea se face dușman al lui Dumnezeu.
5 ౫ ఆయన మనలో ఉంచిన ఆత్మ మనలను తీవ్రమైన ఆసక్తితో కోరుకుంటాడు అని లేఖనం చెబుతున్నది. ఆ లేఖనం వ్యర్థం అనుకుంటున్నారా?
Sau credeți că Scriptura spune în zadar: “Duhul care trăiește în noi tânjește cu gelozie”?
6 ౬ కాదు, ఆయన అధికంగా కృప దయ చేస్తాడు. అందుకనే “దేవుడు గర్విష్టులను అడ్డుకుంటాడు. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు” అని లేఖనం చెబుతున్నది.
Dar el dă mai mult har. De aceea se spune: “Dumnezeu se împotrivește celor mândri, dar dă har celor smeriți”.
7 ౭ కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు.
Fiți deci supuși lui Dumnezeu. Împotriviți-vă diavolului și el va fugi de voi.
8 ౮ దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి.
Apropiați-vă de Dumnezeu, și el se va apropia de voi. Curățați-vă mâinile, păcătoșilor. Curățați-vă inimile, voi, cei cu minte dublă.
9 ౯ చపలచిత్తులారా విలపించండి. మీ నవ్వును విచారానికీ, మీ ఆనందాన్ని చింతకూ మార్చుకోండి.
Plângeți, jeliți și plângeți. Râsul vostru să se transforme în jale și bucuria voastră în tristețe.
10 ౧౦ ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు.
Umiliți-vă în fața Domnului, și el vă va înălța.
11 ౧౧ సోదరులారా, మీలో ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడకండి. తన సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు లేక తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నాడు. ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నావంటే ధర్మశాస్త్రానికి నువ్వు లోబడడం లేదని అర్థం. ధర్మశాస్త్రానికే న్యాయాధిపతిగా వ్యవహరిస్తున్నావని అర్థం.
Fraților, nu vorbiți unul împotriva altuia. Cine vorbește împotriva unui frate și judecă pe fratele său, vorbește împotriva legii și judecă legea. Dar dacă judeci legea, nu ești un împlinitor al legii, ci un judecător.
12 ౧౨ ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందీ తీర్పు తీర్చేదీ ఒక్కరే. దేవుడే! ఆయనే రక్షించడానికీ నాశనం చేయడానికీ సమర్ధుడు. ఇతరులకి తీర్పు తీర్చడానికి నువ్వెవరు?
Numai unul singur este făcătorul legii, care poate să mântuiască și să distrugă. Dar cine ești tu să judeci pe altul?
13 ౧౩ “నేడో రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అనుకునే వారికి ఒక మాట.
Veniți acum, voi, care ziceți: “Astăzi sau mâine să mergem în cetatea aceasta, să petrecem acolo un an, să facem negoț și să câștigăm.”
14 ౧౪ రేపేం జరుగుతుందో ఎవరికీ తెలుసు? అసలు నీ జీవితం ఏపాటిది? కాసేపు కనిపించి మాయమై పోయే ఆవిరిలాంటిది.
Dar voi nu știți cum va fi viața voastră mâine. Căci ce este viața voastră? Căci voi sunteți un abur care apare pentru puțin timp și apoi dispare.
15 ౧౫ కాబట్టి మీరు, “ప్రభువుకు ఇష్టమైతే ఈ రోజు మనం జీవించి ఇది చేద్దాం, అది చేద్దాం” అనుకోవాలి.
Căci ar trebui să spuneți: “Dacă Domnul vrea, vom trăi amândoi și vom face una sau alta.”
16 ౧౬ ఇప్పుడైతే మీరు దురహంకారంగా ఉన్నారు. ఈ గర్వం చెడ్డది.
Dar acum vă lăudați cu mândria voastră. Orice astfel de laudă este rea.
17 ౧౭ మంచి విషయాలు చేయాలని తెలిసీ చేయని వాడికి అది పాపంగా పరిణమిస్తుంది.
Așadar, pentru cel care știe să facă binele și nu-l face, pentru el este păcat.