< యెషయా~ గ్రంథము 7 >
1 ౧ యూదా రాజైన ఉజ్జియా మనవడు, యోతాము కుమారుడు అయిన ఆహాజు దినాల్లో సిరియా రాజు రెజీను, ఇశ్రాయేలు రాజు, రెమల్యా కుమారుడు అయిన పెకహు యెరూషలేముపై దండెత్తారు. అది వారివల్ల కాలేదు.
It happened in the days of Ahaz the son of Jotham, the son of Uzziah, king of Judah, that Rezin the king of Aram, and Pekah the son of Remaliah, king of Israel, went up to Jerusalem to war against it, but they could not prevail against it.
2 ౨ అప్పుడు సిరియా వారు ఎఫ్రాయిము వారిని తోడు తెచ్చుకున్నారని దావీదు వంశం వారికి తెలిసినప్పుడు గాలికి అడవి చెట్లు ఊగినట్టు వారి హృదయాలు, వారి ప్రజల హృదయాలు గిలగిలలాడాయి.
It was told the house of David, saying, "Aram is allied with Ephraim." His heart trembled, and the heart of his people, as the trees of the forest tremble with the wind.
3 ౩ అప్పుడు యెహోవా యెషయాతో ఇలా చెప్పాడు. ఆహాజుకు ఎదురు వెళ్ళు. నీవు, నీ కుమారుడు షెయార్యాషూబు చాకిరేవు దారిలో ఎగువ కోనేటి కాలవ దగ్గరికి వెళ్ళండి.
Then YHWH said to Isaiah, "Go out now to meet Ahaz, you, and Shearjashub your son, at the end of the conduit of the upper pool, on the highway of the Launderers' Field.
4 ౪ అతనితో చెప్పు “భద్రం. కంగారు పడకు. పొగ లేస్తున్న ఈ రెండు కాగడాలకు అంటే రెజీను, సిరియా వాళ్ళు, రెమల్యా కొడుకు పెకహు-వీళ్ళ కోపాగ్నికి జడిసి పోకు. బెదిరిపోకు.
Tell him, 'Be careful, and keep calm. Do not be afraid, neither let your heart be faint because of these two tails of smoking firebrands, for the fierce anger of Rezin and Aram, and of the son of Remaliah.
5 ౫ సిరియా, ఎఫ్రాయిము, రెమల్యా కొడుకు నీకు కీడు చేయాలని ఆలోచించారు.
Because Aram, Ephraim, and the son of Remaliah, have plotted evil against you, saying,
6 ౬ ‘మనం యూదా దేశం మీదికి పోయి దాని ప్రజలను భయపెట్టి దాని ప్రాకారాలు పడగొట్టి టాబెయేలు కొడుకును దానిపై రాజుగా చేద్దాం రండి’ అని చెప్పుకున్నారు.”
"Let's go up against Judah, and tear it apart, and let's divide it among ourselves, and set up a king in its midst, even the son of Tabeel."
7 ౭ అయితే ప్రభువైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. “ఆ మాట నిలవదు, అది జరగదు.
This is what YHWH says: "It shall not stand, neither shall it happen."
8 ౮ సిరియాకు రాజధాని దమస్కు. దమస్కుకు రాజు రెజీను. అరవై ఐదు సంవత్సరాల లోపు ఎఫ్రాయిము ఒక జాతిగా ఉండకుండా నాశనమై పోతుంది.
For the head of Aram is Damascus, and the head of Damascus is Rezin; and within sixty-five years Ephraim shall be broken in pieces, so that it shall not be a people;
9 ౯ షోమ్రోను ఎఫ్రాయిముకు రాజధాని. షోమ్రోనుకు రాజు రెమల్యా కొడుకు. మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండక పోతే భద్రంగా ఉండరు.”
and the head of Ephraim is Samaria, and the head of Samaria is Remaliah's son. If you will not believe, surely you shall not be established.'"
10 ౧౦ యెహోవా ఆహాజుకు ఇంకా ఇలా చెప్పాడు.
YHWH spoke again to Ahaz, saying,
11 ౧౧ “నీ దేవుడైన యెహోవాను సూచన అడుగు. అది ఎంత లోతైనదైనా, ఎంత ఎత్తయినదైనా సరే.” (Sheol )
"Ask a sign of YHWH your God; ask it either in the depth, or in the height above." (Sheol )
12 ౧౨ కానీ ఆహాజు “నేను అడగను. యెహోవాను పరీక్షించను” అన్నాడు.
But Ahaz said, "I will not ask, neither will I tempt YHWH."
13 ౧౩ కాబట్టి యెషయా ఇలా జవాబిచ్చాడు. “దావీదు వంశస్థులారా, వినండి. మనుషులను విసికించడం చాలదన్నట్టు నా దేవుణ్ణి కూడా విసిగిస్తారా?
He said, "Listen now, house of David: Is it not enough for you to try the patience of men, that you will try the patience of my God also?
14 ౧౪ కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుతాడు. వినండి, కన్య గర్భం ధరించి కుమారుణ్ణి కని అతనికి ‘ఇమ్మానుయేలు’ అని పేరు పెడుతుంది.
Therefore YHWH himself will give you a sign. Look, the virgin will conceive, and bear a son, and they will call his name Immanuel.
15 ౧౫ కీడును తోసిపుచ్చడం, మేలును కోరుకోవడం అతనికి తెలిసి వచ్చేనాటికి అతడు పెరుగు, తేనె తింటాడు.
He shall eat curds and honey when he knows to refuse the evil, and choose the good.
16 ౧౬ కీడును తోసిపుచ్చడం, మేలును కోరుకోవడం అతనికి తెలిసి రాక ముందే ఎవరిని చూసి నువ్వు హడలి పోతున్నావో ఆ ఇద్దరు రాజుల దేశం నాశనమై పోతుంది.
For before the child knows to refuse the evil, and choose the good, the land whose two kings you abhor shall be forsaken.
17 ౧౭ యెహోవా నీ పైకి, నీ జాతి పైకి, నీ పితరుల కుటుంబం వారి మీదికి బాధ దినాలను, ఎఫ్రాయిము యూదా నుండి వేరైపోయిన దినం మొదలు నేటి వరకూ రాని దినాలను రప్పిస్తాడు. ఆయన అష్షూరు రాజును నీపైకి రప్పిస్తాడు.
YHWH will bring on you, on your people, and on your father's house, days that have not come, from the day that Ephraim departed from Judah; even the king of Assyria.
18 ౧౮ ఆ దినాన దూరంగా ఐగుప్తు ప్రవాహాల దగ్గర ఉన్న జోరీగలను, అష్షూరు దేశపు కందిరీగలను యెహోవా ఈల వేసి పిలుస్తాడు.
It will happen in that day that YHWH will whistle for the fly that is in the uttermost part of the rivers of Egypt, and for the bee that is in the land of Assyria.
19 ౧౯ అవన్నీ వచ్చి మెట్టల్లో లోయల్లో బండల సందుల్లో ముళ్ళ పొదలన్నిటిలో గడ్డి బీడులన్నిటిలో దిగి ఉండిపోతాయి.
They shall come, and shall all rest in the desolate valleys, in the clefts of the rocks, on all thorn hedges, and on all pastures.
20 ౨౦ ఆ దినాన యెహోవా నది (యూప్రటీసు) అవతలి నుండి కిరాయికి వచ్చే మంగలి కత్తితో, అంటే అష్షూరు రాజు చేత నీ తల వెంట్రుకలను కాళ్ల వెంట్రుకలను గొరిగిస్తాడు. అది నీ గడ్డాన్ని కూడా గొరిగిస్తుంది.
In that day YHWH will shave with a razor that is hired in the parts beyond the River, even with the king of Assyria, the head and the hair of the feet; and it shall also consume the beard.
21 ౨౧ ఆ దినాన ఒకడు ఒక చిన్న ఆవును, రెండు గొర్రెలను పెంచుకుంటే
It shall happen in that day that a man shall keep alive a young cow, and two sheep;
22 ౨౨ అవి సమృద్ధిగా పాలిచ్చినందువల్ల అతడు పెరుగు తింటాడు. ఎందుకంటే ఈ దేశంలో శత్రువులు వదిలేసి పోయిన వారందరూ పెరుగు తేనెలు తింటారు.
and it shall happen, that because of the abundance of milk which they shall give he shall eat butter: for everyone will eat butter and honey that is left in the midst of the land.
23 ౨౩ ఆ దినాన వెయ్యి వెండి నాణేల విలువగల వెయ్యి ద్రాక్షచెట్లు ఉండే ప్రతి స్థలంలో ముళ్ళతుప్పలు, బ్రహ్మజెముడు చెట్లు పెరుగుతాయి.
It will happen in that day that every place where there were a thousand vines at a thousand silver shekels, shall be for briers and thorns.
24 ౨౪ ఈ దేశమంతా ముళ్ళ తుప్పలతో, బ్రహ్మ జెముడు చెట్లతో నిండి ఉంటుంది గనక విల్లంబులు చేతబట్టుకుని ప్రజలు వేటకు అక్కడికి పోతారు.
People will go there with arrows and with bow, because all the land will be briers and thorns.
25 ౨౫ ముళ్ళతుప్పల, బ్రహ్మ జెముడు చెట్ల భయం వల్ల మునుపు పారతో తవ్వి సాగు చేసిన కొండల వైపుకు మనుషులు పోరు. అది పశువులు, గొర్రెలు పచ్చిక మేసే చోటుగా ఉంటుంది.”
All the hills that were cultivated with the hoe, you shall not come there for fear of briers and thorns; but it shall be for the sending forth of oxen, and for the treading of sheep."