< యెషయా~ గ్రంథము 63 >

1 ఎర్రటి బట్టలు కట్టుకుని ఎదోములోని బొస్రా నుంచి వస్తున్న ఈయనెవరు? రాజ వస్త్రాలతో తన మహా బలంతో గంభీరంగా వస్తున్న ఈయనెవరు? నీతితో మాట్లాడే నేనే. రక్షించడానికి సమర్ధుణ్ణి.
מִי־זֶה ׀ בָּא מֵאֱדוֹם חֲמוּץ בְּגָדִים מִבׇּצְרָה זֶה הָדוּר בִּלְבוּשׁוֹ צֹעֶה בְּרֹב כֹּחוֹ אֲנִי מְדַבֵּר בִּצְדָקָה רַב לְהוֹשִֽׁיעַ׃
2 నీ బట్టలు ఎందుకు ఎర్రగా ఉన్నాయి? నీ బట్టలు ద్రాక్షగానుగ తొక్కేవాడి బట్టల్లాగా ఎందుకున్నాయి?
מַדּוּעַ אָדֹם לִלְבוּשֶׁךָ וּבְגָדֶיךָ כְּדֹרֵךְ בְּגַֽת׃
3 ఒంటరిగా ద్రాక్షగానుగ తొక్కాను. రాజ్యాల్లో ఎవడూ నాతో చేరలేదు. కోపంతో వారిని తొక్కాను. ఆగ్రహంతో వారిని అణగదొక్కాను. వారి రక్తం నా బట్టల మీద చిందింది. నా బట్టలన్నీ మరకలే.
פּוּרָה ׀ דָּרַכְתִּי לְבַדִּי וּמֵֽעַמִּים אֵֽין־אִישׁ אִתִּי וְאֶדְרְכֵם בְּאַפִּי וְאֶרְמְסֵם בַּחֲמָתִי וְיֵז נִצְחָם עַל־בְּגָדַי וְכׇל־מַלְבּוּשַׁי אֶגְאָֽלְתִּי׃
4 పగ తీర్చుకునే రోజు కోసం చూశాను. నా విడుదల సంవత్సరం వచ్చింది.
כִּי יוֹם נָקָם בְּלִבִּי וּשְׁנַת גְּאוּלַי בָּֽאָה׃
5 సాయం చేసేవాడి కోసం చూశాను. ఎవరూ రాలేదు. ఎవడూ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాను. అయితే నా హస్తమే నాకు విజయం సాధించిపెట్టింది. నా ఆగ్రహం నన్ను నడిపించింది.
וְאַבִּיט וְאֵין עֹזֵר וְאֶשְׁתּוֹמֵם וְאֵין סוֹמֵךְ וַתּוֹשַֽׁע־לִי זְרֹעִי וַחֲמָתִי הִיא סְמָכָֽתְנִי׃
6 కోపంతో ప్రజలను తొక్కేశాను. నా ఆగ్రహంతో వారికి మత్తెక్కించాను. వారి రక్తాన్ని నేల పారబోశాను.
וְאָבוּס עַמִּים בְּאַפִּי וַאֲשַׁכְּרֵם בַּחֲמָתִי וְאוֹרִיד לָאָרֶץ נִצְחָֽם׃
7 యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయాన్ని, యెహోవా స్తుతి పాత్రమైన పనులను వర్ణిస్తాను. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని గురించి నేను చెబుతాను. తన వాత్సల్యాన్ని బట్టి, కృపాతిశయాన్ని బట్టి, ఇశ్రాయేలు వంశం వారికి ఆయన చూపిన మహాకనికరాన్ని నేను ప్రకటన చేస్తాను.
חַֽסְדֵי יְהֹוָה ׀ אַזְכִּיר תְּהִלֹּת יְהֹוָה כְּעַל כֹּל אֲשֶׁר־גְּמָלָנוּ יְהֹוָה וְרַב־טוּב לְבֵית יִשְׂרָאֵל אֲשֶׁר־גְּמָלָם כְּֽרַחֲמָיו וּכְרֹב חֲסָדָֽיו׃
8 అయితే ఆయన ఇలా అన్నాడు. “కచ్చితంగా వారు నా ప్రజలు. అవిధేయులు కాని పిల్లలు.” ఆయన వారికి రక్షకుడయ్యాడు.
וַיֹּאמֶר אַךְ־עַמִּי הֵמָּה בָּנִים לֹא יְשַׁקֵּרוּ וַיְהִי לָהֶם לְמוֹשִֽׁיעַ׃
9 వారి బాధలన్నిటిలో ఆయన బాధ అనుభవించాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించాడు. ఆయన ప్రేమతో, కనికరంతో వారిని రక్షించాడు. పురాతన దినాలన్నిటిలో ఆయన వారిని ఎత్తుకుంటూ మోస్తూ వచ్చాడు.
בְּֽכׇל־צָרָתָם ׀ (לא) [לוֹ] צָר וּמַלְאַךְ פָּנָיו הוֹשִׁיעָם בְּאַהֲבָתוֹ וּבְחֶמְלָתוֹ הוּא גְאָלָם וַֽיְנַטְּלֵם וַֽיְנַשְּׂאֵם כׇּל־יְמֵי עוֹלָֽם׃
10 ౧౦ అయినా వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపెట్టారు. కాబట్టి ఆయన వారికి శత్రువయ్యాడు. తానే వారితో పోరాడాడు.
וְהֵמָּה מָרוּ וְעִצְּבוּ אֶת־רוּחַ קׇדְשׁוֹ וַיֵּהָפֵךְ לָהֶם לְאוֹיֵב הוּא נִלְחַם־בָּֽם׃
11 ౧౧ ఆయన ప్రజలు పూర్వదినాల్లోని మోషేను గుర్తుకు తెచ్చుకున్నారు. వారిలా అన్నారు, తన మందకాపరులతోబాటు సముద్రంలో నుంచి ప్రజలను తీసుకు వచ్చినవాడేడి? వారి మధ్య తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి?
וַיִּזְכֹּר יְמֵֽי־עוֹלָם מֹשֶׁה עַמּוֹ אַיֵּה ׀ הַֽמַּעֲלֵם מִיָּם אֵת רֹעֵי צֹאנוֹ אַיֵּה הַשָּׂם בְּקִרְבּוֹ אֶת־רוּחַ קׇדְשֽׁוֹ׃
12 ౧౨ మోషే కుడిచేతి వైపున తన ఘనమైన బలాన్ని పంపించిన వాడేడి?
מוֹלִיךְ לִימִין מֹשֶׁה זְרוֹעַ תִּפְאַרְתּוֹ בּוֹקֵֽעַ מַיִם מִפְּנֵיהֶם לַעֲשׂוֹת לוֹ שֵׁם עוֹלָֽם׃
13 ౧౩ తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలగాలని వారిముందు నీళ్లను విభజించినవాడేడి? లోతైన నీళ్ళగుండా వారిని నడిపించిన వాడేడి? మైదానంలో గుర్రం లాగా వాళ్ళు తొట్రుపడలేదు.
מוֹלִיכָם בַּתְּהֹמוֹת כַּסּוּס בַּמִּדְבָּר לֹא יִכָּשֵֽׁלוּ׃
14 ౧౪ లోయలో దిగే పశువుల్లాగా యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలగచేశాడు. నీకు ఘనమైన పేరు కలగాలని నువ్వు నీ ప్రజలను నడిపించావు.
כַּבְּהֵמָה בַּבִּקְעָה תֵרֵד רוּחַ יְהֹוָה תְּנִיחֶנּוּ כֵּן נִהַגְתָּ עַמְּךָ לַעֲשׂוֹת לְךָ שֵׁם תִּפְאָֽרֶת׃
15 ౧౫ పరలోకం నుంచి చూడు. నీ దివ్యమైన పవిత్ర నివాసం నుంచి చూడు. నీ ఆసక్తి, నీ గొప్పపనులు ఎక్కడున్నాయి? మా పట్ల నీ కనికరం, నీ వాత్సల్యం, ఆగిపోయాయేమిటి.
הַבֵּט מִשָּׁמַיִם וּרְאֵה מִזְּבֻל קׇדְשְׁךָ וְתִפְאַרְתֶּךָ אַיֵּה קִנְאָֽתְךָ וּגְבוּרֹתֶךָ הֲמוֹן מֵעֶיךָ וְֽרַחֲמֶיךָ אֵלַי הִתְאַפָּֽקוּ׃
16 ౧౬ అయితే మా తండ్రివి నువ్వే. అబ్రాహాముకు మేము తెలియక పోయినా ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినా, యెహోవా, నువ్వే మా తండ్రివి. అనాదికాలం నుంచి “మా విమోచకుడు” అని నీకు పేరు గదా.
כִּֽי־אַתָּה אָבִינוּ כִּי אַבְרָהָם לֹא יְדָעָנוּ וְיִשְׂרָאֵל לֹא יַכִּירָנוּ אַתָּה יְהֹוָה אָבִינוּ גֹּאֲלֵנוּ מֵעוֹלָם שְׁמֶֽךָ׃
17 ౧౭ యెహోవా, నీ విధానాలనుంచి మమ్మల్ని తప్పిస్తున్నావెందుకు? మాకు నీ పట్ల భయభక్తులు ఉండకుండా మా హృదయాలను ఎందుకు కఠినపరుస్తున్నావు? నీ సేవకుల కోసం నీ సొత్తుగా ఉన్న గోత్రాలకోసం తిరిగి రా.
לָמָּה תַתְעֵנוּ יְהֹוָה מִדְּרָכֶיךָ תַּקְשִׁיחַ לִבֵּנוּ מִיִּרְאָתֶךָ שׁוּב לְמַעַן עֲבָדֶיךָ שִׁבְטֵי נַחֲלָתֶֽךָ׃
18 ౧౮ నీ పవిత్ర ఆలయం నీ ప్రజల ఆధీనంలో కొద్దికాలమే ఉంది. అయితే మా శత్రువులు దాన్ని తొక్కివేశారు.
לַמִּצְעָר יָרְשׁוּ עַם־קׇדְשֶׁךָ צָרֵינוּ בּוֹסְסוּ מִקְדָּשֶֽׁךָ׃
19 ౧౯ నువ్వెన్నడూ పాలించని వాళ్ళలాగా అయ్యాం. నీ పేరెన్నడూ ధరించని వాళ్ళలాగా అయ్యాం.
הָיִינוּ מֵֽעוֹלָם לֹא־מָשַׁלְתָּ בָּם לֹֽא־נִקְרָא שִׁמְךָ עֲלֵיהֶם לֽוּא־קָרַעְתָּ

< యెషయా~ గ్రంథము 63 >