< యెషయా~ గ్రంథము 60 >
1 ౧ లే, ప్రకాశించు! నీకు వెలుగు వచ్చింది. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది.
Arise, shine; for your light has come, and the glory of Yahweh has risen on you.
2 ౨ భూమిని చీకటి కమ్మినా కటిక చీకటి రాజ్యాలను కమ్మినా యెహోవా నీ మీద ఉదయిస్తాడు. ఆయన మహిమ నీ మీద కనబడుతుంది.
Though darkness will cover the earth, and thick darkness the nations; yet Yahweh will arise upon you, and his glory will be seen on you.
3 ౩ రాజ్యాలు నీ వెలుగుకు వస్తారు. రాజులు నీ ఉదయకాంతికి వస్తారు.
Nations will come to your light, and kings to your bright light that is rising.
4 ౪ తలెత్తి చుట్టూ చూడు. వీళ్ళంతా మూకుమ్మడిగా నీ దగ్గరికి వస్తున్నారు. నీ కొడుకులు దూరంనుంచి వస్తారు. నీ కూతుళ్ళు చంకనెక్కి వస్తున్నారు.
Look all around and see. They all gather themselves together and come to you. Your sons will come from far, and your daughters will be carried in their arms.
5 ౫ నువ్వు చూసి ప్రకాశిస్తావు. నీ హృదయం ఆనందిస్తూ ఉప్పొంగుతుంది. సముద్ర సమృద్ధి నీ మీద కుమ్మరించడం జరుగుతుంది. రాజ్యాల ఐశ్వర్యం నీ దగ్గరికి వస్తుంది.
Then you will look and be radiant, and your heart shall rejoice and overflow, because the abundance of the sea will be poured out to you, the wealth of the nations will come to you.
6 ౬ ఒంటెల గుంపులూ మిద్యాను ఏఫాల నుంచి వచ్చిన పిల్ల ఒంటెలూ నీ దేశమంతటా వ్యాపిస్తాయి. వారంతా షేబ నుంచి వస్తారు. బంగారం, ధూపద్రవ్యం తీసుకువస్తారు. యెహోవా కీర్తిని ప్రకటిస్తూ ఉంటారు.
Camel caravans will cover you, the dromedaries of Midian and Ephah; all of them will come from Sheba; they will bring gold and frankincense, and will sing the praises of Yahweh.
7 ౭ నీ కోసం కేదారు గొర్రెమందలన్నీ సమకూడతాయి. నెబాయోతు పొట్లేళ్లు నీ సేవలో ఉపయోగపడతాయి. అవి నా బలిపీఠం మీద బలులుగా అంగీకారమవుతాయి. నా గొప్ప మందిరాన్ని నేను అందంగా అలంకరిస్తాను.
All the flocks of Kedar will be gathered together to you, the rams of Nebaioth will serve your needs; they will be acceptable offerings on my altar; and I will glorify my glorious house.
8 ౮ మబ్బులాగా గువ్వలలాగా తమ గూటికి ఎగిరి వచ్చే వీళ్ళెవరు?
Who are these who fly along like a cloud, and like the doves to their shelters?
9 ౯ నీ దేవుడు యెహోవా పేరునుబట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని పేరును బట్టి ఆయన నిన్ను ఘనపర్చాడు, కాబట్టి నీ కొడుకులను, తమ వెండి బంగారాలను తీసుకురావడానికి, ద్వీపవాసులు నా కోసం చూస్తారు. తర్షీషు ఓడలు మొదట వస్తాయి.
The coastlands look for me, and the ships of Tarshish lead, to bring your sons from far, their silver and their gold with them, for the name of Yahweh your God, and for the Holy One of Israel, because he has honored you.
10 ౧౦ విదేశీయులు నీ గోడలు కడతారు. వారి రాజులు నీకు సేవ చేస్తారు. ఎందుకంటే నేను ఆగ్రహంతో నిన్ను కొట్టినా అనుగ్రహంతో నీ మీద జాలిపడతాను.
Sons of foreigners will rebuild your walls, and their kings will serve you; though in my wrath I punished you, yet in my favor I will have compassion on you.
11 ౧౧ రాజ్యాల సంపద నీదగ్గరికి తెచ్చేలా నీ ద్వారం తలుపులు రాత్రింబగళ్లు మూసివేయడం జరగదు. ఆ ప్రజల ఊరేగింపులో వారి రాజులు ఉంటారు.
Your gates also will remain open continually; they will not be shut day or night, so that the wealth of the nations may be brought, with their kings being led.
12 ౧౨ నిన్ను సేవించడానికి నిరాకరించే ప్రజలు గానీ రాజ్యం గానీ నాశనం అవుతుంది. ఆ రాజ్యాలు తప్పకుండా నాశనం అవుతాయి.
Indeed, nations and kingdoms that will not serve you will perish; those nations will be completely destroyed.
13 ౧౩ నా పరిశుద్ధాలయపు అలంకారం కోసం లెబానోను శ్రేష్ఠమైన దేవదారు వృక్షాలూ సరళవృక్షాలూ గొంజిచెట్లూ నీ దగ్గరికి తెస్తారు. నేను నా పాదాలు పెట్టుకునే స్థలాన్ని ఘనంగా చేస్తాను.
The glory of Lebanon will come to you, the cypress tree, the fir, and the cypress box tree together, to beautify my sanctuary; and I will glorify the place of my feet.
14 ౧౪ నిన్ను బాధించినవారి కొడుకులు నీ ఎదుటికి వచ్చి సాగిలపడతారు. నిన్ను తృణీకరించినవారంతా వచ్చి నీ పాదాల మీద పడతారు. యెహోవా పట్టణం అనీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోను అనీ నీకు పేరు పెడతారు.
They will come to you to bow down, the sons of those who humbled you; they will bow at your feet; they will call you The City of Yahweh, Zion of the Holy One of Israel.
15 ౧౫ నిన్ను విడిచి పెట్టకుండా ఎవరూ నిన్ను ద్వేషించకుండా నీ ద్వారా ఎవరూ వెళ్ళకుండా ఉండడానికి బదులు నిన్ను ఎప్పటికీ హుందాగా ఉండేలా తరతరాలకు సంతోష కారణంగా చేస్తాను.
Instead of you remaining abandoned and hated, with no one passing through you, I will make you a thing of pride forever, a joy from generation to generation.
16 ౧౬ రాజ్యాల పాలుకూడా నువ్వు తాగుతావు. రాజుల చనుపాలు తాగుతావు. యెహోవానైన నేను నీ రక్షకుడిననీ యాకోబు బలవంతుడైన దేవుడిననీ నీ విమోచకుడిననీ నువ్వు తెలుసుకుంటావు.
You will also drink the milk of the nations, and will nurse at the breast of kings; you will know that I, Yahweh, am your Savior and your Redeemer, the Mighty One of Jacob.
17 ౧౭ నేను కంచుకు బదులు బంగారాన్నీ ఇనుముకు బదులు వెండినీ చెక్కకు బదులు ఇత్తడినీ రాళ్ళకు బదులు ఇనుమునూ తెస్తాను. శాంతిని నీకు అధికారులుగా న్యాయాన్ని నీకు పరిపాలకులుగా నియమిస్తాను.
Instead of bronze I will bring gold, instead of iron I will bring silver; instead of wood, bronze, and instead of stones, iron. I will appoint peace as your governors, and justice your rulers.
18 ౧౮ ఇకనుంచి నీ దేశంలో దుర్మార్గం అనే మాట వినబడదు. నీ సరిహద్దుల్లో నాశనం, ధ్వంసం అనే మాటలు వినబడవు. నీ గోడలను విడుదల అనీ నీ ద్వారాలను స్తుతి అనీ అంటావు.
Violence will no longer be heard in your land, or devastation nor shattering within your borders; but you will call your walls Salvation, and your gates Praise.
19 ౧౯ ఇక మీదట పగటివేళ సూర్య కాంతి నీకు వెలుగుగా ఉండదు. వెన్నెల నీ మీద ప్రకాశింపదు. యెహోవాయే నీకు ఎప్పటికీ నిలిచిపోయే కాంతి. నీ దేవుడు నీకు శోభ.
The sun will no longer be your light by day, nor will the brightness of the moon shine on you; but Yahweh will be your everlasting light, and your God your glory.
20 ౨౦ నీ సూర్యుడు ఇక ఎన్నటికీ అస్తమించడు. నీ వెన్నెల తగ్గదు. యెహోవాయే నీకు ఎప్పటికీ నిలిచిపోయే కాంతి. నీ దుఃఖదినాలు అంతం అవుతాయి.
Your sun will no longer set, nor will your moon withdraw and disappear; for Yahweh will be your everlasting light, and the days of your mourning will be ended.
21 ౨౧ నీ ప్రజలంతా నీతిమంతులుగా ఉంటారు. దేశం ఎప్పటికీ వారి స్వాధీనంలో ఉంటుంది. వారు నా ఘనత కోసం నేను నాటిన కొమ్మ. నేను చేసిన పని.
All your people will be righteous; they will take possession of the land for all time, the branch of my planting, the work of my hands, that I may be glorified.
22 ౨౨ అల్పుడు వేయిమంది అవుతాడు. చిన్నవాడు బలమైన జనం అవుతాడు. నేను యెహోవాను. తగిన కాలంలో వీటిని త్వరగా జరిగిస్తాను.
The little one shall become a thousand, and the small one a strong nation; I, Yahweh, will swiftly accomplish these things when the time comes.