< యెషయా~ గ్రంథము 55 >
1 ౧ “దప్పికతో ఉన్న మీరంతా, నీళ్ల దగ్గరికి రండి! డబ్బు లేని మీరంతా వచ్చి, కొని, తినండి. రండి, డబ్బు లేకపోయినా ఖర్చు లేకుండా ద్రాక్షారసం, పాలు కొనండి.
E A! na mea a pau e makewai, E hele mai oukou i na wai, A o ka mea kala ole, e hele mai hoi oukou, e kuai no, a e ai iho; Oia, e hele mai, e kuai i ka waina, a me ka waiu, me ke kala ole, a me ke kumu ole.
2 ౨ తిండి కాని దాని కోసం మీరెందుకు వెండి తూస్తారు? తృప్తినివ్వని దానికోసం మీరెందుకు కష్టపడతారు? నా మాట జాగ్రత్తగా విని మంచివాటిని తినండి. కొవ్విన వాటితో సుఖించండి.
No ke aha la oukou i kaupaona aku ai i ka oukou kala i ka mea, aole ia he berena? A i ko oukou waiwai hoi, i ka mea hoomaona ole mai? E hoolohe pono mai oukou ia'u, a e ai hoi i ka mea i maikai io, A e olioli hoi ko oukou uhane ma ka momona.
3 ౩ శ్రద్ధగా విని నా దగ్గరికి రండి! మీరు వింటే బతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. దావీదుకు చూపించిన శాశ్వతకృపను మీకు చూపిస్తాను.
E haliu mai i ko oukou pepeiao, a e hele mai ia'u; A hoolohe mai, a e ola no ko oukou uhane; A e hana no au me oukou i berita mau loa, I ka lokomaikai oiaio hoi o Davida.
4 ౪ ఇదిగో, రాజ్యాలకు సాక్షిగా నేనతన్ని నియమించాను. ప్రజలకు నాయకునిగా అధికారిగా అతన్ని నియమించాను.”
Aia hoi, ua haawi aku au ia ia i mea hoike no na kanaka, I alakai hoi, a i luna no na lahuikanaka.
5 ౫ నీకు తెలియని రాజ్యాన్ని నువ్వు పిలుస్తావు. నిన్నెరుగని రాజ్యం నీదగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తుంది. ఎందుకంటే, నీ యెహోవా దేవుడు నిన్ను ఘనపరచాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల పవిత్రుడు.
Aia hoi, e kahea aku no oe i ka lahuikanaka au i ike ole ai; A o ka lahuikanaka i ike ole ia oe, e holo aku no lakou iou la, No Iehova, kou Akua, a no ka Mea Hemolele o ka Iseraela; No ka mea, ua hoonani mai oia ia oe.
6 ౬ యెహోవా మీకు దొరికే సమయంలో ఆయన్ని వెదకండి. ఆయన దగ్గరగా ఉండగానే ఆయన్ని వేడుకోండి.
E imi oukou ia Iehova, oiai oia ma kahi e loaa'i, E hea aku ia ia, oiai oia ma kahi kokoke.
7 ౭ భక్తిహీనులు తమ మార్గం విడిచిపెట్టాలి. చెడ్డవాళ్ళు తమ తలంపులు మార్చుకోవాలి. వాళ్ళు యెహోవా వైపు తిరగాలి. అప్పుడు ఆయన వారి మీద జాలిపడతాడు. వారు మన దేవుని వైపు తిరిగితే ఆయన అధికంగా క్షమిస్తాడు.
E haalele ke kanaka hewa i kona aoao, A me ke kanaka lawehala, i kona mau manao; A e hoi mai hoi oia io Iehova la, a e lokomaikai no oia ia ia, A i ko kakou Akua hoi, no ka mea, e kala nui loa auanei oia.
8 ౮ “నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. మీ విధానాలు నా విధానాల వంటివి కావు.” ఇదే యెహోవా వాక్కు.
No ka mea, o ko'u mau manao, aole ia o ko oukou mau manao, A o ko oukou mau aoao, aole ia o ko'u mau aoao, wahi a Iehova.
9 ౯ “ఆకాశాలు భూమి కంటే ఎత్తుగా ఉన్నాయి. అలాగే నా విధానాలు మీ విధానాల కంటే, నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే ఉన్నతంగా ఉన్నాయి.
No ka mea, e like me ke kiekie o na lani maluna o ka honua, Pela no ke kiekie o ko'u mau aoao maluna o ko oukou mau aoao, A me ko'u mau manao, maluna o ko oukou mau manao.
10 ౧౦ వాన, మంచు ఆకాశాన్నుంచి వచ్చి భూమిని తడుపుతాయి. దానినుంచి విత్తనం చల్లే వాడికి విత్తనాన్నీ తినడానికి తిండినీ ఇచ్చేలా, మొక్కలు మొలిచి ఫలించేలా చేస్తాయి. అలా చేస్తేనే తప్ప అవి ఆకాశానికి తిరిగి వెళ్ళవు.
No ka mea, e like me ka ua, a me ka hau i iho mai, mai na lani mai, Aole hoi e hoi hou ilaila, aka, e hoomau mai no i ka honua, A hoohua iho la ia ia, e hoomuo no hoi, I haawi mai ia i ka hua na ka mea lulu hua, A i berena hoi na ka mea ai;
11 ౧౧ ఆలాగే నా నోట నుంచి వచ్చే మాట ఉంటుంది. నిష్ఫలంగా నా దగ్గరికి తిరిగి రాదు. అది నా సంకల్పాన్ని నెరవేరుస్తుంది. నేను పంపించిన ఉద్దేశాన్ని సాధిస్తుంది.
Pela auanei ka'u olelo, ka mea i puka aku, mai ko'u waha aku, Aole ia e hoi nele mai ia'u; Aka, e hana no ia i ka mea a'u e makemake ai, A e hooko io ia i ka mea a'u e hoouna aku ai ia ia.
12 ౧౨ మీరు సంతోషంగా వెళతారు. సమాధానంగా మిమ్మల్ని తీసుకు పోతారు. మీ ముందు పర్వతాలు, కొండలు, సంతోషంగా కేకలు వేస్తాయి. మైదానాల్లోని చెట్లన్నీ చప్పట్లు కొడతాయి.
No ka mea, e puka aku auanei oukou me ka olioli, A e alakaiia'ku oukou me ka malu: E hookani i ke oli na kuahiwi, a me na mauna imua o oukou, A e paipailima hoi na laau a pau o ke kula.
13 ౧౩ ముళ్ళచెట్లకు బదులు దేవదారు వృక్షాలు మొలుస్తాయి. దురదగొండిచెట్లకు బదులు గొంజి వృక్షాలు పెరుగుతాయి. ఆ విషయం యెహోవాకు పేరు ప్రతిష్టలు తెస్తుంది. నశించని నిత్యమైన గుర్తుగా ఉంటుంది.”
Ma kahi o ke kakalaioa e ulu mai auanei ka laau kaa, A ma kahi o ka laau ooi, ka hadasa hoi; A e lilo ia i mea kaulana no Iehova, I ouli mau loa no hoi e hooki ole ia'i.