< యెషయా~ గ్రంథము 52 >
1 ౧ సీయోనూ! లే! నీ బలం తెచ్చుకో. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా! నీ అందమైన బట్టలు వేసుకో. ఇక ఎన్నటికీ సున్నతి పొందని వాడొకడైనా, అపవిత్రుడొకడైనా నీ లోపలికి రాడు.
Ébredj, ébredj, öltsd fel erődet Czión, öltsd fel díszes ruháidat, Jeruzsálem, a szent város, mert már többé nem jön beléd körülmetéletlen s tisztátalan.
2 ౨ ధూళి దులుపుకో. యెరూషలేమా, లేచి చక్కగా కూర్చో. బందీ అయిన సీయోను కుమారీ, నీ మెడకట్లు విప్పివేసుకో.
Rázd ki magadat a porból, kelj föl, ülj le Jeruzsálem, oldd le magadról nyakad kötelékeit, Cziónnak fogoly leánya.
3 ౩ యెహోవా ఇలా చెబుతున్నాడు “మిమ్మల్ని ఉచితంగా అమ్మేశారు గదా! ఉచితంగానే మీకు విమోచన వస్తుంది.”
Mert így szól az Örökkévaló: Ingyen adattatok el és nem pénzen fogtok megváltatni.
4 ౪ యెహోవా ప్రభువు ఇలా అంటున్నాడు. “తాత్కాలికంగా మొదట్లో నా ప్రజలు ఐగుప్తు వెళ్ళారు. ఈ మధ్యే అష్షూరు వారిని బాధించింది.”
Mert így szól az Úr, az Örökkévaló: Egyiptomba ment le népem azelőtt, hogy ott tartózkodjék Assúr semmiért nyomorgatta.
5 ౫ ఇదే యెహోవా వాక్కు. “ఏ కారణం లేకుండా నా ప్రజలను తీసుకుపోయారు. వారి మీద అధికారం చేసేవాళ్ళు పరిహాసం చేస్తున్నారు. రోజంతా నా పేరు దూషణకు గురి అవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ నేనేం చేయాలి?”
Most pedig, mi dolgom itt, úgymond az Örökkévaló, hogy elvétetett népem ingyen? Uralkodói tombolnak, úgymond az Örökkévaló, és folyton egésznap káromoltatik a nevem.
6 ౬ ఇదే యెహోవా వాక్కు. “నా ప్రజలు నా పేరు తెలుసుకుంటారు. ఈ విషయం చెప్పింది నేనే అని వాళ్ళు ఆ రోజు తెలుసుకుంటారు. ఔను. నేనే.”
Ezért megismeri népem a nevemet, igenis ama napon, hogy én, az aki szólt, íme itt vagyok!
7 ౭ సువార్త ప్రకటిస్తూ శాంతిసమాధానాలు చాటిస్తూ శుభ సమాచారం తెస్తూ విడుదల సమాచారం తీసుకు వచ్చే వారి పాదాలు “నీ దేవుడు పరిపాలిస్తున్నాడు” అని సీయోనుతో చెప్పే వారి పాదాలు పర్వతాల మీద ఎంతో అందంగా ఉన్నాయి.
Mi kedvesek a hegyeken a hírhozónak lábai, ki békét hirdet, jót hoz hírül, segítséget hirdet, azt mondja Cziónnak: király lett az Istened!
8 ౮ విను! నీ కావలివారు తమ గొంతు పెంచుతున్నారు. వాళ్ళంతా కలిసి సంతోషంతో కేకలు వేస్తున్నారు. యెహోవా సీయోనుకు తిరిగి వచ్చేటప్పుడు వారు కళ్ళారా చూస్తారు.
Hallga, őreid fölemelték hangjukat, egyetemben ujjonganak, mert szemtől szembe látják, amint visszatér az Örökkévaló Cziónba.
9 ౯ యెరూషలేము శిథిలాల్లారా! కలిసి ఆనంద గీతాలు పాడండి. యెహోవా తన ప్రజలను ఆదరించాడు. యెరూషలేమును విమోచించాడు.
Ujjongva fakadjatok egyetemben, Jeruzsálem romjai, mert megvigasztalta az Örökkévaló az ő népét, megváltotta Jeruzsálemet,
10 ౧౦ అన్ని రాజ్యాల కళ్ళెదుటే యెహోవా తన పవిత్ర హస్తం బయలుపరచాడు. ప్రపంచమంతా మన దేవుని రక్షణ చూస్తారు.
Feltűrte az Örökkévaló szent karját mind a nemzetek szeme láttára; és látni fogják mind a föld végei Istenünk segítségét.
11 ౧౧ అక్కడ నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి, వెళ్ళండి. అపవిత్రమైన దేనినీ తాకవద్దు. యెహోవా సేవాపాత్రలను మోసే మీరు, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి.
Távozzatok, távozzatok, vonuljatok ki onnan, tisztátalant ne érintsetek; vonuljatok ki belőle, tisztálkodjatok, az Örökkévaló edényeinek vivői!
12 ౧౨ మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోయేలా వెళ్లరు. యెహోవా మీ ముందు నడుస్తాడు. ఇశ్రాయేలు దేవుడు మీ వెనుక కావలివాడుగా ఉంటాడు.
Mert nem sietséggel fogtok kivonulni és nem futással fogtok elmenni: mert előttetek megy az Örökkévaló és bezárja a menetet Izrael Istene.
13 ౧౩ వినండి. నా సేవకుడు తెలివిగా ప్రవర్తిస్తాడు. అన్నీ చక్కగా జరిగిస్తాడు. ఆయన్ని హెచ్చించడం, ఉన్నత స్థితికి తేవడం అధికంగా ఘనపరచడం జరుగుతుంది.
Íme, boldogulni fog az én szolgám, fölmagasodik, fölemelkedik és magas lesz nagyon.
14 ౧౪ అతని రూపం, మిగతా ఏ వ్యక్తి రూపం కన్నా వికారంగా ఉంది. ఆ విధంగా ఆయన మనిషిలాగానే లేడు. నిన్ను చూచి చాలామంది నిర్ఘాంతపోయారు.
Valamint eliszonyodtak rajtad sokan – annyira eltorzított, nem is emberi volt az ábrázata és alakja nem olyan mint az ember fiaié –
15 ౧౫ అయితే ఆయన అనేక రాజ్యాలను ఆశ్చర్యపరుస్తాడు. రాజులు అతన్ని చూసి నోరు మూసుకుంటారు. ఎందుకంటే తమకు చెప్పని విషయాలు వారు చూస్తారు. అంతకు మునుపు వాళ్ళు వినని విషయాలు వాళ్ళు గ్రహిస్తారు.
akképpen megdöbbent sok nemzetet, miatta királyok zárják el szájukat; mert a mi nem beszéltetett el nekik, azt látták, és amit nem hallottak, azt észlelték.