< యెషయా~ గ్రంథము 51 >
1 ౧ నీతిని అనుసరిస్తూ యెహోవాను వెతుకుతూ ఉండే మీరు, నా మాట వినండి. ఏ బండ నుంచి మిమ్మల్ని చెక్కారో ఏ గని నుంచి మిమ్మల్ని తవ్వారో దాన్ని గమనించండి.
Klausāties uz Mani, kas taisnībai dzenaties pakaļ, kas To Kungu meklējat. Uzlūkojiet to akmens kalnu, no kā esat cirsti, un to akas bedri, kur esat izrakti.
2 ౨ మీ తండ్రి అబ్రాహామును, మిమ్మల్ని కనిన శారాను గమనించండి. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచాను. అతన్ని దీవించి అనేకమందిగా చేశాను.
Uzlūkojiet Ābrahāmu, savu tēvu, un Sāru, kas jūs dzemdējusi. To Es aicināju, kad viņš vēl bija viens pats, un Es to svētīju un vairoju.
3 ౩ యెహోవా సీయోనును ఆదరిస్తాడు. పాడైన దాని స్థలాలన్నిటినీ ఆయన ఆదరిస్తాడు. దాని అరణ్య ప్రదేశాన్ని ఏదెనులాగా చేశాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటలాగా చేస్తున్నాడు. దానిలో ఆనందం, సంతోషం, కృతజ్ఞత, సంగీతనాదం, ఉంటాయి.
Jo Tas Kungs iepriecinās Ciānu, Viņš iepriecinās visas viņas tukšās vietas un darīs viņas tuksnesi kā Edeni un viņas lauku kā Tā Kunga dārzu; prieku un līksmību tur atradīs, pateikšanu un slavas dziesmas.
4 ౪ నా ప్రజలారా, నా మీద దృష్టి పెట్టండి. నా మాట వినండి! నేనొక ఆజ్ఞ జారీ చేస్తాను. రాజ్యాలకు వెలుగుగా నా న్యాయాన్ని ఉంచుతాను.
Ņem Mani vērā, Mana tauta, atgriežat ausis pie Manis, Mani ļaudis, jo no Manis iziet bauslība, un Savu tiesu Es iecelšu tautām par gaišumu.
5 ౫ నా నీతి దగ్గరగా ఉంది. నా విడుదల బయలుదేరుతుంది. నా చెయ్యి రాజ్యాలను శిక్షిస్తుంది. ద్వీపాల్లో ఉండేవాళ్ళు నా కోసం ఎదురు చూస్తారు. వాళ్ళు నా చేతి వైపు ఆశతో చూస్తారు.
Mana taisnība ir tuvu klāt, Mana pestīšana parādās, un Mans elkonis sodīs tautas. Uz Mani salas gaida un cerē uz Manu elkoni.
6 ౬ ఆకాశం వైపు మీ కళ్ళు ఎత్తండి. కిందున్న భూమిని చూడండి. అంతరిక్షం, పొగలాగా కనిపించకుండా పోతుంది. భూమి బట్టలాగా మాసిపోతుంది. దాని నివాసులు ఈగల్లాగా చస్తారు. అయితే నా రక్షణ ఎప్పటికీ ఉంటుంది. నా నీతికి అంతం ఉండదు.
Paceliet savas acis uz debesīm un skatāties uz zemi apakšā; jo debesis iznīks kā dūmi, un zeme nodils kā drēbe, un viņas iedzīvotāji nomirs kā mušas. Bet Mana pestīšana pastāvēs mūžīgi, Mana taisnība netiks apgāzta.
7 ౭ సరైనది అంటే ఏంటో తెలిసిన మీరు నా మాట వినండి. నా చట్టాన్ని మీ హృదయంలో ఉంచుకున్న మీరు, వినండి. మనుషుల నిందకు భయపడవద్దు. వారి దూషణకు దిగులుపడవద్దు.
Klausāties uz Mani, kas taisnību pazīstat, ļaudis, kam Mana bauslība ir sirdī. Nebīstaties par cilvēku nievāšanu un neiztrūcinājāties no viņu zaimošanām.
8 ౮ చిమ్మెట బట్టలను కొరికేసినట్టు వారిని కొరికేస్తుంది. పురుగు, బొచ్చును కొరికేసినట్టు వారిని కొరికేస్తుంది. అయితే నా నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నా రక్షణ తరతరాలుంటుంది.
Jo tārpi tos ēdīs kā drēbi, un kodes tos sakapās kā vilnu, bet Mana taisnība pastāvēs mūžīgi un Mana pestīšana uz cilšu ciltīm.
9 ౯ యెహోవా హస్తమా లే! బలం ధరించుకో. పూర్వకాలంలో పురాతన తరాల్లో లేచినట్టు లే. భయంకరమైన సముద్ర జంతువును నరికివేసింది నువ్వే గదా? డ్రాగన్ను పొడిచేసింది నువ్వే గదా?
Uzmosties, uzmosties, apvelc stiprumu, Tā Kunga elkonis, uzmosties kā sendienās, vecu vecos laikos! Vai Tu neesi tas, kas Rahabu (Ēģipti) pāršķēlis un to pūķi nodūris?
10 ౧౦ చాలా లోతైన నీళ్లున్న సముద్రాన్ని ఇంకిపోయేలా చేసింది నువ్వే గదా? విడుదల పొందినవాళ్ళు దాటిపోయేలా సముద్ర లోతుల్లో దారి చేసింది నువ్వే గదా?
Vai Tu neesi, kas jūru darījis sausu, tos lielos ūdeņu dziļumus darījis par ceļu, ka tie atpestītie gāja cauri?
11 ౧౧ యెహోవా విమోచించినవారు సంగీతనాదంతో సీయోనుకు తిరిగి వస్తారు. వారి తలలమీద ఎప్పటికీ నిలిచే సంతోషం ఉంటుంది. సంతోషానందాలు వారికి నిండుగా ఉంటాయి. దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోతాయి.
Un Tā Kunga atpirktie griezīsies atpakaļ un nāks uz Ciānu ar gavilēšanu, un mūžīga līksmība būs pār viņu galvām; prieks un līksmība tos apkamps, skumjas un bēdas bēgs projām.
12 ౧౨ నేను, నేనే మిమ్మల్ని ఓదారుస్తాను. చనిపోయే మనుషులకు, గడ్డిలాంటి మనుషులకు మీరెందుకు భయపడతారు?
Es, Es esmu jūsu iepriecinātājs: kas tu esi, ka bīsties no cilvēkiem, kam jāmirst, un no cilvēku bērniem, kas iznīkst kā zāle,
13 ౧౩ ఆకాశాలను పరచి భూమి పునాదులు వేసిన మీ సృష్టికర్త అయిన యెహోవాను ఎందుకు మరచిపోతున్నారు? బాధించేవాడు ఎంతో కోపంతో మిమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు ప్రతిరోజూ నిరంతర భయంతో ఉన్నారు. బాధించేవాడి కోపం ఏమయింది?
Un aizmirsti To Kungu, savu Radītāju, kas debesis izpletis un zemi dibinājis, un bīsties bez mitēšanās cauru dienu no spaidītāja bardzības, kad tas taisās maitāt? Bet kur nu ir tā spaidītāja bardzība?
14 ౧౪ కుంగిపోయిన వారిని యెహోవా త్వరగా విడుదల చేస్తాడు. అతడు గోతిలోకి పోడు. చావడు. అతనికి తిండి లేకుండా పోదు.
Steigšus saslēgtais tiek svabads un nenomirs bedrē, un maizes viņam netrūks.
15 ౧౫ నేను యెహోవాను. నీ దేవుణ్ణి. సముద్రపు అలలు ఘోషించేలా దాన్ని రేపుతాను. నేను సేనల ప్రభువు యెహోవాను.
Jo Es esmu Tas Kungs, tavs Dievs, kas kustina jūru, ka viņas viļņi kauc: Kungs Cebaot ir Viņa vārds.
16 ౧౬ నేను ఆకాశాలను పరచడానికీ భూమికి పునాదులు వేయడానికీ “నువ్వే నా ప్రజ” అని సీయోనుతో చెప్పడానికీ నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పాను.
Un Es lieku Savus vārdus tavā mutē un tevi apklāju ar Savas rokas ēnu, ka Es dēstu debesis un stādu zemi un saku uz Ciānu: tu esi Mana tauta.
17 ౧౭ యెరూషలేమా! లే. లేచి నిలబడు. యెహోవా చేతినుంచి కోపంతో నిండిన పాత్రను తీసుకుని తాగినదానా! నువ్వు పాత్రలోనిదంతా తాగావు. తూలేలా తాగావు.
Uzmosties, uzmosties, celies Jeruzāleme, kas no Tā Kunga rokas esi dzērusi Viņa bardzības biķeri; reibuma biķeri tu esi izdzērusi un izsūkusi.
18 ౧౮ ఆమె కనిన కొడుకులందరిలో ఆమెకు దారి చూపేవాడు ఎవడూ లేడు. ఆమె పెంచిన కొడుకులందరిలో ఆమె చెయ్యి పట్టుకునే వాడెవడూ లేడు.
No visiem bērniem, ko tā ir dzemdējusi, neviena nebija, kas viņu būtu vadījis(drošībā un miera vietā), un no visiem bērniem, ko tā uzaudzinājusi, neviena, kas viņu pie rokas būtu ņēmis.
19 ౧౯ రెండు విపత్తులు నీ మీదికి వచ్చాయి. నీతో కలిసి ఎవరు ఏడుస్తారు? ధ్వంసం, నాశనం, కరువు, కత్తి నీ మీదికి వచ్చాయి. నిన్నెవరు ఓదారుస్తారు?
Šīs divējas lietas tev ir notikušas, kas tad tevi žēlos? Posts un nelaime un bads un zobens, kas tad tevi var iepriecināt?
20 ౨౦ నీ కొడుకులు మూర్ఛపోయారు. దుప్పి వలలో చిక్కుపడినట్టు, ప్రతి వీధిలో పడియున్నారు. యెహోవా కోపంతో నీ దేవుని గద్దింపుతో వారు నిండిపోయారు.
Tavi bērni pamiruši, tie guļ uz visu ielu stūriem kā stirna tīklā, tie bija pilni Tā Kunga bardzības, tava Dieva draudu.
21 ౨౧ అయితే ద్రాక్షమద్యం లేకుండానే మత్తుగా ఉండి బాధపడినదానా, ఈ మాట విను.
Tāpēc klausies jel šo, tu apbēdinātā un apreibusī, bet ne no vīna.
22 ౨౨ నీ యెహోవా ప్రభువు తన ప్రజల పక్షాన వాదించే నీ దేవుడు ఇలా చెబుతున్నాడు, “ఇదిగో, నువ్వు తూలేలా చేసే పాత్రను నా కోపంతో నిండిన ఆ పాత్రను నీ చేతిలోనుంచి తీసివేశాను. నీవది మళ్ళీ తాగవు.
Tā saka tavs Kungs, Tas Kungs, un tavs Dievs, kas Saviem ļaudīm tiesu nesīs: redzi, Es ņemu no tavas rokas to reibuma biķeri, Savas bardzības biķeri, tev vairs to nebūs dzert.
23 ౨౩ నిన్ను బాధించేవాళ్ళ చేతిలో దాన్ని పెడతాను. ‘మేము నీ మీద నడిచిపోతాం. సాష్టాంగ పడు’ అని వాళ్ళు నీతో చెబితే నువ్వు నీ వీపును దాటే వారికి దారిగా చేసి నేలకు దాన్ని వంచావు గదా.”
Bet Es to došu rokā taviem spaidītājiem, kas uz tavu dvēseli saka: lokies, ka mēs ejam pāri, un noliec savu muguru pār zemi un par ielu tiem, kas staigā pāri.