< యెషయా~ గ్రంథము 50 >
1 ౧ యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. “నేను మీ తల్లిని విడిచిపెట్టి ఇచ్చిన విడాకుల పత్రం ఏదీ? నా అప్పులవాళ్ళలో మిమ్మల్ని ఎవరికి అమ్మివేశాను? కేవలం మీ దోషాలను బట్టే మీరు అమ్ముడుపోయారు. మీ తిరుగుబాటును బట్టే మీ తల్లికి విడాకులు ఇవ్వడం జరిగింది.
RAB şöyle diyor: “Boşadığım annenizin boşanma belgesi nerede? Hangi alacaklıma sattım sizi? Suçlarınız yüzünden satıldınız, Anneniz isyanlarınız yüzünden dışlandı.
2 ౨ నేను వచ్చినప్పుడు అక్కడ ఎవరూ లేరు, ఎందుకు? నేను పిలిచినప్పుడు ఎవరూ జవాబు చెప్పలేదెందుకు? నా చెయ్యి మిమ్మల్ని విమోచించలేనంత కురచగా అయి పోయిందా? విడిపించడానికి నాకు శక్తి లేదా? నా గద్దింపుతో సముద్రాన్ని ఎండిపోయేలా చేస్తాను. నదులను ఎడారిగా చేస్తాను. నీళ్లు లేకపోవడం చేత వాటిలోని చేపలు చచ్చిపోయి కంపుకొడతాయి.
Geldiğimde neden kimse yoktu, Çağırdığımda niçin yanıt veren olmadı? Sizi kurtaramayacak kadar kısa mı elim, Ya da gücüm yok mu sizi özgür kılmaya? Azarlayarak denizi kurutur, Irmakları çöle çeviririm. Su kalmayınca balıklar ölür ve kokar.
3 ౩ ఆకాశాన్ని చీకటి కమ్మేలా చేస్తాను. దాన్ని గోనెపట్టతో కప్పుతాను.”
Göklere karalar giydirir, Çul ederim onların örtüsünü.”
4 ౪ అలసినవాణ్ణి నా మాటలతో ఆదరించే జ్ఞానం నాకు కలిగేలా శిష్యునికి ఉండాల్సిన నాలుక యెహోవా నాకిచ్చాడు. శిష్యునిలాగా నేను వినడానికి ఆయన ప్రతి ఉదయాన నన్ను మేల్కొలుపుతాడు.
Yorgunlara sözle destek olmayı bileyim diye Egemen RAB bana eğitilmişlerin dilini verdi. Eğitilenler gibi dinleyeyim diye kulağımı uyandırır her sabah.
5 ౫ ప్రభువైన యెహోవా నా చెవికి వినే బుద్ధి పుట్టించాడు కాబట్టి నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా దూరం జరగలేదు.
Egemen RAB kulağımı açtı, Karşı koymadım, geri çekilmedim.
6 ౬ నన్ను కొట్టే వారికి నా వీపును, వెంట్రుకలు పెరికే వారికి నా చెంపలను అప్పగించాను. ఉమ్మి వేసేవారికి, అవమానించే వారికి నా ముఖం దాచుకోలేదు.
Bana vuranlara sırtımı açtım, Yanaklarımı uzattım sakalımı yolanlara. Aşağılamalardan, tükürükten yüzümü gizlemedim.
7 ౭ ప్రభువైన యెహోవా నాకు సాయం చేస్తాడు కాబట్టి నేనేమీ సిగ్గుపడలేదు. నాకు సిగ్గు కలగదని తెలుసు కాబట్టి నా ముఖాన్ని చెకుముకి రాయిలాగా చేసుకున్నాను.
Egemen RAB bana yardım ettiği için Utanç duymam. Kararımdan dönmem, Utandırılmayacağımı bilirim.
8 ౮ నన్ను నీతిమంతునిగా ఎంచే దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు. నన్ను వ్యతిరేకించే వాడెవడు? మనం కలిసి వాదించుకుందాం. నా ప్రతివాది ఎవడు? అతణ్ణి నా దగ్గరికి రానివ్వండి.
Beni haklı çıkaran yakınımda. Benden davacı olan kim, yüzleşelim, Kimdir hasmım, karşıma çıksın.
9 ౯ ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. నా మీద ఎవరు నేరం మోపుతారు? వారంతా బట్టలాగా పాతబడిపోతారు. వారిని చిమ్మెట తినివేస్తుంది.
Bana yardım eden Egemen RAB'dir, Kim suçlu çıkaracak beni? Onların hepsi giysi gibi eskiyecek, Tümünü güve yiyip bitirecek.
10 ౧౦ మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినే వాడెవడు? వెలుగు లేకుండా చీకటిలో నడిచేవాడు యెహోవా నామాన్ని ఆశ్రయించి ఆయన్ని నమ్ముకోవాలి.
Aranızda RAB'den korkan, Kulunun sözünü dinleyen kim var? Karanlıkta yürüyen, ışığı olmayan, RAB'bin adına güvensin, Tanrısı'na dayansın.
11 ౧౧ ఇదిగో, నిప్పులు వెలిగించి మీ చుట్టూ మంటలను పెట్టుకొనే వారంతా మీ అగ్ని వెలుగులో, మీరు వెలిగించిన మంటల్లో నడవండి. ఇది మీకు నా చేతినుండే కలుగుతున్నది. మీరు వేదనతో పండుకుంటారు.
Ama ateş yakan, Alevli oklar kuşanan sizler, hepiniz, Ateşinizin aydınlığında, Tutuşturduğunuz alevli okların arasında yürüyün. Benden alacağınız şudur: Azap içinde yatacaksınız.