< యెషయా~ గ్రంథము 49 >
1 ౧ ద్వీపాల్లారా! నా మాట వినండి. దూరంగా ఉన్న ప్రజలారా! జాగ్రత్తగా వినండి. నేను పుట్టకముందే యెహోవా నన్ను పిలిచాడు. నా తల్లి నన్ను కనినప్పుడే ఆయన నా పేరుతో గుర్తు చేసుకున్నాడు.
Audite insulæ, et attendite populi de longe: Dominus ab utero vocavit me, de ventre matris meæ recordatus est nominis mei.
2 ౨ ఆయన నా నోటిని పదునైన కత్తిలాగా చేశాడు. తన చేతి నీడలో నన్ను దాచాడు. ఆయన నన్ను మెరుగుపెట్టిన బాణంలాగా చేశాడు. తన అంబులపొదిలో నన్ను దాచాడు.
Et posuit os meum quasi gladium acutum: in umbra manus suæ protexit me, et posuit me sicut sagittam electam: in pharetra sua abscondit me.
3 ౩ ఆయన నాతో “ఇశ్రాయేలూ, నువ్వు నా సేవకుడివి. నీలో నా ఘనత చూపిస్తాను” అని చెప్పాడు.
Et dixit mihi: Servus meus es tu Israel, quia in te gloriabor.
4 ౪ నేను వ్యర్థంగా కష్టపడి, నిష్ఫలంగా నా శక్తినంతా ఖర్చుచేశానని అనుకున్నా, నా న్యాయం యెహోవా దగ్గరే ఉంది. నా బహుమానం నా దేవుని దగ్గరే ఉంది.
Et ego dixi: In vacuum laboravi, sine causa, et vane fortitudinem meam consumpsi: ergo iudicium meum cum Domino, et opus meum cum Deo meo.
5 ౫ యెహోవా దృష్టికి నేను గౌరవనీయుణ్ణి. నా దేవుడు నాకు బలం. తనకు సేవకుడుగా ఉండడానికి, తన దగ్గరికి యాకోబును మళ్ళీ రప్పించాలనీ ఇశ్రాయేలును ఆయన దగ్గరికి చేర్చేలా నన్ను గర్భంలో రూపొందించాడు. యెహోవా ఇలా చెబుతున్నాడు.
Et nunc dicit Dominus, formans me ex utero servum sibi, ut reducam Iacob ad eum, et Israel non congregabitur: et glorificatus sum in oculis Domini, et Deus meus factus est fortitudo mea.
6 ౬ “నువ్వు యాకోబు గోత్రాలను ఉద్ధరించడానికీ ఇశ్రాయేలులో తప్పించుకున్నవాళ్ళను తీసుకురావడానికీ నా సేవకుడుగా ఉండడం ఎంతో చిన్న విషయం. నువ్వు ప్రపంచమంతా నా రక్షణగా ఉండడానికి నిన్ను యూదేతరులకు వెలుగుగా చేస్తాను.”
Et dixit: Parum est ut sis mihi servus ad suscitandas tribus Iacob, et fæces Israel convertendas: Ecce dedi te in lucem Gentium, ut sis salus mea usque ad extremum terræ.
7 ౭ మనుషుల తృణీకారానికీ రాజ్యాల ద్వేషానికీ గురై పరిపాలకులకు బానిసగా ఉన్నవానితో, ఇశ్రాయేలు విమోచకుడు, పరిశుద్ధుడైన యెహోవా ఇలా చెబుతున్నాడు, “యెహోవా నమ్మకమైనవాడనీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడనీ రాజులు తెలుసుకుని నిలబడతారు. అధికారులు నీ ఎదుట వంగుతారు.”
Hæc dicit Dominus redemptor Israel, sanctus eius, ad contemptibilem animam, ad abominatam gentem, ad servum dominorum: Reges videbunt, et consurgent principes, et adorabunt propter Dominum, quia fidelis est, et sanctum Israel qui elegit te.
8 ౮ యెహోవా ఇలా చెబుతున్నాడు, “అనుకూల సమయంలో నేను నీకు జవాబిస్తాను. విమోచన దినాన నీకు సహాయం చేస్తాను. దేశాన్ని తిరిగి కట్టడానికీ పాడైన వారసత్వాన్ని మళ్ళీ అప్పగించడానికీ నిన్ను కాపాడతాను. ప్రజలకు నిబంధనగా నిన్ను నియమిస్తాను.
Hæc dicit Dominus: In tempore placito exaudivi te, et in die salutis auxiliatus sum tui: et servavi te, et dedi te in fœdus populi, ut suscitares terram, et possideres hereditates dissipatas:
9 ౯ నువ్వు బందీలతో, ‘బయలుదేరండి’ అనీ చీకట్లో ఉన్నవారితో, ‘బయటికి రండి’ అనీ చెబుతావు. వాళ్ళు దారిలో మేస్తారు. చెట్లు లేని కొండలమీద వారికి మేత దొరుకుతుంది.
ut diceres his, qui vincti sunt: Exite: et his, qui in tenebris: Revelamini. Super vias pascentur, et in omnibus planis pascua eorum.
10 ౧౦ వారిమీద జాలిపడేవాడు వారిని వెంటపెట్టుకుని వెళ్తాడు. నీటిఊటల దగ్గరికి వారిని నడిపిస్తాడు. కాబట్టి వారికి ఆకలి గానీ దప్పిక గానీ వేయదు. ఎండ, వడగాడ్పులూ వారికి తగలవు.
Non esurient, neque sitient, et non percutiet eos æstus et sol: quia miserator eorum reget eos, et ad fontes aquarum potabit eos.
11 ౧౧ నా పర్వతాలన్నిటినీ దారిగా చేస్తాను. నా జాతీయ రహదారులను సరిచేస్తాను.”
Et ponam omnes montes meos in viam, et semitæ meæ exaltabuntur.
12 ౧౨ చూడండి. వీళ్ళు దూర ప్రాంతం నుంచి వస్తున్నారు. కొంతమంది ఉత్తరం నుంచీ పడమటి నుంచి వస్తున్నారు. మరికొంతమంది సీనీయుల దేశం నుంచి వస్తున్నారు.
Ecce isti de longe venient, et ecce illi ab Aquilone et mari, et isti de terra australi.
13 ౧౩ బాధకు గురి అయిన తన ప్రజల మీద యెహోవా జాలిపడి వారిని ఓదారుస్తాడు. ఆకాశమా, ఉత్సాహధ్వని చెయ్యి. భూమీ, సంతోషించు. పర్వతాల్లారా, ఆనందగీతాలు పాడండి.
Laudate cæli, et exulta terra, iubilate montes laudem: quia consolatus est Dominus populum suum, et pauperum suorum miserebitur.
14 ౧౪ అయితే సీయోను “యెహోవా నన్ను విడిచిపెట్టాడు, ప్రభువు నన్ను మరచిపోయాడు” అంది.
Et dixit Sion: Dereliquit me Dominus, et Dominus oblitus est mei.
15 ౧౫ స్త్రీ, తన గర్భాన పుట్టిన బిడ్డ మీద జాలిపడకుండా ఉంటుందా? తన చంటిపిల్లను మరచిపోతుందా? వాళ్ళు మరచిపోవచ్చు గానీ నేను నిన్ను మరచిపోను.
Numquid oblivisci potest mulier infantem suum, ut non misereatur filio uteri sui? et si illa oblita fuerit, ego tamen non obliviscar tui.
16 ౧౬ చూడు, నా అరచేతుల్లో నిన్ను పచ్చబొట్టు పొడిపించుకున్నాను. నీ గోడలు ఎప్పటికీ నా ఎదుట ఉన్నాయి.
Ecce in manibus meis descripsi te: muri tui coram oculis meis semper.
17 ౧౭ నీ పిల్లలు త్వరగా వస్తున్నారు. నిన్ను నాశనం చేసినవాళ్ళు వెళ్ళిపోతున్నారు.
Venerunt structores tui: destruentes te, et dissipantes a te exibunt.
18 ౧౮ అటూ ఇటూ చూడు. వాళ్ళంతా కలిసి నీ దగ్గరికి వస్తున్నారు. నా జీవం తోడని యెహోవా ఇలా చెబుతున్నాడు. “నువ్వు వీళ్ళందరినీ ఆభరణంగా ధరించుకుంటావు. పెళ్ళికూతురులాగా నువ్వు వారిని ధరించుకుంటావు.
Leva in circuitu oculos tuos, et vide, omnes isti congregati sunt, venerunt tibi: vivo ego, dicit Dominus, quia omnibus his velut ornamento vestieris, et circumdabis tibi eos quasi sponsa.
19 ౧౯ నువ్వు పాడైపోయి నిర్జనంగా ఉన్నా నీ దేశం నాశనమైపోయినా ఇప్పుడు నీ నివాసులకు నీ భూమి ఇరుకుగా ఉంది. నిన్ను మింగివేసినవారు దూరంగా ఉంటారు.
Quia deserta tua, et solitudines tuæ, et terra ruinæ tuæ nunc angusta erunt præ habitatoribus, et longe fugabuntur qui absorbebant te.
20 ౨౦ నీ దుఃఖదినాల్లో నీకు పుట్టిన పిల్లలు ‘ఈ స్థలం మాకు ఇరుకుగా ఉంది. మేము ఉండడానికి ఇంకా విశాలమైన ప్రాంతం మాకివ్వు’ అంటారు.
Adhuc dicent in auribus tuis filii sterilitatis tuæ: Angustus est mihi locus, fac spatium mihi ut habitem.
21 ౨౧ అప్పుడు నువ్వు ఇలా అనుకుంటావు, ఈ పిల్లలను నా కోసం ఎవరు కన్నారు? నేను నా పిల్లలను కోల్పోయి ఏడ్చాను. గొడ్రాలిని, బందీని అయ్యాను. ఈ పిల్లలను ఎవరు పెంచారు? నేను ఏకాకినయ్యాను. వీళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు?”
Et dices in corde tuo: Quis genuit mihi istos? ego sterilis, et non pariens, transmigrata, et captiva: et istos quis enutrivit? ego destituta et sola: et isti ubi erant?
22 ౨౨ ప్రభువైన యెహోవా ఇలా చెబుతున్నాడు, “నేను రాజ్యాల వైపు నా చెయ్యి ఎత్తుతాను. ప్రజలకు నా జెండాను సంకేతంగా ఎత్తుతాను. వాళ్ళు నీ కొడుకులను తమ చేతుల్లో తీసుకు వస్తారు. నీ కూతుళ్ళను తమ భుజాలమీద మోసుకువస్తారు.
Hæc dicit Dominus Deus: Ecce levabo ad Gentes manum meam, et ad populos exaltabo signum meum. Et afferent filios tuos in ulnis, et filias tuas super humeros portabunt.
23 ౨౩ రాజులు, నిన్ను పోషించే తండ్రులుగా వారి రాణులు నీకు పాలిచ్చే దాదులుగా ఉంటారు. వాళ్ళు నీకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. నీ పాదాల దుమ్ము నాకుతారు. అప్పుడు నేను యెహోవాననీ నా కోసం ఆశతో చూసే వారికి ఆశాభంగం కలగదనీ నువ్వు తెలుసుకుంటావు.”
Et erunt reges nutritii tui, et reginæ nutrices tuæ: vultu in terram demisso adorabunt te, et pulverem pedum tuorum lingent. Et scies quia ego Dominus, super quo non confundentur qui expectant eum.
24 ౨౪ బలశాలి చేతిలోనుంచి దోపిడీ సొమ్ము ఎవడు తీసుకోగలడు? నియంత దగ్గర నుంచి బందీలను ఎవడు విడిపించగలడు?
Numquid tolletur a forti præda? aut quod captum fuerit a robusto, salvum esse poterit?
25 ౨౫ అయితే యెహోవా ఇలా చెబుతున్నాడు, “నియంత దగ్గర నుంచి బందీలను విడిపించడం జరుగుతుంది. బలశాలి చేతిలోనుంచి దోపిడీ సొమ్ము తీసుకోవడం జరుగుతుంది. నీతో యుద్ధం చేసేవారితో నేనే యుద్ధం చేస్తాను. నీ పిల్లలను నేనే రక్షిస్తాను.
Quia hæc dicit Dominus: Equidem, et captivitas a forti tolletur: et quod ablatum fuerit a robusto, salvabitur. Eos vero, qui iudicaverunt te, ego iudicabo, et filios tuos ego salvabo.
26 ౨౬ నిన్ను బాధించేవారు తమ సొంత మాంసం తినేలా చేస్తాను. మద్యంతో మత్తుగా ఉన్నట్టు తమ సొంత రక్తంతో వాళ్ళు మత్తులవుతారు. అప్పుడు యెహోవానైన నేనే నీ రక్షకుడిననీ యాకోబు బలవంతుడిననీ నీ విమోచకుడిననీ మనుషులంతా తెలుసుకుంటారు.”
Et cibabo hostes tuos carnibus suis: et quasi musto, sanguine suo inebriabuntur: et sciet omnis caro, quia ego Dominus salvans te, et redemptor tuus fortis Iacob.