< యెషయా~ గ్రంథము 48 >
1 ౧ యూదా సంతానమా! యాకోబు వంశమా! ఈ మాట విను. నిన్ను ఇశ్రాయేలు అనే పేరుతో పిలుస్తున్నారు. నువ్వు యెహోవా నామం తోడని ప్రమాణం చేస్తావు. ఇశ్రాయేలు దేవుని పేరు స్మరిస్తావు. అయితే యథార్థంగా నిజాయితీతో అలా చేయవు.
Послухайте це, доме Яковів, що зве́тесь іме́нням Ізраїлевим, і що вийшли із Юдиних вод, що кляне́теся Йме́нням Господнім та Бога Ізраїля згадуєте, хоч не в правді та не в справедливості!
2 ౨ మేము పరిశుద్ధ పట్టణవాసులం అనే పేరు పెట్టుకుని, వాళ్ళు ఇశ్రాయేలు దేవుని ఆశ్రయిస్తారు. ఆయన పేరు సేనల ప్రభువైన యెహోవా.
Бо від міста святого вони прозива́ються та на Бога Ізраїлевого спира́ються, — Йому Йме́ння Госпо́дь Савао́т!
3 ౩ ఈ విషయాలు ఇలా జరుగుతాయని ఎప్పుడో చెప్పాను. అవి నా నోట్లో నుండే వచ్చాయి. నేనే వాటిని తెలియచేశాను. అకస్మాత్తుగా జరిగేలా వాటిని చేశాను.
Я відда́вна звіща́в про минуле, — із уст Моїх вийшло воно й розповів Я про нього, рапто́вно зробив, — і прийшло.
4 ౪ నువ్వు మూర్ఖుడవనీ నీ మెడ నరాలు ఇనుములాంటివనీ నీ నొసలు కంచులాంటిదనీ నాకు తెలుసు.
Тому́, що Я знав, що впе́ртий ти є, твоя ж шия — то м'я́зи залізні, а чо́ло твоє — мідяне́,
5 ౫ అందుకే ఈ విషయాలు ఎప్పుడో చెప్పాను. అవి జరక్కముందే నేను నీకు చెప్పాను. “నా విగ్రహమే వీటిని చేసింది.” లేకపోతే “నేను చెక్కిన బొమ్మ, లేదా నేను పోతపోసిన బొమ్మ దీన్ని నియమించింది” అని నువ్విక చెప్పలేవు.
то звіщав Я відда́вна тобі, іще поки прийшло, розповів Я тобі, щоб ти не говорив: „Мій божо́к це зробив, а про це наказав мій бовва́н та мій і́дол“.
6 ౬ నువ్వు ఈ విషయాలు విన్నావు. ఈ వాస్తవమంతా చూడు. నేను చెప్పింది నిజమేనని మీరు ఒప్పుకోరా? ఇక నుంచి కొత్త సంగతులు, నీకు తెలియని గూఢమైన సంగతులు నేను చెబుతాను.
Ти чув, — перегля́нь усе це; і ви хіба не визнає́те цього́? Тепер розповів Я тобі новини́ й таємни́ці, яких ти не знав.
7 ౭ అవి చాలా కాలం క్రితం కలిగినవి కావు. “అవి ఇప్పుడే కలిగాయి. అవి నాకు తెలిసినవే” అని నువ్వు చెప్పకుండేలా ఇంతకుముందు నువ్వు వాటిని వినలేదు.
Тепе́р вони ство́рені, а не відда́вна, а пе́ред цим днем ти не чув був про них, щоб не сказати: „Оце я їх знав“.
8 ౮ నువ్వెన్నడూ వాటిని వినలేదు. నీకు తెలియదు. ముందే ఈ విషయాలు నీకు చెప్పలేదు. పుట్టినప్పటినుంచి నువ్వు తిరుగుబోతుగా ఉన్నావనీ పెద్ద మోసగాడిగా ఉన్నావనీ నాకు తెలుసు.
Та не чув ти й не знав, і відда́вна ти не відкривав свого ву́ха, бо Я знав, що напе́вно ти зра́диш, і зва́но тебе від утро́би: пере́вертень.
9 ౯ నా నామం కోసం నేను నిన్ను నిర్మూలం చేయను. నా కోపం చూపించను. నా కీర్తి కోసం మిమ్మల్ని నాశనం చేయకుండా నీ విషయంలో నన్ను నేను తమాయించుకుంటాను.
Ради Йме́ння Свого́ Я спиня́ю Свій гнів, і ради слави Своєї Я стри́муюся проти те́бе, щоб не зни́щити тебе.
10 ౧౦ నేను నిన్ను పుటం వేశాను. అయితే వెండిలా కాదు. బాధల కొలిమిలో నిన్ను పరీక్షించాను.
Оце перетопи́в Я тебе, але не як те срі́бло, у го́рні недолі тебе досліди́в.
11 ౧౧ నా కోసం, నా కోసమే ఆలా చేస్తాను. ఎందుకంటే నా పేరు అవమానానికి ఎందుకు గురి కావాలి? నా ఘనత మరెవరికీ ఇవ్వను.
Ради Себе, ради Себе роблю́, бо як буде збезче́щене Йме́ння Моє? А іншому слави Своєї не дам.
12 ౧౨ యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నా మాట విను. నేనే ఆయన్ని. నేను మొదటివాణ్ణి, చివరివాణ్ణి.
Почуй Мене, Якове та Ізраїлю, Мій поклика́ний: Це Я, Я перший, також Я останній!
13 ౧౩ నా చెయ్యి భూమికి పునాదివేసింది. నా కుడిచెయ్యి ఆకాశాన్ని పరచింది. నేను వాటిని పిలిస్తే అవన్నీ కలిసి నిలుస్తాయి.
Теж рука Моя землю закла́ла, і небо напну́ла прави́ця Моя, — Я закли́чу до них — і вони стануть ра́зом.
14 ౧౪ మీరంతా ఒక చోటికి వచ్చి నా మాట వినండి. మీలో ఎవరు ఈ విషయాలు తెలియచేశారు? యెహోవా మిత్రుడు బబులోనుకు విరోధంగా తన ఉద్దేశాన్ని నేరవేరుస్తాడు. అతడు యెహోవా ఇష్టాన్ని కల్దీయులకు విరోధంగా జరిగిస్తాడు.
Зберіться ви всі та й послухайте: Хто́ серед вас розповів був про те? Кого Господь любить, вчи́нить волю Його в Вавилоні, раме́но ж Його на халде́ях.
15 ౧౫ ఔను. నేనే ఇలా చెప్పాను. నేనే అతణ్ణి పిలిచాను. నేనే అతణ్ణి రప్పించాను. అతడు చక్కగా చేస్తాడు.
Я, Я говорив і покликав його, спрова́див його, і він на дорозі своїй буде мати пово́дження.
16 ౧౬ నా దగ్గరికి రండి. ఈ విషయం వినండి. మొదటినుంచి నేను రహస్యంగా మాట్లాడలేదు. అది జరిగేటప్పుడు నేనక్కడే ఉన్నాను. ఇప్పుడు యెహోవా ప్రభువు తన ఆత్మతో నన్ను పంపాడు.
Набли́зьтесь до Мене, послухайте це: Споконві́ку Я не говорив потає́мно; від ча́су, як ді́ялось це, Я був там. А тепер послав Мене Господь Бог та Його Дух.
17 ౧౭ నీ విమోచకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలా చెబుతున్నాడు. “నేను నీ దేవుణ్ణి. యెహోవాను. నువ్వెలా సాధించగలవో నీకు బోధిస్తాను. నువ్వు వెళ్ళాల్సిన దారిలో నిన్ను నడిపిస్తాను.
Гак говорить Господь, твій Відкупи́тель, Святий Ізраїлів: Я — Господь, Бог твій, що навчає тебе про кори́сне, що провадить тебе по дорозі, якою ти маєш ходити.
18 ౧౮ నువ్వు నా ఆజ్ఞలను పాటిస్తే ఎంత బాగుంటుంది! అప్పుడు నీ శాంతి, సౌభాగ్యం నదిలా పారేవి. నీ విడుదల సముద్రపు అలల్లా ఉండేది.
О, коли б ти прислу́хувався до Моїх заповідей, то був би твій спо́кій, як рі́чка, а твоя справедли́вість, немов морські хвилі!
19 ౧౯ నీ సంతానం ఇసుకంత విస్తారంగా నీ గర్భఫలం దాని రేణువుల్లాగా విస్తరించేవారు. వారి పేరు నా దగ్గర నుంచి కొట్టివేయడం జరిగేది కాదు.
А насі́ння твого було б, як піску́, а наща́дків твого́ живота́ — немов зе́рнят його́, і ви́тяте й ви́гублене не було б твоє йме́ння із-перед обличчя Мого́!
20 ౨౦ బబులోను నుంచి బయటికి రండి! కల్దీయుల దేశంలో నుంచి పారిపొండి! యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించాడు” అనే విషయం ఉత్సాహంగా ప్రకటించండి! అందరికీ తెలిసేలా చేయండి! ప్రపంచమంతా చాటించండి!
Ви́рушіть із Вавилону, втечі́ть від халде́їв, радісним співом звісті́ть, оце розголосі́ть, аж до кра́ю землі рознесіть це, скажіть: Господь викупив раба Свого Якова!
21 ౨౧ ఎడారుల్లో ఆయన వారిని నడిపించినప్పుడు వారికి దాహం వేయలేదు. వారి కోసం బండలోనుంచి నీళ్లు ఉబికేలా చేశాడు. ఆయన ఆ బండ చీల్చాడు. నీళ్లు పెల్లుబికాయి.
І спра́ги не знали вони на пустинях, якими прова́див Він їх: воду з скелі пустив їм, — Він скелю розбив — і вода потекла́!
22 ౨౨ “దుష్టులకు నెమ్మది ఉండదు” అని యెహోవా చెబుతున్నాడు.
Для безбожних споко́ю немає, говорить Господь.