< యెషయా~ గ్రంథము 48 >

1 యూదా సంతానమా! యాకోబు వంశమా! ఈ మాట విను. నిన్ను ఇశ్రాయేలు అనే పేరుతో పిలుస్తున్నారు. నువ్వు యెహోవా నామం తోడని ప్రమాణం చేస్తావు. ఇశ్రాయేలు దేవుని పేరు స్మరిస్తావు. అయితే యథార్థంగా నిజాయితీతో అలా చేయవు.
雅各家,称为以色列名下, 从犹大水源出来的,当听我言! 你们指着耶和华的名起誓, 提说以色列的 神, 却不凭诚实,不凭公义。
2 మేము పరిశుద్ధ పట్టణవాసులం అనే పేరు పెట్టుకుని, వాళ్ళు ఇశ్రాయేలు దేవుని ఆశ్రయిస్తారు. ఆయన పేరు సేనల ప్రభువైన యెహోవా.
他们自称为圣城的人, 所倚靠的是 名为万军之耶和华—以色列的 神。
3 ఈ విషయాలు ఇలా జరుగుతాయని ఎప్పుడో చెప్పాను. అవి నా నోట్లో నుండే వచ్చాయి. నేనే వాటిని తెలియచేశాను. అకస్మాత్తుగా జరిగేలా వాటిని చేశాను.
主说:早先的事,我从古时说明, 已经出了我的口, 也是我所指示的; 我忽然行做,事便成就。
4 నువ్వు మూర్ఖుడవనీ నీ మెడ నరాలు ఇనుములాంటివనీ నీ నొసలు కంచులాంటిదనీ నాకు తెలుసు.
因为我素来知道你是顽梗的— 你的颈项是铁的; 你的额是铜的。
5 అందుకే ఈ విషయాలు ఎప్పుడో చెప్పాను. అవి జరక్కముందే నేను నీకు చెప్పాను. “నా విగ్రహమే వీటిని చేసింది.” లేకపోతే “నేను చెక్కిన బొమ్మ, లేదా నేను పోతపోసిన బొమ్మ దీన్ని నియమించింది” అని నువ్విక చెప్పలేవు.
所以,我从古时将这事给你说明, 在未成以先指示你, 免得你说:这些事是我的偶像所行的, 是我雕刻的偶像和我铸造的偶像所命定的。
6 నువ్వు ఈ విషయాలు విన్నావు. ఈ వాస్తవమంతా చూడు. నేను చెప్పింది నిజమేనని మీరు ఒప్పుకోరా? ఇక నుంచి కొత్త సంగతులు, నీకు తెలియని గూఢమైన సంగతులు నేను చెబుతాను.
你已经听见,现在要看见这一切; 你不说明吗? 从今以后,我将新事, 就是你所不知道的隐密事指示你。
7 అవి చాలా కాలం క్రితం కలిగినవి కావు. “అవి ఇప్పుడే కలిగాయి. అవి నాకు తెలిసినవే” అని నువ్వు చెప్పకుండేలా ఇంతకుముందు నువ్వు వాటిని వినలేదు.
这事是现今造的,并非从古就有; 在今日以先,你也未曾听见, 免得你说:这事我早已知道了。
8 నువ్వెన్నడూ వాటిని వినలేదు. నీకు తెలియదు. ముందే ఈ విషయాలు నీకు చెప్పలేదు. పుట్టినప్పటినుంచి నువ్వు తిరుగుబోతుగా ఉన్నావనీ పెద్ద మోసగాడిగా ఉన్నావనీ నాకు తెలుసు.
你未曾听见,未曾知道; 你的耳朵从来未曾开通。 我原知道你行事极其诡诈, 你自从出胎以来, 便称为悖逆的。
9 నా నామం కోసం నేను నిన్ను నిర్మూలం చేయను. నా కోపం చూపించను. నా కీర్తి కోసం మిమ్మల్ని నాశనం చేయకుండా నీ విషయంలో నన్ను నేను తమాయించుకుంటాను.
我为我的名暂且忍怒, 为我的颂赞向你容忍, 不将你剪除。
10 ౧౦ నేను నిన్ను పుటం వేశాను. అయితే వెండిలా కాదు. బాధల కొలిమిలో నిన్ను పరీక్షించాను.
我熬炼你,却不像熬炼银子; 你在苦难的炉中,我拣选你。
11 ౧౧ నా కోసం, నా కోసమే ఆలా చేస్తాను. ఎందుకంటే నా పేరు అవమానానికి ఎందుకు గురి కావాలి? నా ఘనత మరెవరికీ ఇవ్వను.
我为自己的缘故必行这事, 我焉能使我的名被亵渎? 我必不将我的荣耀归给假神。
12 ౧౨ యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నా మాట విను. నేనే ఆయన్ని. నేను మొదటివాణ్ణి, చివరివాణ్ణి.
雅各—我所选召的以色列啊, 当听我言: 我是耶和华, 我是首先的,也是末后的。
13 ౧౩ నా చెయ్యి భూమికి పునాదివేసింది. నా కుడిచెయ్యి ఆకాశాన్ని పరచింది. నేను వాటిని పిలిస్తే అవన్నీ కలిసి నిలుస్తాయి.
我手立了地的根基; 我右手铺张诸天; 我一招呼便都立住。
14 ౧౪ మీరంతా ఒక చోటికి వచ్చి నా మాట వినండి. మీలో ఎవరు ఈ విషయాలు తెలియచేశారు? యెహోవా మిత్రుడు బబులోనుకు విరోధంగా తన ఉద్దేశాన్ని నేరవేరుస్తాడు. అతడు యెహోవా ఇష్టాన్ని కల్దీయులకు విరోధంగా జరిగిస్తాడు.
你们都当聚集而听, 他们内中谁说过这些事? 耶和华所爱的人必向巴比伦行他所喜悦的事; 他的膀臂也要加在迦勒底人身上。
15 ౧౫ ఔను. నేనే ఇలా చెప్పాను. నేనే అతణ్ణి పిలిచాను. నేనే అతణ్ణి రప్పించాను. అతడు చక్కగా చేస్తాడు.
惟有我曾说过,我又选召他, 领他来,他的道路就必亨通。
16 ౧౬ నా దగ్గరికి రండి. ఈ విషయం వినండి. మొదటినుంచి నేను రహస్యంగా మాట్లాడలేదు. అది జరిగేటప్పుడు నేనక్కడే ఉన్నాను. ఇప్పుడు యెహోవా ప్రభువు తన ఆత్మతో నన్ను పంపాడు.
你们要就近我来听这话: 我从起头并未曾在隐密处说话; 自从有这事,我就在那里。 现在,主耶和华差遣我和他的灵来。
17 ౧౭ నీ విమోచకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలా చెబుతున్నాడు. “నేను నీ దేవుణ్ణి. యెహోవాను. నువ్వెలా సాధించగలవో నీకు బోధిస్తాను. నువ్వు వెళ్ళాల్సిన దారిలో నిన్ను నడిపిస్తాను.
耶和华—你的救赎主, 以色列的圣者如此说: 我是耶和华—你的 神, 教训你,使你得益处, 引导你所当行的路。
18 ౧౮ నువ్వు నా ఆజ్ఞలను పాటిస్తే ఎంత బాగుంటుంది! అప్పుడు నీ శాంతి, సౌభాగ్యం నదిలా పారేవి. నీ విడుదల సముద్రపు అలల్లా ఉండేది.
甚愿你素来听从我的命令! 你的平安就如河水; 你的公义就如海浪。
19 ౧౯ నీ సంతానం ఇసుకంత విస్తారంగా నీ గర్భఫలం దాని రేణువుల్లాగా విస్తరించేవారు. వారి పేరు నా దగ్గర నుంచి కొట్టివేయడం జరిగేది కాదు.
你的后裔也必多如海沙; 你腹中所生的也必多如沙粒。 他的名在我面前必不剪除, 也不灭绝。
20 ౨౦ బబులోను నుంచి బయటికి రండి! కల్దీయుల దేశంలో నుంచి పారిపొండి! యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించాడు” అనే విషయం ఉత్సాహంగా ప్రకటించండి! అందరికీ తెలిసేలా చేయండి! ప్రపంచమంతా చాటించండి!
你们要从巴比伦出来, 从迦勒底人中逃脱, 以欢呼的声音传扬说: 耶和华救赎了他的仆人雅各! 你们要将这事宣扬到地极。
21 ౨౧ ఎడారుల్లో ఆయన వారిని నడిపించినప్పుడు వారికి దాహం వేయలేదు. వారి కోసం బండలోనుంచి నీళ్లు ఉబికేలా చేశాడు. ఆయన ఆ బండ చీల్చాడు. నీళ్లు పెల్లుబికాయి.
耶和华引导他们经过沙漠。 他们并不干渴; 他为他们使水从磐石而流, 分裂磐石,水就涌出。
22 ౨౨ “దుష్టులకు నెమ్మది ఉండదు” అని యెహోవా చెబుతున్నాడు.
耶和华说: 恶人必不得平安!

< యెషయా~ గ్రంథము 48 >