< యెషయా~ గ్రంథము 47 >
1 ౧ బబులోను కన్యా, కిందికి దిగి మట్టిలో కూర్చో. కల్దీయుల కుమారీ, సింహాసనం లేకుండా నేల మీద కూర్చో. నువ్వు సుతిమెత్తని దానివనీ సుకుమారివనీ ప్రజలు ఇక ముందు చెప్పరు.
Go down and sit in the dust, virgin daughter of Babylon. Sit on the ground without a throne, daughter of Babylonia! No longer will people call you gentle and delicate.
2 ౨ తిరగలి తీసుకుని పిండి విసురు. నీ ముసుగు తీసివెయ్యి. కాలి మీద జీరాడే వస్త్రాలు తీసివెయ్యి. కాలి మీది బట్ట తీసి నదులు దాటు.
Go to work grinding flour with millstones. Remove your veil. Strip off your skirt, bare your legs, wade through rivers.
3 ౩ నీ చీర కూడా తీసేస్తారు. నీ నగ్నత్వం బయటపడుతుంది. నేను మనుషులపై ప్రతీకారం తీర్చుకునేటప్పుడు వారిపై జాలిపడను.
You will be seen naked; what should be kept private will be shamefully exposed. I will take vengeance—I won't spare anyone.
4 ౪ మా విమోచకునికి సేనల అధిపతి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అయిన యెహోవా అని పేరు.
Our Redeemer—his name is the Lord Almighty—is the Holy One of Israel.
5 ౫ కల్దీయుల కుమారీ, మౌనంగా చీకటిలోకి వెళ్ళిపో. రాజ్యాలన్నిటికీ రాణి అని ప్రజలు ఇంక నిన్ను పిలవరు.
Sit quietly, and go into the darkness, daughter of Babylonia. Never again will you be called queen of all kingdoms.
6 ౬ నా ప్రజల మీద కోపంతో నా స్వాస్థ్యాన్ని అపవిత్రపరచి వారిని నీ చేతికి అప్పగించాను. కాని నువ్వు వారి మీద కనికరం చూపలేదు. వృద్ధుల మీద నీ బరువైన కాడిని మోపావు.
I was angry with my people, and I abandoned those who belonged to me. I handed them over to you. But you didn't show them mercy—you even mistreated old people.
7 ౭ నీవు “నేను ఎల్లకాలం మహారాణిగా ఉంటాను” అనుకుని ఈ విషయాల గురించి ఆలోచించలేదు, వాటి పరిణామం ఎలా ఉంటుందో అని పరిశీలించలేదు.
You said, “I will reign forever as the eternal queen.” But you didn't think about what was coming; you didn't remember what would happen to you in the end.
8 ౮ కాబట్టి సుఖాసక్తితో నిర్భయంగా జీవిస్తూ “నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరూ లేరు. నేనెన్నటికీ విధవరాలిని కాను, పుత్రశోకం నాకు కలగదు” అనుకుంటున్నావు. ఇదిగో, ఈ మాటను విను.
Now listen to this, you sensual woman, sitting there so sure of yourself, saying to yourself, “I am supreme—there's nobody besides me. I shall never be a widow or experience the loss of my children.”
9 ౯ పుత్ర శోకం, వైధవ్యం, ఈ రెండూ ఒక్క నిమిషంలో ఒకే రోజున నీకు కలుగుతాయి. నువ్వు ఎంతగా శకునం చూసినా, అనేక కర్ణపిశాచ తంత్రాలపై ఆధారపడినా ఈ అపాయాలు నీ మీదికి సంపూర్తిగా వస్తాయి.
But both these things will happen to you in quick succession! In just one day you will lose your children and become a widow. You will have this experience in its totality, in spite of all your witchcraft, in spite of all your magic spells.
10 ౧౦ నీ దుర్మార్గంలో మునిగిపోయి “ఎవడూ నన్ను చూడడు” అని అనుకున్నావు. నీ విద్య, నీ జ్ఞానం “నేనే. నాలాగా మరి ఎవరూ లేరు” అని విర్రవీగేలా చేశాయి.
You put your trust in your evil actions, saying “No one can see what I'm doing.” Your wisdom and knowledge seduced you, and you told yourself, “I am supreme—there's nobody besides me.”
11 ౧౧ వినాశనం నిన్ను కమ్ముకుంటుంది. నువ్వు మంత్రాలతో దాన్ని పోగొట్టలేవు. కీడు నీ మీద పడుతుంది, దాన్ని నువ్వు నివారించలేవు. నీకు తెలియకుండా విపత్తు నీ మీదికి అకస్మాత్తుగా ముంచుకొస్తుంది.
Evil is going to strike you, and you won't be able to magic it away. Disaster will fall on you that you can't stop by paying a ransom. Destruction will suddenly hit you that you weren't expecting.
12 ౧౨ నీవు నిలబడి చిన్నతనం నుండి నువ్వు ఎంతో ప్రయాసతో నేర్చుకున్న నీ కర్ణపిశాచ తంత్రాలను, విస్తారమైన నీ శకునాలను ప్రయోగించు. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరం అవుతాయేమో, వాటితో ఒకవేళ నువ్వు మనుషులను బెదరించగలవేమో.
So keep going with your magic spells and all your witchcraft, which you have worked at since you were young. Maybe you'll be successful, maybe you'll terrify people!
13 ౧౩ నీ విస్తారమైన చర్చల వలన నువ్వు అలసిపోయావు. జ్యోతిష్యులనూ, నక్షత్రాలు చూసి, నెలలు లెక్కించి శకునాలు చెప్పేవారినీ పిలిచి, నీకు జరగబోయేవి నీ మీదికి రాకుండా తప్పించి నిన్ను రక్షిస్తారేమో ఆలోచించు.
All the advice you've received has worn you out! Where are your astrologers, those who look to the stars for guidance, who give you their predictions every month? Let them stand up and save you from what's coming down on you!
14 ౧౪ వారు చెత్త పరకల్లాగా అవుతారు. అగ్ని వారిని కాల్చివేస్తుంది. అగ్ని జ్వాలల నుండి తమను తామే రక్షించుకోలేకపోతున్నారు. అది చలి కాచుకొనే మంట కాదు, మనుషులు దాని ఎదుట కూర్చోగలిగింది కాదు.
But look at them! They're like stubble that fire burns up completely—they can't even save their own lives from the flames. This is no fire to sit beside and grow warm!
15 ౧౫ నువ్వు ఎవరికోసం చాకిరీ చేసి అలసిపోయావో వారు నీకు ఎందుకూ పనికిరారు. నీ బాల్యం నుండి నీతో వ్యాపారం చేసినవారు తమ తమ చోట్లకు వెళ్లిపోతున్నారు. నిన్ను రక్షించేవాడు ఒక్కడూ ఉండడు.
All those people you've worked with, all those you've traded with from when you were young—they will all go their own way, nobody will come and save you.