< యెషయా~ గ్రంథము 45 >
1 ౧ యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి ఈ విధంగా చెబుతున్నాడు. “అతని పక్షంగా రాజ్యాలను జయించడానికి నేను అతని కుడిచేతిని పట్టుకున్నాను. నేను రాజుల నడికట్లు విప్పుతాను. ద్వారాలు అతని ఎదుట తెరచి ఉండేలా తలుపులు తీస్తాను.
Så säger Herren till Cores, sin smorda, den jag vid hans högra hand fattar, att jag skall underkufva Hedningarna för honom, och lösa Konungenom svärdet ifrå; på det att portarna skola öppnade varda för honom, och dörrarna icke igenlästa blifva;
2 ౨ నేను నీకు ముందు వెళ్తూ ఉన్నత స్థలాలను చదును చేస్తాను. ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనపగడియలను విరగ్గొడతాను.
Jag vill gå för dig, och göra backarna till jemna mark; jag vill sönderslå de koppardörrar, och sönderbryta de jernbommar;
3 ౩ పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడు యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకోవాలి. చీకటి స్థలాల్లో ఉన్న నిధుల్నీ రహస్యంగా దాచి ఉన్న ధనాన్నీ నీకిస్తాను.
Och skall gifva dig de fördolda rikedomar, och de bortgömda klenodier, på det att du skall förnimma att jag, Herren Israels Gud, dig vid ditt namn nämnt hafver;
4 ౪ నేను నీకు తెలియకపోయినా నా సేవకుడు యాకోబు కోసం, నేను ఎన్నుకున్న ఇశ్రాయేలు కోసం నేను నిన్ను పేరుతో పిలిచాను. నీకు బిరుదులిచ్చాను.
För Jacob min tjenares skull, och för Israel mins utkorades skull; ja, jag kallade dig vid ditt namn, och nämnde dig, då du ännu intet kände mig.
5 ౫ నేను యెహోవాను, మరి ఏ దేవుడూ లేడు. నేను తప్ప ఏ దేవుడూ లేడు.
Jag är Herren, och eljest ingen mer; ingen Gud är utan jag. Jag tillrustade dig, då du ännu intet kände mig;
6 ౬ తూర్పు నుండి పడమటి వరకూ నేను తప్ప ఏ దేవుడూ లేడని మనుషులు తెలుసుకోనేలా నువ్వు నన్ను ఎరుగకపోయినా నిన్ను సిద్ధం చేశాను. నేనే యెహోవాను. నేను తప్ప మరి ఏ దేవుడూ లేడు.
På det man skall förnimma, både ifrån östan och vestan, att utan mig är intet; jag är Herren, och ingen mer.
7 ౭ వెలుగును సృజించే వాణ్ణీ చీకటిని కలిగించే వాణ్ణీ నేనే. శాంతినీ, విపత్తులనూ కలిగించే వాణ్ణి నేనే. యెహోవా అనే నేనే వీటన్నిటినీ కలిగిస్తాను.
Jag, som gör ljuset, och skapar mörkret; jag, som frid gifver, och skapar det onda; jag är Herren, som allt detta gör.
8 ౮ అంతరిక్షమా, పైనుండి కురిపించు. ఆకాశాలు నీతిన్యాయలు వర్షించనీ. భూమి విచ్చుకుని రక్షణ మొలకెత్తేలా నీతిని దానితో బాటు మొలిచేలా చెయ్యనీ. యెహోవానైన నేను దాన్ని కలిగించాను.
Dryper, I himlar, ofvanefter, och skyn regne rättfärdighet; jorden öppne sig, och bäre salighet, och rättfärdighet växe till med, jag Herren skapar honom.
9 ౯ మట్టికుండ పెంకుల్లో ఒక పెంకులాటి ఒకడు తనను చేసిన వానితో వాదిస్తే వాడికి బాధ. బంకమట్టి కుమ్మరితో ‘నువ్వేం చేస్తున్నావ్?’ అనవచ్చా? ‘నువ్వు చేసినపుడు నీకు చేతులు లేవా?’ అనగలదా?
Ve honom, som träter med sinom skapare, nämliga krukan med krukomakaren. Månn leret säga till krukomakaren: Hvad gör du? Du bevisar icke dina händer på ditt verk.
10 ౧౦ ‘నీకు పుట్టినదేమిటి?’ అని తన తండ్రినీ, ‘నువ్వు దేనిని గర్భం ధరించావు?’ అని తల్లినీ అడిగే వాడికి బాధ తప్పదు.”
Ve honom, som till fadren säger: Hvi hafver du aflat mig? och till qvinnona: Hvi födde du?
11 ౧౧ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట చెబుతున్నాడు, “జరగబోయే విషయాలకు సంబంధించి, నా పిల్లలను గురించీ, నా చేతి పనులను గురించీ నాకే ఆజ్ఞాపిస్తారా?
Så säger Herren, den Helige i Israel, och hans mästare: Äsker tecken af mig, viser min barn och mina händers verk till mig.
12 ౧౨ భూమినీ దానిపైనున్న మనుషులనూ సృష్టించింది నేనే. నా చేతులు ఆకాశాలను విశాలపరిచాయి. వాటిలోని సమస్తాన్నీ నా ఆజ్ఞతోనే నడిపిస్తాను.
Jag hafver gjort jordena, och skapat menniskona deruppå; jag är den, hvilkens händer himmelen utsträckt hafva, och budit allom hans här.
13 ౧౩ నీతిని బట్టి కోరెషును ప్రేరేపించాను, అతని మార్గాలన్నిటినీ తిన్నగా చేస్తాను. అతడు నా పట్టణాన్ని కట్టిస్తాడు, ఏమీ వెల గానీ, లంచం గానీ పుచ్చుకోకుండానే చెరలో ఉన్నవారిని అతడు విడిపిస్తాడు.”
Jag hafver uppväckt honom uti rättfärdighet, och jag skall göra alla hans vägar släta; han skall bygga min stad, och låta mina fångar lösa, icke för penningar eller gåfvor, säger Herren Zebaoth.
14 ౧౪ యెహోవా ఈ విధంగా చెబుతున్నాడు “ఐగుప్తీయుల సంపాదన, కూషు వ్యాపార లాభాలు, నీకు దొరుకుతాయి. ఎత్తుగా ఉండే సెబాయీయులు నీకు లొంగిపోతారు. వారు సంకెళ్ళతో నీవెంట వచ్చి నీకు సాగిలపడతారు. ‘నిజంగా దేవుడు నీతో ఉన్నాడు, ఆయన తప్ప మరి ఏ దేవుడూ లేడు’ అని చెబుతూ నిన్ను వేడుకుంటారు.”
Så säger Herren: De Egyptiers handel, och de Ethiopers förvärfning, och det stora folket i Seba, skola gifva sig under dig, och vara dine egne; de skola följa dig, uti fjettrar skola de gå, och skola nederfalla för dig, och bedja dig; ty när dig är Gud, och är eljest ingen gud mer.
15 ౧౫ రక్షకుడవైన ఇశ్రాయేలు దేవా, నిజంగా నువ్వు నిన్ను కనబడకుండా చేసుకునే దేవుడవు.
Sannerliga äst du en fördold Gud, du Israels Gud, Frälsaren.
16 ౧౬ విగ్రహాలు చేసే వారు సిగ్గుపడతారు. వారంతా అవమానం పాలవుతారు. వారిలో ప్రతి ఒక్కడూ కలవరానికి గురవుతాడు.
Men de afgudamakare måste allesammans med skam och hån bestå, och med hvarannan med blygd afgå.
17 ౧౭ యెహోవా ఇశ్రాయేలుకు నిత్యమైన రక్షణ అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు ఇక ఎన్నటికీ సిగ్గుపడరు, అవమానం పాలు కారు.
Men Israel varder förlossad genom Herran evinnerliga; och skall icke till skam och spott varda någon tid i evighet.
18 ౧౮ ఆకాశాల సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని చేసి, దాన్ని సిద్ధపరచి స్థిరపరిచాడు. నిరాకారంగా కాక, ఒక నివాసస్థలంగా దాన్ని సృష్టించాడు. ఆయన ఇలా ప్రకటిస్తున్నాడు. “యెహోవాను నేనే, మరి ఏ దేవుడూ లేడు.
Ty så säger Herren, som himmelen skapat hafver, Gud, som jordena beredt hafver, och hafver gjort henne och tillredt, och icke så gjort henne, att hon skulle tom vara; utan hafver tillredt henne, att man skall bo deruppå. Jag är Herren, och ingen mer.
19 ౧౯ ఎక్కడో చీకటిలో రహస్య స్థలం నుండి నేను మాట్లాడలేదు. అదృశ్యంగా ఉండి, ‘నన్ను వెదకండి’ అని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయంగా మాట్లాడేవాణ్ణి, యెహోవా అనే నేను యథార్థమైన సంగతులు తెలిపేవాణ్ణి.
Jag hafver icke hemliga talat uti något mörkt rum på jordene; jag hafver icke fåfängt sagt till Jacobs säd: Söker mig; ty jag är Herren, som om rättfärdighet talar, och förkunnar det rätt är.
20 ౨౦ కలిసి రండి, వివిధ రాజ్యాల్లో పరవాసులుగా ఉన్నవారంతా నా దగ్గర సమకూడండి. చెక్కిన విగ్రహాలను మోస్తూ రక్షించలేని ఆ దేవుళ్ళకు మొరపెట్టేవారు బుద్ధిహీనులు.
Låt församla sig och tillhopa framkomma Hedningarnas hjeltar, de der intet veta, och bära deras afgudars stockar, och bedja den gud, som dem intet hjelpa kan.
21 ౨౧ నా సన్నిధిలోకి వచ్చి సంగతులు వివరించండి. ప్రజలు వారిలో వారిని సంప్రదించుకొనియండి. పూర్వకాలం నుండీ ఆ కార్యాలను ఎవరు తెలుపుతూ ఉన్నారు? చాలకాలం కిందటే దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను న్యాయవంతుడైన దేవుణ్ణి. నేనే రక్షించేవాణ్ణి. నేను తప్ప మరి ఏ దేవుడూ లేడు.
Förkunner och kommer hit, rådslår tillsamman. Ho hafver detta låtit säga af ålder, och på den tiden förkunnat det? Hafver icke jag Herren gjort det? Och är eljest ingen Gud utan jag; en rätt Gud och Frälsare, och ingen är utan jag.
22 ౨౨ భూమి అంచుల వరకూ నివసించే ప్రజలారా, నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుణ్ణి నేనే, మరి ఏ దేవుడూ లేడు.
Vänder eder till mig, så varden I salige, alle verldenes ändar; ty jag är Gud, och ingen mer.
23 ౨౩ నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుందనీ, ప్రతి నాలుకా ‘యెహోవా తోడు’ అని అంటుందనీ నేను ప్రమాణం చేశాను. నా న్యాయ వాక్కు బయలుదేరింది. అది వ్యర్ధం కాదు.
Jag svär vid mig sjelf, och ett rättfärdighets ord går utaf min mun, der skall det blifva vid; nämliga, mig skola, all knä böjas, och alla tungor svärja;
24 ౨౪ ‘యెహోవాలోనే రక్షణ, బలం ఉన్నాయి’ అని ప్రజలు నా గురించి చెబుతారు.” మనుషులంతా ఆయన దగ్గరకే వస్తారు. ఆయనను వ్యతిరేకించిన వారంతా సిగ్గుపడతారు.
( Och säga: ) Uti Herranom hafver jag rättfärdighet och starkhet. Desse skola ock komma till honom; men alle de, som honom emotstå, måste till skam varda.
25 ౨౫ ఇశ్రాయేలు సంతానం వారంతా యెహోవా వలన నీతిమంతులుగా తీర్పు పొంది అతిశయిస్తారు.
Ty uti Herranom varder all Israels säd rättfärdigad, och skall berömma sig af honom.