< యెషయా~ గ్రంథము 44 >

1 అయినా నా సేవకుడవైన యాకోబూ, నేను ఏర్పరచుకొన్న ఇశ్రాయేలూ, విను.
但是現在,我的僕人雅各伯!我所揀選的以色列!你聽罷!
2 నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేసే యెహోవా ఇలా చెబుతున్నాడు, “నా సేవకుడవైన యాకోబూ, నేను ఏర్పరచుకొన్న యెషూరూనూ, భయపడకు.
那造成你,從母胎形成你,且協助你的上主這樣說:「我的僕人雅各伯!我所揀選的耶叔戎,你不要害怕!
3 నేను దాహం గొన్నవారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద జల ప్రవాహాలను కుమ్మరిస్తాను. నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను.
因為我要把水倒在乾地上,使豪雨落在旱陸上;我要把我的神傾住在你的苗裔身上,把我的祝福降在你的子孫身上。
4 నీటి కాలవల దగ్గర నాటిన నిరవంజి చెట్లు గడ్డిలో పెరిగినట్టు వారు పెరుగుతారు.
他們要生長,有如水邊的青草,又如溪畔的楊柳。
5 ఒకడు, ‘నేను యెహోవా వాణ్ణి’ అంటాడు, ఇంకొకడు యాకోబు పేరు చెబుతాడు. మరొకడు అయితే ‘యెహోవా వాణ్ణి’ అని తన చేతిపై రాసుకుని ఇశ్రాయేలు అనే మారు పేరు పెట్టుకుంటాడు.”
這個說:「我是上主的,」那個要起雅各伯的名字,另一個要在手上寫 :「屬於上主,」並要起以色列的名號。
6 ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడు, సైన్యాల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు, “నేను మొదటివాణ్ణి, చివరివాణ్ణి. నేను తప్ప ఏ దేవుడు లేడు.
上主,以色列的君王,救主,萬軍的上主這樣說:「我是元始,我是終末,在我以外沒有別的神。
7 ఆదిలో నా ప్రజలను నియమించినప్పటి నుండి నాలాగా విషయాలను వెల్లడి చేస్తూ వచ్చిన వాడెవడు? అలాంటివాడు ఉంటే నాకు చెప్పండి. వారు భవిష్యత్తులో జరిగే సంగతులను తెలియజెప్ప గలిగేవారై ఉండాలి.
誰相似我﹖讓他前來伸述,讓他說明,給我拿出證據來!誰能從永遠預言未來的事,請他告訴我們快要發生的事罷!
8 మీరు బెదరవద్దు, భయపడవద్దు. పూర్వకాలం నుండి నేను మీకు ఆ సంగతి వినిపిస్తూ ఉండలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప వేరొక ఆశ్రయదుర్గం లేదు. ఉన్నట్టు నేనెరుగను.
你們不必驚慌,不用害怕!我不是早已告訴過你,早已宣布了嗎﹖你們是我的證人,在我以外還有別的神嗎﹖決沒有別的磐石!我一個也不認識!」
9 విగ్రహాన్ని చేసే వారంతా మిధ్య. వారిష్టపడే విగ్రహాలు వ్యర్ధం. వారి సాక్షులు గ్రహింపు లేనివారు. చూడలేరు. కాబట్టి వారు సిగ్గు పాలవుతారు.
製造偶像的人都是虛無,他們所喜愛的,也毫無用處;他們的見證人一無所見,毫無所知,必將蒙受恥辱。
10 ౧౦ ఎందుకూ పనికిరాని విగ్రహాన్ని పోత పోసి దాన్ని ఒక దేవుడిగా నిరూపించేవాడెవడు?
有誰製造神像或鑄偶像,不想得利呢﹖
11 ౧౧ ఇదిగో, దాన్ని పూజించే వారంతా సిగ్గుపడతారు. ఆ శిల్పకారులు మానవ మాత్రులే గదా? వారందరినీ పోగు చేసి నిలబెడితే వారు తప్పకుండా భయపడతారు, సిగ్గుపడతారు.
看哪!凡作他夥伴的,都要蒙受恥辱,因為製造偶像的,也只是人而已! 讓他們集合起來一同前來罷!他們必要驚慌羞愧!
12 ౧౨ కమ్మరి ఇనుప గొడ్డలిని పదును చేస్తూ నిప్పుల మీద పని చేస్తాడు. తన బలమైన చేతితో దాన్ని తయారుచేస్తాడు. అతనికి ఆకలి వేస్తుంది, అతని బలం తగ్గిపోతుంది. నీళ్లు తాగకపోవడం చేత సొమ్మసిల్లి పడిపోతాడు.
鐵匠先在炭火上工作,再用鎚子打成偶像,他用大力的手臂工作,當饑餓時,也就沒有力量;沒有水喝,他就疲勞不堪。
13 ౧౩ వడ్లవాడు చెక్క మీద నూలు తాడు వేసి గీత గీస్తాడు. దాన్ని చిత్రిక పట్టి నునుపుగా చేస్తాడు. ఎండ్రకాయ గుర్తు పెట్టి దాన్ని తయారు చేస్తాడు. మందిరంలో నిలబెట్టడం కోసం ఒక మానవ రూపాన్ని ఆకర్షణీయంగా ఉండేలా చేస్తాడు.
木匠伸展繩墨,用筆劃線,後拿刨子刨平,再用圓規測量,做成一個人形,具有人的美麗,好供在廟裏。
14 ౧౪ ఒకడు దేవదారు చెట్లను నరకడానికి పూనుకుంటాడు. లేక సరళ వృక్షాన్నో సింధూర వృక్షాన్నో ఏదొక అడవి వృక్షాన్ని ఎన్నుకుంటాడు. ఒకడు ఒక చెట్టును నాటినప్పుడు అది వర్షం సాయంతో పెరుగుతుంది.
人先去砍伐一塊香柏,或取一塊榆木,或橡木;或在樹林中選一塊堅固的木料,或自己種植一棵月桂樹,讓雨水使之長大。
15 ౧౫ అప్పుడు ఒక మనిషి ఆ చెట్టుని కాల్చి వాటిలో కొంత తీసుకుని చలి కాచుకోడానికి, కొంత నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకోడానికి ఉపయోగిస్తాడు. మిగిలినదాన్ని తీసుకుని దానితో ఒక దేవతను చేసుకుని దానికి నమస్కారం చేస్తాడు. దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడతాడు.
這些木料原是為人作燃料,原可用來取煖,也可燃燒烘烤麵包;人卻用它來作神像去恭敬,或做偶像去叩拜:
16 ౧౬ కొంత చెక్కను నిప్పుతో కాల్చి, దానిపై మాంసం వండుకుని తిని తృప్తి పొందుతాడు. ‘ఆహా, చలి కాచుకున్నాను, వెచ్చగా ఉంది’ అనుకున్నాడు.
人把一半木頭投入火中燃燒,在火炭上烤肉吃;待吃飽了烤肉,又取了煖,遂說:「哈哈!我暖和了,也覺得有了火!」
17 ౧౭ మిగిలిన భాగాన్ని తాను దేవుడుగా భావించే విగ్రహాన్ని చేసుకుంటాడు. దాని ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తూ ‘నా దేవుడివి నువ్వే, నన్ను రక్షించు’ అని ప్రార్థిస్తాడు.
遂用剩下的一半作了一個神像,一個偶像,向它叩拜,俯伏懇求說:「求你救我,因為你是我的神!」
18 ౧౮ వారికి తెలియదు, అర్థం చేసుకోరు. వారు చూడకుండేలా వారి కళ్ళు, అర్థం చేసుకోకుండేలా వారి హృదయాలు మూసుకుపోయాయి.
他們不瞭解,也不覺悟,因為他們的眼糊住了,什麼也看不見;他們的心也不知覺悟,
19 ౧౯ ఎవరూ ఆలోచించడం లేదు. ‘నేను సగం చెక్కను అగ్నిలో కాల్చాను, ఆ నిప్పుల మీద రొట్టె కాల్చుకుని, మాంసం వండుకుని భోజనం చేశాను. మిగిలిన చెక్కను తీసుకుని దానితో అసహ్యమైన దాన్ని చేయాలా? ఒక చెట్టు మొద్దుకు సాగిలపడి నమస్కరించాలా?’ అని ఆలోచించడానికి ఎవరికీ తెలివి, వివేచన లేదు.
也不回心想一下,也不會明智通達地說:「一半木頭我已投入火中燒了,並在火炭上烤了麵包,烤了肉吃;我竟將剩下的一半作了一個怪物,向這塊木頭敬拜。」
20 ౨౦ వాడు బూడిద తిన్నట్టుగా ఉంది. వాడి మోసపోయిన మనస్సు వాణ్ణి దారి తప్పేలా చేసింది. వాడు తన ఆత్మను రక్షించుకోలేడు. ‘నా కుడి చేతిలో ఉన్న బొమ్మ నకిలీ దేవుడు కదా’ అనుకోడానికి వాడికి బుద్ధి సరిపోదు.
他所追求的僅是一把灰;他迷惑的心領他走入歧途,而不能自拔,也不會問說:「我右手所拿的不是虛無嗎﹖」
21 ౨౧ యాకోబూ, ఇశ్రాయేలూ, వీటిని గురించి ఆలోచించు. నువ్వు నా సేవకుడివి. నేనే నిన్ను నిర్మించాను. ఇశ్రాయేలూ, నువ్వు నాకు సేవకుడివి. నేను నిన్ను మరచిపోను.
雅各伯啊!你要記住這些事!以色列啊!你也應記住,因為你是我的僕人,我造了你,是叫你作我的僕人。以色列啊!我決不會忘了你!
22 ౨౨ మంచు విడిపోయేలా నేను నీ అతిక్రమాలను, మేఘాలు తొలగిపోయేలా నీ పాపాలను తుడిచివేశాను. నేను నిన్ను విమోచించాను. నా దగ్గరికి తిరిగి రా.
我消除了你的罪過,有如煙消;我消除了你的愆尤,有如雲散;歸依我罷!因為我救贖了你。
23 ౨౩ యెహోవా ఆ పని పూర్తి చేశాడు. ఆకాశాల్లారా, గీతాలు పాడండి. భూమీ, దాని కింది అగాధ స్థలాలు గొప్ప ధ్వని చేయండి. పర్వతాలూ, అరణ్యం, అందులోని ప్రతి వృక్షం, సంగీతనాదం చేయండి. యెహోవా యాకోబును విమోచిస్తాడు. ఆయన ఇశ్రాయేలులో తన మహిమను కనపరుస్తాడు.”
諸天,歡騰罷!因為上主作了這一切;地下的深淵,歡呼罷!山嶺、森林和其中的樹木,高聲歌唱罷!因為上主拯救了雅各伯,在以色列顯揚了自己。
24 ౨౪ గర్భంలో నిన్ను నిర్మించినవాడు, నీ విమోచకుడు అయిన యెహోవా ఈ విధంగా చెబుతున్నాడు, “యెహోవా అనే నేనే సమస్తాన్నీ జరిగించేవాణ్ణి. నేనొక్కడినే ఆకాశాలను విశాలపరచాను. నేనే భూమిని చక్కబరచిన వాణ్ణి.
你的救主,由母胎形成你的上主這樣說:「我是創造萬有的上主,只有我展開了諸天,佈置了大地,誰與我同在﹖
25 ౨౫ నేనే ప్రగల్భాలు పలికేవారి ప్రవచనాలను వ్యర్ధం చేసేవాణ్ణి. సోదె చెప్పేవాళ్ళను వెర్రివాళ్ళుగా, జ్ఞానులను వెనక్కి మళ్ళించి వారి తెలివిని బుద్ధిహీనతగా చేసేవాణ్ణి నేనే.
是我破壞了占卜者的預兆,使巫士成為愚妄,使智者退後,使他們的知識變為愚蠢,
26 ౨౬ నా సేవకుని మాటలను స్థిరపరిచే వాణ్ణీ, నా సందేశకుల ఆలోచనలు నెరవేర్చే వాణ్ణీ నేనే. యెరూషలేములో ప్రజలు నివసిస్తారనీ యూదా పట్టణాలను తిరిగి కడతారనీ నేను ఆజ్ఞాపించాను. దాని పాడైన స్థలాలను బాగు చేసేవాణ్ణి నేనే.
是我叫我僕人們的話實現,叫我使者們的計謀成功;是我論及耶路撒冷說:「你必要有人居住。」論及猶大各城說:「你們要被重建,我必要重建你們的廢址。」
27 ౨౭ నీ లోతైన సముద్రాలను ‘ఎండిపో’ అని చెప్పి వాటిని ఇంకిపోయేలా చేసేది నేనే.
是我對深淵說:「你必涸竭,我要使你的河流乾涸。」
28 ౨౮ కోరెషుతో, ‘నా మందకాపరీ, నా ఇష్టాన్ని నెరవేర్చేవాడా’ అని చెప్పేవాణ్ణి నేనే. అతడు ‘యెరూషలేమును తిరిగి కట్టండి’ అనీ ‘దేవాలయం పునాది వేయండి’ అనీ ఆజ్ఞాపిస్తాడని నేను చెబుతున్నాను.”
是我論及居魯士說:「他是我的牧人,他要履行我的一切計劃,要吩咐重建耶路撒冷,奠基重修聖殿。」

< యెషయా~ గ్రంథము 44 >