< యెషయా~ గ్రంథము 40 >
1 ౧ మీ దేవుడు చెబుతున్నది ఏమంటే,
Whakamarietia, whakamarietia taku iwi, e ai ta to koutou Atua.
2 ౨ “ఓదార్చండి, నా ప్రజలను ఓదార్చండి.” యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. ఆమె యుద్ధకాలం ముగిసింది. ఆమెకు పాపాల వలన కలిగిన దోషం తీరిపోయింది. ఆమెకు చెప్పండి, యెహోవా చేతిలో ఆమె తన సమస్త పాపాల నిమిత్తం రెండింతల ఫలితం పొందిందని.
Korero i runga i te whakamarie ki Hiruharama, karanga ki a ia, kua mutu tana whawhai, kua murua tona he: i haere rua hoki ta te ringa o Ihowa ki a ia hei utu mo ona hara katoa.
3 ౩ వినండి, అడవిలో ఒకడు ఈ విధంగా ప్రకటన చేస్తున్నాడు, “అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచండి. ఎడారిలో మా దేవుని రాజమార్గం తిన్నగా చేయండి.”
He reo no tetahi e karanga ana, Whakapaia e koutou i te koraha te huarahi o Ihowa, whakatikaia i te titiohea he ara nui mo to tatou Atua.
4 ౪ ప్రతి లోయను ఎత్తు చేయాలి. ప్రతి పర్వతాన్ని, ప్రతి కొండను అణిచివేయాలి. వంకర వాటిని తిన్నగా, గరుకైన వాటిని నునుపుగా చేయాలి.
Ko nga raorao katoa ka whakarewaina ake, ko nga maunga katoa me nga pukepuke, ka whakapapakutia iho: ko nga wahi kopikopiko ka meinga kia tika, ko nga wahi taratara kia papatairite.
5 ౫ యెహోవా మహిమ వెల్లడి అవుతుంది. ఎవ్వరూ తప్పిపోకుండా ప్రతి ఒక్కరూ దాన్ని చూస్తారు. ఎందుకంటే యెహోవా దేవుడే ఇలా సెలవిచ్చాడు.
Ka whakapuakina ano te kororia o Ihowa, a ka kite ngatahi nga kikokiko katoa: he mea korero hoki tenei na te mangai o Ihowa.
6 ౬ వినండి “ప్రకటించండి” అని ఒక స్వరం పలికింది. “నేనేం ప్రకటించాలి?” మరొక స్వరం పలికింది. “శరీరులంతా గడ్డివంటివారు, వారి అందమంతా అడవి పువ్వులాటిది.
I mea mai te reo o tetahi, Karanga. A ka mea tetahi, Ko te aha kia karangatia e ahau? He tarutaru nga kikokiko katoa, a ko tona pai katoa, rite tonu ki te puawai o te parae.
7 ౭ యెహోవా తన ఊపిరి ఊదినప్పుడు గడ్డి ఎండిపోతుంది. పువ్వులు వాడిపోతారు. మనుషులు నిజంగా గడ్డిలాంటివారే.
Ko te tarutaru ka maroke, ko te puawai ka memenga, no te mea e hangia ana e te wairua o Ihowa: he pono, he tarutaru te iwi.
8 ౮ గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోతుంది. మన దేవుని వాక్యమైతే నిత్యమూ నిలిచి ఉంటుంది.”
Ko te tarutaru e maroke, ko te puawai e memenge; ko te kupu ia a to tatou Atua, tu tonu.
9 ౯ సువార్త ప్రకటిస్తున్న సీయోనూ, ఎత్తయిన కొండ ఎక్కు. సువార్త ప్రకటిస్తున్న యెరూషలేమూ, భయపడకుండా స్థిరంగా ప్రకటించు. “ఇదిగో మీ దేవుడు” అని యూదా పట్టణాలకు ప్రకటించు.
E koe, e te kaikawe o te rongo pai ki Hiona, e piki ki te maunga tiketike; e koe, e te kaikawe o te rongo pai ki Hiruharama, whakaarahia tou reo, kia kaha; whakaarahia, kaua hei wehi; korero atu ki nga pa o Hura, Nana, to koutou Atua!
10 ౧౦ ఇదిగో, ప్రభువైన యెహోవా జయశాలి అయిన యోధునిగా వస్తున్నాడు. తన బలమైన చేతితో ఆయన పాలిస్తాడు. ఆయన ఇవ్వదలచిన బహుమానం ఆయనతో ఉంది. ఆయన ఇచ్చే ప్రతిఫలం ఆయనకు ముందుగా నడుస్తున్నది.
Nana, ka haere mai te Ariki, a Ihowa, i runga i te kaha, ka whakahaerea ano tona kingitanga e tona ringa: na, ko te utu mona kei a ia ano, kei tona aroaro te wahi mana.
11 ౧౧ ఒక గొర్రెల కాపరిలాగా ఆయన తన మందను మేపుతాడు. తన చేతులతో గొర్రెపిల్లలను ఎత్తి రొమ్మున ఆనించుకుని మోస్తాడు. పాలిచ్చే గొర్రెలను ఆయన నెమ్మదిగా నడిపిస్తాడు.
Ka rite ki ta te hepara tana whangai i tana kahui, ka whakaminea nga reme e tona ringa, ka hikitia ki tona uma, ka ata arahina nga mea e whakangote ana.
12 ౧౨ తన దోసిలిలో జలాలను కొలిచిన వాడెవడు? జానతో ఆకాశాలను కొలిచిన వాడెవడు? భూమిలోని మన్ను అంతటినీ కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతాలను, తూనికతో కొండలను తూచిన వాడెవడు?
Na wai i mehua nga wai ki te kapu o tona ringa, he whanganga ringaringa ano tana ruri mo nga rangi, whaowhina ake e ia te puehu o te whenua ki te mehua, ko nga maunga, paunatia ana e ia, ki te pauna ringaringa, ko nga pukepuke ki te pauna papa?
13 ౧౩ యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఒక మంత్రిలాగా ఆయనకు సలహా చెప్పిన వాడెవడు? ఆయన ఎవరినైనా ఎప్పుడైనా ఆలోచన అడిగాడా?
Na wai ta te wairua o Ihowa i tika ai? ko wai ranei tana kaiwhakatakoto whakaaro hei whakaako i a ia?
14 ౧౪ ఆయనకు తెలివిని ఇచ్చిన వాడెవడు? న్యాయమార్గాలను ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానాభ్యాసం చేసిన వాడెవడు? ఆయనకు బుద్ధిమార్గం బోధించిన వాడెవడు?
Ko wai tona hoa whakatakoto whakaaro hei tohutohu i a ia ki te ara o te whakawa, hei whakaako i a ia ki te matauranga, hei whakakite i te ara o te mohio ki a ia?
15 ౧౫ రాజ్యాలు చేద నుండి జారిపడే నీటి బిందువుల్లాంటివి. ప్రజలు త్రాసు మీది దుమ్మువంటివారు. ద్వీపాలు గాలికి ఎగిరే సూక్ష్మ రేణువుల్లా ఉన్నాయి.
Nana, ko nga iwi, ano he pata wai i roto i te peere! ki ta te whakaaro he puehu ririki ratou i te pauna; nana, ko nga motu, maua ake e ia, he mea ririki rawa te rite.
16 ౧౬ అగ్నికి లెబానోను వృక్షాలు సరిపోవు. దహనబలికి దాని పశువులు చాలవు.
E kore ano e ranea a Repanona mo te ahi, me nga kararehe hoki o reira, e kore e ranea hei tahunga tinana.
17 ౧౭ ఆయన దృష్టికి సమస్త రాజ్యాలు లేనట్టుగానే ఉంటాయి. ఆయన వాటిని విలువ లేనివిగా, వ్యర్ధంగా ఎంచుతాడు.
Ko nga iwi katoa, he kore noa iho i tona aroaro; iti iho ratou i te kahore, he horihori kau i tona whakaaro.
18 ౧౮ కాబట్టి మీరు దేవుణ్ణి ఎవరితో పోలుస్తారు? ఏ విగ్రహ రూపాన్ని ఆయనకు సమానం చేస్తారు?
Na ka whakaritea e koutou te Atua ki a wai? he aha hoki te ahua e whakaahuatia ai ia e koutou?
19 ౧౯ విగ్రహాన్ని గమనిస్తే, ఒక శిల్పి దాన్ని పోతపోస్తాడు. కంసాలి దాన్ని బంగారు రేకులతో పొదిగి దానికి వెండి గొలుసులు చేస్తాడు.
Ko te whakapakoko, na te kaimahi ia i whakarewa, na te kaitahu i whakakikorua ki te koura, a hanga ana mo reira he mekameka hiriwa.
20 ౨౦ విలువైన దాన్ని అర్పించలేని పేదవాడు పుచ్చిపోని చెక్కను తీసుకొస్తాడు. స్థిరంగా నిలిచే విగ్రహాన్ని చేయడానికి నేర్పుగల పనివాణ్ణి పిలుస్తాడు.
Ko te tangata, he rawakore rawa ia ki te hoatu whakahere pera, whiriwhiria ana e ia he rakau e kore e pirau; rapua ana e ia he kaimahi mohio mana, hei hanga i tetahi whakapakoko e kore e nekenekehia.
21 ౨౧ మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరూ మీతో చెప్పలేదా? భూమి పునాదులు చూసి మీరు దాన్ని గ్రహించలేదా?
Kahore ianei koutou i mohio? kahore koutou i rongo? kahore ianei i korerotia ki a koutou i te timatanga? kahore ianei koutou i matau i nga whakaturanga ra ano o te whenua?
22 ౨౨ ఆయన భూమండలానికి పైగా ఆసీనుడు అయ్యాడు దాని నివాసులు ఆయన ఎదుట మిడతల్లాగా కనబడుతున్నారు. ఒకడు ఒక తెరను విప్పినట్లు ఆయన ఆకాశాలను పరచి ఒక గుడారంలాగా దాన్ని నివాసస్థలంగా ఏర్పరిచాడు.
Ko ia te noho ana i runga i te porohita o te whenua, a ko o reira tangata, ano he mawhitiwhiti; ko nga rangi, horahia ana e ia ano he kakahu tauarai, horahia ana e ia ano he teneti hei nohoanga;
23 ౨౩ రాజులను ఆయన శక్తిహీనులుగా చేస్తాడు. భూమిని పాలించే వారిని నిరర్ధకం చేస్తాడు.
Ko nga rangatira, whakahokia iho e ia ki te kahore; ko nga kaiwhakawa o te whenua, meinga ana e ia hei mea horihori noa iho.
24 ౨౪ చూడు, వారు నాటారో లేదో, వారు పాతిపెట్టారో లేదో, వారి కాండం భూమిలో వేరు తన్నిందో లేదో, ఆయన వారి మీద ఊదీ ఊదగానే వారు వాడిపోతారు. సుడిగాలి పొట్టును ఎగర గొట్టినట్టు ఆయన వారిని ఎగరగొడతాడు.
Ae ra, kahore ratou i whakatokia; ae ra, kahore ratou i ruia; ae ra, kahore to ratou take i whai pakiaka ki te whenua: ka pupuhi hoki ia ki a ratou, a ka maroke ratou; ka rite ki te kakau witi, ka kawhakina e te paroro.
25 ౨౫ “ఇతడు నీతో సమానుడు అని మీరు నన్నెవరితో పోలుస్తారు?” అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు.
Na ki ta koutou, kei to wai he ahua moku? ka rite ranei ahau ki a wai? e ai ta te Mea Tapu.
26 ౨౬ మీ కళ్ళు పైకెత్తి చూడండి. ఆ నక్షత్రాలన్నిటినీ ఎవరు సృజించారు? వాటిని వరుసలో నిలిపి వాటి పేరుల చొప్పున పిలిచేవాడే గదా. తన అధికశక్తి చేతా తన బలాతిశయం చేతా ఆయన ఒక్కటి కూడా విడిచిపెట్టడు.
E ara o koutou kanohi ki runga titiro ai, na wai enei mea i hanga, na wai o ratou mano i whakaputa mai he mea tatau tonu: karangatia ana e ia nga ingoa o ratou katoa, maroro rawa, pakari tonu te kaha; e kore tetahi e ngaro.
27 ౨౭ యాకోబూ “నా మార్గం యెహోవాకు తెలియదు, నా న్యాయం నా దేవునికి కనబడదు” అని నీవెందుకు అంటున్నావు? ఇశ్రాయేలూ, నీవెందుకు ఇలా చెబుతున్నావు?
He aha koe i korero ai, e Hakopa, i mea ai, e Iharaira, Kua huna toku ara ki a Ihowa, kua mahue i toku Atua toku whakawa?
28 ౨౮ నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతాలను సృజించిన యెహోవా నిత్యం ఉండే దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన జ్ఞానాన్ని గ్రహించడం అసాధ్యం.
Kahore koe i mohio? kahore koe i rongo, ko te Atua onamata, ko Ihowa, ko te Kaihanga o nga pito o te whenua, e kore ia e ngenge, e kore ia e mauiui? e kore tona matauranga e taea te rapu.
29 ౨౯ అలసిన వారికి బలమిచ్చేది ఆయనే. శక్తిహీనులకు నూతనోత్తేజం కలిగించేది ఆయనే.
E homai ana e ia he kaha ki te hunga ngenge: a whakanuia ana e ia te pakari o te mea ngoikore.
30 ౩౦ యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు.
Ahakoa ko nga taitamariki, ka ngenge tonu, ka mauiui, a ko nga taitama, ka hinga rawa.
31 ౩౧ అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.
Tena ko te hunga e tatari ana ki a Ihowa, puta hou ana he kaha mo ratou; kake ana ratou ki runga; ko nga parirau, koia ano kei o nga ekara; ka rere ratou, a e kore e mauiui; ka haere, a e kore e ngenge.