< యెషయా~ గ్రంథము 4 >

1 ఆ రోజున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుణ్ణి పట్టుకుని “మా అన్నం మేమే తింటాం. మా వస్త్రాలు మేమే వేసుకుంటాం. కాని, మా అవమానం పోయేలా నీ పేరు మాత్రం మమ్మల్ని పెట్టుకోనివ్వు” అంటారు.
那一日,七個女人要抓住一個男人說:「我們吃自己的食糧,穿自己的衣服,只要你容許我們歸於你名下,除去我們的恥辱。」
2 ఆ రోజున యెహోవా కొమ్మ అందంగానూ, మహిమతోనూ నిండి ఉంటుంది. ఇశ్రాయేలులో శేషించినవాళ్ళ భూమి పంట రుచిగానూ, చూడ ముచ్చటగానూ ఉంటుంది.
那一日,由上主所發出的苗芽,必成為以色列遺民的光輝與榮耀;地上的果實必成為他們的誇耀與光彩。
3 సీయోనులో శేషించిన వాడూ, యెరూషలేములో నిలిచి ఉన్నవాడూ, అంటే సజీవుడుగా లెక్కకు వచ్చినవాడు “పవిత్రుడు” అని పిలిపించుకుంటాడు.
凡留在熙雍的,遺在耶路撒冷的,即凡錄在耶路撒冷的生命冊上的,都必將稱為聖者。
4 న్యాయాత్మ వలన, దహించే అగ్ని ఆత్మ వలన, ప్రభువు సీయోను కుమార్తెల కల్మషం కడిగేసినప్పుడు, యెరూషలేముకు అంటిన రక్తపు మరకలను దాని మధ్య నుంచి తీసి వేసి దాన్ని శుద్ధి చేసిన వాడవుతాడు.
當吾主以懲治的神和毀滅的神,洗淨熙雍女子的污穢,滌除耶路撒冷中間的血漬時,
5 సీయోను కొండలోని ప్రతి నివాస స్థలం మీద, దాని సమావేశ ప్రాంగణాల మీద పగలు మేఘం, పొగ, రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశం ఒక మహిమ పందిరిలా యెహోవా కలగజేస్తాడు.
上主將顯現在熙雍山整個地盤與其集會之上:白日藉著雲煙,黑夜藉光亮的火燄;因為在一切之上,有上主的榮耀,有如天蓋和帳棚,
6 ఆ మహిమ పగలు ఎండకు నీడగానూ, గాలివానకు ఆశ్రయంగానూ, పైకప్పుగానూ ఉంటుంది.
白日作蔭影以免炎暑,又可作庇護,以避狂風暴雨。

< యెషయా~ గ్రంథము 4 >