< యెషయా~ గ్రంథము 38 >

1 ఆ రోజుల్లో హిజ్కియాకు ప్రాణాంతకమైన జబ్బు చేసింది. ప్రవక్త, ఆమోజు కొడుకు యెషయా అక్కడకు వచ్చాడు. “‘నువ్వు చనిపోబోతున్నావు, ఇక బతకవు. కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో’ అని యెహోవా సెలవిస్తున్నాడు” అని చెప్పాడు.
En ces jours-là, Ezéchias fut malade jusqu’à la mort, et entra auprès de lui Isaïe, le prophète, fils d’Amos, et lui dit: Voici ce que dit le Seigneur: Mets ordre à ta maison, parce que tu mourras, toi, et tu ne vivras pas.
2 అప్పుడు హిజ్కియా గోడవైపు తిరిగి,
Et Ezéchias tourna sa face vers la muraille et pria le Seigneur,
3 “యెహోవా, యథార్థ హృదయంతో, సత్యంతో నీ సన్నిధిలో నేనేవిధంగా జీవించానో, సమస్తాన్నీ ఏ విధంగా నీ దృష్టికి మంచిదిగా జరిగించానో, కృపతో జ్ఞాపకం చేసుకో” అని కన్నీళ్ళతో యెహోవాను ప్రార్థించాడు.
Et il dit: Je vous conjure. Seigneur, souvenez-vous, je vous prie, comment j’ai marché devant vous dans la vérité et avec un cœur parfait, et comment j’ai fait ce qui est bon à vos yeux. Et Ezéchias pleura d’un grand pleur.
4 అప్పుడు యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,
Et la parole du Seigneur fut adressée à Isaïe, disant:
5 “నువ్వు తిరిగి హిజ్కియా దగ్గరికి పోయి అతనితో ఇలా చెప్పు, ‘నీ పూర్వికుడైన దావీదు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చేదేమంటే నీ కన్నీళ్లు నేను చూశాను. నీ ప్రార్థన అంగీకరించాను.
Va, et dis à Ezéchias: Voici ce que dit le Seigneur Dieu de David, votre père: J’ai entendu ta prière, et j’ai vu tes larmes; et voici que j’ajouterai à tes jours quinze années;
6 నీ జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్షు పెంచుతాను. నిన్ను, ఈ పట్టణాన్ని అష్షూరు రాజు చేతి నుండి విడిపించి కాపాడతాను.
Et je t’arracherai à la main du roi des Assyriens, toi et cette cité, et je la protégerai.
7 తాను పలికిన మాట నెరవేరుతుంది అనడానికి యెహోవా నీకిచ్చే సూచన ఇదే,
Or, voici le signe que tu auras du Seigneur, que le Seigneur accomplira cette parole qu’il a dite:
8 ఆహాజు ఎండ గడియారం మీద సూర్యకాంతి చేత ముందుకు జరిగిన నీడ మళ్ళీ పది మెట్లు ఎక్కేలా చేస్తాను.’” అప్పుడు సూర్యకాంతిలో ముందుకు జరిగిన మెట్లలో పది మెట్లు మళ్ళీ వెనక్కి జరిగింది.
Voici que moi je ferai que l’ombre des lignes par lesquelles elle était descendue sur l’horloge d’Achaz au soleil, retournera en arrière de dix lignes. Et le soleil retourna de dix lignes par les degrés par lesquels il était descendu.
9 యూదారాజు హిజ్కియా జబ్బుపడి తిరిగి ఆరోగ్యం పొందిన తరువాత అతడు రచించిన ప్రార్థన.
Écrit d’Ezéchias, roi de Juda, lorsqu’il eut été malade et qu’il eut été rétabli de sa maladie.
10 ౧౦ “నా జీవితం సగభాగంలో నేను పాతాళ ద్వారం గుండా వెళ్ళాల్సివచ్చింది. మిగిలిన సగభాగం నేనిక కోల్పోయినట్టే. (Sheol h7585)
Moi j’ai dit: Au milieu de mes jours j’irai aux portes de l’enfer. J’ai cherché le reste de mes années. (Sheol h7585)
11 ౧౧ యెహోవాను, సజీవుల దేశంలో యెహోవాను చూడక పోయేవాణ్ణి. మృతుల లోకంలో పడిపోయి ఇక మనుషులకు కనిపించనేమో అనుకున్నాను.
J’ai dit: Je ne verrai pas le Seigneur Dieu dans la terre des vivants. Je n’apercevrai plus d’homme, et d’habitant du repos.
12 ౧౨ నా జీవం తీసేశారు. గొర్రెల కాపరి గుడిసెలాగా అది నా దగ్గర నుండి తీసివేశారు. నేతపనివాడు చేసినట్టు నా జీవితాన్ని చుట్టేస్తున్నాను. ఆయన నన్ను మగ్గం నుండి దూరం చేశాడు. ఒక్క రోజులోనే నువ్వు నా జీవితాన్ని ముగిస్తున్నావు.
Ma génération m’a été enlevée, pliée comme un tabernacle de pasteurs. Ma vie a été coupée comme par un tisserand; lorsque j’ourdissais encore, il m’a tranché; d’un matin à un soir vous m’achèverez.
13 ౧౩ (ఉదయం దాకా ఓర్చుకున్నాను. సింహం లాగా నా ఎముకలన్నిటినీ విరిచేశాడు.) ఒక్క రోజులోనే నువ్వు నన్ను సమాప్తి చేస్తావు.
J’espérais jusqu’au matin; mais, comme un lion, ainsi il a brisé tous mes os; D’un matin à un soir vous m’achèverez;
14 ౧౪ ముళ్ళ తోక పిట్టలాగా కిచ కిచలాడాను. పావురం లాగా కూశాను. పైకి చూసీ చూసీ నా కళ్ళు అలసిపోయాయి. నలిగి పోయాను. యెహోవా, నాకు సహాయం చెయ్యి.
Comme le petit d’une hirondelle, ainsi je crierai, je méditerai comme la colombe; Mes yeux se sont lassés, regardant en haut; Seigneur, je souffre violence, répondez pour moi.
15 ౧౫ నేనేమనగలను? ఆయన నా గురించి మాట పలికాడు, ఆయనే దాన్ని జరిగించాడు. నా హృదయంలో నిండి ఉన్న దుఃఖాన్ని బట్టి నా సంవత్సరాలన్నీ తడబడుతూ గడిపేస్తాను.
Que dirai-je, ou que me répondra-t-il, puisque lui-même a fait cela? Je repasserai devant vous toutes mes années dans l’amertume de mon âme.
16 ౧౬ ప్రభూ, నీవు పంపిన బాధలు మనుషులకు మంచివే. వాటి వల్లనే నా ఆత్మ జీవిస్తున్నది. నువ్వు నన్ను బాగు చేసి నన్ను జీవింపజేశావు.
Seigneur, si c’est ainsi que l’on vit, et si c’est dans de telles choses qu’est la vie de mon esprit, vous me châtierez et vous me rendrez la vie.
17 ౧౭ ఆ తీవ్రమైన బాధ వల్లనే నాకు నెమ్మది కలిగింది. నీ ప్రేమతో నా ప్రాణాన్ని నాశనం అనే గోతి నుండి విడిపించావు. నా పాపాలన్నిటినీ నీ వీపు వెనుకకు పారవేశావు.
Voici qu’avec la paix se trouve mon amertume la plus amère; Or, c’est vous qui avez délivré mon âme afin qu’elle ne pérît pas, vous avez jeté derrière vous tous mes péchés.
18 ౧౮ ఎందుకంటే పాతాళంలో నీకు స్తుతి కలగదు. మరణం నీకు స్తుతి చెల్లించదు. సమాధిలోకి వెళ్ళినవారు నీ నమ్మకత్వంపై ఆశ పెట్టుకోరు. (Sheol h7585)
Parce que l’enfer ne vous glorifiera pas, ni la mort ne vous louera; ceux qui descendent dans la fosse n’attendront pas votre vérité. (Sheol h7585)
19 ౧౯ సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతిస్తారు! ఈ రోజున నేను సజీవుడిగా నిన్ను స్తుతిస్తున్నాను. తండ్రులు తమ కొడుకులకు నీ సత్యాన్ని తెలియజేస్తారు. యెహోవా నన్ను రక్షించేవాడు.
Le vivant, le vivant, c’est lui qui vous glorifiera, comme moi-même aujourd’hui; le père fera connaître à ses fils votre vérité.
20 ౨౦ నా జీవిత కాలమంతా యెహోవా మందిరంలో సంగీత వాయిద్యాలు వాయిస్తాను.”
Seigneur, sauvez-moi, et nous chanterons nos psaumes tous les jours de notre vie, dans la maison du Seigneur.
21 ౨౧ యెషయా “ఒక అంజూరు పండ్ల ముద్దను ఆ పుండుకు కట్టండి, అప్పుడు అతడు బాగుపడతాడు” అని చెప్పాడు.
Et Isaïe ordonna que l’on prît une panerée de figues, et qu’on en mît un cataplasme sur la blessure du roi, afin qu’il fût guéri.
22 ౨౨ దానికి ముందు హిజ్కియా “నేను మళ్ళీ యెహోవా మందిరానికి వెళతాను అనేదానికి సూచన ఏమిటి?” అని అతణ్ణి అడిగాడు.
Et Ezéchias dit: Quel sera le signe que je monterai à la maison du Seigneur?

< యెషయా~ గ్రంథము 38 >