< యెషయా~ గ్రంథము 37 >
1 ౧ ఆ మాటలు విని హిజ్కియా తన బట్టలు చింపుకుని, గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరానికి వెళ్ళాడు.
Da Kong Ezekias hørte det, sønderrev han sine Klæder, hyllede sig i Sæk og gik ind i HERRENS Hus.
2 ౨ రాజ గృహ నిర్వాహకుడు ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజకుల్లో పెద్దలను ఆమోజు కొడుకు, ప్రవక్త అయిన యెషయా దగ్గరికి పంపించాడు.
Og han sendte Paladsøversten Eljakim og Statsskriveren Sjebna og Præsternes Ældste, hyllet i Sæk, til Profeten Esajas, Amoz's Søn,
3 ౩ వారంతా గోనెపట్ట కట్టుకుని అతని దగ్గరికి వచ్చి అతనితో “హిజ్కియా ఇలా చెప్పమన్నాడు, ‘ఈ రోజు బాధ, శిక్ష, నిందల రోజు. పిల్లలు పుట్టడానికి సమయం వచ్చిందిగాని కనడానికి తల్లికి శక్తి లేదు.
for at sige til ham: »Ezekias lader sige: En Nødens, Tugtelsens og Forsmædelsens Dag er denne Dag, thi Barnet er ved at fødes, men der er ikke Kraft til at bringe det til Verden!
4 ౪ సజీవుడైన దేవుణ్ణి దూషించడానికి తన యజమాని అష్షూరు రాజు పంపిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడు యెహోవా ఒకవేళ విని, ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దిస్తాడేమో. కాబట్టి ఇప్పటికి బతికి ఉన్న మన కొద్దిమంది కోసం నువ్వు ఎక్కువగా ప్రార్థన చెయ్యి.’”
Dog vil HERREN din Gud maaske høre, hvad Rabsjake har sagt, han, som er sendt af sin Herre, Assyrerkongen, for at haane den levende Gud, og maaske vil han straffe ham for de Ord, som HERREN din Gud har hørt — gaa derfor i Forbøn for den Rest, der endnu er tilbage!«
5 ౫ హిజ్కియా రాజు సేవకులు యెషయా దగ్గరికి వచ్చారు.
Da Kong Ezekias's Folk kom til Esajas,
6 ౬ యెషయా వారితో ఇలా అన్నాడు. “మీ యజమానికి ఈ మాట చెప్పండి, యెహోవా ఏమి చెబుతున్నాడంటే, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషిస్తూ పలికిన మాటలకు భయపడవద్దు.
sagde han til dem: »Saaledes skal I svare eders Herre: Saa siger HERREN: Frygt ikke for de Ord, du har hørt, som Assyrerkongens Trælle har haanet mig med!
7 ౭ అతనిలో నేను ఒక ఆత్మను పుట్టిస్తాను. అతడు ఒక పుకారు విని తన దేశానికి తిరిగి వెళ్ళిపోతాడు. అతని దేశంలోనే కత్తివాత హతం అవుతాడు.”
Se, jeg vil indgive ham en Aand, og han skal faa en Tidende at høre, saa han vender tilbage til sit Land, og i hans eget Land vil jeg fælde ham med Sværdet!«
8 ౮ అష్షూరు రాజు లాకీషు పట్టణం విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధం చేస్తున్నాడని తెలిసి రబ్షాకే తిరిగి వెళ్ళి అతనితో కలిశాడు.
Rabsjake vendte saa tilbage og traf Assyrerkongen i Færd med at belejre Libna, thi han havde hørt, at Kongen var brudt op fra Lakisj.
9 ౯ కూషు రాజు తిర్హాకా తనపై యుద్ధం చేయడానికి వచ్చాడని అష్షూరురాజు సన్హెరీబు విన్నాడు. అప్పుడు అతడు తన దూతలతో హిజ్కియాకు ఒక సందేశం పంపాడు.
Saa fik han Underretning om, at Kong Tirhaka af Ætiopien var rykket ud for at angribe ham, og han sendte Sendebud til Ezekias og sagde:
10 ౧౦ “యూదా రాజు హిజ్కియాతో ఇలా చెప్పండి, ‘నీ దేవుని చేతిలో మోసపోయి అష్షూరు రాజు యెరూషలేమును ఆక్రమించలేడని అనుకోవద్దు.
»Saaledes skal I sige til Kong Ezekias af Juda: Lad ikke din Gud, som du slaar din Lid til, vildlede dig med at sige, at Jerusalem ikke skal gives i Assyrerkongens Haand!
11 ౧౧ అష్షూరు రాజులు సకల దేశాలనూ పూర్తిగా నాశనం చేసిన సంగతి నువ్వు విన్నావు కదా, నీవు మాత్రం తప్పించుకోగలవా?
Du har jo dog hørt, hvad Assyrerkongerne har gjort ved alle Lande, hvorledes de har lagt Band paa dem — og du skulde kunne undslippe!
12 ౧౨ నా పూర్వికులు నిర్మూలం చేసిన గోజాను, హారాను, రెజెపు, తెలశ్శారులో ఉండే ఏదెనీయులు, వీరిలో ఎవరైనా తమ దేవుళ్ళ సహాయంతో తప్పించుకున్నారా?
De Folk, mine Fædre tilintetgjorde, Gozan, Karan, Rezef og Folkene fra Eden i Telassar, har deres Guder kunnet frelse dem?
13 ౧౩ హమాతు, అర్పాదు, సెపర్వయీము, హేన, ఇవ్వా అనే పట్టణాల రాజులు ఏమయ్యారు?’”
Hvor er Kongen af Hamat, Kongen af Arpad eller Kongen af La'ir, Sefarvajim, Hena og Ivva?«
14 ౧౪ హిజ్కియా ఆ ఉత్తరం తీసుకుని, చదివి, యెహోవా మందిరంలోకి వెళ్లి ఆయన సన్నిధిలో దాన్ని ఉంచాడు.
Da Ezekias havde modtaget Brevet af Sendebudenes Haand og læst det, gik han op i HERRENS Hus og bredte det ud for HERRENS Aasyn.
15 ౧౫ తరువాత ఈ విధంగా ప్రార్థన చేశాడు,
Derpaa bad Ezekias den Bøn for HERRENS Aasyn:
16 ౧౬ “యెహోవా, కెరూబుల మధ్య నివసించే ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశాలను సృష్టించిన అద్వితీయ దేవా, నీవు ఈ లోక రాజ్యాలన్నిటిపై దేవుడివి.
»Hærskarers HERRE, Israels Gud, du, som troner over Keruberne, du alene er Gud over alle Jordens Riger; du har gjort Himmelen og Jorden!
17 ౧౭ సేనల ప్రభువైన యెహోవా, నీ కళ్ళు తెరచి చూసి నా మాటలు ఆలకించు. జీవం గల దేవుడవైన నిన్ను దూషిస్తూ సన్హెరీబు రాసిన మాటలు విను.
Bøj nu dit Øre, HERRE, og lyt, aabn dine Øjne, HERRE, og se! Læg Mærke til alle de Ord, Sankerib har sendt hid for at spotte den levende Gud!
18 ౧౮ యెహోవా, అష్షూరు రాజులు వివిధ జాతుల ప్రజలనూ వారి దేశాలనూ నాశనం చేసి వారి దేవుళ్ళను అగ్నిలో వేసింది నిజమే.
Det er sandt, HERRE, at Assyrerkongerne har tilintetgjort alle de Folk og deres Lande
19 ౧౯ ఆ రాజ్యాల దేవుళ్ళు నిజమైనవారు కారు. చెక్కతో రాళ్ళతో మనుషులు చేసిన వారు కనుక అష్షూరు రాజులు వారిని నిర్మూలం చేశారు.
og kastet deres Guder i Ilden; men de er ikke Guder, kun Menneskehænders Værk af Træ eller Sten; derfor kunde de ødelægge dem.
20 ౨౦ యెహోవా, ఈ లోకంలో నీవే, నిజంగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవా అని మనుషులంతా గ్రహించేలా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించు.”
Men frels os nu, HERRE vor Gud, af hans Haand, saa alle Jordens Riger kan kende, at du, HERRE, alene er Gud!«
21 ౨౧ అప్పుడు ఆమోజు కొడుకు యెషయా హిజ్కియా దగ్గరికి ఈ సందేశం పంపాడు. “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే”, అష్షూరు రాజు సన్హెరీబు విషయం నీవు నా ఎదుట ప్రార్థన చేశావు కదా,
Saa sendte Esajas, Amoz's Søn, Bud til Ezekias og lod sige: »Saa siger HERREN, Israels Gud: Din Bøn angaaende Assyrerkongen Sankerib har jeg hørt!«
22 ౨౨ అతని గూర్చి యెహోవా సెలవిచ్చే మాట ఇదే, “కన్య అయిన సీయోను ఆడపడుచు నిన్ను తిరస్కరించి, అపహసిస్తున్నది, యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊపుతూ ఉంది.
Saaledes lyder det Ord, HERREN talede imod ham: Hun haaner, hun spotter dig, Jomfruen, Zions Datter, Jerusalems Datter ryster paa Hovedet ad dig!
23 ౨౩ నువ్వు ఎవరిని తిరస్కరించావు? ఎవరిని దూషించావు? గర్వంతో ఎవరిని భయపెట్టాలని చూశావు? పరిశుద్ధుడైన ఇశ్రాయేలీయుల దేవుణ్ణి కదా?
Hvem har du haanet og smædet, mod hvem har du løftet din Røst? Til Israels Hellige løfted i Hovmod du Blikket!
24 ౨౪ నీ దూతల ద్వారా యెహోవాను తిరస్కరించి నువ్వు ఇలా పలికావు, ‘నా గొప్ప రథాల గుంపుతో నేను పర్వత శిఖరాల మీదకీ ఉన్నతమైన లెబానోను స్థలాల పైకీ ఎక్కాను. ఎత్తయిన దాని దేవదారు చెట్లూ శ్రేష్ఠమైన సరళ చెట్లూ నరికేశాను. వాటికి బహు దూరంలో సరిహద్దుల్లో ఉన్న సత్రాల్లోకి, ఫలవంతమైన అడవిలోకి ప్రవేశించాను.
Ved dine Trælle haaned du HERREN og sagde: »Med mine talløse Vogne besteg jeg Bjergenes Højder, Libanons afsides Egne; jeg fælded dets Cedres Højskov, dets ædle Cypresser, trængte frem til dets øverste Raststed, dets Havers Skove.
25 ౨౫ నేను బావులు తవ్వి అక్కడి నీళ్లు తాగాను. నా అరకాలి కింద ఐగుప్తు నదులన్నిటిని ఎండిపోయేలా చేశాను.’
Fremmed Vand grov jeg ud, og jeg drak det, tørskoet skred jeg over Ægyptens Strømme!«
26 ౨౬ అయితే దీన్ని నేనే ఎప్పుడో నిర్ణయించాననీ, పూర్వకాలంలోనే దీన్ని ఏర్పాటు చేశాననీ నీకు వినబడలేదా? నువ్వు ప్రాకారాలు గల పట్టణాలను పాడుదిబ్బలుగా చేయడం నా వల్లనే జరిగింది.
Har du ej hørt det? For længst kom det op i min Tanke, jeg lagde det fordum til Rette, nu lod jeg det ske, og du Gjorde murstærke Byer til øde Stenhobe,
27 ౨౭ అందుకే వాటి ప్రజలు బలహీనులై చెదరిపోయారు. భయంతో పొలంలోని గడ్డిలాగా, బలం లేని కాడల్లాగా మారారు.
mens Folkene grebes i Afmagt af Skræk og Skam, blev som Græsset paa Marken, det spirende Grønne, som Græs paa Tage, som Mark for Østenvinden.
28 ౨౮ నువ్వు కూర్చోవడం, బయటికి వెళ్ళడం, లోపలి రావడం, నా మీద రంకెలు వేయడం నాకు తెలుసు.
Jeg ser, naar du rejser og sætter dig, ved, naar du gaar og kommer.
29 ౨౯ నా మీద నువ్వు వేసే రంకెలు, నీవు చూపిన అహంకారం నా దాకా వచ్చాయి. కాబట్టి నీ ముక్కుకి నా గాలం తగిలిస్తాను. నా కళ్ళెం నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లిస్తాను. నీవు వచ్చిన దారిలోనే నిన్ను తిప్పి పంపుతాను.”
Fordi du raser imod mig, din Trods har naaet mit Øre, lægger jeg Ring i din Næse og Bidsel i Munden og fører dig bort ad Vejen, du kom!
30 ౩౦ యెషయా ఇంకా ఇలా చెప్పాడు. “హిజ్కియా, నీకిదే సూచన. ఈ సంవత్సరం దానంతట అదే పండే ధాన్యాన్నీ, రెండో సంవత్సరంలో దాని నుండి కలిగే ధాన్యాన్నీ మీరు తింటారు. మూడో సంవత్సరంలో మీరు విత్తనం చల్లి పంట కోస్తారు. ద్రాక్షతోటలు నాటి వాటిఫలం అనుభవిస్తారు.
Og dette skal være dig Tegnet: I Aar skal man spise, hvad der saaed sig selv, og Aaret derpaa, hvad der skyder af Rode, tredje Aar skal man saa og høste, plante Vin og nyde dens Frugt.
31 ౩౧ యూదా వంశంలో తప్పించుకొన్న శేషం బాగా వేరుతన్ని ఎదిగి ఫలిస్తారు.
Den bjærgede Rest af Judas Hus slaar atter Rødder forneden og bærer sin Frugt foroven;
32 ౩౨ మిగిలినవారు యెరూషలేములో నుండి, తప్పించుకొన్న వారు సీయోను కొండలో నుండి బయలుదేరతారు. సైన్యాల అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేరుస్తుంది.
thi fra Jerusalem udgaar en Rest, en Levning fra Zions Bjerg. Hærskarers HERRES Nidkærhed virker dette.
33 ౩౩ కాబట్టి అష్షూరు రాజు గూర్చి యెహోవా చెప్పేది ఏమంటే, ‘అతడు ఈ పట్టణంలోకి రాడు. దాని మీద ఒక బాణం కూడా విసరడు. ఒక్క డాలైనా ఆడించడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు.
Derfor, saa siger HERREN om Assyrerkongen: I Byen her skal han ej komme ind, ej sende en Pil herind, ej nærme sig den med Skjolde eller opkaste Vold imod den;
34 ౩౪ ఈ పట్టణం లోపలికి రాకుండా తాను వచ్చిన దారిలోనే అతడు తిరిగి పోతాడు.’ ఇదే యెహోవా వాక్కు.
ad Vejen, han kom, skal han gaa igen, i Byen her skal han ej komme ind — saa lyder det fra HERREN.
35 ౩౫ నా నిమిత్తమూ నా సేవకుడైన దావీదు నిమిత్తమూ నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను.”
Jeg værner og frelser denne By for min og min Tjener Davids Skyld!
36 ౩౬ అప్పుడు యెహోవా దూత వెళ్ళి అష్షూరువారి సైనిక పటాలంలో 1, 85,000 మందిని హతమార్చాడు. ఉదయాన్నే ప్రజలు చూసినప్పుడు వారంతా శవాలుగా పడి ఉన్నారు.
Saa gik HERRENS Engel ud og ihjelslog i Assyrernes Lejr 185 000 Mand; og se, næste Morgen tidlig laa de alle døde.
37 ౩౭ అష్షూరు రాజు సన్హెరీబు తిరిగి నీనెవె పట్టణానికి వెళ్ళిపోయాడు.
Da brød Assyrerkongen Sankerib op, vendte hjem og blev siden i Nineve.
38 ౩౮ ఆ తరవాత అతడు నిస్రోకు అనే తన దేవత మందిరంలో పూజలు చేస్తూ ఉన్నప్పుడు అద్రమ్మెలెకు, షెరెజెరు అనే అతని కొడుకులు అతణ్ణి కత్తితో చంపి అరారాతు దేశంలోకి పారిపోయారు. అప్పుడు అతని కొడుకు ఏసర్హద్దోను అతనికి బదులుగా రాజయ్యాడు.
Men da han engang tilbad i sin Gud Nisroks Hus, slog hans Sønner Adrammelek og Sar'ezer ham ihjel med deres Sværd, hvorefter de flygtede til Ararats Land; og hans Søn Asarhaddon blev Konge i hans Sted.