< యెషయా~ గ్రంథము 36 >

1 హిజ్కియా రాజు పరిపాలన 14 వ సంవత్సరంలో అష్షూరురాజు సన్హెరీబు యూదా దేశంలో సరిహద్దు గోడలు ఉన్న పట్టణాలన్నిటిపై దండెత్తి వాటిని ఆక్రమించాడు.
ויהי בארבע עשרה שנה למלך חזקיהו עלה סנחריב מלך אשור על כל ערי יהודה הבצרות ויתפשם׃
2 తరువాత అతడు రబ్షాకేను లాకీషు పట్టణం నుండి యెరూషలేములో ఉన్న హిజ్కియా రాజు పైకి పెద్ద సైన్యాన్ని ఇచ్చి పంపాడు. అతడు చాకిరేవు దారిలో ఉన్న మెరక కొలను కాలవ దగ్గరికి వచ్చాడు.
וישלח מלך אשור את רב שקה מלכיש ירושלמה אל המלך חזקיהו בחיל כבד ויעמד בתעלת הברכה העליונה במסלת שדה כובס׃
3 అప్పుడు హిల్కీయా కొడుకు, రాజు గృహనిర్వాహకుడు ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, రాజ్యం దస్తావేజుల అధికారి, ఆసాపు కొడుకు యోవాహు వారి దగ్గరికి వెళ్ళారు.
ויצא אליו אליקים בן חלקיהו אשר על הבית ושבנא הספר ויואח בן אסף המזכיר׃
4 అప్పుడు రబ్షాకే వారితో ఇలా అన్నాడు. “హిజ్కియాతో ఈ మాట చెప్పండి, మహారాజైన అష్షూరురాజు నన్నిలా చెప్పమన్నాడు, దేనిపైన నువ్వు నమ్మకం పెట్టుకున్నావు?
ויאמר אליהם רב שקה אמרו נא אל חזקיהו כה אמר המלך הגדול מלך אשור מה הבטחון הזה אשר בטחת׃
5 యుద్ధం విషయంలో నీ ఆలోచన, నీ బలం వ్యర్ధం. ఎవరి భరోసాతో నా మీద తిరగబడుతున్నావు?
אמרתי אך דבר שפתים עצה וגבורה למלחמה עתה על מי בטחת כי מרדת בי׃
6 నలిగిపోయిన గడ్డిపరక లాంటి ఐగుప్తుపై ఆధారపడుతున్నావు గదా! ఎవరైనా దాని మీద ఆనుకుంటే అది అతని చేతికి గుచ్చుకుంటుంది. ఐగుప్తు రాజు ఫరో కూడా అలాంటివాడే.
הנה בטחת על משענת הקנה הרצוץ הזה על מצרים אשר יסמך איש עליו ובא בכפו ונקבה כן פרעה מלך מצרים לכל הבטחים עליו׃
7 మా దేవుడైన యెహోవాను నమ్ముకుంటున్నాం అని అంటారా? ఆ యెహోవా ఉన్నత స్థలాలను, బలిపీఠాలనే కదా హిజ్కియా పడగొట్టి యెరూషలేములో ఉన్న ఈ బలిపీఠం దగ్గర మాత్రమే మీరు పూజలు చేయాలి అని యూదావారికి, యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చింది?
וכי תאמר אלי אל יהוה אלהינו בטחנו הלוא הוא אשר הסיר חזקיהו את במתיו ואת מזבחתיו ויאמר ליהודה ולירושלם לפני המזבח הזה תשתחוו׃
8 కాబట్టి నా యజమాని అయిన అష్షూరు రాజుతో పందెం వెయ్యి. రెండు వేల గుర్రాలకు సరిపడిన రౌతులు నీ దగ్గర ఉంటే చెప్పు, నేను వాటిని నీకిస్తాను.
ועתה התערב נא את אדני המלך אשור ואתנה לך אלפים סוסים אם תוכל לתת לך רכבים עליהם׃
9 నా యజమాని సేవకుల్లో తక్కువ వాడైన ఒక్క అధిపతిని నువ్వు ఎదిరించగలవా? రథాలను, రౌతులను పంపుతాడని ఐగుప్తురాజు మీద ఆశ పెట్టుకున్నావా?
ואיך תשיב את פני פחת אחד עבדי אדני הקטנים ותבטח לך על מצרים לרכב ולפרשים׃
10 ౧౦ అయినా యెహోవా అనుమతి లేకుండానే ఈ దేశాన్ని నాశనం చేయడానికి నేను వచ్చాననుకున్నావా? లేదు, ఈ దేశం పైకి దండెత్తి దీన్ని నాశనం చేయమని యెహోవాయే నాకు ఆజ్ఞాపించాడు.”
ועתה המבלעדי יהוה עליתי על הארץ הזאת להשחיתה יהוה אמר אלי עלה אל הארץ הזאת והשחיתה׃
11 ౧౧ అప్పుడు ఎల్యాకీము, షెబ్నా, యోవాహులు రబ్షాకేతో “మేము నీ దాసులం. మాకు సిరియా భాష తెలుసు కాబట్టి దయచేసి ఆ భాషలో మాట్లాడు. ప్రాకారం మీద ఉన్న ప్రజలకు అర్థమయ్యేలా యూదుల భాషలో మాట్లాడవద్దు” అని అన్నారు.
ויאמר אליקים ושבנא ויואח אל רב שקה דבר נא אל עבדיך ארמית כי שמעים אנחנו ואל תדבר אלינו יהודית באזני העם אשר על החומה׃
12 ౧౨ అయితే రబ్షాకే “ఈ మాటలు చెప్పడానికేనా, నా యజమాని నన్ను నీ యజమాని దగ్గరకీ నీ దగ్గరకీ పంపింది? నీతో కలిసి తమ స్వంత మలాన్ని తిని, తమ మూత్రాన్ని తాగబోతున్న ప్రాకారం మీద ఉన్న వారి దగ్గరకి కూడా పంపాడు కదా” అన్నాడు.
ויאמר רב שקה האל אדניך ואליך שלחני אדני לדבר את הדברים האלה הלא על האנשים הישבים על החומה לאכל את חראיהם ולשתות את שיניהם עמכם׃
13 ౧౩ యూదుల భాషతో అతడు బిగ్గరగా ఇలా అన్నాడు. “మహారాజైన అష్షూరు రాజు చెబుతున్న మాటలు వినండి.
ויעמד רב שקה ויקרא בקול גדול יהודית ויאמר שמעו את דברי המלך הגדול מלך אשור׃
14 ౧౪ హిజ్కియా చేతిలో మోసపోకండి. మిమ్మల్ని విడిపించడానికి అతని శక్తి సరిపోదు.
כה אמר המלך אל ישא לכם חזקיהו כי לא יוכל להציל אתכם׃
15 ౧౫ ‘యెహోవా మనలను విడిపిస్తాడు, ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కదు’ అని చెబుతూ హిజ్కియా మిమ్మల్ని నమ్మిస్తున్నాడు.
ואל יבטח אתכם חזקיהו אל יהוה לאמר הצל יצילנו יהוה לא תנתן העיר הזאת ביד מלך אשור׃
16 ౧౬ హిజ్కియా చెప్పిన ఆ మాట మీరు అంగీకరించవద్దు. అష్షూరు రాజు చెబుతున్నదేమిటంటే, మీరు బయటికి వచ్చి, నాతో సంధి చేసుకోండి. అప్పుడు మీలో ప్రతి ఒక్కరూ తన ద్రాక్ష, అంజూరు చెట్ల పండ్లు తింటూ తన బావిలో నీళ్లు తాగుతూ ఉంటారు.
אל תשמעו אל חזקיהו כי כה אמר המלך אשור עשו אתי ברכה וצאו אלי ואכלו איש גפנו ואיש תאנתו ושתו איש מי בורו׃
17 ౧౭ ఆ తరవాత నేను వచ్చి మీ దేశంలాంటి దేశానికి, అంటే గోదుమలు, ద్రాక్షరసం దొరికే దేశానికి, ఆహారం, ద్రాక్షచెట్లు ఉన్న దేశానికి మిమ్మల్ని తీసుకుపోతాను. యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడని చెప్పి హిజ్కియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు.
עד באי ולקחתי אתכם אל ארץ כארצכם ארץ דגן ותירוש ארץ לחם וכרמים׃
18 ౧౮ వివిధ ప్రజల దేవుళ్ళలో ఎవరైనా తన దేశాన్ని అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించాడా? హమాతు దేవుళ్ళేమయ్యారు?
פן יסית אתכם חזקיהו לאמר יהוה יצילנו ההצילו אלהי הגוים איש את ארצו מיד מלך אשור׃
19 ౧౯ అర్పాదు దేవుళ్ళేమయ్యారు? సెపర్వయీము దేవుళ్ళేమయ్యారు? షోమ్రోను దేశపు దేవుడు నా చేతిలో నుండి షోమ్రోనును విడిపించాడా?
איה אלהי חמת וארפד איה אלהי ספרוים וכי הצילו את שמרון מידי׃
20 ౨౦ ఈ దేవుళ్ళలో ఎవరైనా తన దేశాన్ని నా చేతిలో నుండి విడిపించి ఉంటేనే కదా యెహోవా యెరూషలేమును విడిపిస్తాడు అనుకోడానికి?” అన్నాడు.
מי בכל אלהי הארצות האלה אשר הצילו את ארצם מידי כי יציל יהוה את ירושלם מידי׃
21 ౨౧ అయితే అతనికి జవాబు చెప్పవద్దని రాజు ఆజ్ఞాపించడం వలన వారు బదులు పలకలేదు.
ויחרישו ולא ענו אתו דבר כי מצות המלך היא לאמר לא תענהו׃
22 ౨౨ రాజ గృహనిర్వాహకుడు, హిల్కీయా కొడుకు అయిన ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, రాజ్యందస్తావేజుల మీద అధికారి, ఆసాపు కొడుకు యోవాహు తమ బట్టలు చింపుకుని హిజ్కియా దగ్గరికి వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నిటినీ తెలియజేశారు.
ויבא אליקים בן חלקיהו אשר על הבית ושבנא הסופר ויואח בן אסף המזכיר אל חזקיהו קרועי בגדים ויגידו לו את דברי רב שקה׃

< యెషయా~ గ్రంథము 36 >