< యెషయా~ గ్రంథము 33 >
1 ౧ దోపిడీకి గురి కాకుండా దోచుకుంటూ ఉండే నీకు బాధ! ద్రోహానికి గురి కాకుండానే ద్రోహం చేస్తూ ఉండే నీకు బాధ! నువ్వు నాశనం చేయడం ముగించిన తర్వాతే నువ్వు నాశనం అవుతావు. నువ్వు ద్రోహం చేయడం ముగించిన తర్వాత నీకు ద్రోహం జరుగుతుంది.
Oh pusztító, de téged nem pusztítottak, hűtlenkedő, de ellened nem hűtlenkedtek! Amint végeztél a pusztítással, téged fognak pusztítani; amint befejezted a hűtlenkedést, ellened fognak hűtlenkedni.
2 ౨ యెహోవా, నీ కోసం వేచి చూస్తున్నాం. మమ్మల్ని కరుణించు. ప్రతి ఉదయం మాకు సహాయంగా, ఆపదల్లో మాకు రక్షగా ఉండు.
Örökkévaló, könyörülj rajtunk, hozzád reménykedtünk; légy a karjuk reggelenként, segítségünk is a szorongatás idejében.
3 ౩ మహా శబ్దాన్ని విని జనాలు పారిపోతారు. నువ్వు లేచినప్పుడు దేశాలు చిందర వందర అవుతాయి.
A zajongás hangjától elbujdostak népek; felemelkedésedtől elszóródtak nemzetek.
4 ౪ మిడతలు తిని వేసినట్టు మీ సంపదలు దోపిడీకి గురౌతాయి. మిడతల దండులా శత్రువులు దానిమీద పడతారు.
És összeszedik zsákmányotokat, amint összeszedik a sáskát, amint futkos a szöcske, úgy futkosnak rajta.
5 ౫ యెహోవా మహా ప్రశంస పొందాడు. ఆయన ఉన్నత స్థలంలో నివసిస్తున్నాడు. ఆయన సీయోనును నీతితో, న్యాయంతో నింపుతాడు.
Magasztos az Örökkévaló, mert magasban lakozik, megtöltötte Cziónt joggal és igazsággal.
6 ౬ నీ కాలంలో నీ స్థిరత్వం ఆయనే. నీకు పుష్కలమైన రక్షణ, జ్ఞానమూ, వివేకమూ ఆయనే. యెహోవా భయం అతని ఐశ్వర్యం.
És meglesz időd biztossága, üdvnek gazdagsága, bölcsesség és megismerés; az istenfélelem az az ő kincse.
7 ౭ వాళ్ళ రాయబారులు వీధిలో ఏడుస్తున్నారు. సంధిని కోరుకునే వాళ్ళ రాజనీతిజ్ఞులు ఒకటే రోదిస్తున్నారు.
Íme hőseik kiáltanak kinn, a béke követei keservesen sírnak.
8 ౮ రాజమార్గాలు నిర్మానుష్యమై పోయాయి. వాటి మీద ప్రయాణీకులు ఎవ్వరూ లేరు. సంధి ఒప్పందాలను ఉల్లంఘించారు. సాక్షులను అలక్ష్యం చేశారు. పట్టణాలను అవమానపరిచారు.
Elpusztultak az országutak, megszűnt az útonjáró; fölbontott szövetséget, megvetett városokat, nem vett semmibe embert.
9 ౯ దేశం దుఖిస్తుంది. క్షీణించి పోతుంది. లెబానోను కలవరపడి వాడిపోతుంది. షారోను ఎడారిలా ఉంది. బాషాను, కర్మెలు తమ చెట్ల ఆకులు రాలుస్తున్నాయి.
Gyászol, elhervadt a föld, megszégyenül a Libanon, elfonnyadt; olyan lett a Sárón mint a sivatag, lombját leveti Básán és Kármell.
10 ౧౦ “ఇప్పుడు నేను నిలబడతాను” అని యెహోవా అనుకున్నాడు. “ఇప్పుడే నా ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తాను. నన్ను నేను గొప్ప చేసుకుంటాను.
Most felkelek, mondja az Örökkévaló, most fölmagasodom, most felemelkedem.
11 ౧౧ మీరు పొట్టును గర్భం ధరించారు. చెత్త పరకలను కంటారు. మీ శ్వాస అగ్నిలా మిమ్మల్ని కాల్చేస్తుంది.
Fogantok pozdorját, szültök tarlót, leheletetek tűz, mely megemészt benneteket.
12 ౧౨ జనాలు సున్నంలా కాలిపోతారు. ముళ్ళ పొదలను నరికి కాల్చినట్టుగా కాలిపోతారు.
És lesznek a népek mészkemencék, levágott tövisek, tűzzel gyújtatnak meg.
13 ౧౩ దూరంలో నివసించే మీరు నేను చేసిందేమిటో వినండి. సమీపంలో ఉన్న వాళ్ళు నా శక్తిని అంగీకరించండి.”
Halljátok távollevők, mit cselekedtem és tudjátok meg közelvalók hatalmamat.
14 ౧౪ సీయోనులో ఉన్న పాపులు భయపడుతున్నారు. దేవుణ్ణి లెక్క చెయ్యని వారికి వణుకు పట్టుకుంది. మనలో మండే అగ్నితో కలసి ప్రయాణించే వాడు ఎవరు? నిత్యమూ మండే వాటితో ఎవరు నివసిస్తారు?
Remegtek Cziónban a vétkesek, reszketés fogta el az istenteleneket ki lakhatik közülünk emésztő tűznél, ki lakhatik az örök lángoknál?
15 ౧౫ నీతి కలిగి జీవించేవాడూ, యథార్ధంగా మాట్లాడేవాడూ, అవినీతి వల్ల కలిగే లాభాన్ని అసహ్యించుకునే వాడూ, లంచాన్ని తిరస్కరించేవాడూ, హింసాత్మక నేరం చేయాలని ఆలోచించని వాడూ చెడుతనం చూడకుండా కళ్ళు మూసుకునే వాడూ,
Aki igazságban jár és egyenességet beszél, megveti a zsarolt nyereséget, megrázza kezét, hogy ne fogjon vesztegetést, betömi fülét, hogy ne halljon vérbűnt és behunyja szemeit, hogy ne lásson rosszat:
16 ౧౬ అలాంటి వాడు ఉన్నత స్థలాల్లో నివసిస్తాడు. అతనికి పర్వత శిఖరాలపైని శిలలు ఆశ్రయంగా ఉంటాయి. ఆహారమూ, నీళ్ళూ క్రమంగా అతనికి లభ్యమౌతాయి.
az magasban fog lakozni, sziklák várai az ő menedéke: kenyere megadatik, vize maradandó.
17 ౧౭ నీ కళ్ళు రాజును అతని సౌందర్యమంతటితో చూస్తాయి. విశాలమైన దేశాన్ని నీ కళ్ళు చూస్తాయి.
Királyt az ő szépségében nézik majd szemeid, látni fognak tágas országot.
18 ౧౮ నీ హృదయం భయాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. శాస్త్రి ఎక్కడ ఉన్నాడు? డబ్బును తూచిన వాడు ఎక్కడ ఉన్నాడు? గోపురాలను లెక్కించేవాడు ఎక్కడ ఉన్నాడు?
Szíved félelemmel gondolja: hol az író, hol a mérlegelő, hol aki összeírja a tornyokat?
19 ౧౯ నువ్వు అర్థం చేసుకోలేని తెలియని భాష మాట్లాడుతూ తిరస్కరించే ఆ జనాన్ని నువ్వు చూడవు.
A durva népet nem látod, a homályos ajkú népet, mely meg nem érthető, a dadogó értelem nélküli nyelvűt.
20 ౨౦ మన పండగల పట్టణం అయిన సీయోనుని చూడండి! యెరూషలేమును ప్రశాంతమైన నివాస స్థలంగా నువ్వు చూస్తావు. అది తొలగించలేని గుడారంగా ఉంటుంది. దాని మేకులను ఎన్నటికీ ఊడదీయరు. దాని తాళ్లలో దేనినీ తెంచరు.
Nézd Cziónt, gyülekezésünk városát, szemeid látni fogják Jeruzsálemet gondtalan hajléknak, sátornak, mely nem mozdul, melynek szögeit soha nem szakítják ki, melynek kötelei nem szakadnak szét, egy sem.
21 ౨౧ దానికి ప్రతిగా విశాలమైన నదులూ, నీటి వాగులూ ఉన్న ఆ స్థలంలో యెహోవా తన ప్రభావంతో మనతో ఉంటాడు. తెడ్లు వేసుకుంటూ అక్కడ ఏ యుద్ధనౌకా ప్రయాణించదు. పెద్ద నౌకలేవీ అక్కడ ప్రయాణించవు.
Hanem hatalmas ott számunkra az Örökkévaló, folyók, széles partú folyamok helyett, rajta nem jár evezős hajóraj, és hatalmas hajó nem kel át rajta.
22 ౨౨ ఎందుకంటే యెహోవా మనకు న్యాయాధిపతి. యెహోవా మన శాసనకర్త. యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షిస్తాడు.
Mert az Örökkévaló a bíránk, az Örökkévaló a törvényadónk, az Örökkévaló a királyunk, ő megsegít bennünket.
23 ౨౩ నీ ఓడ తాళ్లు వదులై పోయాయి. స్తంభం అడుగు భాగం స్థిరంగా లేదు. ఓడ తెరచాపను ఎవరూ విప్పడం లేదు. విస్తారమైన దోపిడీ సొమ్మును పంచుకుంటారు. అప్పుడు కుంటి వాళ్ళు కూడా ఆ సొమ్ములో భాగం పొందుతారు.
Meglazultak köteleid, nem tartják erősen árbócfájuk talapját, nem feszítik ki a vitorlát; akkor osztottak zsákmányos ragadmányt sokat, sánták prédáltak prédát,
24 ౨౪ సీయోనులో నివాసం చేసే వాళ్ళెవ్వరూ “నాకు ఆరోగ్యం బాగా లేదు” అని చెప్పరు. అక్కడి ప్రజలు చేసిన పాపాలకు క్షమాపణ దొరుకుతుంది.
és nem mondja lakos: beteg vagyok – a nép, mely benne lakik, ment a bűntől.