< యెషయా~ గ్రంథము 30 >
1 ౧ “తిరుగుబాటు చేసే పిల్లలకు బాధ.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “వాళ్ళు ఆలోచనలు చేస్తారు. కానీ నన్ను సంప్రదించరు. ఇతర జనాలతో స్నేహం చేస్తారు. కానీ నా ఆత్మ నిర్దేశించింది కాదు. ఈ విధంగా వాళ్ళు పాపానికి పాపాన్ని జోడిస్తారు.
여호와께서 가라사대 화 있을진저 패역한 자식들이여 그들이 계교를 베푸나 나로 말미암아 하지 아니하며 맹약을 맺으나 나의 신으로 말미암아 하지 아니하였음이로다 그들이 바로의 세력 안에서 스스로 강하려 하며 애굽의 그늘에 피하려 하여 애굽으로 내려 갔으되 나의 입에 묻지 아니하였으니 죄에 죄를 더하도다
2 ౨ వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళడానికి సిద్ధం అయ్యారు. కానీ నా సలహా కోసం చూడరు. ఫరో సంరక్షణ కోసం పాకులాడుతున్నారు. ఐగుప్తు నీడలో ఆశ్రయం కోసం ఆరాటపడుతున్నారు.
(1절과 같음)
3 ౩ కాబట్టి ఫరో సంరక్షణ మీకు అవమానంగా ఉంటుంది. ఐగుప్తు నీడలో ఆశ్రయం మీకు సిగ్గుగా ఉంటుంది.
그러므로 바로의 세력이 너희의 수치가 되며 애굽의 그늘에 피함이 너희의 수욕이 될 것이라
4 ౪ ఇశ్రాయేలు ప్రజల అధిపతులు సోయనులో ఉన్నారు. వాళ్ళ రాయబారులు హానేసులో ప్రవేశించారు.
그 방백들이 소안에 있고 그 사신들이 하네스에 이르렀으나
5 ౫ కానీ వాళ్లకి సహాయం చేసేవాళ్ళు అక్కడ ఎవ్వరూ ఉండకపోవడం చూసి వాళ్లందరూ సిగ్గుపడి పోతారు. ఉన్నవాళ్ళు సహాయంగానూ, మద్దతుగానూ ఉండకపోగా సిగ్గుగానూ అవమానంగానూ ఉంటారు.”
그들이 다 자기를 유익하게 못하는 민족을 인하여 수치를 당하리니 그 민족이 돕지도 못하며 유익하게도 못하고 수치가 되게 하며 수욕이 되게 할 뿐임이니라
6 ౬ దక్షిణ దేశంలో ఉన్న క్రూరమృగాలను గూర్చిన దైవ ప్రకటన. సింహాలూ, ఆడ సింహాలూ, రక్త పింజేరి పాములూ, ఎగిరే సర్పాలతో దేశం ప్రమాదకరంగా మారినా వాళ్ళు మాత్రం తమ ఆస్తిని గాడిదల వీపుల పైనా, తమ సంపదలను ఒంటెల మూపుల పైనా తరలిస్తూ ఉంటారు. తమకు సహాయం చేయలేని జనం దగ్గరికి వాటిని తీసుకు వెళ్తారు.
남방 짐승에 관한 경고라 사신들이 그 재물을 어린 나귀 등에 싣고 그 보물을 약대 제물 안장에 얹고 암사자와 수사자와 독사와 및 날아다니는 불뱀이 나오는 위험하고 곤고한 땅을 지나 자기에게 무익한 민족에게로 갔으나
7 ౭ ఎందుకంటే ఐగుప్తు చేసే సహాయం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి నేను దానికి పనీ పాటా లేకుండా కూర్చునే రాహాబు. అనే పేరు పెడుతున్నా.
애굽의 도움이 헛되고 무익하니라 그러므로 내가 애굽을 가만히 앉은 라합이라 일컬었느니라
8 ౮ భవిష్యత్తులో సాక్ష్యంగా దీన్ని భద్రపరచడం కోసం నువ్వు వెళ్లి వాళ్ళ సమక్షంలోనే ఒక రాతి పలకపై దీన్ని చెక్కి గ్రంథంలో రాసి ఉంచు.
이제 가서 백성 앞에서 서판에 기록하며 책에 써서 후세에 영영히 있게하라
9 ౯ వీళ్ళు తిరగబడే ప్రజలు. అబద్ధమాడే పిల్లల్లాంటి వాళ్ళు. యెహోవా ఆదేశాలను వినని పిల్లలు.
대저 이는 패역한 백성이요 거짓말 하는 자식이요 여호와의 법을 듣기 싫어하는 자식이라
10 ౧౦ దర్శనాలు చూసే వాళ్ళతో “దర్శనం చూడవద్దు” అని చెప్తారు. ప్రవక్తలకు “కచ్చితమైన సత్యాన్ని మాకు ప్రవచించ వద్దు. మృదువైన సంగతులే మాతో చెప్పండి. మాయా దర్శనాలు చూడండి. తప్పుడు ప్రవచనాలు మాకు చెప్పండి.
그들이 선견자에게 이르기를 선견하지 말라 선지자에게 이르기를 우리에게 정직한 것을 보이지 말라 부드러운 말을 하라 거짓된 것을 보이라
11 ౧౧ మా దారికి అడ్డం రావద్దు. మా మార్గం నుండి తొలగి పొండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా దగ్గర ఎత్తవద్దు” అని అంటారు.
너희는 정로를 버리며 첩경에서 돌이키라 이스라엘의 거룩하신 자로 우리 앞에서 떠나시게 하라 하는도다
12 ౧౨ కాబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఇలా చెప్తున్నాడు. మీరు ఈ మాటని తిరస్కరించి అణచివేతనూ, మోసాన్నీ నమ్ముకున్నారు. వాటి పైనే ఆధారపడ్డారు.
이러므로 이스라엘의 거룩하신 자가 말씀하시되 너희가 이 말을 업신여기고 압박과 허망을 믿어 그것에 의뢰하니
13 ౧౩ కాబట్టి ఈ పాపం మీకు బీటలు వారి, ఉబ్బి పోయి, ఒక్క క్షణంలో కూలి పోవడానికి సిద్ధంగా ఉన్న గోడలా ఉంటుంది. అది ఒక్క క్షణంలో అకస్మాత్తుగా పడిపోతుంది.
이 죄악이 너희로 마치 무너지게 된 높은 담이 불쑥 나와 경각간에 홀연히 무너짐 같게 하리라 하셨은즉
14 ౧౪ కుమ్మరి చేసిన మట్టి కుండ పగిలినట్టు ఆయన దాన్ని పగలగొడతాడు. దాన్ని ఆయన విడిచి పెట్టడు. దాని ముక్కల్లో ఒక్క పెంకు కూడా పొయ్యిలో నుండి నిప్పు కణికలను తీయడానికి గానీ కుండలో నుండి నీళ్ళుతోడటానికి గానీ పనికి రాదు.
그가 이 나라를 훼파하시되 토기장이가 그릇을 훼파함 같이 아낌이 없이 파쇄하시리니 그 조각 중에서, 아궁이에서 불을 취하거나 물웅덩이에서 물을 뜰 것도 얻지 못하리라
15 ౧౫ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడూ ప్రభువూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “మీరు తిరిగి వచ్చి విశ్రాంతిగా నాలో ఉంటేనే రక్షణ పొందుతారు. మౌనంలోనూ, విశ్వాసంలోనూ మాత్రమే మీకు బలం కలుగుతుంది.” కానీ దానికి మీరు ఒప్పుకోలేదు.
주 여호와 이스라엘의 거룩하신 자가 말씀하시되 너희가 돌이켜 안연히 처하여야 구원을 얻을 것이요 잠잠하고 신뢰하여야 힘을 얻을 것이어늘 너희가 원치 아니하고
16 ౧౬ “అలా కాదు. మేం గుర్రాలెక్కి పారిపోతాం” అన్నారు. కాబట్టి మీరు పారిపోతారు. ఇంకా “వేగంగా పరుగుతీసే గుర్రాలపై స్వారీ చేస్తాం” అన్నారు. కాబట్టి మిమ్మల్ని తరిమే వాళ్ళు ఇంకా వేగంగా వస్తారు.
이르기를 아니라 우리가 말 타고 도망하리라 한고로 너희가 도망할 것이요 또 이르기를 우리가 빠른 짐승을 타리라 한고로 너희를 쫓는 자가 빠르리니
17 ౧౭ మీలో మిగిలి ఉన్న వాళ్ళు ఏదో పర్వతంపై ఒక జెండా కర్రగానో, లేదా ఏదో కొండపై జెండా గానో మిగిలే దాకా మీరు ఒక్కడికి భయపడి వెయ్యి మంది పారిపోతారు. ఐదుగురి భయం చేత మీరంతా పారిపోతారు.
한 사람이 꾸짖은즉 천 사람이 도망하겠고 다섯이 꾸짖은즉 너희가 다 도망하고 너희 남은 자는 겨우 산꼭대기의 깃대 같겠고 영위의 기호 같으리라 하셨느니라
18 ౧౮ అయినా మీపై దయ కనపరచాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. మిమ్మల్ని కరుణించాలని నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చే దేవుడు. ఆయన కోసం ఎదురు చూసే వాళ్ళు ధన్యులు.
그러나 여호와께서 기다리시나니 이는 너희에게 은혜를 베풀려 하심이요 일어나시리니 이는 저희를 긍휼히 여기려 하심이라 대저 여호와는 공의의 하나님이심이라 무릇 그를 기다리는 자는 복이 있도다
19 ౧౯ ఎందుకంటే యెరూషలేములోనే సీయోనులోనే ఒక జనం నివాసముంటారు. వాళ్లికపై ఏడవరు. నీ రోదన ధ్వనికి ఆయన కచ్చితంగా నిన్ను కరుణిస్తాడు. నువ్వు మొర్ర పెట్టినప్పుడు ఆయన నీకు జవాబు ఇస్తాడు.
시온에 거하며 예루살렘에 거하는 백성아 너는 다시 통곡하지 않을 것이라 그가 너의 부르짖는 소리를 인하여 네게 은혜를 베푸시되 들으실 때에 네게 응답하시리라
20 ౨౦ యెహోవా నీకు వైరాన్ని ఆహారంగా, వేదనను పానీయంగా ఇచ్చాడు. అయినా నీ బోధకులు నీకు ఇక మరుగై ఉండరు. నీకు ఉపదేశం చేసే వాళ్ళని నువ్వు చూస్తావు.
주께서 너희에게 환난의 떡과 고생의 물을 주시나 네 스승은 다시 숨기지 아니하시리니 네 눈이 네 스승을 볼 것이며
21 ౨౧ మీరు కుడి వైపు గానీ ఎడమ వైపు గానీ తిరిగినప్పుడు “ఇదే మార్గం. దీనిలోనే నడవండి” అని వెనుక నుండి ఒక శబ్దాన్ని మీరు వింటారు.
너희가 우편으로 치우치든지 좌편으로 치우치든지 네 뒤에서 말소리가 네 귀에 들려 이르기를 이것이 정로니 너희는 이리로 행하라 할 것이며
22 ౨౨ వెండితో పోత పోసిన చెక్కిన బొమ్మలనూ, బంగారంతో పోత పోసిన విగ్రహాలనూ మీరు అపవిత్రం చేస్తారు. అసహ్యమైన గుడ్డగా వాటిని భావిస్తారు. “ఇక్కడ నుండి పో” అని వాటికి చెప్తారు.
또 너희가 너희 조각한 우상에 입힌 은과 부어만든 우상에 올린 금을 더럽게 하여 불결한 물건을 던짐 같이 던지며 이르기를 나가라 하리라
23 ౨౩ నువ్వు విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు దానికి కావలసిన వర్షాన్ని ఆయన కురిపిస్తాడు. భూసారమైన ఆహారాన్ని విస్తారంగా నీకిస్తాడు. నీ పంటలు విస్తారంగా పండుతాయి. ఆ రోజున నీ పశువులు విశాలమైన పచ్చిక మైదానాల్లో మేస్తాయి.
네가 땅에 뿌린 종자에 주께서 비를 주사 땅 소산의 곡식으로 살찌고 풍성케 하실 것이며 그 날에 너의 가축이 광활한 목장에서 먹을 것이요
24 ౨౪ భూమిని సేద్యం చేయడానికి సహాయం చేసే ఎద్దులూ, గాడిదలూ పార, జల్లెడలతో చెరిగిన ధాన్యాన్ని మేతగా తింటాయి.
밭가는 소와 어린 나귀도 키와 육지창으로 까부르고 맛있게 한 먹이를 먹을 것이며
25 ౨౫ గోపురాలు కూలి పోయే ఆ మహా సంహారం జరిగే రోజున ఎత్తయిన ప్రతి పర్వతం పైనా, ఎత్తయిన ప్రతి కొండ పైనా వాగులూ, జలధారలూ ప్రవహిస్తాయి.
크게 살륙하는 날 망대가 무너질 때에 각 고산 각 준령에 개울과 시냇물이 흐를 것이며
26 ౨౬ చంద్రుడి కాంతి సూర్య కాంతితో సమానంగా ఉంటుంది. సూర్య కాంతి ఏడు రెట్లు అధికంగా ప్రకాశిస్తుంది. యెహోవా తన ప్రజల గాయాలకి కట్లు కడతాడు. తాను చేసిన గాయాలను ఆయన బాగు చేస్తాడు.
여호와께서 그 백성의 상처를 싸매시며 그들의 맞은 자리를 고치시는 날에는 달빛은 햇빛 같겠고 햇빛은 칠배가 되어 일곱날의 빛과 같으리라
27 ౨౭ చూడండి! ఆయన ఆగ్రహంతో మండిపోతూ దట్టమైన పొగతో యెహోవా పేరు దూరం నుండి వస్తూ ఉంది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి పోయాయి. ఆయన నాలుక దహించే అగ్ని జ్వాలలా ఉంది.
보라 여호와의 이름이 원방에서부터 오되 그의 진노가 불붙듯이 하며 빽빽한 연기가 일어 나듯하며 그 입술에는 분노가 찼으며 그 혀는 맹렬한 불 같으며
28 ౨౮ ఆయన శ్వాస గొంతు వరకూ వచ్చిన బలమైన నదీ ప్రవాహంలా ఉంది. అది నాశనం చేసే జల్లెడలా జాతులను జల్లెడ పడుతుంది. ఆయన శ్వాస జాతుల దవడల్లో కళ్ళెంలా ఉండి వాళ్ళని దారి తప్పిస్తుంది.
그 호흡은 마치 창일하여 목에까지 미치는 하수 같은즉 그가 멸하는 키로 열방을 까부르며 미혹되게 하는 자갈을 여러 민족의 입에 먹이시리니
29 ౨౯ పండగ ఆచరించేటప్పుడు రాత్రి వేళ మీరు పాట పాడుతారు. ఇశ్రాయేలుకి ఆశ్రయ దుర్గమైన యెహోవా పర్వతానికి ఒక వ్యక్తి పిల్లనగ్రోవి వాయిస్తూ ప్రయాణం చేసేటప్పుడు కలిగే ఆనందం వంటిది వారి హృదయంలో కలుగుతుంది.
너희가 거룩한 절기를 지키는 밤에와 같이 노래할 것이며 저를 불며 여호와의 산으로 가서 이스라엘의 반석에게로 나아가는 자 같이 마음에 즐거워할 것이라
30 ౩౦ యెహోవా తన స్వరంలోని వైభవాన్ని వినిపిస్తాడు. ప్రభావంగల స్వరం వినిపిస్తాడు. ప్రచండమైన కోపంతోను దహించే జ్వాలతోను తుఫాను వంటి తన ఉగ్రతలో, అగ్ని జ్వాలల్లో, భీకరమైన సుడిగాలితో, గాలి వానతో, వడగళ్ళతో తన చేతి కదలికను చూపిస్తాడు.
여호와께서 그 장엄한 목소리를 듣게 하시며 혁혁한 진노로 그 팔의 치심을 보이시되 맹렬한 화염과 폭풍과 폭우와 우박으로 하시리니
31 ౩౧ యెహోవా స్వరం విని అష్షూరు ముక్కలైపోతుంది. ఆయన దాన్ని కర్రతో దండిస్తాడు.
여호와의 목소리에 앗수르가 낙담할 것이며 주께서는 막대기로 치실 것인데
32 ౩౨ యెహోవా తాను నియమించిన కర్రతో అష్షూరు పై వేసే ప్రతి దెబ్బా, ఆయన వాళ్ళతో యుద్ధం చేస్తుండగా, తంబురాల, సితారాల సంగీతంతో కలసి ఉంటుంది.
여호와께서 예정하신 몽둥이를 앗수르 위에 더하실 때마다 소고를 치며 수금을 탈 것이며 그는 전쟁 때에 팔을 들어 그들을 치시리라
33 ౩౩ తగలబెట్టే స్థలం చాలా కాలం కిందే సిద్ధం అయి ఉంది. నిజంగా రాజు కోసం సిద్ధం అయింది. దాన్ని దేవుడు లోతుగా, విశాలంగా చేశాడు. తగలబెట్టడానికి మంటలు, విస్తారంగా కట్టెలు సిద్ధంగా ఉన్నాయి. యెహోవా శ్వాస గంధక ప్రవాహంలా దాన్ని తగలబెడుతుంది.
대저 도벳은 이미 설립되었고 또 왕을 위하여 예비된 것이라 깊고 넓게 하였고 거기 불과 많은 나무가 있은즉 여호와의 호흡이 유황 개천 같아서 이를 사르시리라