< యెషయా~ గ్రంథము 3 >
1 ౧ చూడండి, సేనలకు అధిపతి, ప్రభువూ అయిన యెహోవా యెరూషలేము నుంచి, యూదా నుంచి దాని పోషణ, దాని ఆధారం తీసివేయబోతున్నాడు. దాని ఆహార సంబంధమైన ఆధారం, నీటి సరఫరా,
Jo redzi, Tas Kungs Dievs Cebaot atņems no Jeruzālemes un Jūda patvērumu un padomu, visu maizes padomu un visu ūdens padomu,
2 ౨ శూరులు, యోధులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు,
Vareno un karavīru, soģi un pravieti un gudro un vecaju,
3 ౩ సోదెగాళ్ళు, పెద్దలు, పంచ దశాధిపతులు, ఘనత వహించిన వాళ్ళు, మంత్రులు, శిల్పశాస్త్రం తెలిసిన వాళ్ళు, మాంత్రికులు, అందరినీ యెరూషలేములోనుంచీ, యూదా దేశంలో నుంచి, తీసివేయబోతున్నాడు.
Virsnieku pār piecdesmit un godināto un padoma devēju un amata pratēju un apvārdotāju.
4 ౪ “నేను పిల్లలను వాళ్లకు నాయకులుగా నియమిస్తాను. పసివాళ్ళు వాళ్ళ మీద పెత్తనం చేస్తారు.
Un Es viņiem došu puikas par virsniekiem, un nesaprašas pār viņiem valdīs.
5 ౫ ప్రజల్లో ఒకడు మరొకణ్ణి అణిచివేస్తారు. ప్రతి ఒక్కడూ తన పొరుగువాడి చేత అణిచివేతకు గురౌతాడు. పెద్దవాడి మీద చిన్నవాడు, ఘనుని మీద నీచుడు గర్వించి సవాలు చేసి తిరస్కారంగా ఉంటారు.
Un tie ļaudis māksies virsū cits citam, ikkatrs savam tuvākam, puika trakos pret sirmgalvi un nelga pret cienīgo.
6 ౬ ఒకడు తన తండ్రి ఇంట్లో తన సోదరుణ్ణి పట్టుకుని, ‘నీకు పైవస్త్రం ఉంది. నువ్వు మా మీద అధిపతిగా ఉండు. ఈ పాడైపోయిన స్థలం నీ ఆధీనంలో ఉండనివ్వు’ అంటాడు.
Tad satvers viens otru sava tēva namā un (sacīs): tev ir drēbes, esi mums par virsnieku, un lai tava roka nogriež šo postu.
7 ౭ అతడు ఆ రోజున కేక వేసి, ‘నేను సంరక్షణ కర్తగా ఉండను, నాకు ఆహారం గాని, వస్త్రాలు గాని లేవు. నన్ను ప్రజలకు అధిపతిగా నియమించవద్దు’ అంటాడు.”
Bet viņš tai dienā atbildēs un sacīs: es negribu būt tas dziedinātājs, manā namā ne maizes ne drēbju, neceļat mani par ļaužu virsnieku.
8 ౮ తన మాటలు, చేతలు యెహోవాకు విరుద్ధంగా ఉన్నాయి గనుక యెరూషలేము పాడైపోయింది, యూదా పతనమయ్యింది.
Jo Jeruzāleme gruvusi, un Jūda ir kritis, tādēļ kā viņu mēles un darbi ir pret To Kungu, kaitināt Viņa godības acis.
9 ౯ వాళ్ళ ముఖమే వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తూ ఉంది. తమ పాపం దాచకుండా సొదొమవాళ్ళలాగా దాన్ని కనపరుస్తారు. వాళ్లకు బాధ! వాళ్ళు తమకు తామే తమ మీదకి ఈ మహా విపత్తు తెచ్చుకున్నారు.
Viņu vaiga izskats dod liecību pret viņiem, un savus grēkus tie izteic, tā kā Sodoma, un tos neapslēpj. Vai viņu dvēselēm! Jo tie sev pašiem dara ļaunu.
10 ౧౦ నీకు మేలు కలుగుతుందని నీతిమంతుడితో చెప్పు. వాళ్ళు తమ క్రియల ఫలం అనుభవిస్తారు.
Sakait par taisno, ka tam labi klāsies, jo tas ēdīs savu darbu augļus.
11 ౧౧ దుష్టుడికి బాధ! అతనికి కీడు జరుగుతుంది. అతని చేతి పనుల ఫలం అతడు పొందుతాడు.
Ak vai, tam bezdievīgam! Tam labi neklāsies, jo pēc viņa rokas darba viņam taps maksāts.
12 ౧౨ చిన్న పిల్లలు నా ప్రజలను హింసిస్తారు. స్త్రీలు వాళ్ళ మీద ఏలుబడి చేస్తారు. నా ప్రజలారా, మీ నాయకులు మిమ్మల్ని మీ మార్గంలో అయోమయం పాలుచేసి తప్పు దోవ పట్టిస్తారు.
Mani ļaudis! Viņu dzinēji ir bērni, un sievas valda pār tiem; Mani ļaudis! Tavi vadoņi tevi maldina un to ceļu, kur tev jāstaigā, tie samaitā.
13 ౧౩ తీర్పు తీర్చడానికి యెహోవా ఆవరణలో నిలిచి ఉన్నాడు. తన ప్రజలకు తీర్పు తీర్చడానికి నిలబడి ఉన్నాడు.
Tas Kungs ceļas, tiesāties un stāv, tiesu spriest tautām.
14 ౧౪ యెహోవా తన ప్రజల పెద్దల మీద, వాళ్ళ నాయకుల మీద తన తీర్పు ప్రకటిస్తాడు. “మీరే ద్రాక్షతోటను తినేశారు. మీరు దోచుకున్న పేదల సొమ్ము మీ ఇళ్ళల్లోనే ఉంది.
Tas Kungs nāk uz tiesu ar Savu ļaužu vecajiem un viņu lieliem kungiem: un jūs to vīna dārzu esat noēduši; nabaga laupījums ir jūsu namos.
15 ౧౫ నా ప్రజలను నలగ్గొట్టి, వాళ్ళ ముఖాలు మీరెందుకు నేల రాస్తున్నారు?” అని ప్రభువూ, సేనలకు అధిపతీ అయిన యెహోవా అంటున్నాడు.
Kas jums prātā, ka jūs saminat Manus ļaudis un satriecat bēdīgo vaigus? Saka Tas Kungs Dievs Cebaot.
16 ౧౬ యెహోవా చెప్పేదేమంటే, సీయోను కుమార్తెలు పోగరుబోతులు. మెడ చాచి నడుస్తూ, ఓర చూపులు చూస్తూ, కులుకుతో నడుస్తూ, తమ కాళ్ల గజ్జెలు మోగిస్తున్నారు.
Vēl Tas Kungs saka: tādēļ ka Ciānas meitas lepojās un staigā izstieptu kaklu un mirkšķina ar acīm un iet maziem solīšiem, skandinādamas savu kāju gredzenus,
17 ౧౭ కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల తలల మీద గజ్జి పుండ్లు పుట్టిస్తాడు. వాళ్ళ తలలు యెహోవా బోడి తలలుగా చేస్తాడు.
Tad Tas Kungs Ciānas meitām darīs pakausi pliku un atsegs viņu kaunumu.
18 ౧౮ ఆ రోజున ప్రభువు వాళ్ళ కాళ్ళ గజ్జెలు, శిరోభూషణాలూ, చంద్రవంక నాగరాలూ,
Tai dienā Tas Kungs atņems tos skaistos kāju gredzenus, tās saulītes un tos mēnestiņus,
19 ౧౯ చెవిపోగులూ, కడియాలూ, మేలి ముసుగులూ,
Tos ausu glītumus, tās roku sprādzes un tos vaiga apsegus,
20 ౨౦ తలకు కట్టుకునే పాగాలూ, కాళ్ల గొలుసులూ, ఒడ్డాణాలూ, పరిమళ ద్రవ్యపు భరిణెలూ,
Tās cepures un prievītes un jostas un ožamos trauciņus un pesteļus.
21 ౨౧ తాయెత్తులు, ఉంగరాలు, ముక్కు కమ్మలు,
Tos pirkstu gredzenus un tās pieres sprādzes,
22 ౨౨ ఉత్సవ వస్త్రాలూ, ఉత్తరీయాలూ, పైటలూ, సంచులూ,
Tās svētku drēbes un tos mēteļus un apsegus un makus,
23 ౨౩ చేతి అద్దాలు, సన్ననారతో నేసిన జలతారు ముసుగులు, పాగాలు, శాలువాలు తీసేస్తాడు.
Un tos spieģeļus un dārgos kreklus un tos galvas lakatus un uzvalkus.
24 ౨౪ అప్పుడు పరిమళ ద్రవ్యానికి బదులుగా దుర్గంధం, నడికట్టుకు బదులుగా తాడూ, అల్లిన జడకు బదులుగా బోడి తల, ప్రశస్థమైన పైటకు బదులు గోనెపట్టా, అందానికి బదులు వాత ఉంటాయి.
Un smaržas vietā būs puvums, un jostas vietā valgs, un sprogaino matu vietā plika galva, un plata mēteļa vietā šaurs maiss, un skaistuma vietā uguns vātis.
25 ౨౫ మనుషులు కత్తివాత కూలి పోతారు. యుద్ధంలో నీ శూరులు పడిపోతారు.
Tavi vīri kritīs caur zobenu un tavs spēks(varoņi) karā.
26 ౨౬ యెరూషలేము గుమ్మాలు శోకించి దుఃఖిస్తాయి. ఆమె ఒంటరిదై నేల మీద కూర్చుంటుంది.
Un viņas vārti bēdāsies un žēlosies, un iztukšota viņa sēdēs zemē.